Wednesday, March 7, 2007

దూలదర్శన్

కాలాలు నాలుగు - ఎండా కాలం, వానా కాలం, చలి కాలం, పొయ్యే కాలం. మొదటి మూడు కాలాలు సంవత్సరం లొ ఏ ఏ నెలల్లో వస్తాయో చెప్పే వీలుంది. కానీ ఆ నాలుగోది ఎప్పుడు ఏ రూపం లొ వస్తుందో చెప్పలేము.

నాకు ఆ పొయ్యేకాలం గత వారం వచ్చింది.

మా ఆఫీసు లొ తెలుగు వాళ్ళము ఒక ఇరవై మంది దాకా ఉంటాము...వాళ్ళలో పట్టాభి ఒకడు. పొయిన వారం వాడి పుట్టిన రొజు. ఆఫీసు కాంటీను లో అందరికి జ్యూసు ఇప్పించాడు. ఎవరి కక్కుర్తి కొద్దీ వాళ్ళు బాగనే తాగారు. ఈ లోపు విద్యా అనే అమ్మాయి ఎదో చీటీల గేం మొదలు పెట్టింది.

ప్రతి ఒక్కరు టేబుల్ మీద ఉన్న చీటీలు తియ్యాలి. చీటీలొ ఏమి రాసుంటే ఆ పని చెయ్యలి (ఔను..మా దిక్కుమాలిన ఆఫీసులొ పుట్టిన రోజు పండగలకి ఇలాంటి ఆటలే ఆడుతారు).

మొదటి చీటీ విద్యానే తీసింది.."వరుసగా రెండు జ్యూసులు తాగాలి" అని చదివింది. నాకు అనుమానమే. చీటీలు రాసింది అది. లోపల ఏమున్నా, నొటికొచ్చింది చదివి, తేరగా రెండు జ్యుసులు తాగేసింది. ఆ తరువాత చాలా మంది చీటీలు తీసారు. 'పాట పాడాలి ', 'నాలుక తో ముక్కును తాకాలి ' లాంటి మెదడుకు పదును పెట్టే చేష్టలెన్నో చేసారు.

చివరగా పట్టాభి చీటీ తీసాడు. అందులో "నీకు ఇష్టమైన TV ప్రోగ్రాం గురించి చెప్పాలి" అని ఉంది.

వాడు "నా ఫేవరెట్ ప్రోగ్రాం 'ప్రగతి పథం'" అన్నాడు.

"ఏ ఛానెల్ లొ వస్తుంది?" ఎవరో అడిగారు.

"దూరదర్శన్ - తెలుగు" అన్నాడు పట్టాభి.

అంతే....అంత వరకు కోలాహలంగా ఉన్న ఆఫీసు కాంటీన్ ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారింది. ఒక్కొక్కరుగా కాంటీన్ నుంచి వెళ్ళిపొయ్యారు.

వెళ్ళేటప్పుడు ఎవ్వరూ పట్టాభి గాడిని విష్ కూడా చెయ్యలేదు.

చాలా బాధేసింది..పట్టాభి ని చూసి. చాల కోపమొచ్చింది..వెళ్ళిపోతున్న జనాలను చూసి.

పట్టాభి గాడు "నాకు AIDS ఉంది" అన్నా కూడా ఇంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు కాదేమో.

అస్సలు వాడు చేసిన తప్పేంటో నాకు అర్థం కాలా. దూరదర్శన్ చూడటం అంత పెద్ద నేరమా?

వాడితొ ఎవ్వరూ మాట్లాడట్లేదు. వాడితొ కలిసి భొజనం చెయ్యటం మానేసారు. ఇదివరకు వాడిపక్కన సీట్ ఉన్న వాళ్ళంతా ప్లేసు మార్చేసారు.

రెండు రోజుల తరువాత - బాగా బధ్ధకంగా ఉంటే ఆఫీసుకు సెలవు పెట్టాను.

TV ఛానళ్ళు మారుస్తూ దూరదర్శన్ దగ్గర ఆగాను. పట్టాభి కి జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. అంతే...వెంటనే నిర్ణయించుకున్నాను - ఈ రోజంతా దూరదర్శన్ చూసి, రేపు ఆఫీసుకు వెళ్ళి అందరితో చెప్తాను. ఏమి చెస్తారో చూద్దాం.

(నేను మొదట్లొ చెప్పినట్టు 'పొయ్యేకాలం' ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకే ఒక్క సూచన ఉంది 'పొయ్యేకాలం' రాకను పసిగట్ట టానికి - "దూరదర్శన్ చూడాలి" అనే ఆలొచన రావటం).

సరే.. ఎలాగూ ఛానెల్ మార్చను కదా అని, దూరదర్శన్ పెట్టి, రిమోట్ అవతల పారెసి...ఈసీ చైర్ లొ జారబడి కూర్చున్నా.

శాంతి స్వరూప్, విజయ దుర్గ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడో చూసాను వీళ్ళని. ఇద్దరూ బాగా లావయ్యారు..శాంతి స్వరూప్ లో ఎదో తేడా కనిపిస్తోంది. ఎంటబ్బా అని అలోచిస్తుండగా....శాంతి స్వరూప్ తన విగ్గు తీసి, బట్ట తల గోక్కొని, మళ్ళీ పెట్టుకున్నాడు. ఒహ్..ఇదా విషయం.

విజయ దుర్గ ఎదో ఉత్తరం చదువుతోంది.

గుర్తు పట్టెసా..ఇది 'జాబులు జవాబులు ' కార్యక్రమం!

కానీ వాళ్ళిద్దరి వెనకాల ఉన్న నీలం రంగు గుడ్డ మీద 'జాబు - జవాబు ' అని రాసుంది. పేరు మార్చారెమో అనుకున్న. ఒక అరగంట పాటు చూసాక అర్థమయ్యింది. ఒకే ఒక్క ఉత్తరం వచ్చింది వాళ్ళకు - అది కూడా ఫిబ్రవరి నెలలొ దూరదర్శన్ కేంద్రం ఆఫీసుకు వచ్చిన కరెంటు బిల్లు. విజయ దుర్గ ఆ బిల్లులొ ఉన్న ప్రతి అక్షరం చదివి "చాలా మంచి సూచన్లిచ్చారండి" అంది. తరువాత శాంతి స్వరూప్ "కరెంటు" మీద ఒక కవిత చెప్పాడు.

అరగంట తరువాత జాబు జవాబు ముగిసింది. శాంతి స్వరూప్ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు. విజయ దుర్గ ముందు టేబుల్ తెచ్చి వేసారు. కెమేరా వైపు చూసి "తరువాయి కార్యక్రమం..కొత్త సినిమా పాటలు" అని అనౌన్సు చెసింది.

ఆహా..కొత్త పాటలా... అరగంట పాటు ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకున్న.

ప్రోగ్రాం మొదలయ్యింది..

'ఈ పిల్లకు పెళ్ళవుతుందా', 'పులి బిడ్డ ', 'జగన్మోహిని ' - ఒక్కొక్క సినిమాలొంచి రెండు రెండు పాటలేసారు.

అప్పుడర్థమయ్యింది...'కొత్త సినిమ పాటలు ' అంటే - తెలుగు సినిమా మొదలయ్యిన కొత్తలో పాటలని.

మెల్లగా నాకు చెమట పడుతొంది. పైకి చూసాను. ఫాను తిరుగుతూనే ఉంది. మరి చెమట ఎలా పడుతొందా అని ఆలొచిస్తుండగా...మళ్ళీ విజయ దుర్గ వచ్చింది. "ఇప్పుదు డిసెంబరు నెలలొ జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూస్తారు" అంది.

ప్రోగ్రాం మొదలయ్యింది. అసెంబ్లీలో ఎవ్వరూ లేరు. నలుగురు ఆడవాళ్ళు కసువు ఊడుస్తున్నారు. ఒక అరగంటయ్యింది...వెరే ఎవరొ వచ్చి సీట్లన్నీ తుడిచి, వాటర్ బాటిల్స్ పెట్టి వెళ్ళారు. తరువాత MLA లు ఒక్కరొక్కరుగా రావటం మొదలు పెట్టారు.

నాకేమి అర్థం కావటంలా...అసెంబ్లీ సమావెశాలంటే MLA లు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి, వాళ్ళ దినచర్య అంతా చూపిస్తారా...

నాలొ కొద్దిగా భయం మొదలయ్యింది. దూరదర్శన్ ను ఎంత తక్కువగా అంచనా వేసానో ఇప్పుడు అర్థమయ్యింది.

టైము చూసాను....ప్రోగ్రాం మొదలయ్యి చాలా సేపయ్యింది. ఇంకో పది నిముషాలలొ సమావెశాలు ముగిసిపొతాయి అనుకుంటుండగా విజయ దుర్గ మళ్ళీ వచ్చింది. "అనివార్య కారణాలవల్ల సమావెశాలు పూర్తిగా చూపించలేక పొయాము. ఈ రోజు రాత్రి యెనిమిదింటికి కార్యక్రమం మొదటి నుంచి మళ్ళీ ప్రసారం చేస్తాము" అంది.

అమ్మో... త్వరగా బయటపడాలి అని పైకి లేవబొయ్యాను...నా వల్ల కాలేదు. వీపు పట్టెసింది..అస్సలు కదలలేక పొయ్యాను. సరే ఛానెల్ మారుద్దాం అని రిమోట్ కోసం చూసాను.

"దరిద్రుడు బాత్రూము లోకి పోతే... శనిగాడు బయట నుంచి గొళ్ళెం పెట్టేసాడంట"

ఇందాక వెరే ఛానెల్ ఎదీ చూడను అన్న ఆవేశం లొ రిమోట్ ఎక్కడో పారెసాను. ఇప్పుడు అది దొరకట్లేదు. కుర్చీలోంచి లేవటానికి విశ్వప్రయత్నం చేసాను..లాభం లేదు.

చెసేదేమీ లేక అలా ఆ క్షోభను అనుభవిస్తూ కూర్చున్నాను...

నేను చిన్నప్పుడు చదువుకున్నాను - "1926 లొ జె.ఎల్.బైర్డ్ టెలివిజన్ కనుగొన్నాడు" అని. మహానుభావుడు ఎక్కడున్నడో....భవిష్యత్తు లొ దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారమౌతాయి అని తెలిసుంటే TV ని పురిట్లొనే చంపేసేవాడు.

వార్తలు మొదలయ్యాయి. నేనెలాగూ నాశనం అయ్యాను...కనీసం మిగతా ప్రపంచమన్నా బగుందో లెదో తెలుసుకుందాం....

శాంతి స్వరూప్ - "నమస్కారం...ఈ రోజు వార్తల్లోని ముఖ్యంశాలు చదివేముందు....'వార్త ' అనే మాట మీద చిన్ని కవిత"

పది నిముషాల పాటు కవితలు, చాటువుల తరువాత వార్తలు అయిపొయ్యయి.

దుర్గమ్మ తల్లి మళ్ళీ వచ్చి "తరువాయి కార్యక్రమం...డాక్టర్ సలహాలు...live program...మీరు డైల్ చెయ్యవలసిన నెంబరు - 040 23454261. ఈ రోజు అంశం....మూత్ర సంబంధిత వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు"

శాంతి స్వరూప్ తయారయ్యాడు.

శాంతి స్వరూప్ - "ప్రేక్షకులకు నమస్కారం..మా డాక్టర్ గారు ఇంకా రాలేదు. మీరు ఈలోపు ఫొన్ చెస్తే..నా తొ మాట్లాడొచ్చు"

ఇంతలొ ఫొన్ మోగింది..

వీళ్ళకు ప్రేక్షకులు ఫొన్ చేసి చాల కాలమైంది అనుకుంటా...ఫొన్ మోగంగానె స్టూడియో లొ ఉన్న అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒక చిచ్చు బుడ్డి కూడా కాల్చారు.

శాంతి స్వరూప్ ఫొన్ తీసుకుని - "హలో"

కాలర్ - నమస్కారం సార్...నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాదు నుంచి మాట్లాడుతున్నాను.

శాంతి స్వరూప్ - శ్రీనివాస్ గారూ...మీ TV వాల్యూం కాస్త తగ్గించుకొవాలి

కాలర్ - లేదు సార్...మా ఇంట్లో ఎవ్వరూ దూరదర్షన్ చూడరు. మీరు భయపడకండి.

శాంతి స్వరూప్ - సరే చెప్పండి

కాలర్ - నిన్న నాకు జ్వరంగా ఉంటే డాక్టర్ కు చూపించాను సార్

శాంతి స్వరూప్ - అలాగా...మరి డాక్టర్ ఏమన్నాడు

కాలర్ - జ్వరమొచ్చిందన్నాడు

శాంతి స్వరూప్ - మరి ఇంకేంటి సమస్య...శ్రీనివాస్ గారు, మన స్టూడియో కు డాక్టార్ గారు రావటానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఈలోపు నెనొక కవిత చదువుతాను....వినాలి తమరు.

నా రూం లొ కరెంటు పొయ్యింది..ఆహా...కరెంటు పొయ్యినందుకు నేను ఇంతగా ఎప్పుడూ ఆనందించలేదు. ఈ చీకటి నా జీవితంలొకి మళ్ళీ వెలుగు తీసుకొచ్చింది....

దెబ్బతగిలినప్పుడు Dettol రాసుకుంటే మొదటి 10 సెకండ్లు మంటేసి తరువాత చల్లగా ఉంటుంది. ఆ 10 సెకండ్ల మంట ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందొ దూరదర్శన్ చూసాక తెలిసింది.

37 comments:

Naveen said...

హాస్యం పండిచడంలో దాట్ల శ్రీనివాస్రాజు అంతటివార్లా ఉన్నారే :)

Ravi said...

niku nuvve saati ...chaala goppaga vundhi..vamsi kathala vale andanga allukundhi ....

సత్యసాయి కొవ్వలి said...

DSG గారూ దుర్దర్శన్ మీద మల్లిక్ కార్టూన్ల తర్వాత అంత సహజత్వానికి దగ్గరగా వర్ణించినవారు మీరే. నవ్వలేక చచ్చా. నవ్వుకి కళ్ళు మూతలుపడిపోయి, నీళ్ళుకారి ఈ టపా చదవడానికి చాలా కష్టపడ్డాను. అవునూ, మీరు మరీ అజ్ఞాతంగా కాకుండా కాస్త పేరైనా చెప్పచ్చుకదా, ఏదో మాతుత్తికోసం.

radhika said...

ha ha...durada darsan

సుధాకర్(శోధన) said...

నాకస్సలే జ్వరంగా వుంది. ఏమి తోచటం లేదని ఇలా వస్తే ఇలాంటి జాబులా...నవ్వితే కడుపునొప్పి...నవ్వాపుకుంటే తలనొప్పి. ఈ పోయేకాలం నాకు నవ్వేకాలంగా దాపురించేంట్రా బాబు :-(

నాకు ఈ టపా వలన జ్వరం పెరిగితే ...కోర్టులో కలుసుకుందాం..భై..

lalitha said...

చాలా బాగుంది. చదవడం అయిపోయాక కూడా ఉండుండి నవ్వుకుంటూనే ఉన్నాను.
ఎక్కడా తక్కువవ్వకుండా ఆపకుండా నవ్వించారు.

లలిత

Anonymous said...

జంధ్యాల మార్కు హాస్యం. అదరహో! Keep it coming!!

వెంకట రమణ said...

మీ పోష్టులతో హాస్యం పంట పండిస్తున్నారు. ఇలానే వ్రాస్తుండండి.

Anonymous said...

అమ్మో మీరు మామూలు చతురులు కాదండి. హాస్యాన్ని పండిస్తున్నారు.
ఇటు తెలుగు బంతి తో బౌలింగ్ చేసి టప టప నవ్విస్తున్నారు అటు ఇంగ్లీషులో బ్యాటింగ్ చేసి ఫోర్లు సిక్సులు కొడుతున్నారు.


మంచి మజ మజా గా రాస్తున్నారు.


విహారి.

మానస said...

మొన్నెపుడో మా టీవీ లొ శాంతి స్వరూప్ ప్రత్యక్ష్యమై స్లో మోషన్ కవితల్తొ జనాల్ని అదరగొట్టేసాడుట. అక్క్కణ్ణుంచేనా ఈ కవితల ప్రస్తావన?

నాగరాజా said...

అద్భుతం

spandana said...

హ హ ..ఏమి హాస్యం! ఈ సినిమాలోళ్ళు మిమ్మల్ని చూసైనా హాస్యం ఎలా వుండాలో నేర్చుకున్నారు గాదు.

వాఖ్యానాలలో శోధన సుధాకరూ నవ్వించారు.

--ప్రసాద్
http://blog.charasala.com

Japes said...

:) ఈ పోస్ట్ చదివినంక నాకు కూడ ఇదే తట్టింది ....
"పట్టాభి కి జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. అంతే...వెంటనే నిర్ణయించుకున్నాను - ఈ రోజంతా దూరదర్శన్ చూసి, రేపు ఆఫీసుకు వెళ్ళి అందరితో చెప్తాను. ఏమి చెస్తారో చూద్దాం." మల్ల దూరదర్శన్ (దుల / దురద - దర్శన్) చూసి నిర్ధారించుకోవాలని ! Good one !

shadruchulu said...

మరి పందుల పెంపకం, గేదేలకు చేసే వైద్యం,లాంటివి చూడనట్టుంది. చూస్తే ఖచ్చితంగా పిచ్చి ఎక్కేది. చావాలని నిర్ణయించుకుంటే దూల దర్షన్ చూస్తే సరి. జీవితం మీద మిగిలిన కొద్దో గొప్పో ఆశ నశించడం ఖాయం.

Naveen said...

మీరు నాకు పిచ్చనకూడదు...విచిత్రంగా చూడొద్దు.... ఒక విషయం చెబుతా. "పందుల పెంపకం"నాకు భలే ఇష్టమైన కార్యక్రమం. ఇంకా మొక్కల పంపకం, కోళ్ళ ఫారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు భలే విఙ్ఞానాత్మకంగా ఉంటాయి :)...దూరదర్శన్ లో వచ్చే #UGC# కార్యక్రమంతో పోలిస్తే ఈ శాటిలైట్ చానెళ్ళు అపర దండగ అనిపిస్తాయి. పిల్లలకు దూరదర్శన్ కు మంచిన ఛానెల్ లేదు. కోలాటం, గరగలు, గరిడి, చక్కభజన, చిందు యక్షగానం, చెంచు భాగవతం, చెక్కబొమ్మలాట, జిక్కికి, డప్పులు,తంబుర (కడ్డీ తంత్రి), తప్పెటగుళ్లు, తోలుబొమ్మలాట, పగటి వేషాలు, పల్లెసుద్దులు, బుర్ర కథ, మరగాళ్ళు, యక్షగానం, రాయలసీమ కొరవయ్యల నృత్యం లాంటి అపురూప జానపద కళా రూపాల్ని చూపించే ఏకైక ఛానెల్ దూరదర్శన్

Gems Of Hindupur said...

chala bagundi...

idi choopisthe dooradarshan, sorry doola darshan vallaki buddi vastundo ledo?

Pradeep said...

Hi, mI blAg nEnu "thenegoodu" choosa. mee comedy super. navvaleka chachcha. :))

aravind said...

మొదట మీ రెండురెళ్ళు ఆరు లొ సాపాటు ఎటూ లేదు..చదివిన తరువాత నా స్పందన వ్రాద్దామని అనుకొని ...తరువాత టాపిక్ చదివిన పిదప తెలియచేద్దామని అనుకొన్నాను...మీ దూలదర్శన్ చదివిన వెంటనే ఈ స్పందన వ్రాసాను. మీ బ్లాగ్ చదువుతున్నంత సేపు నవ్వు ఆపుకొలెకపొయాను ..మంచి tonic లాంటి హాస్యం ఉంది మీ రచన లొ..

chalam said...

nee yenkammaa babaii, champesaav comedy thoti ...

Murali said...

చక్కటి హాస్యం పండించారు. మీరు రాసే విషయాలని బట్టి నాకర్థమయింది ఏంటంటే, మన అభిరుచులు కూడా కొన్ని కలుస్తున్నాయి, (ఆఫీస్ పార్టీలు ఎలా జరుపుకుంటారు, రమణ గోల గోల పై మీ అభిప్రాయం, ఇత్యాదివి). వీలైతే నా బ్లాగ్ ని సందర్శించండి. http://tetageeti.blogspot.com

Manaswini said...

Evariki tochindi varu rase swathanthram kacchitham gaa andariki undi...
Kaani hasyanni pandichatam kosam unnavi lenivi kalipi ma DD1 ila darunam ga akshareekarinchatam chala badinchindhi nannu..
Mee kada chadivina chala mandi nijam gaa DD1 ide ghoram aina paristhithi lo undemo anukuntaru..
DD1 is the BEST is my personal Opinion..
Ugadi pacchadi laa anni samapallalo chupinche sadanam dooradarshan.
Anyways to crack a joke we need a victim and this time victim is ma DD1...

Lalithaa Sravanthi Pochiraju said...

Many channels see viewers as their consumers
DD is the only channel which sees viewers as the citizens of India

that may be the reason u r all making fun of DD

It is the only channel,where a complete family can watch

రాకేశ్వర రావు said...

ఎంత బాగోపోతే , చూసి మరచి పోవాలిగాని.
ఇలా నలుగురి ముందు రాగింగ్ చేస్తే పాపం ఆ శాంతి స్వరూప్ అవమానం తట్టుకోలేక్ ఎ అగాయిత్యమో చేసుకుంటే... :)

ఆ మాట్లాడితే కవితలు వల్లెవేయడం చూస్తే ఎదో జంధ్యాల సినిమాలో ఒ వ్యక్తి గుర్తుకువచ్చాడు.

రానారె said...

రెండురెళ్లు ఆరు కాదు నూటపదహారు అనిపించారు. బ్రహ్మాండంగా ఉంది. నాణేనికి మరోవైపున చూస్తే, దూరదర్శన్ అనే పదం వినగానే చాలామందికి గుర్తొచ్చే పదాలు - పందుల పెంపకం, పశువులకు వైద్యం. ఉద్యోగయోగం పట్టి నెలనెలా జీతం తీసుకొనేవారికి ఇవి హేయమైనవి కావచ్చు. దూరదర్శన్ అనేది గ్రామప్రాంతాల్లోని జనాలకు కాస్తంత విజ్ఞానం అందించి, వారిని నవీన నాగరిక ప్రపంచంతోపాటు నడిపించే ప్రయత్నం. ఈనాటికీ పక్షపాతం లేకుండా, స్వంత పైత్యాలూ వ్యాఖ్యానాలూ పక్షపాతాలు లేకుండా వార్తను వార్తగా అందించేది దూరదర్శన్. ఈ సంగతి తెలిసే ఈ టపాలో మీరు ఆ కార్యక్రమాల జోలికి వెళ్లినట్లు లేదు. ఆ యాంకర్లను భరించడం మాత్రం నిస్సందేహంగా కష్టమే.

Siddipet BLOGSSSSSSSSSS..... said...

superb ga rasavanna....ekdam undi.asalu navvi navvi chachamanuko....nenu aithe kalisina parthi frnd ki chupisthunna idi...

Budaraju Aswin said...

sir
Naaku memmalni kalavaalani yundi
baaboi champestunnaru mee haasya dhorani tho naaku elaa cheppaalo artham kaavatledu

vijju said...

చాలా చాలా బాగుంది... నాకు ఎప్పుడు ఆ పొయె కాలమె... ఎందుకంటె మాకు డిష్ connection లెదు... ఈ టపా చదివి చాల నవ్వు వచింది... థంక్స్...

Bhanu Reddy said...

DSG mee blog chaala chaala bagundi. I am also from tirupati. Which school did you go to and which year did you pass out?

Sreedevi said...

Fantastic comedy story...:-D

Vamsi said...

Mastaaru..... chduvutu navvaleka chachhanu. mukhyam gaa 'Daridrudu bathroom ki velte sanigaadu bayata gollempettatam' adirindi. Off lo chadavatam modalupettanu. Gattigaa navvite andaru chustaaru... navvakundaa aapukoleka potunnanu... mahanubhavaa...... meeku nijamgaa topeelu tiyyalsinde.. (Hats offff)....

ramu said...

శాంతి స్వరూప్ మీ జీవితం లో అశాంతి రేపాడన్నమాట!
కానీ పాపం అండీ! దూర(ల)దర్శన్ వాళ్ళు చదివితే ఏం చేసుకుంటారో!
అయినా ఈ మధ్య కొన్ని కర్యక్రమలన్నా మంచిగా వుంటున్నాయి లెండి (దయచేసి ఇది మా office లో ఎవరితోను చెప్పకండి)
అన్నట్టు మీరు దూ.ద. లో అప్పుడప్పుడు వచ్చే private dance చూడలేదనుకుంట నేను వాటికి పేద్ద fan నండీ బాబు :)

Chandramouli Malleda said...

హహహహహహ్హాఆఆహ్హ్హ్హహ్హ్హహహహహహ్హాహహహ్హ్హ్హ్హ్
హ్హ్హ్హ్హహ్హ్హహాహహహహహహహహాహాహా
మ్మ్మ్మ్హాఅహ్హ్హ్హ్హహ్హ్హ్హ్హ్హ్ నవ్వలేక చచ్చానండీ బాబూ... థాంక్యూ for a nice and funny article..

Anonymous said...

super andi... chaduvuthunnantha sepu naaku navvu agaledu.... too gud... n thnx for the blogs ...2yrs back eppudo mee blog chennai meedha raasindi office lo chadivaanu email fwd ga vachindi naa navvu enduko team mates sudden ga artham kaaleedu :) ....

Raghu said...

కెవ్వు కేక....

Unknown said...

Gowtham garu.. mee recent post kosam chaala eager ga wait chesthunnam... Yemipoyaaru?

venu said...

Please Don't comment on Doordarshan compare to private channels excellent. if u see private channels serials time waste and u wull get bonus BP,sugar,HeartAttack as per doctor's survey, if u see doordarshan paadipanta good one to do bussiness.

Neha said...

ayya baboy.. entaga navvincharandee babu.. chala years taruvata intaga kallanta neellu vachenta ga navvindi eeroje.. jambalakadi bamba cinema choosinappudu kooda intaga navvaledu. chala chala baagundi ee ee dooradarsan post