Wednesday, August 22, 2007

ఇదీ సంగతి!

గత రెండు నెలలుగా నా చుట్టూ ఉన్న ప్రపంచం లో ఏమి జరుగుతోందో నాకు తెలియదు..పర్సనల్ లైఫ్ లోను, ప్రొఫెషనల్ లైఫ్ లోనూ చాలా పనులవల్ల ఈ రెండు నెలల్లో ఒక్క న్యూస్ పేపర్ చదవలేదు, ఒక్క న్యూస్ చానల్ చూడలేదు...ఇలా ఏ వార్తా సరిగ్గా తెలియకుండా, జనరల్ అవేర్నెస్ సెంటీమీటర్ కూడా లేకుండా పోతే నేను కూడా కొంత మంది తెలుగు న్యూస్ రీడర్ల లాగా అయిపోతానేమో అని భయమేసి వెంటనే మేలుకున్నాను....

పాత న్యూస్ పేపర్ల కోసం రమేష్ రూముకు బయలుదేరాను...

పొద్దున్నే వాకిట్లో పడి ఉన్న న్యూస్ పేపర్ ఇంట్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా గూట్లోపెడతాడు మా రమెష్. చదివితే పేపర్ నలిగిపోతుందని దాన్ని తాకడు. మళ్ళీ పేపర్లు అమ్మేటప్పుడు బయటకు తీయటమే...కాబట్టి అక్కడకు వెళ్తే మనకు కావలసిన పేపర్ ఫ్రెష్షుగ దొరుకుతుంది..

మొన్న శని ఆదివారాలు కూర్చొని రెండు నెలల న్యూస్ పేపర్లు చదివేసాను..ఏమైనా సహాయం చేస్తాడేమోనని రమేష్ ను కూడా ముఖ్యమైన వార్తలేమైనా తెలిస్తే చెప్పమన్నాను. " వారం రోజుల క్రితం మన దేశ ప్రధానమంత్రి కుల్భూషన్ ఖర్భాండా......" అని ఇంకా ఏదో అనబోతుండగా రమేష్ నోటికి ప్లాస్టర్ వేసి ఒక కుర్చీ కి కట్టేసాను...

ఏవో కారణాల వల్ల ఈ మధ్యకాలం లో న్యూస్ మిస్ అయ్యి నాలాగా " చాలా బిజీ " అని కహానీలు దొబ్బుతున్న వాళ్ళ కోసం నేనొక న్యూస్ లెటర్ తయారు చేసాను..ఇది చదివిన వారు చెప్పుకోదగ్గ వార్తలేవీ మిస్ కానట్టే....


పాలిటిక్స్ -

అసెంబ్లీ సమావేశాల్లో చివరి బెంచీల్లో కూర్చుంటున్న మంత్రులుందరికీ తీరని అన్యాయం జరుగుతోందని మంత్రి అఖండమూర్తి గారు అన్నారు. ఆయన మాట్లాడుతూ " ఎయిర్ కండిషనర్లు ముందు వరసలో కూర్చున్న వాళ్ళకు మాత్రమే గాలి వచేట్టు ఫిక్స్ చేసారు...ఇది వెనక బెంచీ వాళ్ళ మీద జరిగిన కుట్ర " అని... దానికి నిరసనగా కట్ డ్రాయర్ల తో స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళారు....
ఇంతలో ముందు బెంచి లో కూర్చున్న మంత్రి ప్రచండమూర్తి గారు లేచి " అధ్యక్షా...ఈ కట్ డ్రాయర్ ల నిరసన ఐడియా మాది...దీనిని దొంగలించిన వీళ్ళని క్షమించరాదు...రెయ్ అఖండి గా...నీ @#$*$@& " అన్నారు..
దీనికి సమాధానంగా అఖండమూర్తి గారు ప్రచండమూర్తి గారిని ఉద్దేశించి " పొరా నీ $@&**, *&***, @#$*&!!! " అన్నారు....
ఇలా ఒకరి వంశవృక్షాన్ని మరొకరు వేళ్ళతో సహా పెకిలించాక స్పీకర్ పక్కన ఎప్పుడూ కర్ర పట్టుకుని సైలెంటుగా ఉండే వ్యక్తిని కిందకు లాగి చితకబాదారు...

ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు అఖండమూర్తి గారు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి -

" నేను వాళ్ళ నాన్నను " బర్రె " అని తిట్టాను...కావాలంటే ఆయనను కూడ మా నాన్నను " గేదె " అనో, " దున్నపోతు " అనో తిట్టమనండి..అంతే కానీ " మొన్నీమధ్యలో వచిన ' సత్యభామ ' సినిమాలోని 'నీ నవ్వులే చూసా ' అనే పాట పాడింది మీ నాన్నేగా "...అని అవమానించటం మేము సహించేది లేదు...అస్సలిది ప్రజాస్వామ్యమేనా?? ఆ పాట పాడి జనాల జీవితాలతో ఆడుకున్నందుకు చక్రి అనే సంగీత దర్శకుడికి ఆల్రెడీ హైకోర్టు వాళ్ళు 130 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్టు యావత్ ప్రజానికానికీ తెలుసు...అలాంటప్పుడు ఈ అపవాదు సబబేనా??? అందుకే మేము ఇంకో మూడు రోజులు రాష్ట్రబంద్ నిర్వహించదలచుకున్నాము " అని అన్నారు...
అంతవరకు ఫోన్ లో మాట్లాడుతున్న ఆయన సెక్రెటరీ " సార్..మనమనుకున్న డేట్లలో ' ప్రజా సేవా.. మజాకా ' పార్టీ వాళ్ళు కూడా బంద్ నిర్వహిస్తున్నారు " అన్నాడు...
" దేనికి బంద్? " అడిగారు అఖండమూర్తి గారు..."
కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాన్వెంట్ లో 3వ తరగతి B సెక్షన్ సోషల్ స్టడీస్ పేపర్ అవుట్ అయ్యిందని రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నారు "..అని సెక్రెటరీ చెప్పగానే " ఆల్రైట్.. మా బంద్ వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాము " అని ప్రకటించారు...వెంటనె ఆ పార్టీ కార్యకర్తలంతా " బంద్ జిందాబాద్...బంద్ వర్ధిల్లాలి " అని ఎంతో సాఫిస్టికేటెడ్ స్లోగన్లు అరిచారు..

ఆ తరువాత వారం రోజులు రోడ్డు మీద కనిపించిన బళ్ళ అద్దాలు పగలగొట్టి, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించటానికి ప్రయత్నించిన జనాల తలలు పగలగొట్టి...ఎంతో శాంతియుతంగా నిర్వహించారు బందును....
రైళ్ళు, బస్సులు ఆపటం తో పాటూ జనాలు కాలకృత్యాలు కూడా తీర్చుకోనీయకుండా జాగ్రత్త పడ్డారు బంద్ నిర్వాహకులు....
" ప్రజలంతా మాకు ఎంతగానో సహకరించి ఈ బందును జయప్రదం చేసారు...అలాగే మాకు ఈ బందు టైములో ఎంతో తోడ్పడ్డ ' ప్రజా సేవా..మజాకా ' పార్టీ వాళ్ళకు వచ్చేసారి ఫ్రీ గా బంద్ నిర్వహించి పెడతామని మాటిస్తున్నాము " అన్నారు....


బిజినెస్ -

'Sensex' అంటే అదేదో బూతు పదమని స్టాక్ మార్కెట్ కు చాలా ఏళ్ళుగా దూరంగా ఉన్న మారెళ్ళ దినకర్ అసలు విషయం తెలిసాక తన దగ్గరున్న లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాడు..
ఒక మంచి రోజు చూసుకుని పొద్దున్నే CNBC, NDTV Profit చానెళ్ళు చూసాడు ఏమైనా సలహా ఇస్తారని..ఆ చానళ్ళలో మాట్లాడే ఇంగ్లీషు తిరుపతి యాస లో లేకపోవటం తో వాళ్ళు చెప్పేది ఏమీ అర్థం కాక TV ఆపేసాడు..
ఇక తన సొంత తెలివి తేటలనే నమ్మాలని అనుకుని ఒక తెల్ల కాగితం మీద వంద కంపెనీల పేర్లు రాసాడు..రెండు కళ్ళు మూసుకుని " జై వీరాంజనేయా " అని ఒక కంపెనీ మీద వేలు పెట్టాడు..దైవ నిర్ణయం కాదనలేక తను వేలు పెట్టిన " కిరాణా జనరల్ స్టోర్స్ " షేర్లు కొన్నాడు...లక్ష రూపాయలకు రెండున్నర లక్ష షేర్లు వచ్చాయి....
మరుసటి రోజు పేపర్లో " దివాళా తీయబోతున్న కిరాణా జనరల్ స్టోర్స్- షేర్లు కొని సొంత బ్లేడుతో గుండు గీసుకున్న బిజినెస్ టైకూన్ దినకర్ " అని మొదటి పేజీలొ వార్త వచ్చింది...
అసలే తన మొబైల్ ఫోన్ పనిమనిషి కొట్టేసిందని కొద్ది రోజులుగా చాలా బాధలో ఉన్నాడు దినకర్..దీనికి తోడు రాత్రి నుంచి తన కీబోర్డ్ మీద 'Enter' కీ కనిపించట్లేదు...ఇలాంటి సమయంలో ఈ వార్త చదవగానే తలకాయ లో Richter స్కేలు మీద 7.8 పాయింట్ల బుర్రకంపం వచ్చింది...
కాకపొతే ఆయనకు తల లోపల డామేజ్ కావటానికి సరుకేమీ లేదని డాక్టర్లు, సైంటిస్ట్లు, మెకానిక్లు ధ్రువీకరించటం తో ఊపిరిపీల్చుకుంది యావత్ వాణిజ్య ప్రపంచం...


సినిమా -

రెండు వారాల క్రితం మన దేశం లోని పైరసీ సిడి ల వ్యాపారస్తులు అంతా కలిసి సమావేశమయ్యారు..మీటింగ్ హాల్ లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ eye patch లు వేసుకుని వచ్చారు...
వాళ్ళ సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ " ప్రేక్షకులు దొంగ సిడిలలో కొత్తదనం కోరుకుంటున్నారు.. థియేటర్ లో ఏదో మూలకు కూర్చుని హాండీకాం తో తీస్తుంటే క్లారిటీ ఉండట్లేదు..జనాల తలకాయలు, ఫాన్ లు కనిపిస్తున్నాయి...ఈలలు, మొబైల్ రింగ్ టోన్లు వినిపిస్తున్నాయి...ఇలాగే కొనసాగితే మన ఇండస్ట్రీ నిలదొక్కుకోవటం కష్టం..అందుకే మనమంతా కలిసి ఒక కొత్త దిశగా ముందుకు వెళ్ళాలి..ఈ మధ్య ఏ న్యూస్ చానల్ వాళ్ళు చూసినా చొక్కాల్లోనూ,పర్సుల్లోనూ హిడన్ కేమెరాలు పెట్టుకుని ఎంతో మంది చీకటి బ్రతుకులు బయటపెడుతున్నారు...మనకు ఆ హిడన్ కేమెరాలే శ్రీరామరక్ష..మన మనుషులకు ఈ కేమెరాలు ఫిక్స్ చేసి ప్రతి సినిమా షూటింగుకు పంపుదాము...అక్కడ జరిగే షూటింగంతా మన వాళ్ళు కేమెరా లో బంధించి తీసుకువస్తారు..ఇక్కడ మనము దానిని ఎడిట్ చేసి, ఇద్దరు ముగ్గురు అరవోళ్ళతో డబ్బింగు చెప్పించి..అసలు సినిమా విడుదల కాకముందే మన సిడి మార్కెట్ లోకి వదులుతాము...మనము దొంగగా తీయబోయే మొదటి సినిమా పేరు ' దొంగనాకొడుకు '...టైటిల్ విని ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు..ఇందులో హీరో తండ్రి పేరు ' దొంగనా '...హీరో మీద టైటిల్ రావాలని అలా పెట్టారు...కమాన్...మీమీ కెమెరాలు పట్టుకుని షూటింగులకు బయలుదేరండి " అన్నాడు...
ఈ రిపోర్ట్ రాత్రి ప్రసారమయ్యే 'దొంగ ఫిల్మ్ న్యూస్ ' లో టెలికాస్ట్ చేసారు...


స్పోర్ట్స్ -

ఆగస్ట్ 13వ తారీఖున మన క్రికెట్ టీం ఇంగ్లండ్ తో మూడవ మాచ్ డ్రా చేసి సీరీస్ 1-0 తో గెలిచింది...
ప్రెజెంటేషన్ సెరిమొని లో మన వాళ్ళు అందరూ కలిసి రచించిన "గెలవాల్సిన మాచ్ డ్రా చెయ్యటం/ఓడి పోవటం ఎలా" అనే పుస్తకాన్ని రెలీజ్ చేసారు...

ఆగస్ట్ 14వ తేది బొడ్డపాటి వంశీధర్ 7 సార్లు తుమ్మాడు..కారుమంచి విజయ్ 9 సార్లు తుమ్మాడు.....విన్నర్ - కారుమంచి విజయ్...నాకు తెలిసి ఈ మధ్య కాలం లో నలుగురికి చెప్పుకుని గర్వించదగ్గ విజయం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారుడు కారుమంచి విజయ్....


జనరల్ -


కొన్నాళ్ళ క్రితం మన భూమిని పోలిన గ్రహం ఇంకోటి ఉందని సైంటిస్టులు ప్రకటించారు...వెంటనే మన వాళ్ళు అంతరిక్షం లో తిరుగుతున్న సునితా విలియంస్ కు ఫోన్ చేసి ఆ గ్రహం మీద ఒక కర్చీఫ్ వేయించారు...హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ తో ఆ గ్రహానికి రిబ్బన్ కట్ చేయించి దానికి 'Bhoom - 2' అని నామకరణం చేసారు....
దీన్ని చూసి తట్టుకోలేని జార్జ్ బుష్ " 'Bhoom-2' మీద కెమికల్ వెపన్స్ ఉన్నాయని" దాని మీద యుధ్ధం ప్రకటించాడు....


అరెరే....పాత పేపర్లు కొనేవాడు వచ్చేసాడు...రమేష్ తన కట్లు తెంచుకుని ఉన్న న్యూస్ పేపర్లన్నీ ఇస్త్రీ చేసి బయటకు తీసుకువెళ్ళాడు....
ఓ ఐదు నిముషాల తరువాత రుసరుసలాడుతూ ఇంట్లోకి వచ్చి.." చూడరా..ఒక సారి వాడిన పేపర్లని వాడు 20 రూపాయలు తక్కువిచ్చాడు..అందుకే వాటిని తాకొద్దు రా అన్నది....సరే గానీ పైకి వస్తూంటే ఓనర్ గాడు నన్ను ఏ పేపర్ తెప్పించేది అనడిగాడు...అదేది రా...T తో స్టార్ట్ ఔతుంది...."

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం...

28 comments:

Anonymous said...

హ1 హ2 హ3 హ4 హ...2000 అంతే ఇంకేమీ మిగల్లేదు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

చాలా ఆసక్తికరంగా రాస్తున్నారు. ఏ పత్రికారచనకీ తీసిపోకుండా ! తెలుగుపదాల వాడకాన్ని పెంచగలరని ప్రార్థన.

మాటలబాబు said...

బాగా వ్రాశారు.ముఖ్య మైన అన్ని వార్తలు వ్రాశారు కాని ఆ వార్తలలొ ముఖ్యమైన వార్త వదిలేశారు. అది కూడా చేర్చి ఉంటే బాగుండేది. తక్కువ సమయం కదా లోపలి పేజిలు జిల్లా ఏడిషన్లు చదవడానికి సయమం చిక్కి ఉండదు. కాని వార్తలు చాల బాగున్నాయి.

మేధ said...

చాలా బాగా వ్రాశారండి.. నేను రోజు పేపర్ మిస్ కాకుండా చదువుతూ ఉంటాను... మీరు అన్నిటినీ వదిలిపెట్టకుండా కవర్ చేశారు..!! మాటలబాబు గారు చెప్పినట్లు, జిల్లా వార్తలని కూడా పెట్టి ఉంటే బావుండేది..

మాటలబాబు said...

మన హైదరాబాదు లొ ఉన్న కోలనీ విషయాలని తాకితే బాగుండేదని నా అభిప్రాయం

చదువరి said...

బాగున్నాయండీ వాతలు.
ఉత్తమ బ్లాగులు మొదటి పదింటిలో మీ బ్లాక్కు తప్పక చోటుంటుంది.

కొత్త పాళీ said...

బ్రహ్మాండం. ముఖ్యంగా సినిమా న్యూస్! గ్రేట్ ఐడియా. ఇలాచేస్తే ఇంకొంచెం బెటర్ క్వాలిటీ సినిమాళు వస్తాయేమో ఇప్పుడొస్తున్న వాటికంటే.

రానారె said...

మీ పేరు అద్దంకి మన్నారా? వార్తలన్నీ రసవత్తరంగా ఉన్నాయి. ఒకటిరెండుచోట్ల మాత్రం కాస్త చప్పబడినట్లనిపించాయి. మీకు మరింత తీరిక దొరకాలని ఆశిస్తున్నాను. అప్పుడు టపా మొత్తం చమక్కులతో చిక్కబడుతుంది.

Srinivas said...

చాలా బాగున్నాయి మీ వార్తలు. అన్నింటిలో కొత్త గ్రహం విషయం హై లైట్

రాకేశ్వర రావు said...

బాగుందండి. మీ సత్తాకి ఒక అంగుళం కింద ఉన్నా, ఇంకా తరచుగా టపటపలాడించి, మీ విశ్వరూపాన్ని చూపిస్తారని ఆశిస్తూన్నాం.

RSG said...

ఇంతకీ ఆ దినకర్ ఎవరండీ బాబూ, ప్రతీ పోస్ట్ లోనూ బలైపోతున్నాడు?

Ravi said...

హాస్యపు పాళ్ళు కాస్త తక్కువ వున్నప్ఫటికీ ..టపా బాగు0ది.వార్తలు విశెషాలు మహ ర0జుగా ప0డాయి..

ప్రవీణ్ గార్లపాటి said...

ఆహా ఎన్నాళ్ళకు దర్శనం...
కాస్త వార్తల ప్రసారం తరచుగా చెయ్యండి. మేమూ టచ్ లో ఉంటాము.

Anonymous said...

Eemadya nenu kaasta busy ga vundi paper chadavatam ledandi.Edemina mee blog valla news anta telisindi.chala Thanx.

Sreenivas Kishore said...

బాసూ, మీ బ్లాగు నన్ను ఎప్పుడూ డిసప్పాఇంట్ చెయ్యదు.భలె రాసారు వార్తలన్నీ.
ఇలా ఇంత పెద్ద గాపులు ఇవ్వటం న్యాయంగా లేదు.వారానికి ఒకటి కాకాపొయ్యినా కనీసం రెండు వారాలకు ఒకటైన రాయాలి.

నేను సినిమా తీస్తే దానికి రచన మాత్రం మీరే.ఇది నేను నిజంగా చెబుతున్నా.

మీ అభిమాని,

శ్రీనివాస్ కిషొర్

Betaludu said...

Betaludu Said............ Nice creativity and all the blogs r very nice.......

L.S.Pochiraju said...

మీ బ్లాగాభిమానిని నేను
మీ గత టపాలతో పోలిస్తే,ఈ టపా నన్ను నిరాశ పరించింది
ఇంకా బాగా రాయగల సత్తా మీలో ఉంది
కాస్త తెలుగు పద ప్రయోగాలని పెంచండి
మీ బ్లాగు మీద మాకు expectations పెరిగి పోయాయి
ఒక దాన్ని మించి ఒకటి ఉంటుంది అన్న ఆశతో ప్రతి సారీ మీ టపా కోసం ఎదురు చూస్తుంటాను
వారానికొకటి రాయండీ.....ప్లీజ్

Anonymous said...

Entandi inni rojulu gap ichesaru.. mee tapa gurinchi chaala wait chestunanu.. chaala baaga raasaru..
meeku baaga theerika dorakali ani devudini pradisthunanu.. prathi vaaram kaakapoyina kaneesam rendu vaaralaki okasari ayina meeru tapa vesi mee abhimanulni anandimpa cheyyalani aasisthunanu..
dayachesi maa ee korikani mannichandi..
itlu..
mee abhimani.

రఘునాధ రెడ్డి బుర్రి said...

మీ టపాలు చాల బాగున్నాయి. ఈమధ్య ఒక జోక్ విన్నాను, దానికి మీ బ్లాగ్ టైటిల్ కి ఎమైనా సంబంధము ఉన్నదా!

లెక్కల మాష్టారు క్లాసులో గోపి అనే విద్యార్థిని లేపి ఒరేయ్‌ రెండు రెళ్ళు ఎంతరా? అని అడిగాడు.
‘ఆరు’ అని చెప్పాడు గోపీ.
మాష్టారికి కోపం వచ్చింది. పక్క కుర్రాడితో జవాబు చెప్పిస్తే వాడికి బుద్ది వస్తుందనుకొని,
‘ఒరేయ్‌! రాము వాడు చెప్పింది కరక్టేనా!’
‘వాడు చెప్పింది కరక్టే సార్‌! మీ ప్రశ్న తప్పు. మీరు రెండు మూళ్ళు ఎంత అని అడగాల్సింది’.

Nagaraja said...

ఎప్పటిలాగే, చాలా బాగుంది టపా. కాస్త తరచుగా దర్శనాలు ఇస్తూ ఉండండి...

వికటకవి said...

మీ పేరూ మారు మ్రోగుతుంటే ఇలా వచ్చాను. జంధ్యాల గారి మార్కు కామెడీ బాగా పండిస్తున్నరు. మీ బ్లాగు చాలా బాగుంది. ముఖ్యంగా ఇది.

Raj said...

hey am not able to read as these letters are not in a readable way...seems i need to install telugu font supported plugin for mozilla,if you guys know about such plugin please point me...here

Ajay Raja said...

Hey hi,

The kind of language you used is awesome. your wring skills are really amazing, the points and things you mentoined are remarkable. This is the first time, I am going thru ur blog, though some are kinda boring, but the pick and usage of words are yet another hit for your blogs.

Anywaz, on a whole i enjoyed reading all your stuff and enjoyed a lot. I wish and hope you to get more and more wonderful writings on these kinds ane get praised with your friends and people

Good luc.
if you have any new posting, send me a link to

Cheers
Ajay
ajay.database@gmail.com

Anonymous said...

warewa! kya news hi,supr

adarsh said...
This comment has been removed by the author.
adarsh said...

ఆదోని? మీరు చెప్పిన కాన్వెంట్ కూడా నాకు తెలుసు :)

soujanya said...

tapa chala baaundi
vartalu chala chamatkaaranga unnay
kotta graham "bhoom 2", piracy cd vaartalu chala baaunnay.
mee tapalu chaduvutu unte yento haayiga untundi

Anonymous said...

నేను వాళ్ళ నాన్నను " బర్రె " అని తిట్టాను...కావాలంటే ఆయనను కూడ మా నాన్నను " గేదె " అనో, " దున్నపోతు " అనో తిట్టమనండి..అంతే కానీ " మొన్నీమధ్యలో వచిన ' సత్యభామ ' సినిమాలోని 'నీ నవ్వులే చూసా ' అనే పాట పాడింది మీ నాన్నేగా "


Simply Impressive.......