Wednesday, January 16, 2008

క్షుర ' ఖర్మ '

స్థలం: ఆఫీసు - conference రూము

రోజు/సమయం: శుక్రవారం 3.30 P.M

జరుగుతున్నది: కంపెనీ ని అభివృధ్ధి లోకి ఎలా తీసుకురావాలో నా బాసు మాట్లాడుతున్నాడు....కొద్దికొద్దిగా వస్తున్న నిద్రను అభివృధ్ధిలోకి తీసుకురావటానికి నేను ప్రయత్నిస్తున్నాను...

45 నిముషాలపాటు ఏమి మాట్లాడాడో తెలియదు - మధ్యమధ్యలో ఏవో కొన్ని పదాలు తప్ప (లంచ్, హాలిడేస్, డిన్నర్, ఆప్షనల్ హాలిడేస్, స్నాక్స్, స్పెషల్ హాలిడేస్)...కరెక్టుగా 46 వ నిముషం లో " ఇంకో వారం రోజుల తరువాత మన టీం లో శృతి అనే అమ్మాయి చేరబోతోంది " అన్నాడు.....

....ఊహల్లో తిరుపతికి వెళ్ళి నిమ్మకాయ సోడా తాగుతున్న బుర్ర జెట్ ఎయిర్వేస్ లో తిరిగి కాంఫరెన్సు రూము కు వచ్చేసింది.....ఆ మీటింగు లో నాతో పాటు ఊహల్లో ఉన్న సాటి పురుష పురుగులు కూడా ఇప్పుడే ఫ్లైటు దిగినట్టు ఉన్నారు.

అందరమూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఆనందంగా నవ్వుకున్నాము...

మళ్ళీ నా బాసు గాడే మాట్లాడుతూ " మొదటి రోజు శృతి కి మన ఆఫీసు లో అందరిని పరిచయం చేసి, తను సెటిల్ అవ్వటానికి ఏమి కావాలో చూసి కాస్త తోడుగా ఉండాలి...హేమలతా, నువ్వు ఆ బాధ్యత తీసుకుంటావా " అని అడిగాడు.....

అక్కడున్న ' సిగ్గు 'లేని వాళ్ళలో ' సి ' కూడా లేని వెధవ నీల్ విజయ్ ఒక్కసారిగా పైకి లేచి " సార్..సార్....ప్లీస్ సార్....మేమెవరైనా చేస్తాము సార్...ఇప్పుడు టీము లో ఉన్న అమ్మాయిలు ఎలాగూ మా మొహాలు చూడట్లేదు...కనీసం కొత్తగా వచ్చే అమ్మాయితోనైనా కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్..మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ " అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని మా అందరి తరపున దీనంగా దేబిరించాడు. దానికి బాసు గాడు " సరే ఆపు......(నన్ను చూసి) ఏమయ్య.. నువ్వు చేస్తావా " అని అడిగాడు....

నేను లేచి " చేస్తాను బాసు గారు " అని..టేబుల్ పైకెక్కి - "ఆకాశంలో ఒక తారా...నాకోసమొచ్చింది ఈ వేళ " అని పాడి నా ఆనందాన్ని వ్యక్తపరిచాను. టేబుల్ చుట్టూ నుంచున్న నా టీం మేట్స్ అందరూ "ఝుం ఝుం ఝుం....ఝుం తన ఝుం"...అని కోరస్ లో నన్ను అభినందించారు....పాట చరణం లోకి వెళ్ళకముందే మా బాసు "కట్" చెప్పి, నన్ను చూసి "కాస్త హెయిర్ కట్ చెయించుకోవయ్యా...మరీ అలా చింపిరి జుట్టేసుకుని ఎదురుపడకు ఆ అమ్మాయికి " అన్నాడు...

ఈ మధ్యన వచ్చిన 'చింపిరి' అనే తెలుగు సినిమా లో హీరో హెయిర్ స్టయిల్ లా ఉందని కాంప్లిమెంటు ఇచ్చాడేమో అనుకున్నా...తరువాత తెలిసింది...దువ్వుకోలేనంత జుట్టు తల మీద పెట్టుకుని దువ్వుకోకుండా ఆఫీసుకు వచ్చినందుకు నా బాసు గాడు తిట్టిన తిట్టని..

*************

నాకు ఊహ తెలిసి తల దువ్వుకోవటం మొదలుపెట్టినప్పటినుండి నాకు, నా జుట్టుకు కొన్ని వేల యుధ్ధాలు జరిగాయి...జరుగుతూనే ఉన్నాయి....ఇప్పటిదాకా నేను గెలవలేదు....

సన్ ఫ్లవర్ లాగా రోజుకు రెండు సార్లు డైరెక్షను మారుస్తుంది నా జుట్టు...కొబ్బరి నూనే, ఆముదమే కాదు....ఫెవికాల్ రాసి దువ్వుకున్నా కుదురుగా ఉండదు నా జుట్టు..

తిరుపతి లో గోవిందరాజుల స్వామి గుడి దగ్గర శ్రీనివాసా హెయిర్ డ్రెస్సర్స్ అని ఒక సెలూన్ ఉంటుంది..పొరపాటున కూడా హెయిర్ కట్ చేయించుకోవటానికి అక్కడకు వెళ్ళకండి...వాడు చేసేది 'హెయిర్ డ్రెస్సింగ్' కాదు....'హెయిర్ వస్త్రాపహరణం'....వాడి దగ్గర కటింగ్ చేయించుకుంటే నిండుసభ లో అవమానంతో జుట్టు దించుకోవలసిందే...

నేను వాడి సెలూను కు వెళ్ళిన ప్రతిసారీ మొదటి పావుగంట నాకు హెయిర్ కట్ ఎలా కావాలో చెబుతాను...."చూడు బాబూ...సైడుకు కాస్త పొట్టిగా చెయ్యి...వెనకవైపు కూడా అంతే...ముందు మాత్రం కాస్త ఉండనివ్వు.. మరీ పొట్టిగా చేస్తావేమో...అస్సలు దువ్వుకోవటానికి రాదు...అలాగని అస్సలు కత్తరించకుండా వదిలెయ్యకు...కరెంటు షాకు కొట్టినట్టు నిక్క బొడుచుకునుంటాయి "....అని ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తాను......
నేను ఇలా కష్టపడి వాడికి వివరిస్తుంటే..వాడి కళ్ళు నన్ను చూస్తుంటాయి...చెవులు మాత్రం TV లో వస్తున్న తెలుగు సినిమా వింటుంటాయి....హీరొ మొదటి హీరోయిన్ ను చేసుకుంటాడా, పాటలకు మాత్రమే వాడుకున్న రెండో హీరోయిన్ ను చేసుకుంటాడా అని వాడి టెన్షన్.....సినిమా చివర్లో ఏమాత్రమూ సిగ్గులేకుండా హీరోయిన్లు ఇద్దరూ ఒక్కడినే పెళ్ళిచేసుకున్నాక వాడు ఊపిరి పీల్చుకుని నా వైపు చూస్తాడు......
నేను అంత సేపు చెప్పిందానికంతా తలూపి చివరకు.. " మీకు కటింగ్ ఎలా కావాలి సార్ " అని గోడకున్న NTR, ANR, శోభన్ బాబు, క్రిష్ణ ఫొటోలు చూపిస్తాడు....వాళ్ళ లాంటి జుట్టు కావాలనుకుంటే వీడి దగ్గరకు ఎందుకు వస్తాను - ఏ విగ్గులమ్మే కొట్టుకో వెళ్తానుగానీ...

మొన్న ఆదివారం తిరుపతి వెళ్ళినప్పుడు 'శ్రీనివాసా హెయిర్ డ్రెస్సర్స్' కు వెళ్ళాను...ఈ సారి శ్రుతి దగ్గర మంచి మార్కులు లయబద్దంగా కొట్టేయ్యాలని..."చూడగానే అమ్మాయిలు 'వావ్'అనే లాగా కటింగ్ కావాలి" అని మెడలో ఒక బోర్డు తగిలించుకుని సెలూన్లోకి అడుగుపెట్టాను..

దువ్వెన, కత్తెర పట్టుకుని...యుధ్ధానికి దిగిన సైనికుడి బార్బర్లాగా నా మీదకు వచ్చి, నా జుట్టును ఒక పది సార్లు అటూ, ఇటూ చూసి.."ఇలా అర్థం పర్థం లేకుండా ఎవడు సార్ కటింగ్ చేసింది...ఇదివరకు ఎక్కడ చేయించారేంటి?" అని అడిగాడు..."నీ సెలూన్ లోనే రా వంకర కత్తెర వెధవ " అని అందామనుకుని...చుట్టుపక్కల చాలా కత్తులు, కత్తెరలు ఉన్నాయని ఊరుకున్నా..

వెనకాల ఉన్నఒక బెంచి మీద కొంతమంది కుర్రాళ్ళు కూర్చుని నన్నే చూస్తున్నారు..."ఏంటి అందరూ అలా చూస్తున్నారు?" అని అడిగాను...."వాళ్ళంతా ఇక్కడ కటింగ్ నేర్చుకోవటానికి వచ్చిన interns సార్ " సమాధానమిచ్చాడు సెలూను ఓనరు..

స్కూటరు, కారు నేర్పించేప్పుడు ఒక డొక్కు బండి మీద నేర్పించినట్టు...కటింగ్ నేర్పించటానికి నా లాంటి తల కొసం ఎదురు చూస్తుంటాడు ఈ ఎదవ...
"కటింగ్ ప్రారంభించక ముందే షేవింగ్ చేస్తాను సార్" అన్నాడు..సరే ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన రూలేమోనని ఒప్పుకున్నా....సగం గెడ్డం గీసాక ఆపేసాడు.... నా తల మీద ప్రయోగాలు చేస్తారని తెలిసినా నేను ఇక బయటకు పారిపోలేనుఅని నిర్ధారించుకున్నక...బెంచీ మీద కూర్చున్న ఒక్కొక్కడినీ పిలిచి నా జుట్టుతో చెడుగుడు మొదలు పెట్టాడు....మొదటొచ్చినోడు కుడి వైపు కాస్త ఎక్కువగా కత్తెరించేసాడు...." అరెరే పొరపాటైపొయ్యింది సార్ ".. అని ఇంక ఏదొ అనబొయ్యేంతలోపు ఆ ఓనర్ గాడు "పరవాలేదు...మొదట్లో ఇలాంటి 'పొరబాట్లు ' జరుగుతూ ఉంటాయి...నువ్వు కానీ " అన్నాడు......అలా మరో గంటన్నర పాటు మిగతా interns కూడా 'పొరబాట్లు ' చేసాక...అప్పటిదాకా నా కళ్ళకు కట్టిన గంతలు, నోట్లో కుక్కిన గుడ్డ తీసేసారు....

ఇంతలో లోపలి రూము లోంచి ఒకడు చేతిలో కిరొసిన్ డబ్బా పట్టుకొచ్చి "సార్...జుట్టు ' బ్లీచింగ్ ' చెయ్యమంటారా?" అని అడిగాడు...'బ్లీచింగ్' అంటే కిరొసిన్ తలకు అంటుతాడేమోనని భయమేసి "నో " అని నొక్కి వక్కాణిద్దామనుకున్నా..
కానీ కిరొసిన్ వాసనంటే నాకు చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం...అందుకే TV సీరియళ్ళలో లాగా "అదీ...విషయమేంటంటే...అసలు ఏమి జరిగిందంటే...నేను చెప్పొచ్చేదేంటంటే " అని కాసేపు లాగి...గుండె నిండా ఆ వాసన పీల్చి..."కిరొసిన్ జుట్టుకు అంటితే ప్రమాదమేమీ లేదా?" అని అడగటానికి నోరు తెరవబొయ్యేలోగా.....ఆ సెలూను ఓనర్ " రే మనోహర్...ఇది ఇంట్లో ఇచ్చి రా " అని ఆ కిరోసిన్ డబ్బా ఒక కుర్రాడికి ఇచ్చాడు....
"చెప్పండి సార్...బ్లీచింగ్ చెయ్యమంటారా " అని మళ్ళీ అడిగాడు....వీడి ముందు చులకన కారాదని "బ్లీచింగ్ కిరోసిన్ తో చెయ్యరని నాకు కూడా తెలుసు " అన్నాను..వాడికి ఏమీ అర్థం కాలా...పక్కనున్న ఒక ఫొటొ చూపించి " ఇది చూడండి " అన్నాడు....

వార్నీ.. అది నా స్నేహితుడి ఫొటో...వాడి పేరు విక్రం (పేరు మార్చబడింది....అసలు పేరు - ఎం. దినకర్, అడ్రస్ - 11111, Bangalore - 111111, mobile - 9999999999)...వాడి జుట్టు కు పిచ్చిపిచ్చిగా గోదుమ రంగు, పసుపు పచ్చ రంగు పూసున్నాయి...నేను గట్టిగా నవ్వి.." బాగా చేసారు ఎదవకి...ఏంటి.. కటింగ్ చేయించుకుని డబ్బు ఎగ్గొట్టాడా...మధ్య మధ్యలో ఆ గ్యాపులు ఎందుకు వదిలారు...మొత్తం రాసెయ్యల్సింది ఆ దిక్కుమాలిన రంగు " అని...ఇంకాస్సేపు నవ్వి..." ఇప్పుడు చెప్పు.. ఆ బ్లీచింగ్ గురించి....అది చేయించుకున్నవాడి ఫొటోలు ఏవైనా ఉంటే చూపించయ్యా...డిసైడ్ చేసుకోవటం కాస్త సులభంగా ఉంటుంది " అన్నాను......

నేను అన్న ఏమాటకు వాడికి కాలిందో తెలియదు..అక్కడున్న interns లో ఫెయిల్ మార్కులు తెచ్చుకున్న ఇద్దరిని నా మీదకు వదిలి...ఒక్కొక్కరికి చెరోవైపు ఇచ్చి లైట్లు ఆర్పేసాడు...

కొంత కాలం గడిచాక (అంటే ఓ రెండు గంటల తరువాత)...

ఇలాంటి జుట్టు తో శృతి కంట పడితే నన్ను మొదటి రోజే "హాయ్ 'ఫ్రెండ్' " అనే ప్రమాదముంది....ఒక అందమైన అమ్మయితో 'ఫ్రెండ్' అనిపించుకోవటంకంటే 'అన్నయ్య ' అనిపించుకోవటం మంచిది.......సోమవారం దాక టైముంది ఆలోచించుకోవటానికి..ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు...పిరికి వాడిలాగ జుట్టు మళ్ళీ పెరిగేంతవరకు శెలవు పెడదామా....లేక ధైర్యవంతుడి లాగ పరిస్థితి ని ఎదురుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేద్దామా.......

58 comments:

నిషిగంధ said...

:)))))) పొద్దున్నే కాఫీ కప్పు పట్టుకుని మీ టపా చదవడం మొదలుపెట్టాను.. అదెంత పొరపాటో మానిటర్ నిండా పడిన కాఫీని తుడుస్తుంటే అర్ధం అయింది :-) Super as always!

జ్యోతి said...

గౌతం, ఇది మరీ దారుణం , ఆరు నెల్లకోసారి అదరగొట్టే టపా రాసి మాయమైపోతావ్. నిజంగా సూపర్ గా ఉంది నీ ప్రహసనం.మరి శృతి ఏమంది? ఫ్రెండ్ అందా, బ్రదర్ అందా, భయపడి బాస్ కి కంప్లైంట్ చేసిందా. అది చెప్పలేదు. ఇలా సస్పెన్స్ లో పెడితే ఎలా??

ప్రవీణ్ గార్లపాటి said...

శృతి అనగానే పోకిరి - బ్రహ్మీ గుర్తొచ్చాడు. :)

బావుంది క్షుర ఖర్మ. నాకా ఖర్మే పట్టలేదు ఎందుకంటే హెయిర్ కట్ అనేది నా జుట్టు ఈ మధ్యన ఎరగదు కాబట్టి...

వరప్రసాద్ said...

గౌతం గారు, ఇలా రాయడంలో మీకు మీరే సాటి.
చాలా బాగుంది....

రాకేశ్వర రావు said...

అప్పుడెప్పుడో ఒక సారి ఒక అమ్మయిని తెగపటాయించడానికి ప్రయత్నిస్తుంటే, అడ్డంకాలో బుడ్డంకాయ్ లా ఒక వ్యక్తివచ్చాడు, మీట్ మై హసబెండు అంది. ఆ స్రుతి కూడా ఏ పెళ్లయిపోయినావిడో అవుతుందేమోనని నా అనుమానం.

Anonymous said...

Gowtahm,

I should tell you some thing.

It was 01/16- 11AM. I was in a crash course of CCIE-Voice, every thing was bouncing for me. My sister fwded me this link to read, Was not listening to lecture from British guy who is not bothered about me. I started laughing when first read the two paragraphs about your reaction after your meeting and hair cut process. U r narration broght me back with new energy levels. It was enjoyable.

karthik said...

too gud gowtham garu. meeru matrame ila raya galaru. kaneesam 15 days ki oka post rayandi. this is a request.

-Karthik

ప్రదీప్ said...

ఎప్పటిలానే అదరగొట్టేసారు గురూగారూ...

Budaraju Aswin said...

ఇంతకీ శ్రుతి ఏమంది గౌతం గారు, చాలా రోజులనుండీ మీ కొత్త టపా కోసం వేచియున్నాను. ఆ జుట్టు మళ్ళీ పెరెగేలోపు మరో టపా రాసి మమ్ములని నవ్వించగలరని ప్రార్ధన

RSG said...

ROFLMAO... [:)]

లెనిన్‌కన్ బండి said...
This comment has been removed by a blog administrator.
Ravi said...

చాలా భాగుంది ...ఇంతకి నీ మూగ ప్రేమ ......శృతి నా ?

రాధిక said...

kevvu....keka
300/100

సిరిసిరిమువ్వ said...

ఎప్పటిలాగే బాగుంది. కాస్త వెంట వెంటనే రాస్తుండండి. ఇంతకీ ఆఫీసుకి వెళ్ళారా, శృతికి ఆహ్వానం పలికారా?

Ravi Krishna Reddy said...

Very good, my office network blocked this site but some how I managed my network administrator and got permission for this site.

I used to read Mallik Novels and now I started loving your blog.

REDDY said...

చాలా బాగుంధిరా సిద్దు !!

ఇలా అర్థం పర్థం లేకుండా ఎవడు సార్ కటింగ్ చేసింది...ఇదివరకు ఎక్కడ చేయించారేంటి?" అని అడిగాడు..."నీ సెలూన్ లోనే రా వంకర కత్తెర వెధవ "
ఈ తిట్టు అదిరింది..

Budaraju Aswin said...

ఇది మూడో సారి చదవటం నాకు ఎంత బద్దకమంటే నా బ్లాగులో తప్పు లు కూడా సరిదిద్దటానికి మళ్ళీ చదవను . మీరు నన్ను చదివించి ఇలా కామెంట్లు రాయించేసుకుంటున్నారు....

నేను బాగా విన్నదాన్ని, చదువుతున్నవాటినీ ఊహించుకుంటాను అంటే మాములుగాఅ కాదు విపరీతంగా ....

మీ టపా లో మీరు conference table మీద పాట తలచుకున్నకొద్దీ నవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నాను

మీకు మీరే సాటి ...
మీ taking,
writing
అన్నిటికీ
100/100

Vamsi said...
This comment has been removed by the author.
లలితా స్రవంతి పోచిరాజు said...

కాస్త తరచుగా రాయండి
ఇంతకీ శృతి ని కలిసారా లేదా ?

Anonymous said...

Goutam garu,
not up to your level.
The ending is very abrupt.
don't come to conclusion that i don't like this one; its only a bit less humorous compared to your earlier posts.
i am sure you can do better next time.
you have a capability to be a cine writer.(Jandhyala genre)
keep it up.

Kamaraju Kusumanchi said...

సూపర్! అదిర్స్! కెవ్వు! కేక!

KK said...

గౌతం, నీ 'శ్రుతి ' అదిరింది. ఇంతలా నవ్వి చాల కాలం అయింది. నీ హాస్యానికి HATS OFF!!!

sid said...

బావుందండి ఇంతకి మీ శ్రుతి శ్రుతి కలిపింద లేదా, మీరు వారపత్రికలకు కధలు వ్రసినట్టు మధ్యలో అపెసరు విషయం ఏమైంది.

శ్రుతి శ్రుతికలిపింద కలపలేద????????????????

sid said...

బావుందండి ఇంతకి మీ శ్రుతి శ్రుతి కలిపింద లేదా, మీరు వారపత్రికలకు కధలు వ్రసినట్టు మధ్యలో అపెసరు విషయం ఏమైంది.

శ్రుతి శ్రుతికలిపింద కలపలేద????????????????

Anonymous said...

You are not writing frequently that’s why i wrote one story for you...

Year 2007
He and She are engaged. Both are working in Hyderabad, while their
parents are at Gudur. They are going by the same train to Gudur.
Incidentally, the first time they are traveling together
Time 10:00 PM
She : Enti Intha Tvaraga station ku vachharu.. Nenu usual gaa
10.45
train ki aithe 10.30 ki vasthaa
He : Nenu aithe direct gaa secunderabad lo ekkutha
She : Avunaa..He he
He : Sare le...Nenu water bottle konukosthaa..
She : Sare..
He comes back in 2 minutes catching his breath...with lots of
other
stuff apart from water bottle(choclates,crisps etc),
She : Enduku Alaa parigethhi vastunaaru...Mellaga raavachu gaa...
He : Hmmn...Ante...Nuvvu okka daanive unnavu kadhaa...andukani...
She : Ayyo...Asalu nenu eppudu okka daane travel chesthaanu...Idhe
1st time nenu inkokaritho velthunanu...
He : Hmmmm
She : Sare...Velli train lo kurchundaam raa...
They get into the train
She : Side upper, Side lower book chesaava?
He : Avunu... So that we can talk for sometime. Migatha berths
aithe
andaru padukuntaaru...
She : Avunu...correcte...smiles naughtily !
Train starts
She : Next year idhe time ki manam pelli tarvatha mana modati
Sankranthi ki Vizag velthamu...
He: Holds her hand tightly, and gives her one Cadburys temptation
chocolate
She : So sweet. Meeku ela telusu naaku e choclate ante ishtamani
(even though she doesnt like it)
She splits the chocolate into smaller bits, and feeds him the
first
bit
He : You know what? Nenu eppudu kalalo kuda anukoledhu. That I
will
fall head over heels for someone.
She : Nenu kuda eppudu anukoledhu raa...
By this time, almost all passengers are asleep. And someone tells
Him
to talk slowly since he is too loud & disturbing
He : Padha...Door deggariki veldaamu...
He and She are at the door. He opens the door, and they sit at the
steps for some 1 hr, they get in and sleep (Of course at their
respective berths)
Year 2008
He and She are married for 9 months by now
He and She get into the train.
She : A berth?
He : Rendu upper berth book chesaa. No disturbance ( Edhava nasa
vundadu )
She : Hmmmm...
He : Sare. water bottle ivvu...
She : Water ledhu...station lo kondhaam ani anukunaa....
He : Mundhe cheppi edavachu gaa! Ippudu chudu train start
avvataaniki
inko 5 mins kuda ledhu
She : Meeru Elaane anukuntu kurchunte aa 5 mins kooda vundadhu
He : Thooo edava bathuku!
He runs and gets the water bottle (And this time just the water
bottle), just when the train starts
She yawns and says
She : Sare. Nenu chaala tired ga vunnanu...Velli padukunta.
He : Ok.. (Paduko ..koncham sepu nenu prashantangaa vuntaa)
After the TTR checks the tickets, he also gets into his berth and
tries to sleep. He is not able to sleep after a while, due to some
conversation happening below.
He turns towards the couple in the side-upper and side-lower berth
He : Babu... If you don't mind, meeru koncham mellaga
maatlaadukunte
memu padukuntaamu !
The side-upper & side lower couple walk towards the door
And life goes on ................

Lucky i'm not married hahahahah

రానారె said...

నీల్ విజయ్ రిక్వెస్టు, మీరు బెంచీఎక్కి అందుకున్న పాట - ఈ రెండూ చదివి నాకు పొట్ట చెక్కలైపోయింది. ఆఫీసులో గట్టిగా నవ్వలేను. నవ్వకుండా వుండనూలేను. ఇంటికెళ్లి మళ్లీ చదివి తనివితీరా నవ్వాలి. చింపిరి సినిమాలో షిండే చెప్పినట్లు, 'కామెడీకింగ్' అని మీకు పట్టాభిషేకం చెయ్యాలి.

Venkat said...

Dear Anon,
(The one who wrote a story on unmarried/married couple)
Your skepticism may not be genuine as you are not married(?). I am very happily married for 24 years, one short of siver jubilee. We enjoy every moment of our company.

రాకేశ్వర రావు said...

@ Anon,
మీ కథ చాలా బాగుంది.. మీరు కూడా ఏదైనా బ్లాగు మొదలు పెట్టి అక్కడ వ్రాయొచ్చుగా...

happygolucky said...

రావు గారు , మీరు ఏమి అనుకోను అంటె ఒక మాట. మీకు హాస్యం పాలు కొంచెం ఎక్కువ సుమీ. అదరకొట్టారు బాస్. No words ante nammandi.

Vasundhara said...

మీ టపాల్లో దినకర్ ప్రస్తావన వస్తే చాలు నాకు నవ్వాగదు. సినిమాల్లో బ్రహ్మానందం రాగానే నవ్వొస్తుంది ఆలాగన్నమాట. ఈ దినకర్ ఎవరు వూహాజనిత పాత్రా లేక మీ విరోధా..స్నేహితుడా..? ఈ సారి మీ టపాల్లో దినకర్ పాత్ర పరిధి పెంచండి మరింత హాస్యం కోసం.

వసుంధర

నాగరాజా said...

సూపర్

Anonymous said...

ఏంటి గురువు గారు ఇంక జుట్టు పెరిగినట్టు లేదు మీకు....
మేము ఎంతో ఆత్రంతో మి టపా కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు చాల రోజులే సెలవలు తీసుకునట్టున్నరు.కాస్త త్వరగా ఆఫీసుకి వచ్హి టపా వ్రాయండి

anil said...

iraga bossu !
kummesav !

chandramouli said...

జంద్యాలగారి ౩ గంటల్లో అందిచే నవ్వు, మీ టపాచదివితే వచ్ఛేస్తుందండీ, గౌతంగారు.
కేక ...
అయిన ఈ శ్రుతి గురించి,మీ కంటే, పాఠకులకే ఎక్కువ interest ఉంది అంటే,మీ రచనా పటిమ ఎంత గొప్పదో ఆట్టే !చెప్పనక్కర లేదు....

hari said...

perfect blog...would like to add this as one of my favs...with your consent ofcourse...thanks..keep posting such things...i was laughing in the office and my manager asked me wat happened!!!!

Ravi Varma said...

adiripoyindi, navvaleka kantlonchi neellu vachaayi. inka kotta blogulu emi update cheyaledu enti.chaala aatruta to eduruchuustunna

Hemanth Potluri said...

తోటరాముడు గారు కుమేసారు

rakee said...

Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .com ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
http://www.hyperwebenable.com/

Anonymous said...

U r really great man...keep it up..I enjoed a lot after long time in my life

archana said...

This was the first blog of yours i have read. Got the link from a friend. Just thought of sending you my comments and happened to see how people reacted to the same. I guess there are a bunch of them who appreciate your writings and its surprising they wait for a next one from you, so i suggest you always keep up to the standards. i really dont know how the other ones are, but this one was OK.. and i guess all the appreciation you got for this was because of the soft corner you already developed.

bolloju ahmad ali baba said...

good imaginations
bolloju baba

http://sahitheeyanam.blogspot.com/

PRADEEP said...

Excellent Sir. చాలా బాగా రాసారు.

PRADEEP said...

ఇంతమంది అభిప్రాయం రాసారంటే అంతకు ఎన్నోరెట్లమందికి నచ్చిందన్నమాట.ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

PRADEEP said...

http://bookmarks.oneindia.in/11940/showthread.html
మా సైట్లో మీ రచనకు స్దానం ఇచ్చాం

MURALI said...

ఇంతకీ శ్రుతి ఏమంది గౌతం గారు

భరత్ said...

చాల బాగుంది

Damodar said...

awesome may be not correct word. But i know only that word..

Anonymous said...

గురూ నీ కథకి finishing touch గా, గుండు కొట్టించుకో.. ఎలాగూ తిరుపతి అన్నావ్...పైగా నీ జుట్టు...ఫొయేదేముంది? latest fashion...ఎవరైనా దెబ్బకు పడిపోతారు.. ఏమంటావ్?

kishan said...

thota ramudugaru porapatna idi chadivi hair cutting ki velite?.chalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa baundi

Anonymous said...

superrrrrrrrrrr

telugu comedy said...

Chala bagundi....

http://freetelugucomedyclips.blogspot.com/

mahendra said...

Hi Gowtham garu....

I think U r from Guntur...

Really Ur Stroies r simply super...

Navvatam oka bogam Navvinchatm oka yogam anna hasya Bramha jandhya garu kuda ee stories chuste navve vallemo!!!!!!

Reagards
Mangaiah Chowdary Vunnam

vinu said...

http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=51259632&tid=5422882530823679718

vinu said...

evaro miru chepandi andhariki plsssssssssss

Foster said...

అప్పుడెప్పుడో ఒక సారి ఒక అమ్మయిని తెగపటాయించడానికి ప్రయత్నిస్తుంటే, అడ్డంకాలో బుడ్డంకాయ్ లా ఒక వ్యక్తివచ్చాడు, మీట్ మై హసబెండు అంది. ఆ స్రుతి కూడా ఏ పెళ్లయిపోయినావిడో అవుతుందేమోనని నా అనుమానం.

పూర్ణప్రజ్ఞాభారతి said...

చివర ఇచ్చిన పిల్లాడి కటింగు బొమ్మ కూడా సూపరు

Kiran Maroju said...

malli edipincharu guruvu garu...
chettantha magadi tho edipincharu..
really superb...
mee lanti vadu friend ga unte nijamga 100 years easy ga navvulatho bathikeyyochu....
office bore koduthunte ee post chadivi thega edusthunte, maa friend gadu emaindi ra .. love faiure aa.. serious ga adigadu...
office lo kada, gattiga navvali anipinchina navvalekapoyanu....

Kiran Maroju said...

enti meeru ee madhya posts em rayaledha,,,,,
malli mee prasthanam ni konasaginchandi... malli ilanti jokes mammalni puneethulani cheyyand.. plzzzzz