Thursday, August 28, 2008

వివాహ భోజనంబు - వింతైన వంటకంబు

ఆగస్టు 24, 2008 – ఎవ్వరూ నమ్మని కొన్ని విచిత్రాలు జరిగాయి

- హైదరాబాదు లో హుస్సేన్ సాగర్ లోని చెత్తా చెదారం తీసేసి త్రాగు నీటి కొలను గా మార్చారు.

- లాస్ ఏంజెలస్ లో స్టీవన్ స్పీల్బర్గ్ తన తదుపరి చిత్రం బిజీ ఆర్టిస్టు నందమూరి తారకరత్న తో తీస్తున్నట్టు ప్రకటించాడు.

- బెంగళూరులో ఉంటున్న నేను ఇకపై రోజూ ఇంట్లో వంట చేసుకుని తినాలని నిర్ణయించుకున్నాను.


"ఇకనుండి రోజూ ఇంట్లోనే వంట చేద్దాం" అనుకునే ప్రతి బ్రహ్మచారి లాగనే నేను కూడా 'Food World' కు వెళ్ళి పది కిలోలు బంగాళా దుంపలు, పది కిలోలు ఉల్లిపాయలు, పది కిలోలు గట్రాలు, ఇంకో పది కిలోలు వగైరాలు తీసుకుని కొట్టు బయటకు అడుగుపెట్టాను....రెండు ఆటోలు మాట్లాడాను – రెండూ కూరగాయలకే...నేను డ్రైవర్ పక్కన కూర్చున్నా.......

కాస్త దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ తన జేబు లోంచి ఒక కార్డు తీసి – "సార్...ఇది మా తమ్ముడు సూర్య ప్రకాష్ ఫోన్ నంబరు....పెళ్ళికి కావలసిన షామియాన, వంట సామాను అద్దెకు ఇస్తాడు....వాడి దగ్గరే తీసుకోండి సార్ " అన్నాడు.......

"ఎవరి పెళ్ళికి?" అడిగాను నేను.....

"ఈ కూరగాయలన్నీ......"

"ఈ రోజు నుండి నేను రూము లో వంట చేసుకోవటం మొదలు పెడుతున్నా.....అందుకే నెలకు సరిపడ కూరగాయలన్నీ తెచుకున్నా....ఇవ్వాళ సాంబార్ వండుకుంటున్నా"

ఆటో వాడు రెండు నిముషాలు మౌనంగా ఆటో నడిపి.....ఇంకో కార్డు జేబులోంచి తీసి.... "సార్…ఇది శంకర్ నారాయణ అని మా ఎదురింటాయన నంబరు...ఆయన పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో మిగిలిపోయిన కూరగాయలు కొని వాటిని హోటళ్ళకు అమ్ముతుంటాడు....మీరు 'ఇక వంట నా వల్ల కాదు' అనుకున్నప్పుడు ఫోను చేస్తే మీ ఇంటికొచ్చి కూరలన్నీ కలెక్టు చేసుకుని వెళ్తాడు...................మీరు ఇవ్వాళ సాయంకాలానికి ఫోను చేస్తారని చెప్పనా సార్ ఆయనతో?" అన్నాడు

ఆటో వాడు నన్ను ఇంతగా అవమానించి నందుకు ఆటో ఆపి...కిందకు దిగి…రెండు చేతులూ పైకి లేపి… "ఈ రోజునుండి నా వంట నేను చేసుకు తింటాను...లేక పోతే ఉపవాసముంటాను.....ఏ మెరీ అఖండ్ ప్రతిగ్యా హై " అని భీష్మ ప్రతిఙ చేసాను.....ఆకాశం నల్ల బడింది....ఉరుములు, మెరుపులు, వర్షం...మబ్బుల సందులోంచి దేవతలు పూలు చల్లారు.........

దేవతల వేషం వేసిన ఎక్స్ట్రాలకు, వర్షం కురిపించిన ఫైర్ ఇంజన్లకు డబ్బులిచ్చి పంపించేసాక…..ఇల్లు చేరుకున్నాను….

మొదటి సారి వంట చేయ్యబోతున్నాను కదా....మా అమ్మకు చెబితే సంతోషిస్తుందని ఇంటికి ఫోను చేసా........సరే ఎలాగూ ఫోన్ చేసాను కదా అని ఒక చిన్న డౌటు క్లియర్ చేసుకుందామనుకున్నా......

"అమ్మా...సాంబార్ ఏలా చేస్తారు?"

"ఎవరు?" అడిగింది అమ్మ

"ఎవరైనా ఎలా చేస్తారు?"

"ఎందుకు?"

"అబ్బా.......నేను ఈరోజు ఇంట్లో వంట చేస్తున్నానమ్మా......అందుకే అడిగా...ఎలా చేస్తారో చెప్పు "

"అవునా........నువ్వు వంట చేసుకుంటున్నావా........" అని అంతులేని ఆనందంతో మా అమ్మమ్మను పిలిచి.. "అమ్మా.....గౌతం వంట చేసుకుంటున్నాడంట....." అని అరిచి చెప్పింది.........మా అమ్మమ్మ చేస్తున్న పని వదిలేసి....మా పనిమనిషి కి, మా పక్కింటి డ్రిల్ మాస్టారి పెళ్ళానికి.. "నా మనవడు వంటచేసుకుంటున్నాడంట " అని మా అమ్మకన్నా గట్టిగా అరిచి చెప్పింది.....దానికి మా పనిమనిషి "అయ్యయ్యో.....వంటలు చేసుకుని బతుకుతున్నాడామ్మా" అని అడిగింది...

నాకిక్కడ ఫోను బిల్లుతో పాటు BP కూడా పెరుగుతోంది......."అమ్మా....సాంబార్ ఎలా చెయ్యాలో చెబుతావా లేదా " అన్నాను...

మా అమ్మ "సరే....ముందు కూరగాయలన్నీ తరిగి.......పెళ్ళి చేసుకోరా" అంది...

"ఎంటి సాంబార్ చెయ్యాలంటే పెళ్ళి చేసుకోవాలా?"

"కాదు....పెళ్ళి చేసుకుంటే ఈ కష్టాలన్నీ ఉండవని............కూరగాయలు తరిగి...ఒక పక్కన పెట్టుకో"

ఎవరో కాలింగ్ బెల్లు కొట్టారు....

మా అమ్మ – "కాలింగ్ బెల్లు తరువాత కొట్టొచ్చు....ముందు కూరగాయలు తరుగు"

"నేను కాదమ్మా....ఎవరో వచ్చినట్టున్నారు......నేను తరువాత ఫోను చేస్తా " అని ఫోను పెట్టేసాను..

సాంబార్ లో పుడక లాగా వీడెవడని తలుపు తెరిచాను..

"ఎవరు కావాలండి?"

"సార్.. గౌతం అంటే..."

"నేనే...చెప్పండి "

"సార్....శ్రీనివాసులు మీకు నా కార్డు ఇచ్చానన్నాడు....అదే ఆటో డ్రైవరు.............నా పేరు శంకర్ నారాయణ సార్"

"ఆ.....చెప్పండి"

"ఎన్ని కూరగాయలున్నయో చూపిస్తే ఒక రేటు అనుకోవచ్చు "

"ఆ అవసరం లేదండి...ఏమైనా విషయముంటే నేనే మీకు ఫోను చేస్తాను"

"నేను కింద మీ సెక్యూరిటీ వాడితో మాట్లాడుతూ ఉంటాను....ఫోను చెయ్యండి సార్....రెక్కలు కట్టుకుని లిఫ్టులో వచ్చేస్తాను" అని వెళ్ళిపోయాడు....

మా అమ్మ కాని, అమ్మమ్మ కాని వంట చెయ్యటం మొదలు పెట్టాగానే TV ఆన్ చేస్తారు....TV లో వచ్చేది వింటూ చెయ్యకపోతే ఆ రుచి రాదు...అందుకే నేను కూడా TV ఆన్ చేసాను...

ఏదో తెలుగు చానెల్...."ప్రపంచంలో మొట్టమొదటి live వంటల కార్యక్రమానికి ప్రేక్షకులకు స్వాగతం.....గత కొద్ది వారాలుగా మాకు వచ్చిన ఉత్తరాల్లో చాలా మంది అడిగిన కోరిక ఒకటుంది....బ్రహ్మచారులు ఇళ్ళల్లో వండుకునే వంటకాలేమైనా చూపించండి అని....అందుకే ఈ వారం మనము బెంగళూరు విజయనగర్ లోని 'హనుమాన్ అపార్ట్మెంట్స్' కు వెళ్తున్నాము...."


నేను ఇవ్వాళ పొద్దున మా గేటు బయట పడుకునే నక్క తోక పచ్చడి పచ్చడి గా తొక్కినట్టున్నాను....లేక పొతే ఇంత అదృష్టమా??....నేను వంట చెయ్యాలనుకున్న రోజే ఎవరో బ్యాచిలర్స్ ఇంట్లో వంట కార్యక్రమం live.....బ్రహ్మచారుల కొంప కాబట్టి ఆడవాళ్ళెవ్వరూ వచ్చి "ముందు పాత్రలు కడుక్కోవాలి..ఇల్లు శుభ్రంగా వూడవాలి...jeans కనీసం రెండు సంవత్సరాలకు ఒక సారి ఉతుక్కోవాలి " లాంటి టిప్స్ ఇవ్వరు......

నేను బంగాళా దుంపలు తరుగుతూ TV చూస్తున్నాను..

"హెలో..ఎవరండీ లోపల??" అని తలుపు కొడుతూ అడిగింది మైకు పట్టుకున్నావిడ...

లోపలినుండి ఎవరో తలుపు సగం తెరిచి చెయ్యి మాత్రం బయట పెట్టారు...

"హెలో...మేము NAA TV నుండి వస్తున్నామండి....మాకు ఉత్తరం వచ్చింది ఈ అడ్రసు నుండి... నిమ్మల వెంకట రావు గారు ఉన్నారా?"

చెయ్యి లోపలకు తీసుకుని తలకాయ బయటకు పెట్టాడు ఆ లోపలున్నతను....."ఒహ్..మీరు నిజంగా TV వాళ్ళా....రెండు నిముషాలు ఉండండి" అని తలుపు వేసేసాడు....

ఆ మైకు పట్టుకున్నావిడ మొహం లో చిరునవ్వు ఏ మాత్రం చెరిగిపోకుండా కెమేరా వైపు చూసి.."చూస్తున్నారుగా....తమ ఇంట్లో చెయ్యబోయే వంటలు చూపించటానికి వీళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో....ఏమి వండబోతున్నారో తెలుసుకోబొయ్యేముందు మీరు తీసుకోండి ఒక చిన్న BREAK"....

నేను కూరగాయలు తరగటం నుండి చిన్న బ్రేకు తీసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి....అందులో నీళ్ళు పోసి స్టవ్ వెలిగించాను...................నీళ్ళు ఘమ ఘమ లాడిపొతున్నాయి.......ఇంక సాంబార్ సూపర్ హిట్టే.....

స్టవ్ మీద నీళ్ళున్నాయి..తరిగిన కూరలున్నాయి..ఆ తరువాత ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుండగా మా అన్నయ్య ఫోనొచ్చింది...

" రేయ్...నేను ఇవ్వాళ సాంబార్ వండుతున్నాను....తరిగిన కూరగాయలు నీళ్ళు ఉడికాక వెయ్యాలా....నీళ్ళు ఉడకకముందే వెయ్యాలా?" అని అడిగాను..

"నీళ్ళు 'ఉడకట'మేంట్రా....'మరగటం' అనాలి....వంట తరువాత నేర్చుకుందువు గాని...ముందు తెలుగు నేర్చుకో"....

"సరే...ఫోనెందుకు చేసావో చెప్పు"....

"కాస్త తలనొప్పిగా వుంటే ఏ మాత్రలు వాడాలి అని అడుగుదామని ఫోన్ చేసా"..

"ఓ...తలనొప్పా....మెన్నీమధ్య ఎక్కడో చదివాను..'లంఖణం పరమౌషధం' అని...కాబట్టి..నువ్వు వెంటనే మెడికల్ షాపుకెళ్ళి మూడు లంఖణాలు తెచ్చుకో...పూటకొకటి వేసుకో...........భోజనం తరువాత" అన్నాను....

మా వాడు సమాధానమేమి ఇవ్వకుండా ఫోను పెట్టేసాడు..

సరే...అన్నింటికీ నల-భీములే ఉన్నారనుకుని........

మరిగే (ఉడికే) నీళ్ళలో తరిగిన కూరగాయలు వేసా.....
సాంబార్ పొడి పాకెట్టు కట్ చేసి ఒక దోసిట్లో సరిపడా పొడి వేసా.....
ఉప్పేసా...కారమేసా...
దాహంగా ఉంటే కొన్ని నీళ్ళు తాగి...కొన్ని గిన్నెలో పోసా..
చక్కెర డబ్బా మీదకెక్కుతున్న చీమను నలిపేసా..

(భలే...నాకు తెలియకుండానే ఒక డబ్బింగు సినిమా పాట రాసేసా)

ఇంతలో TV లో బ్రేకు అయిపొయ్యింది...నేను గబ గబా గిన్నె మీద మూత తీసి TV ముందు కూర్చున్నా.....

బ్రేకు టైములో ఆ ఇంట్లోని బ్యాచిలర్సంతా నిద్ర లేచి...తలకు నీళ్ళు రాసుకుని, తలలు దువ్వుకుని తయారయ్యినట్టున్నారు....

ఆ మైకావిడ కెమేరా వైపు చూసి "Welcome back.....ముందుగా ఈనాటి మన హోస్ట్లు ఏమి చేస్తుంటారో తెలుసుకుందాం....చెప్పండి వెంకట్రావు గారు...ఏమి చేస్తుంటారు మీరు?" అంది...

వెంకట్రావు సమధానమిచ్చే లోపు అతని పక్కనున్న లుంగి కట్టుకున్న బ్యాచిలర్ మైకు లాక్కుని "రాత్రుళ్ళు బాత్రూము లైటు ఆఫ్ చెయ్యకుండా పడుకుంటుంటాడు....నేను ఉతుక్కున్న సాక్సులు, డ్రాయర్లు, ఇస్త్రీ చేసుకున్న చొక్కాలూ వేసుకెళ్తుంటాడు.....మీరు TV లో కనిపించినప్పుడు 'మాంచి కసక్కు' అని అంటుంటాడు.........." అని ఇంకా ఏదో చెప్పబొయ్యేలోపు వెంకట్రావు వాడి నోరు మూసేసి...."ఆవిడ అడిగింది ఏ ఉద్యోగం చేస్తుంటానని రా...........మేడం..మనము నేరుగా విషయానికి వచ్చేద్దాం" అన్నాడు.....

"ఓకే ఐతే...మా ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏ వంటకం చెయ్యబోతున్నారు"

"ప్రతి బ్రహ్మచారి గర్వంగా...తలెత్తుకుని...రోజూ వండుకునే వంటకమే..........Noodles"....అన్నాడు...

"ఓ...గ్రేట్....మొదలెడదామా"

"ఒక్క నిముషమండీ....రెండు మూడు వస్తువులు తెప్పించాలి..." అని.......ఇందాకటి నుండి తన close-up తీయమని కెమెరా మెన్ ను బతిమాలుతున్న బ్యాచిలర్ దగ్గరకు వెళ్ళి..."రేయ్ ప్రసాదు..నువ్వు వెంటనే బయటకెళ్ళి...టొమేటోలూ, ఉల్లిపాయాలు, ఉప్పు, కారం, జింజర్-గార్లిక్ పేస్టు తీసుకురా.......అలాగే వచ్చేప్పుడు ఒక నూడుల్స్ పాకెట్టు, గ్యాస్ సిలిండర్ కూడా తీసుకురా" అని చెప్పి పంపించేసాడు...

మైకావిడ మళ్ళీ కెమేరా వైపు తిరిగి...."ప్రసాద్ గారు వస్తువులు తెచ్చేలోపు మనము తీసుకుందాం....ఒక చిన్న...” అని వెంకట్రావు, లుంగీ బ్యాచిలర్ వైపు చూసింది....వెంటనే ముగ్గురూ కలిసి.....కెమెరా కు బొటన వేలు చూపించి..... "BREAK" అన్నారు....

ఇందాక వెంకట్రావు జింజర్-గార్లిక్ పేస్టు అన్నది గుర్తొచ్చి వెంటనే నేను గిన్నె మీద నుండి మూత తీసేసి రెండు చెంచాలు జింజర్-గార్లిక్ పేస్టు వేసాను....కాసేపు గరిటె తో తిప్పుతూ ఉండగా ఎవరో కాలింగు బెల్లు కొట్టారు..

వెళ్ళి తలుపు తీసాను...మా ఇంటి ఓనరు...

"ఏంటి సార్"

"మీ ఇంట్లోంచి ఏదో రబ్బరు కాలిన వాసనొస్తోందయ్యా...అందుకే ఇలా వచ్చా" అని....హిడింబాసురుడి లాగా..."రబ్బరు వాసన.....రబ్బరు వాసన" అని అరుస్తూ వంటింటి వైపు పరిగెట్టాడు....

మర్డరు వెపన్ ను పసిగట్టిన పోలీసు కుక్క లాగ.....నా సాంబారు గిన్నె ముందు నిలబడ్డాడు మా ఓనరు....."ఏంటయ్యా...వంట చేస్తున్నావా...ముందే చెప్పుంటే టిప్స్ ఏమైనా ఇచ్చేవాడిని కదా.....ఏమి వండుతున్నావ్?" అని అడిగాడు...

"సాంబార్ సార్"

"అలాగా...ఉండు మా ఆవిడ వంటలోకి వాడే మసాలా పొడి తెస్తాను" అని పరిగెత్తుకెళ్ళి ఏదో పొడి తీసుకొచ్చి నేను ఎంత వద్దంటున్నా వినకుండా నా సాంబారు లోకి వేసాడు....

రెండు నిముషాలు....నేను మా ఓనర్ని, మా ఓనరు సాంబారు గిన్నెని చూస్తూ గడిపాము...

"ఇప్పుడు నిజంగా వస్తోంది సార్....రబ్బరు కాలిన వాసన...ఏం పొడి సార్ అది?" అని ఆడిగాను...

"ఏదైతే నీకెందుకు, ఓ ఇరవై నిముషాల పాటు మూత పెట్టుంచు...ఆ తరువాత చూడు.....మహత్తరంగా ఉంటుంది" అని వెళ్ళిపొయ్యాడు...

TV లో బ్రేకు అయిపొయ్యింది....మైకావిడ, వెంకట్రావు, లుంగి బ్రహ్మచారి..ముగ్గురూ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు....

ఇంతలో ఆ ప్రసాదు చేతిలో ప్లాస్టిక్ సంచితో రూములోకి వచ్చాడు...

"ఏంట్రా...అన్ని వస్తువులు తెమ్మని పంపితే చిన్న సంచితో దిగావు??"

"కిందకెళ్ళి చూస్తే బండి పంక్చర్ అయ్యింది రా.....ఆటోలో అన్ని తీసుకురావటం ఎందుకు ఖర్చు అని.....మురుగదాస్ హోటలుకెళ్ళి నూడుల్స్ పార్సెల్ తెచ్చాను.."............

ఆ గదిలో అందరు నిశ్శబ్దంగా నుంచున్నారు.....

వెంకట్రావు ఉండబట్టలేక....."నూడుల్స్ పార్సెల్ తేవటమేంట్రా........ఇక్కడ TV వాళ్ళు ఉన్నారని తెలుసు గా.." అన్నాడు కోపంగా...

"తెలుసు రా....వాళ్ళకు కూడా రెండు ప్లేట్లు పార్సెల్ తెచ్చాను" అని కవర్లోంచి మూడు పొట్లాలు తీసి చూపించాడు....

ఇదంతా చూస్తున్న మైకావిడ అతని వైపు చూసి..."నిజం చెప్పండి....వీళ్ళు మిమ్మల్ని ప్రసాద్ అంటున్నారు కానీ....మీ అసలు పేరు దినకర్ కదూ".....అంది

"మీకెలా తెలిసింది మేడం?? మా ఇంట్లో వాళ్ళు, నా ఫ్రెండ్సు నన్ను ప్రసాద్ అని పిలుస్తారు కాని...నా అసలు పేరు దినకర్....ఎలా చెప్పగలిగారు మీరు" అనడిగాడు...

నాకు చిరాకేసి TV కట్టేసాను.......వంటింట్లోకి వెళ్ళాను....

ఇందాక రబ్బరు కాలిన వాసన ఇప్పుడు ఎలక చచ్చిన వాసన గా మారింది.....భయం భయంగా గిన్నె మీద ఉన్న మూత తెరిచాను......

నలుపు, పసుపుపచ్చ, నీలం రంగులు కలిపితే వచ్చే రంగులో ఉంది ఆ గిన్నె లోని పదార్థం......ముక్కుకి కర్చీఫు కట్టుకుని అదంతా ఒక చిన్న టిఫిన్ డబ్బాలోకి వేసి మా ఓనర్ వాళ్ళ ఆవిడకిచ్చాను........ఆ వంటకం పేరు 'కాలా పథ్థర్' అని....మా ఓనరు గాడికి తినిపించమని చెప్పి వచ్చాను........

ఫోను తీసుకుని శంకర్ నారాయణ నంబరు డయల్ చేసాను......"హెలో....ఆ...పైకి రండి....ఒక రేటు అనుకుందాం".........

వంట చెయ్యటం అస్సలు రాకుండానే.....టన్నులకొద్దీ కూరగాయలు కొని....ఆవేశం తో వంట మొదలుపెట్టి....చేతికి దొరికినవన్నీ వేసి వండి....మధ్యలో మా ఓనరు లాంటి cookక ను వేలు పెట్టనిస్తే.....ఇలాగే ఉంటుంది...............రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేసినట్టు!

85 comments:

Murali.Marimekala said...

Chala bagundi andi mee post....dinakar ee sari prasad avatharam ethadu...chala koddi sepey vunnadu adey badaga vundi :)))...

Anonymous said...

బావుంది. యభై సెభాస్ లు.

-- విహారి

కత్తి మహేష్ కుమార్ said...

చాన్నాళ్ళకి కొత్త ‘టపా’కాయ పేల్చారు. ఏదిఏమైనా...మీ టపా లక్ష్మీటపాకాయేనండీ ! నవ్వినవ్వి చచ్చా.

సుజాత said...

ఓరి దేవుడా,
నిజంగా బాచెలర్లకు ఇన్ని వంట కష్టాలా స్వామీ? నవ్వి నవ్వి విసుగు పుట్టింది.(నవ్వలేక)! సరే, ఇప్పుడే మంచి సాంబారు చేసి వస్తున్నాను. రెసిపీ చెప్తా రాసుకోండి!
ముందు....స్టవ్ సమీపంలో రబ్బరు లేకుండా చూసుకోవాలి.
నెక్స్ట్...

Kalyani said...

అదిరింది....ఎ.ఎమ్ . రత్నం రాసిన పాటను రమణ గుల గుల పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది...బాచిలర్స్ ఇంకో వంటకం ఎగ, టమాట మర్చిపోయారు...

Ghanta Siva Rajesh said...

రజిని కాంత్ సినిమాలా తకువ టపాలునా అదరగొడుతునారండి

Anonymous said...

.”నిజం చెప్పండి....వీళ్ళు మిమ్మల్ని ప్రసాద్ అంటున్నారు కానీ....మీ అసలు పేరు దినకర్ కదూ”
ha ha ha. awesome!

Falling Angel said...

Back with a Bang :)

Kamaraju Kusumanchi said...

Wow! SUper!

అశ్విన్ బూదరాజు said...

కొన్ని కొన్ని డైలాగులు అదిరాయి, రోటీన్ గా చాలా బా రాశారు

పెదరాయ్డు said...

ఎప్పటిలాగే బాగుంది

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

Welcome back !!!

మీ టపాల గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను.

ఎప్పటిలాగే ఈ టపా కూడా అదిరింది. నేను అప్పుడెప్పుడో చేసిన "ఉప్పు"మా అనే వంటకాన్ని గుర్తుతెచ్చింది.

Sudheer said...

Good one

అశ్విన్ బూదరాజు said...

”నిజం చెప్పండి....వీళ్ళు మిమ్మల్ని ప్రసాద్ అంటున్నారు కానీ....మీ అసలు పేరు దినకర్ కదూ” ఇక్కడ భలేలే చాలా సేపు నవ్వుకున్నా, ఈ సారి దినకర్ గెస్టు పాత్ర పోషించాడన్నమాట

దైవానిక said...

దినకర్ ఎప్పుడొస్తాడా అని అనుకున్నంతలోనే గ్రాండ్ ఎంట్రి ఇచ్చేసాడు. గుడ్ వన్.

MURALI said...

అయ్యా తోటరాముడు గారు,
నిజంగా మీకు దినకరనే మితృడు ఉండేవాడా? (ఉన్నాడా? అని ఎందుకు అడగలేదంటే, ఇప్పటికీ ఉండుంటే మిమ్మల్ని మర్డర్ చేసి ఈ పాటికే జైలు కి వెళ్ళేవాడు). ఏం పాపం చేసాడండి ఇంతలా ఆడేసుకుంటున్నారు. కానీ ఒక విషయం అర్దమయ్యింది నాకు. మనకి చిన్నప్పటి నుండీ పడని ఏ ఎదవన్నా ఉంటే, లేదా చూడక,చూడక మన వైపు చూసి అరనవ్వో చిరునవ్వో నవ్విన అమ్మాయిని మనకి కాకుండా చేసి ఎగరేసుకుపోయిన ఏ పింజారి వెధవనైనా ఆయుధం పట్టకుండా జీవితాంతం ఎలా హింసించొచ్చో తెలుసుకున్నా. (అసలే బలం లేని వెధవని నేను. కలం బలం తెలుసుకున్నా మీ వల్ల)

MURALI said...

అసలు టపాకంటే ముందు దినకర్ ని ఎలా రప్పించాలో ఆలోచించి పెట్టుకుంటారా మీరు?పగవాడి కి కూడా వద్దు ఈ దినకర్ బ్రతుకు. :)

రవి said...

"ప్రతీ బ్రహ్మ చారి గర్వంగా..."

కంట్లో నీళ్ళు వస్తున్నాయి, నవ్వీ నవ్వీ. ఒక ముక్క. నేను బ్రహ్మచారి గా ఉన్నప్పుడు, ఆ స్థాయిలో కూడా లేను. నా రేంజి, పెనంలో నెయ్యి కాస్త, బ్రెడ్డు ముక్కలు.

నా మొదటి వంట, బప్పీలహిరి మ్యూజిక్ కి, బాల మురళీ కృష్ణ గాత్రం, ప్రభు దేవా డాన్సు లాగ ఉన్నది. ఎందుకంటే, నేనో ఎత్నిచ్ వంటకం ట్రై చేసాను.

ప్రతాప్ said...

హ్హా, హ్హా
చాలా బాగా రాసారు. నవ్వలేక, నవ్వి నవ్వి కూడా చచ్చాను. ఇంకా నయం మీరు సాంబారు చేద్దామని రెడీ అయ్యారు, నేనేమో అన్నం వండటానికి ఎన్ని కస్టాలు పడ్డానో. అవన్నీ చెబితే ఒక పెద్ద టపా అవుతుంది, మీరిచ్చిన స్ఫూర్తితో రాసేస్తా.

oremuna said...

SUPER

కల said...

బాగా రాసారు, అలానే నవ్వించారు కూడా.
ఎన్ని కష్టాలో కదా పాపం బ్రహ్మచారులకి, బ్రహ్మచారిణిలకి (హాస్టల్ లో ఫుడ్ తినలేక)?

Vijay Namoju said...

గౌతమ్ ,

" గ్యాస్ సిలిండర్ " ... " నూడల్ ప్యాకెట్ " సీక్వెన్స్ లు అద్భుతం ... నాకు నవ్వు వాంతి లా తన్నుకోస్తుంది .... ఆఫీస్ లో ఎక్కువ నవ్వితే ప్రాబ్లమ్ అని బాత్‌రూమ్ కెళ్ళి డోర్ పెట్టుకొని అరగంట నవ్వి వచ్చా ... ఎలా వస్తాయి సార్ మీకు ఇలాంటి ఐడియా లు ?
గురువా ! అని కాళ్ళ మీద పడాలి అని ఉంది నాకు ... లవ్ లెటర్ చదువుకున్నటూ రోజు చదువుకుంటాను మీ టపాలు ...

నా మాట విని మీరు డైలాగ్ రైటర్ గా ట్రై చెయ్యండి సినిమాల్లో, జంధ్యాల గారు లేని లోటు తీరుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ....

krantiviswas said...

epudu dinakar name eh na... na name kuda pettochu kada...
dinakar ki chala sarlu cheppa.. ippudu meku cheptunna...

I am Dinakar's colleague. Kranti

krantiviswas said...

anni stories chadiva... each one atleast 10 times...
but first time post chestunnaa..

Super super super...

movie theyali anukunte nene hero ga unta.. marchipokandi... free of cost .. full calsheets..

ప్రదీప్ said...

"రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేసినట్టు !"
"నిజం చెప్పండి....వీళ్ళు మిమ్మల్ని ప్రసాద్ అంటున్నారు కానీ....మీ అసలు పేరు దినకర్ కదూ"
-- సూపర్ !!!!
నేను కూడా బెంగళూరులోనే ఉంటాను.. మీరు ఎక్కడ ఉంటారో చెబితే, వచ్చి కాళ్ళకు దండం పెట్టుకుంటా. ఏం రాసారండీ బాబూ !! నవ్వలేక చచ్చా. ఆ దినకర్ ఎవరోకానీ బ్రహ్మానందంగారిలాగా పేరు వినగానే నవ్వొచ్చేస్తుంది :D

Kavuru said...

మధ్యలో మా ఓనరు లాంటి cookక ను వేలు పెట్టనిస్తే.....ఇలాగే ఉంటుంది..

bagundi

శివ బండారు said...

:):):)

tink said...

vantalu chaala baga nerchukuntunnaaru, inka pelli chesesukovachu tvaralo :P

you have a very good sense of humor! keep it up

sujata said...

దేవతల వేషం వేసిన ఎక్స్ట్రాలకు, వర్షం కురిపించిన ఫైర్ ఇంజన్లకు డబ్బులిచ్చి పంపించేసాక…..ఇల్లు చేరుకున్నాను….

చాలా బావుంది.

శ్రీవిద్య said...

అదరగొట్టేసారండి.. ఇంత బాగా ఎలా రాస్తారసలు మీరు?

ప్రవీణ్ గార్లపాటి said...

ఫక్కున నవ్వించారు !

Sandeep said...

chakkani article vraasaarandi. chaalaa baagundi :)

Sesha Sai said...

hello gautam, nenu modatisaari mee blaagu choostunna. Mee writing style chaala baagundi. Navvi, navvi nooru, potta rendu noppi puttayi:))

srinivasa raju said...

very good comedy article

భరత్ said...

చాల బాగుంది

Anonymous said...

super gaa undi mama...Vivaha bojanambu...whats nxt?

-Suri

Anonymous said...

హల్లో గౌతం, చాలా బాగా రాశారు. "సరే....ముందు కూరగాయలన్నీ తరిగి.......పెళ్ళి చేసుకోరా". అదిరి పోయింది. గత రెండు నెలలుగా పని లేక పోయినా ఆఫీస్ కి కేవలం మీ బ్లాగ్ చదవటానికే వస్తున్నా.

Ravi Krishna Reddy said...

chala baga vundi mee sambar...

Redrod said...

Awesome man !!

నెలకొక టపా విడుదల చే్స్తే సంతోషిస్తాము. :D

పులిగోరు రమేష్ said...

ఛాల బాగ వ్రాసావు రా సిద్దు...సూపర్.... ఎంటి దినకర్ గాడు ఇంకా రాలేదు అని అనుకుంటూ వుండగా వఛ్హడు. వెంకటరావు గాడి మీద ఇంక ఏమైన వ్రాసి వునంటావేమొ అనుకుంటూ చదివా...ఇందులొ ఆ లుంగి గాడు ఎవడూ???

Sravya said...

hahaa...chaala chaala baagundi..

Swetha said...

Nenu ee madhye me blog chadavadam start chesanu
Naku mee posts anni chala nachayi they are awesome
Mee blog chadavadam start chesinappati nundi ma office lo naku pichi pattinattu rumours start ayyayi (mee blog chaduvuthu nalo nene navvukuntunna, appudappudu pyki gattiga kuda navvanu andukani)
Meeru marinni posts la tho mamalni ela navvisthune undalani korukuntu

Ramesh_trainer said...

I was told that ur blogs are good but they are great

ramana gogula,chakri kalisi padina pata ku jagapathi babu, krishna dance chesi nattu ........

Colgate add ki Raja shekar navvinattu......

adirayee mastaru.

-Ramesh

Nagarjuna said...

boss!!meerevarO naaku teliyadu..
mee blog link evaricchaarO kooDaa sariggaa gurtulEdu...mottaaniki mee blog aitE raccha...open chEsina prati saari anni posts chaduvutunnaa...baagaa baadhalO unDi suddengaa evarO mee blog lO post ni e-mail kinda pampitE maLlii venakkocchi mee blog address vetiki paTTukoni anni posts chadivaanu...dhanyavaadaalu...
meeru ilaagE raastunDaali...haasya patrikEmO gaanii meetO oka manchi comedy cinema teeyaalanundi...all the very best...

Madhu said...

మీ పాత పోస్టులన్నీ...ఈ రోజు కూర్చిని చదివేసా...

నవ్వీ..నవ్వీ..ఒక టైపులో...తయారయ్యాను..
నాకేమయినా...అయితే మీదే ..భాధ్యత.. :)

సుధీర్ వూణ్ణ said...

టాపా అద్బుతం గా ఉంది.
బ్లాగు ప్రపంచం లొ హాస్యరాజ్యనికి రారాజు మీరే అని మరొసారి నిరూపించారు.

- సుధీర్ వూణ్ణ

Anonymous said...

balle balle balle tota laamudu gaaalu
meee sambaaalu bhalee vundadi
vaasana ikkalidaaka vachhidi

"ahaa haa ha ha aha oho ohho ho ho hhho vivaaha saambaalu vintayyinaa sambaalu " ha ha ha h haha ha ha

naaku sambaalu pettdam vachhu neneminaa saayam cheyyagalanaa

avunu "DINKAL" anedi mee pelaa mee fliend gaali pelaa???

Pardhu said...

దారుణం గా నవ్వించారు.

("అమ్మా...సాంబార్ ఏలా చేస్తారు?"

"ఎవరు?" అడిగింది అమ్మ)

ఇక్కడ స్టార్ట్ చెసిన నవ్వు.. చివరి వరకు ఆగలేదు.

హర్షోల్లాసం said...

చాలా చాలా బాగుంది.

krishna rao jallipalli said...

ఆశ్చర్యం...ఇంత గొప్ప టపా ఇన్ని రోజులు ఎలా మిస్ ఆయానా అని. ఓ సారీ.. అప్పుడు టూరులో ఉన్నాను. నిజ్జంగా గొప్ప గొప్ప గా. అదిరింది.. మామూలు అడరడం కాదు.. సూపర్ .. అలనాటి.. ఆంధ్ర భూమి మల్లిక్.. యర్రంసెట్టి సాయి ని మరిపించారు... వారానికొక టపా ఆశించా వచ్చా?

Nageswar Rao said...

hai prasad gaaru,chala bagundi nijamgaa chala mandi బాచిలర్స్ elagaa chestu untaru.nenu chala navvukonnanu.
Nageswar Rao

Anand said...

okkasari mimmalni chudalani undandi...

Anonymous said...

Hay goutham ....
oka 2days back ma friend oka meil pampichadu "na vimana prayanam" nenu danini chusi.. yedole maavaadi swagatam ani anukuni pakkana pettanu. ninna pani lekapovadam to vadi meil bayatiki teesi yem rasado chusanu... sUpar...kEka.. are mama idi yekkaDidiraa... link pampichi chavaraa ani poddununchi (meils meeda meils) gola pedite.. idigo ee link pampichaaDu..Opening tone ee vivaha bhojanambu nenu kurchilo sariga kurchunte voTTu pakkana vunde hindi vallaki nenu yenduku navvukuntunaano artham kaledu... madhyalo " amma sambaar Yelaa chestaru? yeavru? adigindi amma." ikkada apukoleka gattiga navvesa.. andaru lechi navanka vichitranga chusaru... nenu karchif addam pettukoni navvu aapukovadaniki try chesa... saadhyapadaledu chivariki maa manger ni chudagane...nirasam vachi idigo ila mail chestunnau..nijamga super.. kekooooooooo keeeka

Anonymous said...

Allo Gautam ji....

katthi....thurumu....chaku.....baku
simply superb!!!

KK said...

mama kevvu keka

Gopal said...

ఇంకేం మాట్లాడతాం బాసూ.. as usual కుమ్మేశావ్!

anupama said...

sambhar kosam pelli cheskovala? :))
chala chala navvukunna ..post kummesaru :D

Jayachandra said...

na friend link pampiste iee post chadivaanu, enno rojula tarvata intaga navva galigaanu. Great work. marinni ilanti hasyaspada 'post'lu raastaarani aasistoo...

Jayachandra

Chaitü said...

inkaa dinakar ravatam ledenti anukuntunna time lo correct ga entry ichaadu... undi koddisepaina tana talent chupinchaadu :)
chala chala bagundi post :)

Venugopal said...

Too good. Somebody already commented that you are reminding us of Yerramsetty Sai and Mallik in good old days. Actually that was my feeling also when I first read your post.

But my only complaint is you are too lazy ... why dont you write a blog everyday? I bet that your blogs will be compiled and sold like hotcakes one day.

Waiting for your next post.

sujji said...

...................నీళ్ళు ఘమ ఘమ లాడిపొతున్నాయి.......ఇంక సాంబార్ సూపర్ హిట్టే.....

hahaha....

Bharath said...

thotaraamudu gaaru.. hats-off to u.. eppatilaage chaala baaga raasarandi.meelaanti vaalla inspiration thone nenu kuda blog raayatam start chesaa.Tvaralo bglr vasthunnaa, okasaari mimmalni kalavaalanundi

Bhaskar Muppana said...

babu thotaramudu, nuvvu keka.. kinda padi padi navvuthunna..

Bachi

nagaprasad said...

super...

jhansi papudesi said...

నవ్వి నవ్వీ అలసిపోయాను. నాకు మెంటలెక్కిందేమోనని ఆఫీసుస్టాఫ్ డౌటుగా చూస్తున్నారు. నూరేళ్ళు నవ్వుతూ నవ్విస్తూవుండండి.

The Phoenix said...

bapu ramana kathalu la unnayi.
baaga enjoy chesaa.
thanx mams for posting.

అజిత్ కుమార్ said...

వారేవా ఏమి టేస్టూ...సూపర్.

శ్రీ said...

అబ్బ..ఏమి రాసారు తోట రాముడు గారు? పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను.

HemanthPradeep said...

మీ రచానసక్తి కి నా జోహార్లు
మీ పద ప్రయోగాలకి నా వందనాలు
డబ్బింగ్ సినిమా పాట ...దినకర్ ...రమణ గోగుల అణు మాలిక్ సంగీతానికి కృష్ణ రాజశేఖర్ డ్యాన్స్ అదిరింది

RaSri said...

Ramana gogula+anumalik .....
:) .. awesome creativity

venuram said...

soooparoo soooper ......

chandrasekhar said...

కేక బాసూ ... హాస్యంతో కూడా చంపెయ్యొచ్చని నిరూపించారు ... అస్సలు నేను ఇన్నిరోజులు మీ బ్లాగు చూడనందుకు చాలా బాధ పడుతున్నాను. మీరు సంతోషంగా ప్రయత్నం చెయొచ్చండి ... అదే వెండితెరలో వెలిగిపోడానికి. ఒకప్పుడు మల్లిక్ జోకులకి పడీ పడీ నవ్వేవాణ్ణి, మళ్ళీ ఇన్నాళ్ళకి మీ దయ వల్ల చాలాసేపు నవ్వుకున్నా. ... ఇక చూడండి ... నే చదువుతా ... మొత్తం చదువుతా ... అరె మిగతావి కూడా చదువుతా ... మీరు చివర ఇచ్చారే చమక్కు అది కేకో కేక ... అదే రాజశేఖరూ, కృష్ణా కలిసి రమణ గోగుల పాటకు డాన్సు వెయ్యడం ... కేక ...

చంద్రం.

టి. శ్రీవల్లీ రాధిక said...

చాలా రోజుల తర్వాత చాలా నవ్వుకున్నాను. (కళ్ళల్లో నీళ్ళొచ్చేంతగా)
మంచి అబ్జర్వేషన్ తో రాసే హాస్యం ఎప్పుడూ గొప్పగా వుంటుంది.
---
మా అమ్మ "సరే....ముందు కూరగాయలన్నీ తరిగి.......పెళ్ళి చేసుకోరా" అంది...

మా అమ్మ కాని, అమ్మమ్మ కాని వంట చెయ్యటం మొదలు పెట్టాగానే TV ఆన్ చేస్తారు....TV లో వచ్చేది వింటూ చెయ్యకపోతే ఆ రుచి రాదు...
---

లాంటీ వాక్యాలు అందుకు ఉదాహరణ. మీ మిగతా రచనలన్నీ కూడా చదివి నవ్వుకుంటాను.
Thank you.

sagar said...

vaammo...navvi navvi chachanu andi(ante malli bratikanu)...

Vinodh Kolluri said...

Too good.. One of your best posts..

"రమణ గోగుల, అను మలిక్ ,
"నిజం చెప్పండి....వీళ్ళు మిమ్మల్ని ప్రసాద్ అంటున్నారు కానీ....మీ అసలు పేరు దినకర్ కదూ",
" గ్యాస్ సిలిండర్ " ... " నూడల్ ప్యాకెట్ " ivanni wonderful sequences.. hats off to you...!!!

kish_tn said...

mee posts naaku nenu eppudo chinnappudu chadivina yerramsetti sai gari humorology ni talapistunnai andi. mahattaram

Deeps said...

boss, kummesavu.

satish said...

మొదటి సారి మీ టపాలో వ్యాఖ్యానిస్తున్నాను...రెండు రోజుల నించి ఆఫీసులో నవ్వు ఆపుకోలేక చాలా కష్టపడ్డాను :) మీ టపాలన్నీ చాలా బాగున్నాయండి...మరిన్ని టపాలకోసం ఎదురు చుస్తూ ఉంటాను :)

Anonymous said...

awesome

Anonymous said...

adbhutam,awesome!

chittibabu said...

very good. choosara bachlor problems. every bachlor marriage chesukondi twaraga.
Mee
Chittibabu.N

Sudha-Bangalore said...

Gowtham gaaru!!!

Kaasta mee address cheptaraa??

marem ledu, buddhi ga kidnap chesukundamani...

Praveen said...

superb boss

Anonymous said...

.రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేసినట్టు! ......


Superb boss .........

Ramki said...

అదరగొడుతునారండి