Wednesday, March 28, 2007

పెళ్ళెప్పుడు???

కొత్తగా ఉద్యోగం లో చేరాక మనకు తెలిసిన వాళ్ళెవరైన కనిపిస్తే.. "ఎలా ఉన్నావు? " అని అడిగినా అడగకపొయినా "పెళ్ళెప్పుడు? " అని మాత్రం తప్పకుండా అడుగుతారు.

సినిమాల్లో పెళ్ళి కాని అమ్మాయిల కష్టాలు చూపిస్తారు కానీ చదువు అవగొట్టి, ఉద్యోగం తెచ్చుకుని, పెళ్ళి కాని అబ్బాయిల బాధలు ఎవ్వరూ పట్టించుకోరు.

నా ఫ్రెండు ఒకడు "ఇంకో సంవత్సరం దాకా నాకు పెళ్ళి ఒద్దు మొర్రో " అని ఎంత గింజుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినలా..
తన మాటలు నచ్చక అందరూ రెండు రోజులు భోజనం మానేస్తారేమో అనుకున్నాడు. కానీ వీడికి తిండి పెట్టడం ఆపేసారు. దాంతో ఒప్పుకోక తప్పలేదు.ఇలాంటి పరిస్థితే దాదాపు అందరిదీ.

పెళ్ళికి ఒప్పుకోగానే మన బాధ్యతంతా అయిపోదు. నిజానికి అప్పటి నుంచే అసలు టార్చర్ మొదలు.

మొదట చెయ్యవలసింది..పెళ్ళిళ్ళ మార్కెట్లోకి వదలటానికి మంచి ఫొటోలు తీయించుకోవటం.

ఫొటోలు: ఏ ఫొటోలు పడితే అవి ఇవ్వకూడదంట..స్టూడియోలో నీలం గుడ్డ ముందు నుంచుని ఒకటి, కుర్చీలో కూర్చుని ఒకటి, ఫొటో మొత్తం మొహం మాత్రమే కనపడేలా ఒకటి తీయించుకోవాలి. "ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు " అన్నామంటే.. మనము ఇంటర్మీడియట్లో పరీక్ష హాల్ టికెట్ కోసం తీయించుకున్న ఫొటో ఇస్తామని బెదిరిస్తారు.
పెళ్ళి సంబంధాల కోసం ఫొటోలు తీయటానికి 'స్పెషలిస్ట్ 'లు ఉంటారు. వీళ్ళ దృష్టిలో అక్కడకు ఫొటో లు తీయించుకోవటానికి వచ్చిన వాళ్ళంతా శత్రు దేశ యుధ్ధ ఖైదీలు..స్టూడియో లోకి వెళ్ళగానే ఇంటరాగేషన్ టైము లో వేసినట్టు పెద్ద పెద్ద లైట్లు వేస్తారు. "సరిగ్గా నుంచోండి సార్..కాస్త నవ్వండి..పై పళ్ళు నాలుగు, కింది పళ్ళు ఒకటిన్నర మాత్రమే కనపడాలి...ఎక్కువగా నవ్వకండి...ఆ చొక్కా గుండీ మీద ఇంకు మరకేంటి..తుడిచెయ్యండి "....ఇలా ఓ గంట సేపు రాగింగ్ చేసాక ఏవో ఫొటోలు తీసి పంపుతాడు. ఫొటోలు తీసినంత సేపూ మన మొహంలో ఏ పార్టూ సరిగ్గా లేదంటూ నిముషానికి ఒకసారి ఏడిపించి, అవమానించి..మన దగ్గర 1000 నుంచి 1500 రూపాయలు గుంజేస్తాడు.

బయోడాటా: ఫొటోలు రెడీ అయ్యాక చెయ్యవలసిన పని బయోడాటా తయారు చెయ్యటం. మన గురించి, మన అలవాట్ల గురించి చాలా జాగ్రత్తగా రాయాలి. ఈ బయోడాటా మాటి మాటికీ మారుస్తూ ఉంటే చాలా ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుంది.
నా ఫ్రెండొకడు పేపర్ లో 'వధువు కావలెను ' అనే ప్రకటన లో మొదట "కట్నం లేకున్నా పరవాలేదు " అని ఇచ్చాడు. వాడికి తెలిసిన వాళ్ళెవరో "అలా ఇస్తే నీలో ఎదో లోపముందనుకుంటారు " అన్నారట. "కట్నం తప్పనిసరిగా కావాలి " అని మార్చాడు. అయినా లాభం లేక పొయ్యింది. ఇలా కాదని.. "కట్నం తీసుకు రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను..ఖబడ్దార్!" అని మార్చాడు. కొత్త సంబంధాలు ఏమీ రాలేదు కానీ పోలీసుల నుంచి ఫోను మాత్రం వచ్చింది...
అందుకే మొదటి సారే ఆచి తూచి బయొడాట తయారు చేసుకోవాలి. "సిగరెట్టు, మందు అలవాటు లేదు " లాంటి చిన్ని చిన్ని అబధ్ధాలు పరవాలేదు కానీ "నేను అందంగా ఉంటాను..రోజూ ఎక్సరసైసు చేస్తాను...అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు"... లాంటి పచ్చి బూతులు రాయకూడదు...అసలుకే మోసం వస్తుంది.

మధ్యవర్తులు: వీళ్ళు చేసే అన్యాయం అంతా ఇంతా కాదు - మనకు నెలనెలా వచ్చే జీతం నుంచి..మన అండర్వేరు సైజు వరకు ఎవ్వరికీ చెప్పని వ్యక్తిగత విషయాలన్నీ దబాయించి అడిగి తెలుసుకుంటారు..వాళ్ళు తెచ్చిన ప్రతీ సంబంధానికి "అమ్మాయి భూమిక లాగ ఉంటుంది..కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు " అంటారు. తీరా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి అమ్రీష్ పురి లాగ ఉంటుంది.

ఇంట్లో వాళ్ళ కంగారు: ఒక్క సారి సంబంధాలు చూడటం మొదలు పెట్టాక ఇంట్లో వాళ్ళు పడేదానికన్నా మనల్ని పెట్టే కంగారు ఎక్కువ.ఇంటికి వచ్చిన ప్రతీ వాడితో "మా వాడికి ఏవైన సంబంధాలు ఉంటే చూడరదూ " అంటారు. ఆ వచ్చినోడు మనల్ని ఎగా దిగా చూసి "నువ్వు కాస్త నీటుగా ఉండే బట్టలేసుకోవాలి మరి....అలా జుట్టు పెంచుకుంటే కుదరదు" అని ఐదు పైసల సలహాలు రెండు ఇచ్చి పోతాడు. ఛీ.. ఇలా మాటలు పడటం కన్నా ఆ ఆడ అమ్రీష్ పురి ని చేసుకోవటం మేలనిపిస్తుంది.

జాతకాలు: పిల్లవాడు పుట్టాక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవటం మరచిపొయ్యినా జాతకం రాయించటం మాత్రం పొరపాటున కూడా మరువరు తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు కుదరటం వెనకాల ఉన్న కష్టాలు తెలుసుకున్న జ్యోతిష్యులు జాతకాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు.

నా ఫ్రెండు దినకర్ జాతకం ఓ జ్యోతిష్యుడు ఇలా రాసాడు:

చదువు - అద్భుతం
ధనం - అద్భుతం
కళ్యాణ యోగం - అద్భుతం (conditions apply)

మనతో పాటూ చదువుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళయ్యే కొద్దీ ఇంట్లో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది...."వాడిని అడిగైన తెలుసుకో ఏమి తప్పు చేస్తున్నావో " అంటారు. మనమేమీ మాట్లాడలేము. మనతో పాటూ ఫెయిల్ అవుతున్న ఫ్రెండు సడన్ గా 35 మార్కులతో పాస్ అయ్యి "పరీక్షలలో పాస్ కావటం ఎలా " అని సలహా ఇచ్చినట్టు... వాడూ ఏవో రెండు మాటలు చెప్తాడు.

ఇంట్లో వాళ్ళ ఎమొషనల్ బ్లాక్మెయిల్ వల్ల పెళ్ళికి సిధ్ధ పడ్డ అబ్బాయిలు చాలా మంది తెలుసు నాకు.
అమ్మాయిలకు జరిగే బలవంతపు పెళ్ళిళ్ళతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు...అలా అని మరీ కొట్టిపారేసేంత చిన్నదీ కాదు..అందుకేనెమో ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని ఎక్కువ మంది గుర్తించరు...

35 comments:

spandana said...

హ్హ హ్హ కడుబుబ్బ నవ్వేశా! నిజమే అమ్మాయిల బాధలు పట్టించుకున్నంతగా అబ్బాయిల బాధ పట్టించుకోరు. మీకే మగ మహారాజులు అంటారు గానీ "పీత భాధలు పీతవి" అన్నట్లు మన బాధలు మనవి కదా!

--ప్రసాద్
http://blog.charasala.com

కొత్త పాళీ said...

చాలా మంచి టపా. హాస్యంగా అయినా సునిశితమైన వ్యాఖ్య.

Rajesh said...

హహహహ,బాగా చెప్పారు.
http://gannarapu.wordpress.com

S said...

చాలా బాగుందండి. నవ్వుతూనే ఉన్నా.
ఇదే మొదటి సారి మీ బ్లాగు చదవడం నాకు. సో, wishing u all the best!

radhika said...

హ హ...అదరగొట్టేసారు.ఫొటోలు తీయించుకునే ప్రహసనం నాకు బాగా నచ్చింది.తెలుగు బ్లాగులు హాస్యపు జల్లులు తెగ కురిపించేస్తున్నాయి.ఆ చినుకుల్లో మీదో స్వాతి చినుకు.

రానారె said...

హహ్హహ్హ... కొన్నికొన్ని అంతే :))) భలే రాశారు.

Anonymous said...

భలే చెప్పారు అబ్బాయిల కష్టాలు...ప్చ్ పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీత వి

Krishh said...

సూపర్ గా రాస్తున్నారండీ బాబూ ప్రతీ పోస్టూ !!

ప్రవీణ్ గార్లపాటి said...

హహహ... బాగుందండీ ప్రహసనం. ఏం చేస్తాం ? మన మగాళ్ళంటే అందరికీ చులకనే.

Srinivas Kishore said...

adbhtangaa raasaaru. comedy enta baaga pandinchaaro anthey chakkagaa chivariki rendu linelalo ee post venakaala unna antaraartham kooda chepparu....really good!

మానస said...

" "నేను అందంగా ఉంటాను..రోజూ ఎక్సరసైసు చేస్తాను...అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు"... లాంటి పచ్చి బూతులు రాయకూడదు..."

Bravo..!!

guns said...

well said dude.. I enjoyed a lot. I hope atleast we will become good parents for our children

ప్రవీణ్ గార్లపాటి said...

మీ ఈ టపా కంపెనీ సర్కిళ్ళలో తిరుగుతుంది. జనాలు ఫార్వర్డ్ లు మొదలెట్టారు :)
కూడలి నుంచి ఈ మధ్య చాలా టపాలే తిరుగుతున్నాయనుకుంట.

మానస said...

ప్రవీణ్,
బ్లాగర్ల పుణ్యమా అని మన వాళ్ళలొ తెలుగు చదవాలని రాయాలని ఆసక్తి కలగటం చూస్తోంటె సంతోషంగా లేదూ?

నవీన్ గార్ల said...

నాకు కూడా నిన్నట్నుంచి...ఈ మెయిల్ farwards వస్తూనే ఉన్నాయి. వారందరికీ నేను ఈ సమాధానం ఇస్తున్నాను (ఎందుకంటే..కనీసం ఈ కారణం చేతైనా తెలుగు బ్లాగుల గురించి తెలుసుకొంటారు):
* Some one copied the content from http://thotaramudu.blogspot.com/2007/03/blog-post_28.html

* Also read reactions of this post in: http://gemsofhindupur.blogspot.com/2007/03/blog-post_30.html

* I too maintain a Telugu Blog : http://gsnaveen.wordpress.com................ What about you? for help visit http://groups.google.com/group/telugublog/topics?start=Last but not least do not forget to visit Telugu blog aggregators: 1) http://www.koodali.org 2) http://www.thenegoodu.com/

Regards,
Naveen

Satya said...

ఇది నాకు మెయిల్ లో వచ్చింది. చదువుతున్నప్పుడు గొప్ప నవ్వు వచ్చింది. ఇది రాసింది మన తెలుగు బ్లాగర్లలో ఒకరైన "మానస గారు" అని తరువాత తెలిసింది, మా అందరికీ ఇంత నవ్వుని పంచిన మీకు ధన్యవాదాలు.

Satya said...

నాకు మెయిల్ లో వచ్చినప్పుడు, చాలా బాగుంది కదా అని నా బ్లాగ్ లో టైపు చేశా!! తీరా చూస్తే అది మన మానస గారి సృష్టి.. So , for obvious reasons I removed the post from my blog.. I will be careful so that these kind of mis-understandings shouldn't repeat... Once again my best wishes to Manasa on this success.. Keep rocking...

మానస said...

Hey Satya,
Let me clear one more misunderstanding.
మీరు చెప్తున్న పోస్టు నేను రాసింది కాదు. అది DSG aka తోట రాముడు గారిది. ఆ విషయం మీ దృష్టికి తీసుకు రావాలనే మీ బ్లాగు 'రచ్చబండ'లో కామెంట్ ఉంచా.
Now bouquets or brickbats, please aim them at తోట రాముడు.

రాక్.అ said...

ఆ...సం అండి.
చూస్తూంటే ఆంధ్రా అబ్బాయలందరిది ఇదే సమస్య అనుకుంటా..

ఉదాహరణకు
నేను:"కట్నం లేక పోయినా పరవాలేదు "
మా అమ్మ:"అలా అంటే నీలో ఎదో లోపముందనుకుంటార్రా !! "


ఏ ఈనాడులోనో ప్రచురించగలరేమో చూడండి, అప్పుడైనా మన పెద్దలకు తెలిసి వస్తుంది, మన బాధ.

Ravi said...

ఇప్పుడె చదివా ....అస్సలు ఇ౦త గొప్పగా ...ఒక గ౦ట పాటు నవ్వడ౦ ఆపలెదు అ౦టె అథిశ యొక్థి కాదెమొ ... ఇది నిజ౦

Manaswini said...

aada amreshpuri joke bagundi..

SOPETI said...

తోట రాముడు గారు ... మా కంపెనీ లో కుడా ఈ టపా చక్కర్లు కొడుతుంది.ఇక్కడ ఒకరిద్దరు తెలుగు చదవలేని వారు ఆంగ్లానువాదం కోరితే వారి కోసం ఈ కింది విధంగా తర్జుమా చేశా ... సమయం వుంటే చదివి క్షమించెయ్యండి.

The first question a just-employed guy will get is not “How is your job?” it is “When are you tying the knot?”

Movies, by and large, depict the plight of unmarried girls but none will care about the misery of lads who studiously complete their studies, hook up with a decent job and are with the marital status “Single”.

One of my friends, whose family is busy googling prospective brides, declared in a voice of prophetic finality “I am not going to marry for at least for another year”. He expected everyone to quit eating for a day or two. The twist in the tale is, they stopped giving him food. He is forced to marry. The story is a sad reflection of almost every eligible bachelor’s difficulties.

Agreeing to marry is in no means the end of our responsibilities. The real torture starts then and there. First task on the agenda is to pose for photographs to be released into the marriage market.

Photographs:

Normal photographs won’t do.

1. Standing in a studio with a blue background
2. Sitting in a chair
3. A zoomed (and thus doomed) one with only the face covering the length, breadth, width and depth of the photograph.

All three poses are mandatory.

By any means if you say “I don’t like all this stuff”, you will receive threats to publicize the photographs you have taken for your Plus 2 examination hall ticket.

There are some specialists to take these kinds of photographs. They treat the objects of the photography (us) as pleasantly as one would treat enemy war-prisoners. As soon as you step into the studio, they will switch on these Megawatt neon bulbs as if they are going to interrogate you. “Please stand straight, sir. Smile a little. Only four of the upper and four of the lower should be out. Don’t smile too much. What’s that stain on the shirt button? Swipe that.” After ragging you for an hour he will take some pictures and send. All through this tedious exercise, he keeps pointing out the non-conformance of our facial parts to the lofty standards he has set. In the end, he makes us cough up anything between 1k and 1.5k bucks based on his financial well-being at that point of time.

Bio-data:

The next step is to prepare bio-data. We have to carefully pen down (most of the times, type down) our habits. One of my friends while giving a “classified” ad added the sentence “Dowry is optional”. Pat comes an advice from a well-wisher, “If you say so, people may think there is something wrong with you”. He changed that to “Dowry is mandatory”. Frustrated with the lack of response, he rephrased it to an ultra-cool “If bride comes without bringing dowry, I will scorch her with petrol”. In response, he got a single phone call. It is from the Superintendent of Police. That’s the reason, why bio-data should be prepared with utmost levels of attention; which you need not extend even to the preparation of a job resume. You can go ahead with minor lies like “No smoking and no drinking”. But things like “I am handsome. I exercise everyday religiously. Ajit Agarkar is a good bowler” are sure to land you up in hot thick tomato soup if you are herbivorous and hot thick chicken soup in case you being omnivorous.

Mediators:

There is no limit to the emotional losses incurred because of them. Starting from the salary you get each month, right up to the size of your underwear, they use their “right to information” act and rob you off your most intimate and best-kept secrets. For every alliance they show, they will drum and trumpet incessantly “Girl looks like a long-lost-in-Kumbh-Mela twin of Katrina Kaif”; only after seeing her you will realize her resemblance to the great former India under-19 cricketer Mohd.Kaif.

Familial Pressure:

Once the hunt starts, the pressure your family is under is infinitesimal compared to what you are under. They query each and every person who happens to enter your household “Please do look out for any suitable alliances”. That guy gives a mean look sizing you from top to bottom and comes up with some cerebral advice like “You have got to be dressed up well. You better have a hair-cut.” That’s the time you start having second thoughts of sharing your life with the Mohd Kaif look-alike.

Horoscopes:

Horoscope is the shortened word form of Horroroscope. Parents might even forget taking birth certificates of their just-borns but they won’t forget getting their horoscopes prepared. Astrologers with their long long foresight write them in a very delicate and diplomatic manner. Find below an excerpt from one of my friends’ horoscope:

Education: Brilliant
Prosperity: Brilliant
Marriage: Brilliant *

* Conditions apply

As one after the other of our contemporaries gets married, BP levels of family increases steeply and steadily. “Ask Ashok, what you are doing wrong”. We can’t say a thing back. As if a friend who is failing all along with us suddenly scores a 35 and manages to pass by the skin of his teeth gives us unsolicited advice on how to pass through examination, this just married guy will also gives you his own recipe of Dos and Don’ts.

I know a lot of guys who got ready to marry only due to the emotional blackmail from their family.
Though this guys’ issue is dwarfed when compared to the graver problem of forced marriages of some girls, we got to agree it didn’t receive its due importance.

Sravan Kumar DVN said...

"నేను అందంగా ఉంటాను..రోజూ ఎక్సరసైసు చేస్తాను...అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు"... లాంటి పచ్చి బూతులు రాయకూడదు..."

ఈ లైను చదివి ఒక పది నిముషాలు పొట్టపగిలేలా నవ్వుకున్నాను.

Anonymous said...

అజిత్ అగార్కర్ ఇది చదివితుంటే అతడి reaction చూడాలని ఉంది. హ హ హ్హా!!!

చందర్.

రాజశేఖర్ said...

చాలా బాగా వ్రాశారండి. April లో ఒక FWD Email వచ్చింది , ఇప్పుడు ఇక్కడ చూశాక రచయిత ఎవరో తెలిసింది.
బాగా నవ్వించారండి :)

Phani said...

ha ha ha mama chala baaga rasavu..... hats off ! ! !

ramu said...

అప్పుడే అయిపోయిందా అనిపించింది. నా లాంటి పెళ్ళికావలసిన వాళ్ళకి మంచి సూచనలు వున్నాయి :)

uma blog said...

బాగా రాసారు అండి సొంత అనుబవం అనుకుంటా ..లేదు అంటే ఇంత బాగా రాదు కదా

tulasi said...

బాగుంది

udaya sree said...

HELLO chala baaga raasaru, munde chadivi vunte maa abbayiki inka kaasta jagrattaga profile raasedaanni, ok ninna saakshi paper lo chadive varaku ilanti blog lu telugu lo vuntayani teliyadu. udaya

Chandramouli Malleda said...

సూపరండీ.. అదరగొట్టేశారు.. keep it up..

vchowdary_89 said...

wah wah wah

Damarapalli mahender said...
This comment has been removed by the author.
Anonymous said...

@ మహేందర్
అలా చెవుల్లో రంధ్రాలుండడం అంత మంచిది కాదు. అవి మూలశంక లక్షణాలు కావచ్చు (అసలే మూలా నక్షత్రమాయె!)

వీరభద్దర్రావు గారు రెకమెండ్ చేసినట్టు మన మునేందర్ నవ రంధ్రాల్లోనూ మైనం కూరేయండి. ఆ చెవుల్లోని రెండు తూట్లు కూడా మూసుకుంటాయ్.

మైనం మిగిలిపోతే కొంచెం self administer కూడా చేసేసుకోండి, బ్లాగ్లోకంలో కొంచెం కాలుష్యం తగ్గుద్ది.

Anonymous said...

/అతనికి పుట్టుకతోనే రెండు చెవులకు రెండు రంద్రాలు ఉన్నాయి.వాటి అర్థం ఏమిటి మరియు అతని భవిష్యత్ ఎలా ఉంటుంది/
!?!?
నాకు కూడా చెవులకి రెండు రంధ్రాలేవున్నాయి. అర్థం అంటే... రెండువైపులనుంచి బాగానే వినిపించాలి. చెవులకి రెండుంటే ప్రమాదంలేదు గాని, నోళ్ళు రెండుంటే 'వర్జయేత్' అని ఆయుర్వేదం ఘోషిస్తోంది. అంటే ఒక నోరు పూడ్చేయాలి.
మొత్తం శరీరంలో నవరంధ్రాలు వుండాలి, వున్నాయో లేదో కౌంటింగు చేసి చెబితేగాని ఏ విషయమూ ఇదమిద్ధంగా చెప్పడం కష్టం.