Wednesday, March 21, 2007

మల్లెపూలూ - మసాలా వడ

ఈ క్రింద ఉన్నదంతా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగ వ్రాయబడింది..ఇందులోని ఏ పాత్రా కల్పితము కాదు..
ఇంకో విషయం...మన తెలుగు సినిమాల లాగానే పైన ఉన్న టైటిల్ కూ కింద రాసిన దానికీ ఏ మాత్రమూ సంబంధం లేదు...ఏ పేరు తోచక పెట్టింది మాత్రమేతలుపు కొట్టిన చప్పు డయ్యింది. వెళ్ళి చూస్తే ఎదురుగా 'రెండు రెళ్ళు ఆరు ' నిలబడుంది.

నేను - హలో..బాగున్నావా

రెండు రెళ్ళు ఆరు - నెను బాగానే ఉన్నాను. నీ విషయం చెప్పు. వారం దాటిపొయ్యినా కలవటానికి రాకపొతే నెనే వచ్చా..ఏంటి సంగతులు?

నేను - మంచి పని చేసావు. నిజానికి నెనే నీ దగ్గరకు వద్దామనుకున్నా

ఇంతలొ మళ్ళీ తలుపు చప్పుడయ్యింది. తెరిచి చూస్తే 'ఆఫీసు పని ' కనిపించింది. బట్టలన్నీ చిరిగి పొయ్యి, చింపిరి తలతో చాలా అస్సహ్యంగా ఉంది

నేను - నువ్వా..మళ్ళీ ఎందుకొచ్చావ్? దయచేసి నన్ను కాస్సేపు వదిలెయ్యి..చాలా రోజుల తరువాత నా ఫ్రెండుతొ ఓ గంట సేపు సరదాగ గడపాలనుకుంటున్నా. ఐనా నిన్ను ఆఫీసు లో రోజూ కలుస్తూనే ఉన్నాను గా..ఇంటికెందుకొచ్చినట్టు?

ఆఫీసు పని - నీ బాసు పంపించాడు..నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కాస్త ఆనందంగా ఉండటం చూసినట్టున్నాడు. ఎక్కడో మూలకు పడి ఉన్న నన్ను వెతికి నీ కోసం పంపాడు. నాకు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగి, తల దువ్వి, పౌడర్ రాసి పంపాలట.

నేను 'రెండు రెళ్ళు ఆరు ' వైపు చూసాను.

రెండు రెళ్ళు ఆరు - పరవాలేదు. నెను వెయిట్ చెస్తాను. దాని సంగతి చూడు

'ఆఫీసు పని ' కి గంట సేపు స్నానం చేయించినా జిడ్డు వదల్లేదు. నా ఓపిక నశించింది..చేయించిన స్నానం చాలనుకుని, చాలీ చాలని బట్టలు తొడిగి దానిని పంపించేసాను..

హమ్మయ్య...ఇప్పుడు ఎవ్వరొచ్చినా సరే 'రెండు రెళ్ళు ఆరు ' తో కనీసం ఓ అర గంటైన గడపాలి..

తలుపు చప్పుడయ్యింది. వెళ్ళి కిటికీ లోంచి చూసాను.

బయట 'నిద్ర ' నుంచుని ఉంది. నేను తలుపు తెరవలా.

ఇంతవరకు తలుపు మెల్లగా తట్టిన 'నిద్ర ' ఇప్పుడు దబ దబా బాదుతోంది...సరే దీని సంగతేంటొ చూద్దామని తలుపు తెరిచా

నేను - నువ్వు మామూలుగ ఆఫీసు లో ఉన్నప్పుడు కదా వస్తావు...ఇలా ఇంటికొచ్చావేంటి?

నిద్ర - మాష్టారూ..మనము కలిసి రెండు రోజులౌతోంది. నా వెనకాలే 'జ్వరం' కాచుకుని ఉంది..దానిని ఇంకాస్త వెయిట్ చెయ్యమని నచ్చజెప్పి నేను వచ్చాను..ఈ రోజైన కనీసం నాలుగు గంటలు నాతో గడపక పోతే రెపు పొద్దున్నే ఆ 'జ్వరం' నిన్ను వచ్చి కలుస్తుందంట..మూడు నాలుగు రోజులక్కానీ నిన్ను వదలదు మరి...ఆలోచించుకో.

'నిద్ర ' మాటల్లో నిజం లేక పోలేదు. ఏమి చెయ్యాలో తోచక 'రెండు రెళ్ళు ఆరు ' దగ్గరకు వెళ్ళాను

నేను - ఏమీ అనుకోకు..ఓ రెండు రోజులు గా 'నిద్ర ' ను బాగా నిర్లక్ష్యం చేసాను..ఈ రోజు కూడా దానిని పలకరించక పోతే ఇబ్బందులొస్తాయి. మనము రేపు తప్పకుండా కలుద్దాం..ఎమంటావు?

'రెండు రెళ్ళు ఆరు ' - అలాగే కానీ..నీ ఇష్టం. రేపు ఎన్నింటికి రమ్మంటావు?

నేను - నేనే వస్తాను. రెపు నేను చెయ్యవలసిన పని ఒకటుంది..వారం రోజులుగా మా బాబాయి కొడుకు 'తీరిక ' కనిపించట్లేదు. వాడిని ఎలాగైన వెతికి పట్టుకోవాలి..'తీరిక ' దొరకంగానే నేనే నిన్ను వచ్చి కలుస్తాను.

ఎంతో బాధతో 'రెండు రెళ్ళు ఆరు ' వెళ్ళిపొయ్యింది. నేను అబద్దం చెప్పానని దానికీ తెలుసు. మా బాబాయి కొడుకు పేరు 'తీరిక ' కాదు ..'సాకు '. పైగ వాడెప్పుడూ నాతోటే ఉంటాడు....కాని ఏమి చెయ్యను?? రేపు ఆఫీసుకి వెళ్ళిన వెంటనే నిన్న నేను స్నానం చేయించిన 'ఆఫీసు పని 'ని నా బాసు గాడు బురద లో దొర్లించి మళ్ళీ నా దగ్గరకు పంపుతాడు. ఈ సారి దానిని రెడీ చెయ్యటానికి ఎంత సేపు పడుతుందో? అందుకే అలా అబద్దం ఆడాల్సి వచ్చింది.

కారణం అదొక్కటే కాదు...నన్ను కలవటానికి వచ్చే విజిటర్స్ లో ఇంకో వెధవ ఉన్నాడు. వాడి పేరు 'సోమరితనం'. వీడు నాతో ఉన్నంతసేపు ఎవ్వరు వచ్చినా నేను తలుపు తియ్యను. ఎవ్వరి తోను మాట్లాడను..వీడు నన్ను వదిలి నా బాసు గాడి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా వాడి దగ్గర ఉన్న 'ఆఫీసు పని ' నా దగ్గరకు వస్తూ ఉంటుంది.

సరే, ఏదోలాగా మసి పూసి మారేడికాయ చేసి వీళ్ళందరిని వదిలించుకుని 'రెండు రెళ్ళు ఆరు ' తో మీటింగు ఏర్పాటు చేసుకుంటే...నా మంచం కింద దాక్కుని ఉన్న 'దిగులు ' బయటకు వస్తుంది. ఇదో రాక్షసి. అస్సలు ఇది ఎలా వస్తుందో తెలియదు..ఏమి కావాలో అడగదు..ఎవరు పంపిస్తే వచ్చిందో చెప్పదు. ఉన్నంతసేపు ప్రాణం మాత్రం తోడేస్తుంది.

ఇంత మంది శత్రువుల తో పోరాడితే తప్ప 'రెండు రెళ్ళు ఆరు 'ని కలవలేక పోతున్నా.

వచ్చే వారంలో నైనా 'రెండు రెళ్ళు ఆరు 'ని కాస్త త్వరగా కలిసి..దానితో కాస్త ఎక్కువ సేపు గడపాలి..చూద్దాం..

45 comments:

వెంకట రమణ said...

అద్భుతం! చాలా బాగా వ్రాశారు.

మానస said...

ఈ మధ్య కాలంలొ మన తెలుగు రచనల్లొనూ, సినిమాల్లొనూ నిజంగా దమ్మున్న, స్వఛ్చమైన హాస్యం అస్సలు కనిపించడం లేదు.
You seem to be somoene with the potential to change this.
Thank you for entertaining us!

వీవెన్ said...

బలే బాగుంది.

Sudheer said...

Nidra tho kalavakapothe jwaram vasthundanna vishayam baga rasaru.
Maa ex-boss oka ayana antundevaru:
"Body will take it's rest. Either you give it, or it will take" ani, mee post chadivi malli ade gurthuku vachindi.

ప్రవీణ్ గార్లపాటి said...

వావ్ చాలా బాగా రాశారు.
అప్పుడప్పుడూ అన్నిటినీ పలకరిస్తేనే అందం మరి.

వల్లూరి said...

మీ శైలి చాలా బాగుంది. ఇంతకీ, "రెండు రెళ్ళు ఆరు" ఏవరు? ఆ "రెండు రెళ్ళు ఆరు"కి "మల్లెపూలూ - మసాలా వడ"కి గల సంబందం ఏమిటి? కనీసం ఏదైనా లాజికైనా ఉండివుంటుంది కాదా ఈ టైటిల్ పెట్టటంలో

Sravan Kumar DVN said...

Wonderful !

radhika said...

super.prayoagam adirindi.

Raghuram Murthy said...

చాలా బాగా రాశారు.

వల్లూరి గారూ, రెండు రెళ్ళు ఆరు అనేది ఈ బ్లాగు పేరండీ!!!

కొత్త పాళీ said...

రె.రె.ఆ. తో మీ సంసారం మూడు కలయికలు ఆరు బ్లాగులుగా వర్ధిల్లుగాక!

నరహరి said...

Good One

Swathi said...

చదుతున్నంత సేపు ఒక నాటకం చూస్తున్నట్టనిపించింది.
పేరు ఇంకా బాగుంది సంబంధం లేకపోయినా.
మీకు మంచి ఊహా శక్తి ఉంది. రాస్తూ ఉండండి ఇటువంటివి :)

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

చాలా నాటకీయంగా చెప్పారు. మీ శైలి ఒక్కపట్టులో ఆసాంతం గబగబా చదివించేసింది

Krishh said...

మీ రచనా శైలి కి జోహార్లు !!

Rohini said...

చాలా బాగుంది.

spandana said...

అద్బుతంగా వుంది అంటే చాలా తక్కువ.
ఛా ఈ సినిమాలోల్లు సీరియల్ గాళ్ళూ మన బ్లాగరులను చూసైనా కామెడీ ఎలా పుట్టించాలో తెలుసుకోరు. మొన్ననే జెమినిలో "జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్" అంటే ఏదో అని చూశా!
మొదలెట్టిన మొదటిరోజే వాళ్ళ కామెడీకి సరుకుగా "కళ్ళులేని కబోది"ని, "బ్రహ్మ చెముడూ"నీ వాడుకున్నారు. కళ్ళు వంకరగా వున్న కళ్ళ చిదంబరం, వళ్ళు నల్లగా వున్న బాబూ మోహన్ మనకు హాస్య విశయాలు. ఛీ వీళ్ళ దుంప తెగ.


--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

యర్రంశెట్టిశాయి, మల్లిక్ లాంటివాళ్లను తలపించింది మీ రచన. "మా బాబాయి కొడుకు పేరు 'తీరిక ' కాదు ..'సాకు '" అని నిజాయితీతో మా మనసు దోచింది. ఇంకేం చెప్పమంటారు, బ్రహ్మాండం !

Anonymous said...

అదిరిపోయిందిబ్బా.

చూడబోతే మీరు సాధారణ బ్లాగరు కాదు. ఏదో పేరున్న రచయిత రాసినట్టుంది.

నాకె తెలీకడుగుతా..నాకు కూడా కొంచెం అటు ఇటుగా ఇలాంటి ఆలోచనే బుర్రలోకి వచ్చింది. ఎందుకు చెప్మా!!!
బహుశా మీరు కూడా నాలాగే తిరపతి లడ్లు ఎక్కువ తినేసుంటార్లే.

విహారి.

ravi shankar said...

Interesting observations.. me a first timer.. here... telugu lo chaala rojula tharuvaatha santoshamga chadivaanu... looking forward to ur latest posts....

Srinu said...

చాలా బాగుంది.నిజాలని చక్కగా వ్యక్తం చేసారు.

సత్యసాయి కొవ్వలి said...

బాగుంది అంటే సరి పోనంత బాగుంది. మా పిల్లల భాషలో చెప్పాలంటే ఓ పది ఆకాశాలంత బాగుంది.
మీరు చెప్పినవాళ్ళందరూ నాకుకూడా బాగా దగ్గర వాళ్ళే. అంటే మనం ఆత్మ బంధువులం అన్న మాటా. ఇందులో సాకు,సోమరితనాలు చాలా దగ్గరవాళ్ళు.

BandarBlogarudu said...

మాష్టారు మీరు బ్లాగుల్లో ఏం చెస్తున్నారండి. ఒక కథ రాయండి ఇదే సైలిలొ. సిల్వర్ జూబ్లీ మినిమం అండి. సూపర్ అదిరింది

నేనుసైతం said...

అద్భుతం!....మీ శైలి, కథనం మహాద్భుతం!!!

chaitanya said...

బలే బాగుంది

siva prasadnama said...

chaala chaaaala chaaaaaala chaaaaaaaaaala chaaaaaaaaaaaaaaaaaaaaaala .........bagundi

తెలుగు వీర said...

అయ్యా, మాకు వీటిని వదిలించుకొనే కిటుకేమైనా కనుగొంటే తప్పకుండా ఉత్తరమ్ముక్క వెయ్యండి

Budaraju Aswin said...

చంపేశారు
2*2=4
మాటలు రావట్లేదు
అబ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బాఆఆఆఆ

vijju said...

మీకు హ్యట్సాఫ్.... చాల బాగా వ్రాసారు... మన పనులని చాలా బాగా చెప్పారు...

Anonymous said...

mee vuuhhaa sakthi excellent... when ur writing another fun-tonic?????? we all are waiting for that.........

Telugodu said...

అదిరింది గురువుగారు. ఇలానే ముందుకు దూసుకుపొండి.

Harika said...

adhirindhi andi..chala baga raseru..
mee blogs anni chadhuvuthunna..excellent asalu..
waiting 4 more.....

అశ్విన్ బూదరాజు said...

గౌతం గారు అసలు ఈ టపా చాలా బావుంటుంది. నేను ఇది వరకు 2*2=4 అని రాశాను, అంటే నిజం మాట్లాడారు అని కానీ ఆసలు అంత క్రియేటివ్ గా చాలా బా రాశారు. అసలు ఎలా నా భావాన్ని చెప్పాలో అర్ధం కావట్లేదు.కేకంటే కేక మా బాబాయి గారి అబ్బాయి కాన్సెప్ట్ అదిరింది.

Anonymous said...

This is awesome.. "మా బాబాయి కొడుకు పేరు 'తీరిక ' కాదు ..'సాకు '. పైగ వాడెప్పుడూ నాతోటే ఉంటాడు" I liked this very much...

Padma said...

Ayyo Gowtham. asalu rojuku okasari ayina chadavakunda undalekapothunnamura boss....

bodapati said...

Hats off basu..chala baga rasavu....we except more from u...

shameena said...

Chaala baaga raasaaru!!!I just wanted to meet u to take one autograph..

kiddybank said...

Hii thotaramudu
i am working on a movie script...and recently reading blogs...to get some real life situations..and i m impressed with ur writing style
if you think u can contribute to a film script by giving scenes/dialogues..please email me at the earliest.
kiddybank@gmail.com

Anonymous said...

First time iam posting a comment. I couldnt resist. This is the highest degree of imagination. Tilak wrote about GOD visiting his room and converses. This is beyond that .Is there no better word than Hats Off?
ramprasad vedula

Anonymous said...

First time i couldn't resist from postimg my appreciative comments. This is a highly imaginative post. Tilak writes about GOD coming to his room and converses. This is similar to that but coated with lot of laughter. Is there no better word than Hats Off.
Ramprasad vedula

ramu said...

మీ సృజనాత్మకత చాలా బాగుంది (సృజన అనే అమ్మాయి ఆత్మ కథ కాదండీ బాబు! :) )

ammadu said...

chaala bagundi andi mee blog. chadivinantha sepu navvukuntuune vunnannu.really really excellent. kani koncham chinna chinna blog kudaa rasthe baguntundi.

vinu said...

busy life :(

చాతకం said...

నేను కూడా ఈమధ్యనే ఒక బ్లాగు తెరిచాను. మీ టపా నా కళ్ళకి కట్టినట్లుంది. చాలా బాగా వ్రాసారు.

Jithender V said...

SUNNITHA MINA HASYAM CHALA BAGUNDAMDI

Anonymous said...

Super.......