Thursday, May 3, 2007

" ఇక్కడ మంచు పడుతోంది "...

...అని న్యూ యార్క్ నుంచి రాంకిరణ్ ఫోన్ చేసినప్పుడల్లా నా కడుపు రగులుతుంది. కారణం - ఇక్కడ మద్రాసు లో నిప్పులు కురుస్తున్నాయి.

2004 లో అనగనగా ఒక నేను మద్రాసు లో వచ్చి పడ్డాను. ఈ మూడేళ్ళలో సంవత్సరానికి 10 చొప్పున 30 ఎండాకాలాలు చూసాను. మార్చ్, ఏప్రెల్, మే నెలలలో ఎవరైనా మద్రాసు కు పెళ్ళికో, బంధువుల ఇంటికో వచ్చారంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టినట్టే. దగ్గర్దగ్గిర 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం.

అసలు మాటర్ ఏంటంటే.....'Big Bang' జరిగిన తరువాత మన విశ్వం లో అన్నీ చల్లబడి సర్దుకుంటున్న టైములో 'Small Bang' అనే చిన్న విస్పోటం ఇంకోటి జరిగింది. ఆ నిప్పు రేణువులు పడటం వల్ల మన విశ్వం లో కొన్ని ప్రాంతాలు మాత్రమే వేడిగా అలా ఉండిపొయ్యాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి సూర్యుడు, సహారా ఎడారి, మద్రాసు...

ఇప్పటి వాళ్ళ లాగానే రాతియుగం నాటి మద్రాసు వాస్తవ్యులు కూడా కోతి నాయాళ్ళు. తంగ వేల్, శరవణ వేల్, బొటన వేల్, చిటికెన వేల్ అనే నలుగురు అన్నదమ్ములు దోమలు ఎక్కువగా కుడుతున్నాయని ఓజోన్ పొర ను చించి దోమతెరలు కుట్టుకున్నారంట. దాని ఫలితం ఇప్పటి జనాలు అనుభవిస్తున్నారు.
వీళ్ళకంటే అలవాటైపొయ్యింది....తలరాత తమిళ దేవుడు రాసి మద్రాసు లో ఉద్యోగం వచ్చిన నాలాంటి వాళ్ళ సంగతి ఏంటి??

'మద్రాసు ' ను 'చెన్నై' అని పేరు మారిస్తే పరిస్థితి మారుతుందేమో అని ప్రయత్నించారు. అసలుకే మోసం వచ్చి ఎండ మూడింతలయ్యింది. ఆ వేడికి బుర్ర బాయిలింగ్ పాయింట్ దాటి...మామూలు మనుష్యుల్లాగా అలోచించే శక్తి కోల్పొయ్యి, ఏమి చెయ్యాలో తోచని వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి..ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు అయ్యారు (మీరుగానీ నేను కరుణానిధి, జయలలిత గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా??? ఐతే మీకు వంద మార్కులు...నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను).

మా ఆఫీసు లో ఫార్మల్ వేర్ తప్పనిసరి....మార్చ్, ఏప్రెల్, మే నెలల్లో మేము పడే కష్టాలు గమనించి మానేజ్మెంట్ వాళ్ళు అందరికీ మెయిల్ చేసారు - "మీకు ఏ డ్రస్సు సౌకర్యంగా ఉంటే అదే వేసుకురండి" అని....మరుసటి రోజు అందరూ నిక్కర్లూ, బనియన్లూ వేసుకుని తయారయ్యారు..

కాసిన్ని వానలు పడితే ఐనా భూమి కాస్త చల్లబడుతుంది...కానీ అదంత వీజీ కాదు..

ఉన్న కొండలన్నీ పగలగొట్టి KPJ లక్కీ స్టోన్స్ వాళ్ళు ఉంగరాల్లో పెట్టి అమ్మటం మొదలు పెట్టారు..అశోకుడు మద్రాసు లో కూడా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడంట. కానీ ఇక్కడ టీ కొట్లనుంచి కార్ షోరూముల దాకా చెట్లు కొట్టేసి, ఫూట్పాత్లు చెరిపేసి కట్టిన ఇల్లీగల్ కట్టడాలు చాలా ఉన్నాయి...ఇప్పుడు మద్రాసు మొత్తానికి 13 చెట్లు మిగిలున్నాయి - అందులోవి ఆరు గులాబీ మొక్కలు...

కొండలూ, చెట్లు ఏమీ లేకపోతే వర్షాలు ఎక్కడినుండి పడతాయి??

అలాగని అస్సలు వర్షాలే ఉండవని కాదు..అప్పుడప్పుడూ కొన్ని అకాల వర్షాలు పడుతుంటాయి - అది కూడా కేవలం మద్రాసులో ఇండియా క్రికెట్ మాచులు ఉన్నప్పుడు మాత్రమే...ఈ మాట చాలా మంది నమ్మక పోవచ్చు....కావాలంటే ఈ సారి మనవాళ్ళ మాచ్ ఏదైనా మద్రాసు లో ఉన్నప్పుడు ఇక్కడకు రండి. ఆ రోజు పొద్దున వాన పడే సూచన ఏమాత్రం లేకున్నా సగం మంది గొడుగులు పట్టుకుని కనిపిస్తారు...మిగతా సగం 'అడవి రాముడు ' సినిమాలో వాన పాట డ్రస్సులేసుకుని తిరుగుతుంటారు. మనవాళ్ళు గనక గెలిచే పొజిషన్ లో ఉంటే ఆరోజు మధ్యాన్నానికల్లా తుఫానొచ్చి మద్రాసు చుట్టుపక్కల రెండు మూడు ఊర్లు మునిగిపోతాయి..

నేను నా స్నేహితులను కలవటానికి సగటున మూడు నెలలకొకసారి బెంగళూరు వెళ్తుంటాను. మద్రాసు నుండి వస్తున్న బస్సు బెంగళూరు ప్రవేశించబోతోంది అనగా ఒక అనౌన్సుమెంటు చేస్తారు - "మద్రాసు నుండి వస్తున్న ప్రజలార...ఇప్పుడు మీరు మీకు తెలియని ఒక కొత్త అనుభూతికి లోనవబోతున్నారు...దీనిని 'చలి ' అంటారు. సీట్ల కింద దూరడమో, డ్రైవర్ పక్కనున్న ఇంజను మీద కూర్చోవడమో చెయ్యండి...లేకపొతే చచ్చి ఊరుకుంటారు " అని...

మద్రాసు లోని లోకల్ బొబ్బిలి బ్రహ్మన్న 'చలి 'ని ఎప్పుడో 'గ్రామ బహిష్కరణ ' చేసాడు.. అందుకే ఇక్కడ 'చలికాలం ' అనే మాటకు అర్థం చాలా మందికి తెలియదు...ఇక్కడ డిసెంబర్, జనవరి నెలల్లో కూడా ఎయిర్ కూలర్ల అమ్మకాలు మాంచి జోరుగా ఉంటాయి...

మూడు నెల్ల క్రితం పేపర్లో వచ్చిన ఒక సంచలన వార్త అందరూ చదివే ఉంటారనుకుంటా - "మద్రాసు లో స్వటర్లు అమ్మటానికి ప్రయత్నించిన దినకర్ అనే వ్యక్తిని పిచ్చాసుపత్రిలో చేర్పించిన పోలీసులు " అని...మొదట్లో ఇదేదో పోలీసులు పన్నిన కుట్ర అనుకున్నారు మిగతా ప్రాంతాల వారు...కానీ అదే దినకర్ పిచ్చాసుపత్రి నుండి రెలీజ్ అయ్యాక మద్రాసు ఎండలో 'sun bath ' చేద్దామని రెండు చిన్న గుడ్డ పేలికలు కట్టుకుని మరీనా బీచులో పడుకున్నాడంట...ఆ ఫొటోలు పేపర్లో రావటం తో కొంచెం తేడా కాండిడేట్ అని నిర్ధారించుకున్నారు..

గంట సేపుగా కంప్యూటర్ ముందు కూర్చున్నానేమో...వళ్ళంతా చెమటలు పట్టేసాయి..ఈ రోజు చెయ్యవలసిన నాలుగో స్నానానికి టైమయ్యింది...

33 comments:

Anonymous said...

అందుకే నేను మెడ్రాస్ లో పని చేసేటప్పుడు చెడ్డీ బనీను తో ఆఫీసుకెళ్ళి అక్కడ బాత్రూం లో డ్రెస్సు వేసుకుని టై కట్టుకునే వాడిని. కరంటు పోయినప్పుడు అనిపించేది ఆ టై ని మాత్రమే నడుముకు చుట్టుకుంటే ఎంత హాయిగా వుంటుందో అని.


ఆహా ఆ మెడ్రాసు సౌందర్యం వర్ణినంపనలవి కాదు. వర్షం వచ్చినప్పుడు ఎప్పుడో ఎక్కడో మర్చిపోయిన కర్చీఫ్ ఆ నీళ్ళ లో కొట్టుకుంటూ డైరెక్టుగా మన పాంటు జేబులోకి వెళ్ళి పోయే సీను కడు రమ్యంగా వుంటుంది. ఇంకా అదృష్టం బావుంటే ఎంజీఆర్ కళ్ళజోడు కూడా దొరకచ్చు. ఈ స్కూటర్లు కార్లవాళ్ళు జేంస్ బాండ్ సినిమాలలాగా పడవగా మారే వాటిని ఎందుకు కనిపెట్టలేక పోయారో.


గేరు మార్చి మాంచి స్పీడులొకొచారు గౌతం గారు అభినందనలు.

radhika said...

హా హా..అదేమిటో మీ కష్టాలు నాకు నవ్వుతెప్పిస్తున్నాయి.ఒక్క మద్రాసు అనే కాదులెండి మన ఆంధ్ర భారతం కూడా అలానే వుంది.

oremuna said...

బగా వ్రాసిన్రు

Ravi said...

EE roju ee post maa office lo tamilollaki choopinchaaa...chachinattu oppukunnaru....nee screenplay adbutham goutham..nenu neku ee post lo full support enduku antey nenu akkada 4 years gadipanu ganaka...superb....haahhhaaaaa

OFFICE lo andaram navvu kunnam

Lalitha said...

మీ రచనా శైలి నాకు ఎంతగానో నచ్చింది. జీవితంలోని సమస్యలను (చిన్నవైనా, పెద్దవైనా)హ్యూమరస్ గా రాస్తున్నారు మొదటి నుండి.ఏ చిన్ని కష్టం వచ్చినా కుంగిపొయ్యే వాళ్ళను చాలా మంది ని చూసాను నేను.మీలా కష్టాల గురించి నవ్వుతూ, నవ్విస్తూ చెప్పేవాళ్ళు చాలా అరుదు.ఇలానే రాస్తూండండి.

శోధన said...

నేను నా జీవితంలో దర్శించకూడదని ఒట్టు పెట్టుకున్న నగరం చెన్నై. ఇప్పటి వరకు వెళ్లలేదు. బహుశా గ్రీన్ హౌస్ ఎపెక్ట్ వలన పర్యావరణంలో విపరీత మార్పులు వచ్చి, చెన్నై లో చలికాలం వచ్చినపుడూ ఆలోచిస్తా..

ప్రదీప్ said...

హా.. హా.. ఈ చెన్నై ఎండలు నాకు కూడా బాగా పరిచయమండీ..
ఆ ఎండలకు తట్టుకోలేకే బెంగళూరు కు పారిపోయి వచ్చా.. :)
అక్కడ ఆ ఎండలకి సముద్రమే ఎండిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. :))

CM said...

Hi,

I like ur blogs..ur having good sense of humor.
keep writing...

Regards,
Chandramouli.

కొత్త పాళీ said...

LOL ROFL LMAO ..
వీటన్నిటికీ ఒక అర్థాన్నిచ్చిందండీ ఈ టపా.. మీ టపాయే అనుకుంటే దానిమీద విహారి వ్యాఖ్య - This is too much I say.

Praveen said...

Awesome! addirindi!!!!

ప్రవీణ్ గార్లపాటి said...

ఏం చెన్నయ్యో వేడి మాత్రం అదరగొడుతుంది. అందుకే ఎప్పుడూ అక్కడకి వెళ్ళడానికి వీలు చేసుకోను :)

విహారి గారూ: ఇప్పుడు అమెరికా లో ఉన్నరు గా ట్రై చెయ్యండి టై మాత్రమే కట్టుకుని ;)

భాస్కర్ రామరాజు said...

అన్నా!!నువ్వు చెప్పింది నిజమే అన్నా!! నువ్వు ఏ ఇలాఖాలో ఉన్నవ్ మద్రాసులో? nEnu అభిరామపురమ్లో అటు తర్వాత రాజా అన్నామలైపురం లో ఉన్నా కొంతకాలం క్రితం. అనిపించింది, హైదరాబాదుడుకంటే మద్రాసే బాగుందని. మౌంట్ రోడ్డుకి అటువైపు అంటే టీ-నగర్ వైపు ఎండ ఇటువైపుకన్న 2-3 రెట్లు ఎక్కువ అని నేను గమనించా!!

ఏమైనా నేను తీయబోయే సినేమాకి మాటల రచన మీకే!!

-భవదీయుడు
భాస్కర్

చదువరి said...

గొప్పగా ఉంది. మోత మోగించేసారు పొండి.

అన్నట్టు ఆ కేపీజే వాళ్ళు ఇప్పుడు హై. కొండల మీద పడ్డారనుకుంటా. టీవీ చానళ్ళు మారుస్తూ ఉంటే అదేదో చానల్లో .. ఏ రాయెందుకు పెట్టుకోవాలో చెబుతూ ఉంటాడొకడు, ఏప్పుడూ అదే పని! మీ రాళ్ళైపోయి మా ఊరొచ్చుంటారు వాళ్ళు.

Ganesh said...

Hi Gautam,

I got this link from Hari.. Amazing stuff from you. Never knew that you have such great sense of humor..Keep writing

Cheers
Ganesh Datta

Sravan Kumar DVN said...

హే డింగుటకా , హే జజ్జనకా , హే డింగుటకా (చంకలు గుద్దుకుంటూ..)

అదేమిటో నాకు చెన్నై వాళ్ళా కష్టాలు వింటుంటే చాలా ఆనందం !

SOPETI said...

మీ ఎండ వెతల కి ఎండింగ్ ఎప్పుడో ...
మా పూణే మెరుగు ఈ విషయంలో

రానారె said...

మీరు చెప్పిన అసలు సంగతి Big-bang, Small-bang థియరీకి తిరుగులేదు. పదేళ్లక్రితం ఒకే ఒక్కసారి చెన్నైవెళ్లాను... అప్పుడు నిర్ణయించుకున్నాను మరెప్పుడూ వెళ్లకూడదని. కానీ వీసా కోసం వెళ్లవలసి వచ్చింది. ఆశ్చర్యంగా ఆ రోజు చల్లగా గాలి వీస్తోంది. వీసాలాఫీసు క్యూలో నిలబడ్డాను. చమటలు పట్టలేదు. నా శరీరం ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందున కాబోలు నాకు వీసా రాలేదు. ఆ తరువాత కొన్ని శాంతి క్రియలు జరిపాక వచ్చింది.

Murali said...

చక్కటి హాస్యం. ఇదొక్కటే కాదు, మిగతా టపాలు కూడా. నేను ఒక సారి మద్రాసు గూండా హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడున్న కొద్ది గంటలకే తడిసి మోపెడయ్యింది.

వ్రజబాల said...

బస్ సంగతి ఏమో గానీ, ట్రైన్ లో చూసానో సారి. జోలార్ పేటై స్టేషన్ రాగానే "ఏమేవ్ తొందరగా సూట్ కేస్ తియ్యి" అని అర్ధం వచ్చేలా అరవాయన అరవడం, అరవ మామి ఖంగారుగా సూట్ కేస్ తెరిచి రెండు మఫ్లర్లు రెండు మంకీ కేప్ లు రెండు స్వెట్టర్లు తీయడం, వాటిని వాళ్ళిద్దరు గబగబా వేసేసుకోడం, కంపార్ట్ మెంట్ లో తిరుగుతున్న ఫేన్ లు ఆపెయ్యడం, కిటికీలు వేసేసి ఊరుకోకుండా షట్టర్లు కూడా వేసెయ్యడం.... ముందు నాకర్ధం కాలేదు ఏం జరుగుతోందో. ఏప్రిల్ నెలలో బెంగుళూరు లో గడ్డ కట్టించే చలికి మద్రాసు వాళ్ళు తట్టుకోలేరని పది నిముషాలు పోయాక వాళ్ళ ఫీలింగు చూసి అర్ధమయ్యింది.

గౌతం గారూ, మిమ్మల్ని మద్రాసు లో పడేసిన తమిళ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను.

Deepthi Mamiduru said...

మీ పొస్టులకి 100 కామెంట్లు రాసినా సరిపొదండి అంత బావునాయి అన్ని
superb!!
Deepthi

Anonymous said...

navvi navvi potta noppi pudutundi andi babu.chadivite kooda inta navvu vastundi ani naaku ippude telinsindi.meeru rase vidanam baga nachindi.

Dileep said...

Super gaa cheparandi.

Madhusudhan said...

Andhirindandi...modatisaari mee blog choosanu...chennai gurinchi chaala hasyanga chepparu...ento ee madhya chennai vathavaranam kooda challaga undhi....

Ravi Kiranam said...

సూపర్.మేము మా సీమ లో ఎండలు చూసాం. అయితే, చెన్నై లో ఎండ కు తోడు గా చమట బోనస్. అందుకేనేమో మా వాడు ఒకడు చెన్నై నుండి సీమ కు వచ్చినప్పుడంతా ఆనందభాష్పాలు కార్చేవాడు !

Budaraju Aswin said...

కుమ్మేసారండి
అబ్బా....
చాలా బాగా రాసారు
దీప్తి గారనట్టు దీనికి 100 comments రాసినా సరిపోదు......

ప్రవీణ్ నంద said...

ఈ ఒక్క విషయంలో నేను చాలా అదృష్టవంతుడిననుకుంటా... ఎందుకంటే.. ఆ "సాంబార్ ఎడారి "లో నా జీవితకాలంలో నేను నిలిచింది కేవలం మూడే మూడు గంటలు... అదికూడా రాత్రి ఏడు నుండీ పది గంటల మధ్యలోనే. మేయిన్ బస్టాప్ నుండీ 1 నెం. సిటీ బస్సెక్కి రైల్వే స్టేషన్‌కి చేరుకొని వరంగల్ రైలు బోర్డ్ చేసాను. సో మీరు చెప్పిన కష్టాలకు నేను అతీతున్ని... కాకపోతే ఆ రోజు మధ్యాహ్నం 'పాండిచ్చేరి'లో బుక్కయ్యానులెండీ. హ్యూమిడిటీ అనగా 'గాలిలో తేమ' అని ఆ రోజే తెలుసుకున్నాను ప్రాక్టికల్‌గా . (ఏదేమైనా మీ సెన్సాఫ్ హ్యూమర్ అదిరింది)

Yaso Vardhan said...

baga rasaru !! naaku chennai anteh parama chiraku ..

meeru tpt lo chadivarah ?? mee posts lo chala chotla tirupathi gurunchi prastavisteh agudutunah (nenu tirupathi nunche :))

Dinkar garini okasari kalvali ani undhi :P

swetha said...

eemandoi.... ee kashtalu annee nenu kuda anubhavistunnanu...andhra nundi ikkadiki vachhinapudu america valla color lo undedanni... ippudu africa valla color loki vacchhaa.. inkonnallaku cuba valla color lo ki vellipotanemo ani bhayam ga undi... sambar tintaru,tagutaru,ekkada ,endulo choosinaa sambare....chastunnamanukondi....

The Phoenix said...

andhra nundi ikkadiki vachhinapudu america valla color lo undedanni... ippudu africa valla color loki vacchhaa.. inkonnallaku cuba valla color lo ki vellipotanemo ani bhayam ga undi...

swetha garu.. nijam cheppandi.. miku dinakar garu parichayam kadha

keerthana said...

రెచ్చిపోయింది బాబూ

veeru said...

gautam గారు,
ఇరగ దీసారు..
ఇప్పటిదాకా ఎలా మిస్ అయ్యన అనుకుంటున్నాను.
మా నాయాళ్ళు ఎప్పుడు చెన్నై నుండి ఇక్కడకు వచ్చేవాళ్ళు..
నాకు అర్థం అయ్యేది కాదు... పని పాట లేదు యెదవలకు అనుకునేవాడిని....
కానీ ని బ్లాగ్ చదివాకా వాళ్ళ కష్టాలు అర్థం అయ్యాయి..
వాళ్ళని నేనే రమ్మని పిలుస్తును...
కామెంట్స్ కూడా చాల బాగా రాసారు...
:-) ఎక్కడ బూతు లాంగ్వేజ్, పాలిటిక్స్ కని పించలేదు..
ఇంకా అన్ని పోస్ట్ లు చదవాలి ఉంటా..

Harika said...

hey goutham....
ne comments super asalu...ma dura-adrustham ga vundi e chennai lo 6 motnhs nunchi e endalni barinchaleka chasthunna. naku ikkada vunde varaku ardham kaledu...ikkada vallu nallabangaralla endhuku vuntaro... chudapothe nenu kuda oka nalla bangaram ayyetattu vunnanu....

kani e madras kastalu eppatiki teeruthayoooooooo..............

Anonymous said...

http://idinaatelugublog.blogspot.in/2012/05/blog-post_18.html