Thursday, October 16, 2008

ఓణం - ఆణో - పెణ్ కుట్టి

ఓ నెల రోజుల క్రితం మాట...మా వదిన షాపింగు చెయ్యాలంటే తోడు వెళ్ళాను. తన దగ్గరున్న 1,487 జతల చెప్పులు పాతవయ్యాయని కొత్త చెప్పులు కొనటానికి 'మెట్రో షూ మార్టు ' కు వెళ్ళాము. మూడు గంటల తరువాత తను కొన్న చెప్పులకు బిల్లు కట్టటానికి పర్సులో ఉన్న డబ్బు, కారు తాళాలు, ఇంటి కాగితాలు షాపు వాడికి ఇస్తుండగా ఎవరో ఒకమ్మాయి వచ్చి మా వదినను పలకరించింది..ఓ ఐదు నిముషాల పాటు మాట్లాడుకున్నారు..దూరంగా కూర్చున్న నన్ను చూపించింది మా వదిన..ఈ చెప్పుల కొట్టోడికి నన్ను తాకట్టు పెట్టేస్తొందేమోనని కంగారు కంగారు గా పరిగెట్టుకెళ్ళాను...

"ఈ సారికి మా వాడు వస్తాడు...ఇదిగో..మాటల్లోనే వచ్చాడు....ఈ అమ్మాయి నా ఫ్రెండు శిల్ప చెల్లెలు - పూర్ణిమ...వీడు నా మరిది - గౌతం" అని పరిచయం చేసింది...

"మీరు తప్పకుండా రావాలి...అడ్రసు మీ వదినకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి..

మా వదిన నా వైపు తిరిగి "ఈ 12 వ తారీఖు వాళ్ళింట్లో ఒక ఫంక్షన్ ఉంది...నేను, మీ అన్నయ్య ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి నిన్ను పంపిస్తానని మాటిచ్చాను" అంది..

"నేనెళ్ళను..ఆ రోజు నాకు ఆఫీసు లో మూడు మీటింగ్లున్నాయి, మొబైలు బిల్లు కట్టాలి, బ్యాంకు లో పనుంది, ఫ్రెండ్స్ తో సినిమా ప్లానుంది, డిన్నర్...."

"అది 'ఓణం' ఫంక్షన్...పెళ్ళి కాని మళయాళీ అమ్మాయిలు బోలెడు మంది వస్తారు"

"ఆ కవర్లు ఇటీ వదినా...ఎన్నింటికెళ్ళాలి?"

*******************************************

నాకు మళయాళంలో అత్యంత ఇష్టమైన పదాలు మూడున్నాయి - ఓణం, ఆణో, పెణ్ కుట్టి...'పెణ్ కుట్టి ' అంటే 'అమ్మాయి ' అని అర్థం..ఆ భాష లో ఇంతకన్నా అందమైన పదం ఉండటం అసాధ్యమని నా లిస్టు అక్కడితో ఆపేసాను..

మళయాళీలను 'మల్లు'లు అంటారని అందరికీ తెలుసు..కానీ మళయాళీ అమ్మాయిలను 'మల్లమ్మ'లు అంటారని కొందరికి మాత్రమే తెలుసు..(మల్లమ్మ = మల్లు + అమ్మాయి - షష్టీ తత్ 'పురుష' సంధి)..

పూర్ణిమ వాళ్ళ ఇల్లు ఇందిరా నగర్ లో - విజయనగర్ నుండి 15 కిలోమీటర్లు. త్వరగా బయలుదేరాలని ఉదయాన్నే, తెల్లవారుజామునే, మరియు పొద్దున్నే లేచాను..వెళ్తున్నది 'ఓణం' ఫంక్షన్ కు కాబట్టి..మళయాళీల సంప్రదాయ లుంగి, చొక్కా వేసుకుని, Asianet చానెల్ లో యేసుదాస్ సుప్రభాతం విని, అయ్యప్ప స్వామికి మొక్కుకుని, కొబ్బరి నూనె తో చేసిన ఇడ్లీలు తిని, పడవలో బయలుదేరాను..

నీల్ విజయ్ గాడి ఫోను వచ్చింది -

"జై ఓణం...చెప్పరా"

"ఏరా..ఓణం ఫంక్షన్ కు వెళ్తున్నావంట...మీ అన్నయ్య చెప్పాడు. నేనొక్కడే వెళ్తానంటే నా వైఫ్ ఒప్పుకోదు..మా ఇంటికి రారా..ఇద్దరూ కలిసి వెళ్దాం..అసలే మల్లమ్మలు.. "

"నోరు మూసుకుని ఇంట్లో కూర్చోరా...చూసావా..పెళ్ళి చేసుకోకపోవటం వల్ల ఉన్న లాభాలు....ఉహుహుహహహ" అని వికటాట్టహాసించాను (వికటాట్టహాసం = వికట + అట్టహాసం - 'హాసం'-పత్రిక-నిలిచిపోయింది సంధి)...

మరో అరగంటలో పూర్ణిమ వాళ్ళ ఇల్లు చేరాను..వాళ్ళ ఇంటి వెనకాల నా పడవ పార్కు చేస్తుండగా నా పక్కన ఒక TVS-50 వచ్చి ఆగింది..

"హమ్మయ్య..సరిగ్గా టైముకు వచ్చాను " అన్న మాటలు వినిపించాయి...ఇక్కడ తెలుగు మాట్లాదేది ఎవర్రా అని పక్కకు చూసాను....

దినకర్ గాడు....

"రేయ్...నువ్వేమి చెస్తున్నావిక్కడ???" అనడిగాను

"నువ్విక్కడ జరిగే ఓణం సంబరాలకు వస్తున్నావని ఇందాకే నాకొక ఆకాశరామన్న sms వచ్చింది......అయినా ఇది చాలా అన్యాయం రా..సంవత్సరానికి 9 సార్లు నాతో బర్త్ డే పార్టీలు తీసుకోవటానికి మాత్రం ఫోన్లు చేస్తుంటావే.....ఇంతమంది మల్లమ్మలను కలిసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఫోన్ చెయ్యవేరా??" అన్నాడు తన TVS-50 ని చెట్టుకి కట్టేస్తూ....

ఇంతలో నాకొక sms వచ్చింది..నీల్ విజయ్ గాడి దగ్గరి నుండి..

"ఉహుహుహహహ - ఇట్లు ఆకాశరామన్న" అని ఉంది..

దినకర్ గాడికి ఆ SMS చూపించాను..

"వార్నీ...నీకు కూడా నీల్ విజయ్ గాడి మొబైల్ నుండే వచ్చిందా??...ఈ ఆకాశరామన్న గాడెవడో నీల్ గాడి మొబైల్ నుండి అందరికీ మెసేజ్ లు చేస్తున్నాడు రా....వెంటనే నీల్ గాడికి ఫోను చేసి చెప్పాలి..." అని నా డ్రస్సు వైపు వింతగా చూసాడు..

"మల్లూల సంప్రదాయ దుస్తులు రా...ఓణం కదా అని" అన్నాను..

"ఇలా లుంగీలు, గోచీలు కట్టుకొస్తే అమ్మాయిలు నీ దగ్గరకు కూడా రారు... నాతో ముందే చెప్పుంటే నాలాగ 'hep' గా డ్రెస్ చేయించుండేవాడిని కదరా " అంటూ తన డ్రస్సు చూపించాడు......

గులాబి రంగు జీన్సు ప్యాంటు ....టీషర్టు మీద 'Cool Dude' అని రాసుంది........తలకు నవరత్న తైలం రాసుకుని, నుదుటికి వీబూది అడ్డబొట్టు పెట్టుకున్నాడు......

చిన్నగా నవ్వి ప్యాంటు కాస్త పైకి లేపాడు...కుడికాలికి ఎరుపు, ఎడమ కాలికి నీలం రంగు సాక్సులు వేసుకునున్నాడు....

"ఆ సాక్సులేంట్రా" అన్నాను..

"చూసావా..అమ్మాయిలు కూడా నా సాక్సులు చూడగానే ఇలానే అడుగుతారు..నేను వెంటనే వాళ్ళ పేరు, ఫోన్ నంబరు తీసుకుంటాను...గేం ఓవర్!" అని గట్టీగా అరిచి, ప్యాంటూ అలా పైకెత్తుకుని "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అంటూ నా చుట్టూ తిరగటం మొదలు పెట్టాడు....

---------------------------
Flashback - 1
---------------------------

అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు..మా క్లాసు ఎదురుగా ఒకటో తరగతి పిల్లలు "రింగా రింగా రోజెస్...పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్" అని ఆడుకుంటున్నారు. నేను చూస్తుంది ఆ పిల్లలను కాదు..వాళ్ళను ఆడిస్తున్న మా సరస్వతి మిస్సును...

సరస్వతి మిస్...మళయాళం అమ్మాయి.......నా ఫస్ట్ లవ్!

సరస్వతి మిస్సు మాకు సోషల్ స్టడీస్ చెప్పేది..తన అందం తో నా చదువు సర్వనాశనం చెసింది..అందమే అనుకుంటే.. అందానికి మించిన తెలివితేటలు. ఎవ్వరూ, ఎప్పుడూ వినని విషయాలెన్నో మాకు చెప్పేది మా మిస్సు. "శ్రీలంక రాజధాని ఆఫ్ఘనిస్తాన్" అన్న మా సరస్వతి మిస్ మాటలు ఆ తరువాత ఎక్కడైన ఎవరైన రాసారేమో/చెప్పారేమో అని ఎంత వెతికినా లాభం లేకపొయ్యింది...

మా మిస్సు కు నేనంటే మొదటి నుండి అదోకరకమైన ఇది..

నన్ను అప్పుడప్పుడూ 'కుట్టా' అని పిలిచేది - 'కుట్టా' అంటే మళయాళం లో 'స్వీట్ బాయ్' అని అర్థం!

చాలా సార్లు 'useless idiot' అని కూడా పిలిచేది - 'useless idiot' అంటే ఇంగ్లీషులో 'స్వీట్ బాయ్' అని అర్థం!

మా సరస్వతి మిస్ అపురూప సౌందర్యాన్ని చూసే అప్పట్లో ఇంగ్లీషు పెద్దలు ఒక సామెత కనుగొన్నారు -

"Man is a social animal" అని......అంటే - "మా సోషల్ మిస్సుని ప్రేమించని మనిషి జంతువుతో సమానం" అని అర్థం...

అటువంటి మా సరస్వతి మిస్సు..సరస్వతి మిస్సెస్ గా మారబోతోందని తెలిసింది. మా స్కూల్లో అందరికీ కార్డులు పంచింది. నా బుగ్గ నిమిరి "పెళ్ళికి తప్పకుండా రావాలి కుట్టా" అని తట్టా బుట్టా సర్దుకుని నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది....

ఆ బాధ తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా దగ్గు మందు తాగి దేవదాసు కామిక్స్ చదువుతూ గడిపేసాను..

ఆ మరుసటి రోజే నిర్ణయించుకున్నాను - ఇంకోసారి ప్రేమలో పడకూడదని!

-------------------------------

దినకర్ గాడు పడ్డాడు - నా చుట్టూ తిరుగుతున్న హుషారు లో ఒక గులక రాయి మీద జారి..

వాడీని పైకి లేపి "పద లోపలకు వెళ్దాం..లోపల నీ విపరీత చేష్టలు కాస్త అదుపులో పెట్టుకో" అని హెచ్చరించి లోపలకు తీసుకెళ్ళాను....


మేము ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ 30, 40 మంది మల్లమ్మలు కిల కిల, గల గల అని మళయాళం లో నవ్వుతూ కనిపించారు...అంత మంది అందమైన అమ్మాయిలను చూడగానే దినకర్ గాడికి (లేని) మతి పోయింది..

"ఆహా..నా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ఇన్నాళ్ళకు దొరికింది రా..నా చార్మ్ తో ఇక్కడుండే అమ్మాయిలందరిని మెస్మరైజ్ చేసి అవతల పారేస్తాను....చూస్తూ ఉండు...ఇంకో రెండు మూడూ గంటల్లో ఈ మల్లమ్మలందరూ 'దినకర్ నాకు కావాలి...దినకర్ నా వాడూ అని ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటారు" అని...రెండు క్షణాలాగి "సరే పద...ఇద్దరం కలిసి విజృంభిద్దాం" అని నా చెయ్యి పట్టుకు లాగాడు....

"ఇద్దరం కలిసా??...వద్దురా...'గౌతం జోగి, దినకర్ జోగి రాసుకుంటే కిలో బూడిద రాలిందంట'....ఎందుకు రిస్కు..ఎవరికి వాళ్ళు ప్రయత్నిద్దాం..ఏమంటావు?" అన్నాను...

వాడు ఏమీ అనకముందే పూర్ణిమ నన్ను గుర్తు పట్టి నా దగ్గరకు వచ్చింది..

"హై గౌతం..రండి..ఎవరో ఫ్రెండును కూడా తీసుకొచ్చినట్టున్నారు...గుడ్..సరిగ్గా టైం కు వచ్చారు..ఇప్పుడే ముగ్గుల పోటీలు జరగబోతున్నాయి..వెళ్ళీ మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి - అక్కడ" అని ఒక చిన్న టేబులుముందు నుంచున్న ముగ్గురు అమ్మాయిల వైపు చూపించింది...నేను థ్యాంక్స్ చెప్పేలోపు దినకర్ గాడు నన్ను లాక్కుని ఆ అమ్మాయిల దగ్గరకు తీసుకెళ్ళాడు..

"హెలో..వెల్కం. మీ పేర్లు రెజిస్టర్ చేసుకోండి..ఇంకో పది నిముషాల్లో పోటీ మొదలవ్వబోతోంది" అంది ఆ ముగ్గురిలోకి కాస్త పొడుగ్గా ఉన్న మల్లమ్మ..

దినకర్ గాడు వెంటనే తిరుపతి లోని ప్రతాప్ థియేటర్ ఎదురుగుండా కొన్న 67 రూపాయల సన్ గ్లాసెస్ తన జేబులోంచి తీసి పెట్టుకుని -

"నా పేరు దినకర్" అన్నాడు..

"స్పెలింగ్ చెబుతారా?" అడిగిందా అమ్మాయి..

"Dinakarqwxyz" అన్నాడు మావాడు..

"అదేంటండి??"

దినకర్ గాడు టేబుల్ మీదకెక్కి కూర్చుని, తన సన్ గ్లాసెస్ ముక్కు మీదకు జార్చి - "నా పేరులో చివరి ఐదక్షరాలు సైలెంట్.....ఒక వేళ మీకు కష్టమనిపిస్తే 'The nakar' అని రాసుకోండి" అన్నాడు..

ఆ అమ్మాయి ఏదో రాసుకుని - "మీ మెయిల్ ID ఇస్తారా..వచ్చే నెలలో మా మళయాళీ సంఘం వాళ్ళు ఒక నాటకం వెయ్యబోతున్నారు..మీకు ఇన్విటేషన్ పంపుతాము" అంది..

"తప్పకుండా...నా మెయిల్ ID - dinakardinakar@gmail.com.....password - lakshmikrishna.....నా ఫోన్ నంబరు - 9999999999"

"ఫోన్ నంబరు అవసరం లేదండి"

"పర్లేదు ఉంచండి....నంబరు మీ దగ్గరుంటే ఒకటి..నా దగ్గరుంటే ఒకటీనా.." అని తన మొబైల్ బయటకు తీసి "ఇంతకీ మీ నంబరు చెప్పలేదు" అన్నాడు...

"అవును" అని సమధానమిచ్చింది ఆ అమ్మాయి..

జరిగేదంతా నేను నిశ్శబ్దంగా చూస్తున్నాను...ఇంత నిశ్శబ్దంగా అప్పుడెప్పుడో నా కెమిస్ట్రీ ల్యాబు పరీక్షలో మా ప్రొఫెసర్ నన్ను Viva క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఉన్నా.....మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు...

ఆ అమ్మాయి తన దగ్గరున్న లిస్టులో ఏవో టిక్కు మార్కులు పెట్టి మా ఇద్దరినీ ఇంకో నలుగురు అమ్మాయిలున్న టీములో వేసింది...

"అదిగో మీ టీము వాళ్ళు అక్కడున్నారు" అని రూము చివర్న పూల బుట్ట పక్కనున్న అమ్మాయిల వైపు చూపించింది..

దినకర్ గాడు ఆ రెజిస్ట్రేషన్ అమ్మాయితో ఏదో మాట్లాడుతుండంగానే నేను మా టీమ్మేట్స్ వైపు వెళ్ళాను...ఆ నలుగురిలో ఒకమ్మాయికి బుగ్గ మీద సొట్టుంది....

"నన్ను మీ టీం లో వేసారండి" అన్నాను ఆ అమ్మాయిని చూసి...

"అలాగా...నా పేరు స్మిత...మీరు?" అని చెయ్యి ముందుకు చాచింది..

"గౌతం" అని షేక్ హ్యాండు ఇచ్చాను...

షేక్ హ్యాండు ఇస్తుంటే...నా జీవితాన్ని షేక్ చేసి నాకు హ్యాండిచ్చిన 'సునయన ' గుర్తొచ్చింది..


-------------------------------
Flashback - 2
-------------------------------

సునయన - నా రెండో ఫస్ట్ లవ్...ట్రివేండ్రం అమ్మాయి...ఇంజనీరింగ్ లో నా క్లాస్మేట్...నేనెప్పుడు కనిపించినా నవ్వుతూ షేక్ హ్యాండిచ్చేది..తను నా చెయ్యి తాకినప్పుడల్లా నా జీవితం బృందావన్ గార్డెన్స్ లాగా అందంగా కనిపించేది....

సునయన ను కలిసిన మొదటి నెలలోనే నిర్ణయించుకున్నాను....'జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే సునయన నే చేసుకోవాలి'* అని....

(*కుదరక పొతే వేరే అమ్మయిని చేసుకుందాం)

మా మూడవ సంవత్సరం కాలేజీ వార్షికోత్సవానికి మేము గ్రూప్ డాన్సు చెయ్యాలని అనుకున్నాము..ఏ పాటకు చెయ్యాలనే విషయం మీద మొదలయ్యింది గొడవ...

"మనము చెసేది శాస్త్రీయ నృత్యం కాబట్టి 'నిన్నా కుట్టేసినాది, మొన్న కుట్టేసినాది గండు చీమా ' అనే తెలుగు పాటకు చేద్దాము " అని నేను...."కాదు 'ఓణం, ఆణో, పెణ్ కుట్టి' అనే మళయాళం పాటకు చేద్దామని సునయన.....చివరకు మా గ్రూపు లోని మిగతావాళ్ళంతా మళయాళం పాటకే ఓటేసారు. ఆ అవమానాన్ని నేను భరించలేకపోయాను. సునయన తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను...తను ఎప్పుడో గిఫ్టుగా నాకిచ్చిన నట్రాజ్ పెన్సిల్, ఇమామి కోల్డ్ క్రీం తనకు తిరిగిచ్చేసి - వెనక్కు తిరిగి చూడకుండా వచ్చేసాను..

(ఇందాక flashback మొదలవ్వకముందు సునయన నాకు హ్యాండిచ్చిందని అన్నాను కద....సారీ....నేనే హ్యాండిచ్చాను)


---------------------------------------

"ఎలా ఉంది ముగ్గు" అంది స్మిత...

ఉలిక్కిపడి, ఉలిక్కిలేచి...ముగ్గు చూసాను.."నన్ను పెళ్ళి చేసుకుంటావా స్మిత" అనటానికి మళయాళం లో ఏమంటారో అని ఆలోచిస్తుండగా దినకర్ గాడు నా దగ్గరకు వచ్చి "రేయ్..నేనిప్పుడే వస్తాను..అలా వాకిట్లోకెళ్ళీ కుందేలునో, జింకనో పట్టి తీసుకురావాలి" అన్నాడు...

"ఏమి మాట్లాడుతున్నావు రా...ఒక్క ముక్కా అర్థమవ్వట్లేదు" అన్నాను..

"అదిగో అక్కడ మంచి నీళ్ళు తాగుతోందే అమ్మాయి..ఆ అమ్మయిని పేరు అడిగాను రా..'పట్టీ పో' అంది...సీత రాముడిని అడిగినట్టు జింకనో, కుందేలునో పట్టి తీసుకు రమ్మందేమొనని వెళ్తున్నా" అన్నాడు...

"రేయ్ మూర్ఖుడా...'పట్టి' అంటే మళయాళం లో 'కుక్క' అని అర్థం రా"

"అవునా??"

"అవును...'పట్టి పో' అంటే......'నీ కుక్క బుధ్ధులు ఇంకెక్కడైన చూపించుకో పో...ఆ 67 రూపాయల చల్లద్దాలు తీసెయ్యి..గౌతం దగ్గర తీసుకున్న cd లు, లీటర్ పెట్రోలు ఎప్పుడూ తిరిగిస్తావు బే....TVS-50 చెట్టుకు కట్టెయ్యటమేంట్రా గులాబి రంగు జీన్సు ప్యాంటు వెధవా" అని అర్థం" అన్నాను....

"పేరు అడిగినందుకు పేరగ్రాఫ్ పొడుగు తిట్టు తిట్టిందా పట్టి మొహం ది"....అని కాస్సేపు బాధపడి...."ఏంటోరా..ఈ రోజు అంతా రివర్సే...నువ్వు ఆ ముగ్గు గొడవలో ఉండగా 14 మంది అమ్మాయిలను ట్రై చేసాను...ఒక్కరూ వర్క్ అవుట్ అవ్వలేదు.........సరే..నీ పరిస్థితి ఏంటి" అనడిగాడు...

"నాతోరా...Mrs.గౌతం ను పరిచయం చేస్తాను" అని స్మిత దగ్గరకు తీసుకెళ్ళాను..

స్మిత కూడా తన ఫ్రెండు ఎవరినో నాకు పరిచయం చెయ్యటానికి తీసుకొచ్చింది..

"దిసీజ్ గౌతం...ముగ్గుల పోటీలో మా టీం లో ఉన్నాడు..మళయాళం బాగా మాట్లాడతాడు తెలుసా" అంది..

"అవునా...ఎలా నేర్చుకున్నారు మళయాళం?" అడిగింది ఆ అమ్మాయి..

"నేను TV లో ఎప్పుడూ మళయాళం చానెల్స్ చూస్తూ ఉంటానండి..అలా పట్టేసాను..నా డ్రస్సు చూసారా....మొన్న శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో చూసిన మళయాళం సినిమాలోని కాస్ట్యూంసే ఈ నా ఈ డ్రస్సుకు ఇన్స్పిరేషన్" అన్నాను...

దినకర్ గాడు నా భుజం మీద గిల్లి - "శనివారం రాత్రి 'సూర్య' టీవీ లో మనము చూసిన సినిమాలో అసలు హీరో, హీరోయిన్లు కాస్ట్యూంసే వేసుకోలేదు కద రా" అన్నాడు...

స్మిత, స్మిత స్నేహితురాలు నా వైపు అస్సహ్యంగా చూసి - "ఓణం, ఆణో, పెణ్ కుట్టి" అని ఛీదరించుకును వెళ్ళిపోయారు..

కళ్ళలో నీళ్ళతో దినకర్ గాడి వైపు చూసాను..

"సారీ రా...తప్పు చేసాను...క్షమించు" అన్నాడు...

"తప్పు నీది కాదులేరా...ఎందుకో చెబుతా విను....నీ Orkut ప్రోఫయిల్ లో, పర్సనల్ డీటెయిల్స్ లో 'Ideal Match' పక్కన 'India vs Pakistan in sharjah' అని రాసుకున్న ఏబ్రాసి వెధవవి నువ్వు..ఇది తెలిసి కూడా నాకిష్టమైన అమ్మాయిని పరిచయం చెయ్యటానికి తీసుకెళ్ళానే....నాది రా తప్పు....నా పేరు మార్చుకోవాలి రా 'దినకర్ ' అని....." అని ఏడ్చేసాను..

ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళే సరికి నీల్ విజయ్ గాడు అందరికీ పార్టీ ఇచ్చాడు...నా మూడో ఫస్ట్ లవ్ ఫెయిలైనందుకు...ఆ తరువాత మా వాళ్ళు కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు.....ఇదిగో..మొదటి బహుమతి పొందిన ముగ్గు -

91 comments:

Raj said...

మీ ఇంట్లో వేసిన ముగ్గు బాగుంది. మరోసారి వేసేటప్పుడు నన్ను మీ టీంలో చేర్చుకోండి. మొత్తానికి మీ టపా చాలా నవ్వించింది. కొచ్చిలో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయి.

రిషి said...

hahha.. :)

ప్రపుల్ల చంద్ర said...

హహహ బాగా నవ్వించారు... as usual మీ స్టైల్లో కుమ్మేసారు.... పాపం దినకర్....

చైతన్య said...

హా..హా బాగుంది. మీ టపా అదుర్స్. మీ స్టైల్ లో కుమ్మేశారు. 'పట్టి పో' కు అంత అర్థం ఉందా ?... హా ..హా అయితే మేము వాడేసుకోవాలి ఆ పదం.

mutyalarao said...

మీ టపా బాగా నవ్వించింది. చివర్లో దినకర్ చెప్పిన "సూర్య టీవీ" చమక్కు బాగుంది! మీ "దేవుడికే దడ" టపా బాగా నచ్చి ఇవ్వాళ మీ టపా తిరగేశాను. మీ రచనా శైలి బాగుంది.

రవి said...

పొద్దునే ఆఫీసులో నవ్వలేక చచ్చాను బాసు. :-)

"ఒరుబాడు ప్రమాదమాయి"...

కాకతాళీయంగా, నా ఓర్కుట్లోనూ, ideal match - india vs pakistan అనే రాసుకున్నా..

సుజాత said...

నిజానికి మీ పోస్ట్ లు చదవగానే నేను మా వారికి లింకు పంపిస్తూ ఉంటాను "ఇదో సారి చదివి వికటాట్టాహాసించండి" అని..! ఈ సారి పంపట్లేదు....మీ ఇంట్లో ముగ్గు తనకి ఏమైనా సందేశాలు పంపుతుందేమో అని డౌటు గా ఉండి! ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ముగ్గులపోటీ పెట్టుకుంటేనో!

సూర్య టీవీ చమక్కు కసుక్కున దిగేలా ఉంది!

కత్తి మహేష్ కుమార్ said...

టపా అదిరింది. చదువుతున్నంతసేపూ చిరునవ్వు నా ముఖంమీద ఉంటే, అక్కడక్కడా లేచి కుర్చీలోనే గంతులేసిన అనుభూతి కలిగింది.

Sarath said...

గౌతం గారూ, మీరు అక్కడక్కడా వేసే చణుకులు భలే ఉంటాయండీ.
"ఆ కవర్లు ఇటీ వదిన...ఎన్నింటికెళ్ళాలి?"
"కొబ్బరి నూనె తో చేసిన ఇడ్లీలు తిని, పడవలో బయలుదేరాను."
సింప్లీ సూపర్బ్.

Anonymous said...

న్యాన్ నిన్నె వెరక్కునం అని చెప్పకనే చెప్పిందన్న మాటా ఆ అమ్మాయి బాగు బాగు
ఓణం - ఆణో - పెణ్ కుట్టి కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

Anonymous said...

అన్నయ్యా,

నన్ను ఆఫీసులో పని చేసుకోనియ్యవా నువ్వు??

నవ్వి నవ్వి కంట్లో నీళ్ళొస్తున్నాయి.నీలాంటోడితో రోజూ గడిపే ఈ దినకర్, నీల్ విజయ్ నిజంగా అదౄష్టవంతులు..రోజూ ఇలా నవ్వుకుంటే ఇక జీవితంలో కష్టాలే ఉండవు.

ఇంకో వారాంలో మరో టపా రాయకపోతే మర్యాదగా ఉండదు.

శ్రీధర్ ప్రభు

ప్రతాప్ said...

బాగా రాశారు.

laxmi said...

LOL :)

ammo nenu seat lo viragabadi navvutu unte maa team janalu bittarapoyi chustunnaru... inkoncham sepu navvite naakosam bhoota vaidyudini techi unde vallu nakedo deyyam pattindi ani... emaina chala bagundi tapa

టి. శ్రీవల్లీ రాధిక said...

చాలా నవ్వించింది.
“...ఇంత నిశ్శబ్దంగా అప్పుడెప్పుడో నా కెమిస్ట్రీ ల్యాబు పరీక్షలో మా ప్రొఫెసర్ నన్ను Viva క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఉన్నా.....మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు...” లాంటీ వాక్యాలు మరీ.

MURALI said...

Superb Gowtham.ఆఫీస్ లో అప్పుడప్పుడు పనిచేస్తూ ఠంచనుగా బ్లాగులు చదువుతా. మీ బ్లాగు చదివేప్పుడు మాత్రమే అందరూ నా వైపు చూసేలా నవ్వుతా. Hats off to your sense of humour.

Rakesh said...

Excellent ..

It may b a small term 2 express my feelings. This is d best so far ani every post ki anipistondi ...

Chala baga rasaru ...

Aa 'patti po' ki meeru cheppina definition keka ...

End lo surya TV satire superb ..

Ila cheptu potu anni 2222222222 gud

dhrruva said...

naaayana neeko dannam.!!

office time lo nee blog choodakoodadhu anukunta malli tappakunda choostha.


silent ga navvukolekha, navvu aapukolekha.. naa baadha evadiki cheppukovali.

annattu PRATAP theater dagara nenu kooda 10th lo sungalss konna ley ;)

NICE POST GAUTHAM !!!

jhansi papudesi said...

బాగుందండి. పొలమారేలా నవ్వుకున్నా ఎప్పటిలాగే సింగిల్ గా.
అన్నట్టు మీరిచ్చిన ఇ-మెయిల్ పాస్ వర్డ్ తప్పండి.
వర్కౌట్ కాలేదు.

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

కొత్త తెలుగు వ్యాకరణం నేర్చుకుంటున్నా.

షష్టీ తత్ 'పురుష' సంధి

బాగుంది !!!

కొత్త పాళీ said...

2mmach!!

సత్యసాయి కొవ్వలి said...

:)))))))

ప్రదీప్ said...

మీ టపా అదిరింది !!!
ఆఫీసులో మీ టపాలు చదవకూడదు అని చాలా సార్లు అనుకున్న .. కానీ, మీరు కొత్త టపా రాసారు అని తెలియగానే చదివా.. as usualగా బాగా నవ్వించారు.

సిరిసిరిమువ్వ said...

ఏమని వ్యాఖ్యానించను, మీ టపా చదివి నవ్వుకోవటమే సరిపోతుంది.

krishna rao jallipalli said...

"దేవదాసు కామిక్స్ చదువుతూ గడిపేసాను"
"మనము చెసేది శాస్త్రీయ నృత్యం కాబట్టి 'నిన్నా కుట్టేసినాది, మొన్న కుట్టేసినాది గండు చీమా ' అనే తెలుగు పాటకు చేద్దాము"
నిజ్జంగా ఇరగ దీసారు.

శ్రీ said...

భలే నవ్విస్తూ రాస్తారు మీరు! మీ ముగ్గు సందేశాత్మకంగా ఉంది!!

నిషిగంధ said...

:))))
మీరింత హాస్య రాక్షసులేంటండీ బాబూ!

Anonymous said...

hi, raa.
nuvvu ippudu ekkadunnaavu.
ee snday tirupati vaste nannu kaluvura.
bob00231@gmail.com

nenu 21st varaku Tirupati lo untaa.

muthi.

Srinivas Ch said...

అబ్బబ్బ టపా చదువుతున్నంత సేపూ నవ్వు ఆపుకోలేక చచ్చాను. ఈ టపా కూడా మీ స్టైల్ లో అదిరింది.

Rajesh said...

అన్నా ఇరగదీసావు.
చదివినంత సేపే కాదు చదిన తర్వాత చాల సేపటి వరకూ నవ్వు ఆపుకోలేక పోయా. అన్ని పంచ్ లు సూపర్. మీరు "తోట రాముడు" కాదు "హాస్య రాముడు"

మున్నీ said...

:) ... నేను మీ బ్లాగులన్ని ఏకబిగిన చదివేసాను సార్.... అసలు ఇంత బాగా ఎలా వ్రాస్తారండి?

Motorolan said...

When someone addicts to drugs, he wants more and more "dose" of it all the time.

Its exactly the same with your posts, sadly... this "dose" is not enough for me :)

వేణూ శ్రీకాంత్ said...

మీ దినకర్ బ్రహ్మానందాన్ని మించి పోతున్నాడండీ.... తన పేరు చదవగానే నవ్వొచ్చేలా చేస్తున్నారు :-) As alway టపా అదుర్స్. కొన్ని చెణుకులు ఇంకా అదుర్స్ లైక్ రెండో ఫస్ట్ లవ్, సూర్యా టీవి..., ఇటీ వదిన..., చివరి ఐదక్షరాలు సైలంట్.. శాస్త్రీయనృత్యం.. etc కేక.

Damodar said...

Yo Gowtham,,,,

Meedhi thirupathannav..
Maadhi thirupathanna..

Post mathram iraga deesav...
Kani konchem thvaraga raasi, mana sfotware vaaalla athmahathyalu thagginchu saami..
Asale tension la tho mana vallu chala mandhi chanipoyjunnaranta..

Nee blog lantidhi choosthe anna valla tension thaggi, bathuku tharemo..

Meeku cheppakunda , mee post lanni printout lu theesi, maa room lo DINAKAR ki icha, Orey, ivi alibaba adbhtha dweepam kathalu ani cheppi..
Vaadu appatinunchi mee blog bhashe matladuthunnadu..
Any ways thanx once again for santhosha pettinandhuku..

Jai Dinakar

Sesha Sai said...

Good one. I like your blog very much. Thanks for bringing smiles in the stressfull life.

anupama said...

aa ammai vesina muggu kante mee mugge bagundi:)
muggu kante mee post inka bagundi..
ila rastune undandi :D
"ఆ కవర్లు ఇటీ వదిన...ఎన్నింటికెళ్ళాలి?"
"కొబ్బరి నూనె తో చేసిన ఇడ్లీలు తిని, పడవలో బయలుదేరాను."
adiripoyayi :D

anupama said...

marchipoyanu "శాస్త్రీయనృత్యం" annitikee highlite :)

రాధిక said...

తింగరి వెధవ అని అనడానికి నేను దినకర్ అని అంటున్నాను ఈ మధ్య.మీ ఫ్రెండు అయినందుకు భలే ఫేమస్సు అయిపోయాడు.పాపం దినకర్.

Venky said...

తన దగ్గరున్న 1,487 జతల చెప్పులు పాతవయ్యాయని,
'తను కొన్న చెప్పులకు బిల్లు కట్టటానికి పర్సులో ఉన్న డబ్బు, కారు తాళాలు, ఇంటి కాగితాలు షాపు వాడికి ఇస్తుండగా',
షష్టీ తత్ 'పురుష' సంధి,
నా జీవితాన్ని షేక్ చేసి నాకు హ్యాండిచ్చిన 'సునయన '

hahaha, ultimate way of taking something to heights baasoo ..!! Very nice post ... chivarlo surya tv lo cinema chamakku maatram adirindi !!![:P]

hari said...

loool :)) .... awesome post

kalyani said...
This comment has been removed by the author.
aswin budaraju said...

dinkarXZPQWE అదిరిందన్నా.
దినకర్ అప్పుడప్పుడొస్తేనే నవ్వలేక చచ్చేవాళ్ళమే
ఈ టపా లో ఫుల్ లెంన్త్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకో బాసు

lalithasravanthi said...

ఇంకా బాగా రాయగలిగి ఉండాల్సింది
ఇదివరకటి టపాలతో పోలిస్తే హాస్యపు పాలు తగ్గింది అనిపించింది

నాగన్న said...

కిల కిల, గల గల (తెలుగు)

Anonymous said...

adirindi baasu..

>> ఆ బాధ తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా దగ్గు మందు తాగి దేవదాసు కామిక్స్ చదువుతూ గడిపేసాను..

:D

Neelima Lella said...

As usual..excellent....

oka saari mi orkut profile chudalani vundi...akkada about me lo emi raasaro chudalani vundi ...

Vijay Namoju said...

Hi Gouthmqxyzwv

1,488 వ జత కొని మిమ్మల్ని మీ వదిన చెప్పుల షాప్ వాడికి తాకట్టు పెట్టె సన్నివేశంతో మొదలయ్యిన నవ్వుల మారథన్… ఆసియనెట్ లో ఏసుదాసు పాటలు విని పడవ లో భయలుదెరె సీన్ తో వాక్ అందుకుంది …మీరు పడవ పార్క్ చెయ్యడం , పక్కనే దినకర్ TVS 50 ని చెట్టుకు కట్టెయ్యడం ఆ నడక స్పీడ్ ని మరింత పెంచాయి …. తన టీ షర్ట్ మీధ కూల్ డ్యూడ్ అని స్కెచ్ పెన్ తో రాసుకొని …ఒక వైపు నీలం ,మరో వైపు ఎర్రటి సాక్స్ వేసుకొని ప్యాంట్ పైకి లక్కోని మీ చుట్టూ తిరుగుతూ “ రింగా రింగా రోసెస్ “ అని Dinakarqxyz paade సన్నివేశము తో పరుగు అందుకుంది ......... “ శ్రీలంక రాజధాని ఆఫ్గనిస్తాన్ “ అన్న మీ సరస్వతీ మిస్ తెలివితేటలు , రాత్రంతా దగ్గు మంధు తాగుతూ , దేవదాస్ కామిక్స్ చదువుతూ మీరు పడిన విరాహ వేధానాలతో ఆ పరుగు పిచ్చి కుక్క వెంట పడినట్టు గా వూపు అందుకుంది .... “ ప్రతాప్ థియేటర్ ముందర దినకర్ కొన్న 67 రూపాయల కళ్ళజోళ్ళు , శాష్త్రీయ నృత్యముగా మీరెంచుకున్న “ నిన్న కూట్త్తేసీనది .. మొన్న కుట్తేసినాధి “ పాట , సన్ టీవీ లో మీరు చూసిన సినిమా లో క్యాస్టింగ్ కాస్ట్యూమ్స్ “ చమక్కులతో వాయువేగాన్ని అందుకుంది ….. అందుకున్నాయి

Sri Vallabha said...

goutham gaaru,

navvapukoleka chachanu. and first thing i did after reading this, naa orkut profile lo "ideal match: India Pakistan final" ni delete chesanu :P

nenu dinakari ni kaadandoi.

Anonymous said...

too good. please, please, please write more frquently.

ఎల్లమ్మ said...

hahahahahaha ... this is (n+1)th time I'm reading your posts ! I'm a great fan of your hilarious writing style ! Kudos !

Krrish said...

గౌతం గారు,
బిల్లు కట్టటానికి ఆస్థులు ఇవ్వటం, మీ వదిన మిమ్మల్ని కూడా తాకట్టుపెడుతుందేమూ అని మీరు అనుకోవటం, అమ్మాయిలు ఉంటారు అని తెలియగానే మీ కార్యక్రమాలు అన్నీ ఇట్టే మాయమవ్వటం, మల్లు అమ్మాయిలను మల్లమ్మలు అని అనటం, మీ స్నేహితుడు ఆకాశ రామన్న సందేశాలు పంపి మీ మీద కసి తీర్చుకోవటం, దినకర్ అవతారం, మధ్య మధ్యలో మీ ఫ్లాష్ బాక్లు, మీ సోషల్ టీచర్ తెలివి తేటలు, ఫ్లాష్ బాక్ కొనసాగింపుగా "దినకర్ పడ్డాడు" అని అన్నటం, దినకర్ పేరులో సైలెంట్ అక్షరాలు, ఈమెయిల్ ఐడితోపాటు పాస్వర్డ్ కూడా చెప్పటం, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా సునయనకి "స్టార్" మార్కు పెట్టటం, శాస్త్రీయ నృత్యానికి మీ పాట ఎన్నిక, "పట్టి పో" అన్న దానికి అస్సలు అర్ధం ఎమో కాని... మీరు చెప్పిన భాష్యం, సూర్యా టివి చమక్కు, ఆర్కుట్‌లో ఐడియల్ మాచ్ కాన్సెప్టూ...
అబ్బా ఏమి చెప్పమంటారు... సూపరో సూపరు!!! మీ టైమింగ్-కి, మీ ఈ చతురతకి నెనరులు.

aswin budaraju said...

అబ్బబ్బబ్బబ్బా
ఎం రాశారు గౌతం గ్గారు
అసలు ఆ సైలేంట్ ఎంటండీ....
పేరు లో ఆ సైలెంట్ ఎలా రాయలనిపించింది మీకు
కేక బాసు

Suuren D'sa said...

Gautam,

I hope you subscribe to the modified adage, “plagiarism is the best form of flattery”.

I have news for you buddy.

మీ బ్లాగు లోంచి పేరాలు పేరాలు లేపి, కొంచెం టింకరింగ్ చేసి సొంత సరుకులా చలామణి చేసెస్తున్నాడొక అంత సీనులేని సీను గాడు.
http://cnugaadu.blogspot.com/2008/10/blog-post.htmlThis the comment I posted in his blog

Suuren D'sa said...
Thotaramudu, September 6, 2007: ఆఫీసులో 7 వ అంతస్థు లో ఉంటుంది నా సీటు.....మెట్లెక్కితే మంచి ఎక్సరసైసు అని లిఫ్టు ఎంత ఆహ్వానిస్తున్నా రోజూ మెట్లెక్కే వెళ్ళేవాడిని. కాని ఒక రోజు మెట్లెక్కబోతుంటే....అక్కడ నుంచున్న సెక్యూరిటీ వాడు ఆపి "పొద్దున్నుండి మెట్లు పని చెయ్యట్లేదు సార్...ఇవ్వాళ లిఫ్ట్ లో వెళ్ళండి" అన్నాడు. అంతే...నడుము చుట్టూ ఇంకో ఇంచు..

Cnugaadu, October 23, 2008: మేము ఇంతకుముంది 5th floorలో కూర్చునేవాళ్ళం. అప్పుడు మంచిగా మెట్లు ఎక్కీ మరీ వెళ్ళేవాడిని. ఇప్పుడు అది కాస్తా 10th floorకి మార్చారు. ఇంకేముంది రోజూ లిఫ్టు లో వెళ్ళటం.. దాని పర్యవసానం... నా నడుము చుట్టూ ఇంకో ఇంచు పెరగటం.Thotaramudu March 21, 2007 ఇంకో విషయం...మన తెలుగు సినిమాల లాగానే పైన ఉన్న టైటిల్ కూ కింద రాసిన దానికీ ఏ మాత్రమూ సంబంధం లేదు...ఏ పేరు తోచక పెట్టింది మాత్రమే

Cnugaadu October 23, 2008: గమనిక : మన తెలుగు సినిమాలలో లాగా పైన చెప్పిన titleకి కింద ఉన్న దానికీ ఏమాత్రం సంబంధం లేదు. నాకు ఏ పేరు పెట్టాలో తెలియక ఈ పేరు పెట్టాను.


Thotaramudu January 16, 2008: కంపెనీ ని అభివృధ్ధి లోకి ఎలా తీసుకురావాలో నా బాసు మాట్లాడుతున్నాడు....
కరెక్టుగా 46 వ నిముషం లో
" ఇంకో వారం రోజుల తరువాత మన టీం లో శృతి అనే అమ్మాయి చేరబోతోంది " అన్నాడు.....
.....ఆ మీటింగు లో నాతో పాటు ఊహల్లో ఉన్న సాటి పురుష పురుగులు కూడా ఇప్పుడే ఫ్లైటు దిగినట్టు ఉన్నారు.

Cnugaadu October 23, 2008: మా మానేజరు ఖర్చులు తగ్గించి, లాభాలు పెంచి కంపెనీని ఎలా అభివృద్దిలోకి తీసుకురావాలో ఒక గంట నుండి చెప్తూ.... ఉండటంతో... మేము అందరం ఎవడి ఊహల్లోకి వాడు వెళ్ళిపోయారు. అంత అయిపోయిన తరువాత... వచ్చే వారం మన ప్రాజెక్ట్ లోకి కొత్త అమ్మాయి జాయిన్ అవబోతుంది అని మా మానేజరు అనగానే... ఊహల్లోనుండి అందరు బయటికి వచ్చి దేబురు మోహలువేసుకొని ఒకరిని ఒకరం చూసుకోవటం మొదలుపెట్టాం
Thotaramudu September 6, 2007: ఈ సూటిపోటి మాటల బరువు నేను మొయ్యలేను..ఇంకో మూడు నెలల్లో నేను బరువు తగ్గుతాను.....ఒక వేళ తగ్గకపోతే....దానికి నైతిక బాధ్యత వహించి మన రాష్ట్రపతి రాజీనామా చెయ్యాలి!

Cnugaadu, October 23, 2008: ఇంక ఇలా ఐతే కష్టం అని వెంటనే "ఆరు నూరు ఐనా నూరు ఆరు ఐనా సరే... ఒక వారం రోజుళ్ళో బరువు తగ్గవలసిందే" అని ఒక భీష్మ ప్రతిఘ్న చేసేసాను. ఒక వేళ అనివార్య కారణాల వల్ల అది జరగక పోతే దీనికి భాద్యత వహిస్తూ మన రాష్ట్రపతి రాజీనామా చెయ్యవలసిందే. నేనుThotaramudu March 7, 2007 కాలాలు నాలుగు - ఎండా కాలం, వానా కాలం, చలి కాలం, పొయ్యే కాలం. మొదటి మూడు కాలాలు సంవత్సరం లొ ఏ ఏ నెలల్లో వస్తాయో చెప్పే వీలుంది. కానీ ఆ నాలుగోది ఎప్పుడు ఏ రూపం లొ వస్తుందో చెప్పలేము.

Cnugaadu July 8, 2008: కాలాలు మూడు.. అవి భూత, భవిష్యత్ మరియు వర్తమాన కాలాలు. ఇంకో కాలం కూడా ఉంది... అది పోయే కాలం. అది ఎప్పుడు, ఎలా, ఎవరికి వస్తుందో... ఎవరికీ తెలియదు.Thotaramudu March 7, 2007: దెబ్బతగిలినప్పుడు Dettol రాసుకుంటే మొదటి 10 సెకండ్లు మంటేసి తరువాత చల్లగా ఉంటుంది. ఆ 10 సెకండ్ల మంట ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందొ దూరదర్శన్ చూసాక తెలిసింది.

Cnugaadu July 8, 2008: తగిలిన దెబ్బకి Dettol రాస్తుంటే ఉండే మంట.... ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందో... అప్పుడే నాకు తెలిసింది.Thotaramudu March 7, 2007ఆహా..కొత్త పాటలా... అరగంట పాటు ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకున్న.
మెల్లగా నాకు చెమట పడుతొంది. పైకి చూసాను. ఫాను తిరుగుతూనే ఉంది. మరి చెమట ఎలా పడుతొందా అని ఆలొచిస్తుండగా...

Cnugaadu July 8, 2008: నాకు నచ్చిన సినిమాలోని పాట వినొచ్చు అనుకుని TV volume పెంచాను. ఆ పాట మొదలైన కొద్ది సేపటికి చూసుకుంటే.... నాకు బాగా చెమటలు పట్టేసి, గుండె దడ మొదలైంది. పైకి తలెత్తి చూసా... fan తిరుగుతూనే ఉంది. ఏంటీ ఇంత చెమటలు పట్టాయి అని చూస్తే...Thotaramudu March 7, 2007: నా రూం లొ కరెంటు పొయ్యింది..ఆహా...కరెంటు పొయ్యినందుకు నేను ఇంతగా ఎప్పుడూ ఆనందించలేదు. ఈ చీకటి నా జీవితంలొకి మళ్ళీ వెలుగు తీసుకొచ్చింది....

Cnugaadu July 8, 2008: అనుకోకుండా... మా ఇంట్లో కరెంటు పోయింది. హమ్మయ్య అనుకున్నాను. ఇంతకు ముందు ఎన్నో సార్లు కరెంటు పోయినప్పుడు "ఛీ... వెధవ కరెంటు ఇప్పుడే పోవాలా??? అని అనుకునే వాడిని.. కానీ ఆ రోజు మాత్రం చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు మా ఇంట్లోకి చీకటి వచ్చి... నా జీవితంలోకి వెలుగును నింపింది.


I rest my case....
October 24, 2008 2:41 PM

కొత్త పాళీ said...

@Suuren .. good investigation.
BTW, thotaramudu's earlier posts have been so popular that some of them made email rounds, esply among the Telugu 20-something software crowd .. without acknowledgement to the source.

Sandy said...

Good one..

hope your 4th 1st love will workout well for you..

రానారె said...

నమస్కారం, గౌతంగారూ. నిన్న సాయంత్రం ఆఫీసులో మొదలుపెట్టాను ఈ టపాను చదవడం. దినకర్ ప్రవేశించగానే "ఇట్లా కాదు, ఇంటికెళ్లి పట్టపగ్గాలు లేకుండా నవ్వుకుందాం" అనుకొని ఆపేశాను. మళ్లీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడే చదివి నాలో నేనే కుళ్లికుళ్లి నవ్వుకుంటున్నాను. ఈమధ్య సౌమ్యగారొక టపారాశారు - నవ్వొక బాధ - అని, ఇప్పటి నా పరిస్థితి కూడా అందులో ఒక ఉదాహరణగా సరిపోతుంది. ఈసారి చమక్కులు చాలా పదునుగా వున్నాయి. అన్నట్టు, మొన్న వాలీబాల్ ఆడేటప్పుడు నా సహోద్యోగులు మీ బ్లాగుగురించే మాట్లాడుకుంటూ కనిపించారు. మీ దినకర్ వాళ్లపాలిట బ్రహ్మానందం. చాన్నాళ్లక్రితం నేనే వాళ్లకు బ్లాగులోకాన్ని పరిచయం చేశాను. కానీ మీ బ్లాగొక్కటే వాళ్లకు లోకమైపోయింది. నాకిప్పటికీ థాంక్స్ చెబుతూవుంటారు. ఆ థాంక్సన్నీ ఇదిగో ఈ వ్యాఖ్యలపెట్టెలో పెట్టి మీకిచ్చేస్తున్నాను.

Regipandu said...

chaala baaga rastunnaru. i came across your blog recently. oka night lo annee chadivesanu. mallee chala rojula tarvata 'exams tension' la night out chesanu ;)

innallu prapancha samasyalu antu dikkumalina IBN, NDTV blogs chadivi, rojuu ratri poota mokaliki amrutanjanam raasukoni, edo pichi kalavarinthalatho padukunevanni.
ippudu meevi chadivina tarvata, chinnappudu ammoru vaste vepa mandalatho vadilinchinatlu naa pytyam vadilindi.
ee santhosham ekkuvai kotha tension. nidra lo nenu oooohuhhaha ani vikatattahasam chestunnata, intha manchi blog dorikinanduku.

Dhaatrey - The Cute Little Rascal said...

Your writing style is ultimate. Inthakanna emi cheppalenu. Ee tapa the best.
'Dinakarqwxyz',pink color jeans pant, ilanti ideas meekela vostayandi.
Ippatiki enni sarlu chadivano gurtu kuda ledu. Rendu sarlu chadavagane maa variki prati sentence to saha kadha cheppesanu. annam tinetappudu cheppanu. Papam polamarindi. Padi padi navvukunnaru. Monna oka friend ki auto lo vostunte cheppanu. Adi silent ga vikatattahasam chesi, mee blog URL teesukundi. maa friends,relatives andariki mee blog mail chesanu. Andarni navvincahnu.

Mee Dinakar evaro kani, mee kadhalu chadivevallandariki suparichitudu. Baga close ayipoyadu andariki mee kadhala dwara.

Very nice andi. Waiting for your next post.

Regipandu said...

hi, below is a collection of short stories, written by sa. ven. Ramesh, which i liked very much. Really Humorous, resembles us good old childhood days. have no time to describe much.. but hope u do enjoy. by the way...'Nellore mandalikam' is the slangugage used in it.

http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=22927&page=2

sherlock holmes said...

aakasa ramanna phone number pettesadoch !!!

Eliyas said...

బాగుంది బాగుంది

Anonymous said...

very nice story. i really enjoy it.

Anonymous said...

నేటి ఆంధ్రజ్యోతి > నవ్య > రెందో పేజిలో మీ బ్లాగు పరిచయం ఉంది. అభినందనలు. మీ హాస్యం బాగుంటుంది!

సత్యప్రసాద్ అరిపిరాల said...

కొత్తగా చెప్పేదేముంది?? తోటరాముడి టపాలంటే
ఎప్పుడూ కేకాస్పదమే.. ఆంధ్రజ్యోతిలో మీ పేరు చూసి ఇదుగో ఇలా ... అభినందనలు

అరిపిరాల

veeru said...

congratulations for your blog appearing on andhrajyothi !

sujata said...

You are brilliant! I loved this too. Thanks for the wonderful free humour !!! It is really really good.

Anonymous said...

1.5 months ayyindi annayya. inkennallu wait cheyyali nee next post kosam. please edo okati raayannayya.

usha said...

chaala bagundi :)
mee vaakchaturyaniki na joharlu

Affinity's Infinity said...

chala baaga raasaru posts navvaleka chaccha inka still....ROFL........

మధుర వాణి said...

తోట రాముడు గారూ.. ఇదే మొదటిసారి మీ బ్లాగ్ చదవడం. నాకయితే జంధ్యాల గారి సినిమా చూస్తున్నంత ఆనందం, నవ్వూ వచ్చాయి. ఇప్పటిదాకా చదివిన వాటిలో నిజంగా బెస్ట్ ఇదే..
అద్భుతంగా రాసారు...!!

HemanthPradeep said...

Kummesaru ..TVS 50 chettuki katteyatamentra ebrasi vedava ...hehe ..

Meru kerala sampradayyani alavarchukunna teeru keka

Sudheer said...

Too much dude, this is FedEx (Ideal Post) :)

బొల్లోజు బాబా said...

:-))))

chandra v said...

superb post.....


"పేరు అడిగినందుకు పేరగ్రాఫ్ పొడుగు తిట్టు తిట్టిందా పట్టి మొహం ది....."
adirindi

Abhilash said...

Goutham,

Chaala Bagundi :)

నిశాంత్ said...

nite 12 ki emi tochaka choostoo enduko kasepu navvudamanipinchi ila open chesa..kani naa navvuki intlo vallu lechela rasarandi babu... aa sandhi ekkadidi? ;-)
aa upamanalu enti..abbo kevv andi..

pradeep said...

Innallu eee blog chadavaleka povatam naa dhourbhagyam............virodhi naama samvatsam lo mee blog balle dorikindi naaku.......takshana karthavyam mee anni postings chadavatame...........

Anonymous said...

super...kevvu keka...goutham garu..nenu monne mee blog chusa..so ippati varaku naluge chadiva...inka chala unnayii..office lo chadivi..navvutuu untee evariki artham kavatle...ii project unna klista paristhihillo...identi ilaa navvuthondi ani..soo ii week end intiki velli anni chadivi...malli coment rasthanu.. :)..kaani..super andi..mee creativity.. :)

Gopi said...

asalu telugu lo blog rayalanna mee alochana adbhutam. bhaavaaniki bhasha akkarledu antaaru kaani na drusthtilo bhavaaniki bhasha avasaram. adi mee kathanam lo kathana shailitho velladincharu. chinnapati madhura smruthulu anni okkasaari talapimpa chese mee tapa lu atyadhbhutam.

annattu marichanu andoyi, mee muggu adirindi.

ee roju nunchi mee abhimani.

nani chowdary said...

simply awesome

Anonymous said...

baagundi

rmandala said...

moodu nelalu daatindhi. ekkadandi mee kotha postu?

Anonymous said...

http://mGinger.com/index.jsp?inviteId=1435613

SkyLark said...

Chinchesaaru pondi dinakar friend gaaru..

Sripal Sama said...

Who the hell are you man ? So hilarious !! Wonderful !!!

Anonymous said...

Tooooooooooooo good .. mee sense of humour chaalaa baagundandi..

Kiran said...

konchem kadupu noppi vasthundhadi.. officelo ma manager thittina thittlaki edho relief kosam eenadu paper open chesthe edho blog kaniipinchindhi sare open chasaka dhantlo mee thotaramudu link... sare peru bagundhi kadhani click chesi chadhavadam modhalu petta.. officelo nenu viragabadi navvuthunte antha nannu pichi vadila chusthunnaru..ma manager thiduthunte veedenti ila navvukuntunnadu ani.... chala bagunnayandi..1 roju pattindhi mee blog antha chadhavadaniki...
mee ktha log kosam edhuru chusthu..
Kiran

Sai Praveen said...

తోటరాముడు గారూ...
మీరు మనిషి కాదండి బాబు :)
మీ పోస్ట్స్ రెండు ఫార్వర్డ్ మెయిల్స్ లో చూసాను. అందులో సోర్సు లేదు. మీ బ్లాగ్ చూసాక తెలిసింది. ఏం రాసారండి. నవ్వలేక చచ్చిపోయాను. మీరు ఇంత గ్యాప్ తీసుకోవడం ఏమి బాలేదు. తొందరగా మళ్లీ మొదలు పెట్టెయ్యండి.

Sreenivasa Reddy.Sanam said...

History Adhurs boss...

Krishna said...

LOl... Just couldnt stop laughing... too good

suresh said...

nice post

Anonymous said...

comedy scens choosina danikanna mi tapa chadivi inka ekkuva navvukunnanu.....