Wednesday, February 28, 2007

పాత సామాన్లు కొంటాం.......

-----------------------------------------------------------------------
ప్రకటన

ఆమ్మబడును - ఒక Yamaha Rx 135 బండి

ఈ బండి కొనదల్చుకున్న వారు మద్రాసు రోడ్ల మీద తిరగ వలసిందిగా ప్రార్థన.రోడ్డుపక్కన ఒక yamaha Rx 135 స్టార్ట్ కాక అవస్థపడుతూ ఏవరైన కనిపిస్తే...అది నేనే.స్పాట్ లో బండి ఇవ్వబడును.

వెల - మీ సుఖశాంతులు
-----------------------------------------------------------------------

నా బండి కొని రెండేళ్ళు అయిపొయ్యింది.ఇప్పటిదాక ముప్పై సార్లు ఆఫీసుకు వేసుకెళ్ళుంటాను - అందులొ రెండు సార్లు కింద పడ్డాను, పది సార్లు దారిలొ ఆగిపొయ్యింది, మిగత పద్దెనిమిది సార్లు ఇంటి దగ్గరే స్టార్ట్ అవ్వలేదు - ఇదీ నా బండి ట్రాక్ రికార్డు.

దాన్ని నిరంతరం నడుపుతూనే ఉండాలి.ఒక్క పది నిముషాలు పార్క్ చెసినా స్టార్ట్ అవ్వదు.అటువంటిది... మూడు రోజులు ఊరిలో లేను..ఇవ్వాళ పొద్దున్నే దిగాను.స్టార్ట్ అయ్యే సమస్యే లేదని తెలిసు.కాని ...చూద్దాం....ఆఫీసుకు తయారయ్యి,దాన్ని శుభ్రంగా తుడిచాను.

పావుగంట కిక్కు కొట్టాను.చమటలు, కాలు నొప్పి.బండి మాత్రం స్టార్ట్ అవ్వలా.ఇంగ్లీషులొ "చచ్చాడు" అనటానికి "Kicked the bucket" అంటారట.సుద్ద తప్పు."Kicked Yamaha Rx 135" అనాలి.

ఆఫీసుకు లేటు అవుతొంది.ఇక లాభం లేదని ఆటో ఎక్కటానికి బయటకు నడిచాను.అక్కడ పాచి పళ్ళేసుకుని నవ్వుతూ ఆటో డ్రైవర్ గాడు నాకొసం కాచుకుని ఉన్నాడు.కావేరీ నదీ జలాల కేసు తమిళనాడు గెలిచిందిగా....చాల రోజుల తరువాత వీడు స్నానం చెసినట్టున్నాడు.

"ఎన్న సార్....వండి స్టార్ట్ ఆవ్లియా" అని అడిగాడు.దీనిని తెలుగు లొకి అనువదిస్తే - "దొరికావురా నాకు..ఇవ్వాళ నీకు గుండే" అని అర్థం.

వేరే గత్యంతరం లేక ఆటో ఎక్కాను.ఆ డ్రైవర్ గాడు ఇంకా నవ్వుతూనే ఉన్నడు.వాడికి తెలుసు.. ఇంకో వారం రోజుల వరకు వెరే పార్టీ వెతుక్కోవలసిన పని లేదని...

యాభై నాలుగు వేల రూపాయలు - రెండేళ్ళ పాటు ఈ బండికి వాయిదాలు కట్టాను.తలుచుకుంటేనే కళ్ళలొంచి పెట్రోలు కారుతుంది.ఈ ఆటో డ్రైవర్ గాడికి ఇలాంటి కష్టం రాకపొతుందా...అప్పుడు నేనూ నవ్వక పొతానా...

కసి కొద్దీ వాడిని అడిగాను "ఎంతకు కొన్నవు ఈ ఆటొ?"
వాడు "మూడున్నర లక్షలు" అన్నాడు.
"ఎన్ని వాయిదాలు?" అని అడిగాను
వాడు నవ్వి ఊరుకున్నాడు....

అప్పుడు అర్థమయ్యింది...నేను ఎంత వెర్రి ప్రశ్న వెసానో అని.

మనలాంటి వాళ్ళము లోన్లు తీసుకుంటాము గానీ....మద్రాసు ఆటో డ్రైవర్లకు ఏంటి ఖర్మ? రాత్రి పూట రెండు ట్రిప్పులు వేస్తే ఒక ఆటో కొనెయ్యవచ్చు.ఒక నెల రోజులు నైట్ డ్యుటీ చేస్తే మన దేశం వరల్డ్ బ్యాంకు కు చేసిన అప్పు తీర్చెయ్యవచ్చు.మొన్నీమధ్య ఆటో డ్రైవర్ ల కాలనీ లొ Income Tax వాళ్ళు రైడు కూడ చెసారంట! పేరు కు ఆటొ డ్రైవర్లు కానీ....వీళ్ళ ఆదాయం చూస్తే మన డిగ్రీలన్ని మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాయి.

మా ఆఫీసు ముందు ఆటో బ్రేకు వెయ్యగానే బాధాకరమైన ఆ ఆలొచనల్లోంచి ఈ లోకం లొకి వచ్చాను.ఆ ఆటో వాడికి ఒక పది పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి ఆఫీసులోకి వెళ్ళాను.రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫీసు కారు ఉండటంతొ నా పర్సు కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఇంటికి చేరగానే బయట నా బండి కనిపించింది.కోపం పట్టలేక వెనక టైరు మీద లాగి కొట్టాను."సరే...రేపు పొద్దున వస్తావుగా" అన్నట్టు చూసింది నన్ను.

దీన్ని అమ్మటానికి మనసు ఒప్పదు...అమ్మి ఇంకొకడి గొంతు కోసిన పాపం ఎందుకని.

కేవలం నేను ఉన్నాను అన్న ధైర్యంతొ మా ఆటో దరిద్రుడు వాడి బండి కి credit card swiping machine కూడా పెట్టించాడు.

రేపు కూడా బండి స్టార్ట్ కాకపొతే....నేను ఉద్యొగం మానేసి ఒక ఆటో కొనుక్కుంటాను.

వంశీ గనక ఇప్పుడు "చెట్టు కింద ప్లీడరు" సినిమా మళ్ళీ తీస్తే.. అందులొ ఆ కారుకు బదులు తప్పకుండ నా బండే వాడతాడు.

పాత సామాన్లు కొంటాం.......

26 comments:

Anonymous said...

బాగా చెప్పారు.

కొంచెం అటు ఇటుగా నా దగ్గర సోనీ లాప్టాప్ ఉంది. బహుశా దాన్ని మీ యమహ కు ఇచ్చి పెళ్ళి చేసేస్తే చక్క కాపురం చేసుకుంటా యనుకుంటా. మీరు కొంచెం కట్నమిస్తే నా లాప్టాపు నిస్తా. దాని అసలు ఖరీదు డెబ్బై వేలు మరి.


విహారి

తెలు'గోడు' unique speck said...

మీ బండేమోకాని మీరు వివరించిన తీరు నవ్వు తెప్పించింది...

ravindra said...

chala baga chepparu mastaru..mee varnana adbutham..kallaku kattinattu chupettaru mee kastalu..

ram said...

బాబు డి.ఎస్.జి బాగా వ్రాశావు. నేను ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లో నా దగ్గెర ఒక స్కూటర్ ఉండేది, అది నీ బండి కంటే అన్యాయములే. గతించిన కాలాన్ని గుర్తుచేసావు.
నువ్వు ఇలాగే , బాగా బ్లోగాలని కోరుకుంటున్నాను.

రాముడు

చదువరి said...

అదరహో! యమహా మీద, చెన్నై 'ఆటొకార్' ల మీద మీ చెణుకులు బ్రహ్మాండం! మొదటి జాబే అదరగొట్టేసారు.

నవీన్ గార్ల said...

రైటర్ గా నీకు బ్రహ్మాడమైన భవిష్యత్తు ఉంది. హాస్యం వ్రాయగలగడం అనే అరుదైన విద్య నీకు స్వతహాగా అలవడినట్టుంది. ఇలాగే జోకూతూండే..

radhika said...

పక పకా...పొద్దు పొద్దన్నే తెగ నవ్వించారండి..కష్టాలని కామెడీగా భలే చెప్పారు.

Sudhakar said...

Awesome.... chala baaga raasaaru.

nenu kudaa Yamaha vaadevadini.. RX100.. adi kudaa nannu satyainchedi.. kaani sardipettukonevadini...endukante adi 10 years old bike... kaani meedi kotta bande kaada, ala enduku chestundataaru? oka saari auto vadini kanipedtundandi :(

ప్రవీణ్ గార్లపాటి said...

అహహహ్హ...
మీ బైకు మిమ్మల్ని భలే ముప్పు తిప్పలు పెడుతున్నట్టుందే. మరందుకే నాలా స్ప్లెండర్ కొనుక్కోవాలి :)

Anonymous said...

ggggakkkhjklghjkh

Japes said...
This comment has been removed by the author.
Japes said...

'పాత సామాన్లు కొంటాం.......':)) yahoo smilies ఇక్కడ పని చెయ్యయి కని లేకుంటె ఒక 100 సార్లు =)) [ అదే rolling on the floor & laughing loudly smily] అని పెట్టేటోడ్ని (ఒక 10 సార్ల దొర్లి మరి)

Good One !

Manaswini said...

Navvatam oka kala
Navvinchatam oka varam..
ala navvinchagaluguthunna meeku abhinandanam

రానారె said...

హహ్హహ్హ!! కళ్లలో పెట్రోలు కారడం లాంటి భలే భలే జాతీయాలు రాశారు. మీరు మీ బండిని ఇలాగే కాపాడుకొంటూ ఉండండి, కొన్నేళ్లకు దాని విలువ పెరగనారంభిస్తుంది.

Naani said...

uhahahahaha....

hmm..baga rasaru...edhe kadhu anni bagunnayi....

Vasu said...

Hilarious. chaala chaala bavundi mashtaaru.. Trvikram taruvata inta sattire evarlonoo choodaledu nenu.
oka dani taruvata okati varasa petti chaduvutunnaa meeru rasinavanni.. kottavati gurinchi waiting.

Kamal Kumar said...

simply superb..

Manohar said...

"తడిసి మోపెడు" అన్న భమిడిపాటి రామగోపాలం గారి కధ చదివారా, ఇంచుమించు అదీ ఇలాగే ఉంటుంది. కాకపోతే అందులో మోపెడ్ ఉంటుంది.....

Avinash said...

awesome post! hats off ..

bodapati said...

Keka ga rasavu ga... kani ne bandi meda kasi kuda telusthundi.....

TK said...
This comment has been removed by the author.
TK said...

అన్నయ్యా... చాలా బాగా రాసారు. సింపుల్ గా తెలుగు లో చెప్పాలంటే 'కేక' అంతే.. చెన్నై వాళ్ళపై సెటైర్లు సూపెర్ అన్న.. ఆ ఆటో వాడి పై ఒక కామెంట్ వేసారు చూడు... దానికి నేను జస్ట్ ROFL ....
అదే నది వివాదం లో గెలిచి స్నానం చేసాడని.... అందుకేనేమో వాళ్ళలా ఉంటారు...
:)

My Dear Friend said...

తెలుగు తల్లి మిమ్మల్ని చూసి ఎంత ఆనందిస్తుందో..

My Dear Friend said...

మీ బ్లాగుని చూసిన తర్వాత,ఆపై మీ రాతలు చదివిన తర్వాత,నాకొకటే అనిపించింది...తెలుగువానిగా పుట్టించి ఆ దేవుడు నాకెంత మహోపకారం చేసాడోనని!

Anonymous said...

Super boss.... You can easily replace Jandyala garu in writing comedy....

Venkata MS Pradeep Karavadi said...

Thank you Thota ramudu ... i am relaxed after reading u r blog...