Wednesday, December 3, 2008

కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు

నేను పడుకుని 50 గంటలు అవుతోంది....

గత రెండు రోజులుగా ఆపకుండా ఒక పుస్తకం చదువుతున్నాను. ఆ పుస్తకం పేరు "నిద్రపోవటం ఎలా?"..ఒక పెన్ను తో ఆ పుస్తకం మీదున్న టైటిల్ కొట్టేసి "నిద్ర రాకుండా పోవటం ఎలా?" అని మార్చాను..

ఏదో trance లో ఉన్నట్టుంది..నేను నుంచున్నానో, కూర్చున్నానో కూడా తెలియట్లేదు. ఆకలేస్తొందో లేదో అర్థమవ్వట్లేదు....ఏమయినా తిందామని ఫ్రిజ్ తెరిచాను........కానీ ఎందుకు తెరిచానో గుర్తుకు రావట్లేదు. నా మెదడుకు ఏదయినా ప్రాబ్లం వచ్చిందేమోనని భయమేసింది.....ఛ...అలాంటిదేమీ అయ్యుండదు. ఫ్రిజ్ మూసేసి వెనక్కు రెండడుగులు వేసాను....." ఇల్లు ఊడ్చి, బట్టలు ఉతుకుదాము " అనిపించింది! వామ్మో...నా మెదడు ఖచ్చితంగా దెబ్బతినింది..లేకపొతే ఇలాంటి విపరీతమైన ఆలోచనలు రావటమేంటి? కాస్త చల్ల గాలి కోసమని తలుపు తెరిచి...బాల్కనీ లోని బెంచి మీద కూర్చున్నాను.

ఎదురుగా ఉన్న సముద్రం నుండి చల్ల గాలి వీస్తోంది.. బెంచి మీద నా పక్కన బంగారు కిరీటం, నగలు పెట్టు కునికూర్చున్న ఆయనతో - "ఎంత హాయిగా ఉంది కద సార్.. ఈ గాలి, ఈ బెంచి, మీరు, నేను.....కానీ నాకు హాయితో పాటూ ఒక డౌటు కూడా ఉంది సార్...మా ఇల్లు గ్రౌండు ఫ్లోర్ లో కదా ఉండేది - మరి తలుపు తెరవగానే ఈ బాల్కనీ, బెంచి ఏంటి...పైగా బెంగళూరులో సముద్రం ఏంటి.....అవును...మీరెవరు?????

ఆ కిరీటం, నగలాయన నాకు తన చెయ్యి ఇస్తూ " కాల్ మి డు...దేవుడు " అన్నారాయన..

"OK...డు - దేవుడు గారు...ఎవరు మీరు...ఈ బాల్కనీ, సముద్రం ఎలా వచ్చాయని నేను తలబద్దలు కొట్టుకుంటుంటే..మీరు మా ఇంట్లోకి ఎలా వచ్చారు?" అనడిగాను...

"ఓరీ భక్తి లేని భక్తా! నేను దేవుడిని రా..మొన్నేదో మంచి పని చేసి ఏడ్చినట్టున్నావు...నీకో వరమిమ్మని పంపించారు నన్ను....నీ బుర్ర మామూలు కండిషన్ లో ఉన్నప్పుడు వస్తే తట్టుకోలేవని ఈ రోజు వచ్చా. ఇప్పుడయితే..ఏది కలో, ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితి లో ఉన్నావు కాబట్టీ అంత షాక్ తినవు...సరే..ఈ ఉపోద్ఘాతము చాలు కానీ, ఏ వరం కావాలో కోరుకో." అన్నారాయన...

"వరాలు తరువాత...మీ ID కార్డు ఏదయినా ఉంటే చూపించండి " అనడిగాను..

"ఏరా...తిమ్మిరి తిమ్మిరిగా ఉందా?"

"లేకపోతే మీరు దేవుడని ఎలా సార్ నమ్మటం? పోనీ ఏదయినా మ్యాజిక్ చేసి చూపించండి"

"సరే - 1 నుండి 50 లోపు ఒక నంబరు అనుకో....."

"మీరు 1 నుండి 500 లోపు ఒక నంబరు అనుకోండి - ఏదనుకున్నారో నేను చెప్పేస్తా....ఇలాంటి మ్యాజిక్ లు కాదు సార్. దిమ్మ తిరిగి పోవాలి..అలాంటిదేదయిన ఉంటే చూపించండి."

"OK....నీకు ఇష్టమయిన క్రికెటర్ ఎవరో చెప్పు" అనడిగారు...కిరీటం తీసి పక్కన పెడుతూ..

"జయమాలిని.........
అదేంటి సార్ ' టెండుల్కర్ ' అందామనుకుంటే ' జయమాలిని ' అని వచ్చింది నోట్లోంచి?"

"మరదే...ఇప్పుడు తెలిసిందా నా శక్తుల గురించి..."

నేను జవాబిచ్చేలోపు వెనక నుంచి నా తలపైన ఎవరో బలంగా కొట్టారు. వెనక్కు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు...

దేవుడు నా తల మీద రుద్దుతూ " దిమ్మ తిరిగిపోవాలి అన్నవుగా....అందుకే ఈ ఏర్పాటు..... సరే అడుగు ఏ వరం కావాలో?" అన్నాడు, అరచెయ్యి వరమిచ్చే పొజిషన్ లో పెడుతూ....

"ఏముంది సార్....ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో, సకల సంపదలతో......."

"ఆగు - నిజం చెప్పు"

"ఈ సారి నా Annual appraisal లో నాకు నూట ఇరభై పర్సెంటు ఇంక్రిమెంటు వచ్చేట్టు చూడండి సార్...ఇదయ్యాక కూడా నా వరం లో ఇంకొంచం మిగిలుంటే - ఆ హిమాన్షు గాడి ఉద్యోగం ఊడేట్టు చూడండి "..అనడిగాను వినయంగా..

"ఇంతోటి దేవుణ్ణి...అంత దూరం నుంచి వస్తే ఇదా నువ్వు కోరుకునేది?? కమాన్ యార్..ఇంకాస్త ఆలోచించు. మొన్నెప్పుడో ఎవరితోనో 'ఏంటి ఈ జీవితం - ఇక ఇంతేనా?' అన్న డైలాగ్ అన్నట్టున్నావ్"...

"బాగా గుర్తుచేసారు సార్..ఏమి చెప్పమంటారు - ఈ ఉద్యోగం బొరు కొడుతోంది...ఏదో అసంతృప్తి...రోజూ చిరాకే. ఇలా కాకుండా బాగా exciting గా ఉన్న ఉద్యోగం ఇప్పించండి సార్...ప్రతి రోజూ థ్రిల్లింగ్ గా ఉండాలి..." అన్నాను..

" రైట్....కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు తెరిచాను..

ఒక పెద్ద బోను లో ఉన్నాను. చేతిలో హంటర్ ఉంది. చిన్న అలికిడి లాగ వినిపిస్తే కిందకు చూసాను......

......నా ఎదురుగా నేల మీద ఆరు సింహాలు కూర్చుని ఉన్నాయి!

మాంచి conditioner తో తల స్నానం చేసొచ్చినట్టున్నాయి...జూలు గాలికి అటూ ఇటూ ఎగురుతోంది..

నా ప్రమేయం లేకుండానే నా కుడి చేయి హంటర్ ను నేల మీద గట్టిగా కొట్టింది...ఆ చప్పుడు కు సింహాల కన్నా ముందు నాకు భయమేసింది. ఒక్కొక్క సింహం పైకి లేచి మెల్లగా నా చుట్టూ తిరగటం మొదలు పెట్టింది..నా చొక్కా, నా ప్యాంటు తడిసి పోయాయి (రెండూ చమట వల్లే.........అనుకుంటా)..

నా చుట్టూ మూడు ప్రదక్షణాలు అయ్యాక సింహాలన్నీ ఒక మూల చేరి ఏవో మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి.. పది సెకెండ్ల తరువాత సింహాలన్నీ "high five" అని చేతులు కొట్టుకుని నా వైపు తిరిగాయి..అందులో ఒక సింహం కింద కూర్చుని తమలపాకులకు సున్నం రాస్తోంది...నన్ను తినేసాక వేసుకోవటానికి తాంబూలాలు రెడీ చేస్తున్నట్టుంది...మిగతా సింహాలు నా వైపు అడుగులేస్తున్నాయి...ఇంకొద్ది సేపట్లో ఈ బోను లోని సింహాలు నన్ను తిని, నా బోన్స్ తో పాచికలు చేసుకోవటం ఖాయం...ఒక్క సారిగా సింహాలు నా మీదకు ఎగిరాయి..కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాను - "దేవు............."

"..........డా" అని కళ్ళు తెరిచాను.........

మళ్ళీ బాల్కనీలో బెంచి మీద కూర్చుని ఉన్నా. ఎదురుగా దేవుడు. అంతా నిశ్శబ్దం.

ఇందాక నేను సింహాలు బోనులోకి వెళ్ళినప్పుడు 'pause' చేసిన సీను మళ్ళీ 'play' చేసాడు దేవుడు....మళ్ళీ సముద్రపు హోరు, చల్ల గాలి, మొదలయ్యాయి..

"ఏంటి సార్....అంత పని చేసారు?" అన్నాను చమట తుడుచుకుంటూ...

"చిన్న ప్రివ్యూ ఇచ్చాను తమ్ముడూ...ఇందాక నువ్వు చేసావే...రోజూ exciting గా, థ్రిల్లింగ్ గా ఉండే ఉద్యోగం అదొక్కటే....వేరే ఏ ఉద్యోగం అయినా...కొద్ది రోజులకు బోర్ కొడుతుంది..మంచి వ్యాపకాలేవయినా ఏర్పరచుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు........సరే - ఏ వరం కావాలో కోరుకో"..

"ఉండండి సార్...భయం తో గొంతు ఎండిపోయింది..లోపలకెళ్ళి నీళ్ళు తాగొస్తా. మీకూ ఓ గ్లాసు పట్రమ్మంటారా?" - అడిగాను...

"వద్దు....నేను మా లోకం నుంచి ఫ్లాస్క్ లో అమృతం తెచ్చుకున్నాను...నువ్వు నీళ్ళు తాగి రా"..

నేను వెళ్ళి నీళ్ళు తాగుతుంటే నా వెనకాలే దేవుడు కూడా వచ్చాడు..

"ఈ గిటార్ నీదేనా? వాయిస్తుంటావా?" అనడిగాడాయన నా మంచం పక్కనున్న నా గిటార్ ను చూపిస్తూ..

"అంటే సార్...అది...అప్పుడప్పుడూ...ఎప్పుడోఅప్పుడు"

"రేయ్ మూర్ఖా...ఇటువంటి వాయిద్యాలు ఇంట్లో ఉంచుకుని కూడా ఎప్పుడో ఒక సారి వాయిస్తాననటం మహా పాపం రా"

"ఊరుకోండి సార్..అలా భయపెట్టకండి..ఇప్పటికే తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేసుంటాను...ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడ పాపాల లిస్టులో చేరిస్తే ఇక నా లాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళటం అసాధ్యం" అన్నాను...

"సరే...ఆ గిటార్ సంగతి చెప్పు...ఎందుకు రోజూ సాధన చెయ్యట్లేదు?"

"సమయం దొరక్క సార్...ఒక్క గిటార్ అనే కాదు...ఎన్నో ఉన్నాయి సార్ నేను చేయాలనుకునేవి...టైం లేదంతే..రోజుకు ఇంకొక్క
' ఆరు గంటలు ' ఎక్కువుంటేనా........"

"కావాలా?"

" అంటే...కుదురుతుందా సార్....రోజుకు 30 గంటలు...నిజంగా వీలు అవుతుందా?" అనడిగాను...

" కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు "

కళ్ళు మెల్లగా తెరిచాను..నా మంచం మీద పడుకుని ఉన్నాను..పక్కనే గడియారం...టైం ఉదయం 7:30 అయ్యింది..ఎదురుగా TV ఆన్ చేసి ఉంది....NDTV 30/7 అనే చానెల్ వస్తోంది....ఆహా...ఐతే రోజుకు 30 గంటలు వచ్చేసాయన్నమాట...మెల్లగా నిద్ర లేచి, తయారయ్యి ఆఫీసుకు చేరేప్పటికి 10:30 అయ్యింది..ఆఫీసు మెయిల్ నిదానంగా చెక్ చేసుకోవచ్చని G-talk లోకి లాగిన్ అయ్యాను...

'Hi....Hi.....Hi.....Hi....' అని నాలుగు విండోలు తెరుచుకున్నాయి....హేమ, లలిత, విద్య, నీల్ విజయ్ ఆన్లైన్ ఉన్నారు..

(ఈ క్రింది సన్నివేశం లో కెమేరా నా లాప్టాప్ స్క్రీన్ వైపు తిప్పబడింది)

-----

హేమ - ఏంటి లేటయ్యింది?
నేను - అవును..లేటయ్యింది..

లలిత - చాక్లెట్ తెచ్చావా?
నేను - నువ్వు డబ్బు తెచ్చావా?
లలిత - తెచ్చా
నేను - ఇలా ఇవ్వు...వెళ్ళి పట్టుకొస్తా

విద్య - భవ్......హహహ....భయపడ్డావా
నేను - ప్లీజ్ యా....పొద్దున్నే అలా భయపెట్టకు

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ డేట్ ఎంత?
నేను -

-------

హేమ - టిఫిన్ చేసావా....ఇవ్వాళ మా ఇంట్లో ఇడ్లీ..చట్నీ భలే ఉండింది...నీకు పెట్టనుగా...హహహ.
నేను - నేను కూడా ఇడ్లీనే తిన్నా...మీ నాన్న అదే హోటల్ నుండి పార్సెల్ కట్టించుకెళ్ళాడు..

లలిత - నీకొక విషయం తెలుసా...హిమాన్షు ఇవ్వాళ పొద్దున్నే బాసుకు రవ లడ్లు, మెరపకాయ బజ్జీలు తెచ్చిచ్చాడు...ఈ సారి వాడి ప్రమోషన్ గ్యారంటీ..
నేను - అసలు వాడికి సిగ్గుందా?? ఇరిటేటింగ్ ఫెలో..
లలిత - నాకు కూడా అదే అనిపించింది...ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారటమా?
నేను - ప్రమోషన్ గురించి కాదు లల్లీ..బుధ్ధున్నోడు ఎవడయినా మెరపకాయ బజ్జీలు పొద్దున తెస్తాడా?? సాయంకాలం స్నాక్స్ టైములో తీసుకురావాలి కానీ....

నీల్ విజయ్ - రేయ్...ఉన్నావా....రిప్లై ఇవ్వరా...
నేను -

--------

విద్య - బోర్ కొడుతోంది...బ్రేక్ కు వెళదామా?
నేను - టూ మినిట్స్

హేమ - నువ్వు, విద్య బ్రేక్ కు వెళ్తున్నారట గా...ఇప్పుడే పింగ్ చేసింది..అవును లే..మమ్మల్ని ఎందుకు పిలుస్తారు..పెద్ద వాళ్ళయిపోయారు..
నేను - ఏంటి హేమ..అలా అంటావు..నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నా ...ఈ లోపే నీకు చెప్పేసిందా??

లలిత - నిన్న రాత్రి మీ ఇంట్లో ఏమి కూర?
నేను - ఒక్క నిముషం..ఇప్పుడే వస్తా..

నీల్ విజయ్ - రేయ్...ఇవ్వాళ రాత్రికి PVR లో సెకెండ్ షో టికెట్లు దొరికాయి..
నేను - ఆ చెప్పరా...ఇంతసేపు ఒక కాల్ లో ఉన్నాను.....షో ఎన్నింటికి?

--------

బ్రేక్, లంచ్, తరువాత ఇంకో బ్రేక్ తీసుకున్నాక నా మెయిల్ చెక్ చేసుకున్నా....నా బాసు దగ్గర్నుండి ఏదో మెయిల్....అందులో చివరి వాక్యం మాత్రం 16 ఫాంటు సైజు లో, బోల్డు అక్షరాలతో, ఎర్రటి రంగులో - "send it to me by the end of day, today" అని ఉంది...పని మొదలెడదామని గడియారం చూస్తే మధ్యాహ్నం 3:40 అయ్యింది...ఇవ్వాళ పని జరగటం అసంభవం...రేపటి దాక టైం అడుగుదామని నా బాసు క్యాబిన్ కు వెళ్ళాను..తలుపు తెరవంగానే "be aggressive, be proactive, take initiative, by the end of the day, youtube blocked, Gtalk blocked, messenger blocked" లాంటి నాలుగైదు విషయాలు మొరిగి నన్ను పంపించేసాడు...వాడి మాటల హోరుకు నాకు కళ్ళు తిరిగి పడిపోయాను...

కళ్ళు తెరిచేప్పటికి మళ్ళీ ఇంట్లో ఉన్నాను...దేవుడు నా గిటార్ వాయిస్తూ కనిపించాడు..

"చూసావా..30 గంటలు కాదు..రోజుకు 300 గంటలు ఇచ్చినా నీ బుధ్ధి మారదు....కాబట్టి వేరే వరమేదయినా కోరుకో.."

నేను అడిగేలోపు దేవుడు "హలో..ఆ చెప్పు...OK...OK" అంటున్నాడు....ఎవరో ఫోన్ చేసినట్టున్నారు...మనకు వైర్ లెస్ లాగా వీళ్ళకు ఫోన్ లెస్ అనుకుంటా..చేతిలో ఏ ఫోనూ లేకుండా రెండు నిముషాలు మాట్లాడేసాడు దేవుడు..

"ఏంటి సార్ ఏమయినా ప్రాబ్లమా?" అడిగాను ఆయన ఫోను పెట్టంగానే..

"Recession అయ్యా...అందుకే అందరికీ టెన్షన్ గా ఉంది..మీరు బచ్చాగాళ్ళు..ఓ పది, పదిహేను బాంకులు మూసేసారు...మాకున్న క్రైసిస్ కు మేము 3 గ్రహాలు మూసేసాము తెలుసా..ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు..."

నాకు తలియకుండానే గట్టిగా నవ్వేసాను...

"ఏరా కొవ్వెక్కిందా...నా ఉద్యోగం ఊడుతుందంటే నవ్వొస్తోందా నీకు? నా గురించి నీకు పూర్తిగా తెలిసి నట్టు లేదు రా రేయ్..నీ Engineering Graphics పేపర్ గుర్తుందా? పరీక్ష ముందు రోజు కూడా ఏదో తోక ఆడించావు...అందుకే 34 మార్కుల దగ్గర ఆపేసాను నీ పేపర్"

"అది చేసింది మీరా??????????????"

"అన్ని క్వశ్చన్ మార్కులెందుకు?"

"లేకపోతే ఏంటి సార్...ఏదో పొరబాటున రెండు మాటలు అనుంటాను..దానికి Engineering Graphics లాంటి పేపర్ ఇంకో సారి రాయించారా నాతో..." అని మొహం మాడ్చుకుని ఏడ్చేసాను..

"సర్లే ఊరుకో..ఇప్పుడెందుకు ఏడుపు... అయినా ఆ తరువాతి సారి పాస్ చేయించాగా...లేకపొతే నువ్వేసిన పూలకుండి, సైకిల్ టైర్ బొమ్మలకు ఎవడిస్తాడు చెప్పు 65 మార్కులు.....ఏడుపాపి ఏమి కావాలో కోరుకో.." అన్నారాయన నాకు కర్చీఫ్ అందిస్తూ...

"ఇంతకు ముందు కోరుకున్నవేవీ వద్దు సార్....ఈ ఒక్క కోరిక తీర్చండి...ఇక జీవితం లో ఎప్పుడూ ఏమీ కోరుకోను" అన్నాను..

"నేను చిన్నప్పుడు పేపర్ కిరీటాలు పెట్టుకునే రోజుల నుండి చూస్తున్నాను..ఏ కోరిక కోరినా 'ఇదొక్కటే తీర్చు స్వామీ..ఇంకేమీ అడగను ' అంటూనే ఉన్నారు మీరు...సరే అడుగు "....

"ఒక అందమైన, తెలివైన అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్ళి చెసుకునే వరమివ్వండి సార్" అన్నాను...

"బాగుంది రా....' బాబుకి లేక బాలకృష్ణ సినిమా దొంగ DVD చూస్తుంటే, కొడుకొచ్చి జేంస్ బాండ్ కొత్త సినిమా కు మొదటి రోజు టికెట్లు అడిగాడంట '......నాకే 700 సంవత్సరాలుగా పెళ్ళి కుదరట్లేదంటే...నీకొక అమ్మాయిని చూడాలా...."

"ఇవ్వలేనప్పుడు ఎందుకు సార్ అడగటం??? అయినా ఇప్పుడు నాకు మీ సహాయం అవసరం లేదులెండి...మీ మంత్రం గుర్తుంది నాకు........' కళ్ళు మూసుకో - 1,2,3 - కళ్ళు తెరు ' "....అని కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచాను........

మళ్ళీ ఒక బోనులో ఉన్నాను..ఈ సారి బోను ఊసలకు కరెంటు కనెక్షనుంది....కిందకు చూసాను...ఎదురుగా కుర్చీలో కూర్చుని నవ్వుతూ దినకర్ గాడు కనిపించాడు....నేను తల పైకి లేపి చూసాను...దేవుడు తన బండి స్టార్ట్ చేస్తూ కనిపించాడు....

"మంత్రాన్ని దొంగలించినంత మాత్రాన....ఇంత పెద్ద శిక్ష విధించాలా సార్?"......

ఆయన నన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా... ఫస్ట్ గేర్ వేసుకుని వెళ్ళిపోయారు...

70 comments:

వేణూ శ్రీకాంత్ said...

ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపించింది గౌతం.
బాబుకిలేక సామెత... సింహాలు... ఒక ఎత్తైతే చాటింగ్ మాత్రం కేక... మా లాంటి దినకర్ ఫాన్స్ ని నిరుత్సాహ పరిస్తే ఎలా చెప్పండి.

డా.ఇస్మాయిల్ said...

100% Pure fun.

ప్రపుల్ల చంద్ర said...

అక్కడ కూడా రిసెషనా... 2,3 గ్రహాలు మూసేసారా :)... కేక....
సింహాలు, చాటింగ్... అదరగొట్టేసారు...

RNP said...

Amazing, Awesome creativity, Goutham Garu !

Extra-ordinarily Hilarious ! :-)

Great post !

చైతన్య said...

కేకో కేక..

సింహాలు, G-Talk చాటింగ్ బాగుంది.
బాలకృష్ణ సామెత బాగుంది.

రవి said...

అప్పుడే అయిపోయిందా? నేనొప్పుకోను.

dhrruva said...

"నేను చిన్నప్పుడు పేపర్ కిరీటాలు పెట్టుకునే రోజుల నుండి చూస్తున్నాను.

kevvu Keeeeka !! but chaala chinna post.. memu deenni kandisthunnamu.

kiraN said...

బాగుంది, చాలా బాగుంది

- కిరణ్
ఐతే OK

aswin budaraju said...

చాటింగ్ అదిరింది గౌతం గారు

Sandy said...

Have shown ur class again..

Chaaala bagundhi.

Anonymous said...

ఒక్కముక్కలో చెప్పాలంటే ముందున్న కామెంట్లు + ఎనకొచ్చే కామెంట్లు = నా కమెంటు గా ఏస్కొండి

krantiviswas said...

hello gautham garuu...

excellent again...
ne blog lo post tho patu comments kuda chadive chetta alavaatu nadi...(ne blog lo oka letter kuda vadalakudadu ani ala chestanu)

ne post epudu vasthe apudu ventane dinakar naku cheppesthadu...

alage mana blog readers andarike theliyalante, meru post chese one week munde edanna signal isthe baguntundemo...

శ్రీనివాస్. కె. said...

అప్పుడే అయిపోయిందా అనిపించింది.
డు...దేముడులా ఆఖరున మెరిసాడు దినకర్.

Theja said...

Peetha kastalu peethavannattu mana yee bathukulaku devudu yenni varalichinaa pavala manasanthi dorakadhu kadaa, yeti setham?
Mothaniki devudu varamivvani varalu kooda manaku konni yedchi sachayi, yeppatikappudu devullu kooda thama capacity ni upgrade chesukovali lekapothey devudu kooda varamivvamani inko devunni adagavachemo....

Idendhuku chebuthunna ante andamaina, preminche, manchi manasunnaammayi baryagaa ravali ane requirement ki devudu papam yekkada nundi thegaladu, oka vela okato aroo alanti ammaini vethiki thesthey Q lo nilabadi vunna lakshaladhimandi yuvakulaku yela sardagaladu....

Theja said...

Peetha kastalu peethavannattu mana yee bathukulaku devudu yenni varalichinaa pavala manasanthi dorakadhu kadaa, yeti setham?
Mothaniki devudu varamivvani varalu kooda manaku konni yedchi sachayi, yeppatikappudu devullu kooda thama capacity ni upgrade chesukovali lekapothey devudu kooda varamivvamani inko devunni adagavachemo....

Idendhuku chebuthunna ante andamaina, preminche, manchi manasunnaammayi baryagaa ravali ane requirement ki devudu papam yekkada nundi thegaladu, oka vela okato aroo alanti ammaini vethiki thesthey Q lo nilabadi vunna lakshaladhimandi yuvakulaku yela sardagaladu....

సత్యసాయి కొవ్వలి said...

:))))) ఇంకా దినకర్ రాలేదేం లేక దేఁవుడే దినకరైపోతాడా అని అనుకుంటూంటే దినకర్ వచ్చాడు...

Lakshmi Sravanthi Chowdam said...

Excellent andi...

meeku nayam gtalk block chesi vadilesaaru.. maaku work sheet model change chesaaru, even braks kuda start time end time ivvalanta... koddi rojullo new year ki dairy ichi, late ayinaa, leave ayinaa inlto parents signature kuda aduguthaaremo annatlundi....

mee post choosi navvalekaa, navvithe ekkada blogs kuda block antaaro ani line by line break isthoo, atu itu choosthoo, navvukuntooo complete chessaanandi...

Thank you

Josna said...

superb post Gowtam,but chala chinnadi anipinchindi
chat was awsome,,
try to write more posts plzz..

Harita said...

Chala bagundhandi!
Kani mee gatha tapalatho tho polchi choosthe koddiga nirutsahaparicharu.

Dinakar pathra nidivi maree chinnadhiga unna bagundi.

mee poorvapu tapalaku spandinche avakasam raledu kani Bhagavadgita chadivinattu rojukokasari mee tapalanu chaduvukuni navvukuntoo untanu.

ilanti adhbutha tapalanu maku andisthunnanduku hruyapoorvaka dhanyavaadalu..

MURALI said...
This comment has been removed by the author.
MURALI said...

I protest. dinkar pathra nidivi, pradanyata taginanta leka pOvatam cheta ee post ni nenu kandistunna.

Naani said...

aba aba abaaa......em rasavayyaaa

శివ - teluguratna.com said...

అదరగొట్టేసారు...

శ్రీ said...

చాలా రోజుల నుండీ మీ దగ్గర నుండి ఇంకో టపా ఎపుడు వస్తుందా అని బావురు కప్పలా ఎదురు చూస్తూ ఉన్నాను. టపా రాసినందుకు ఛాలా సంతోషం!

ఉదయాన్నే మీ టపా చదివి ముఖంలో కండరాలకి మంచి "థాయ్ మసాజ్" అయింది.
నాకు ఆనందం పట్టలేక సౌండ్ లేకుండా పెట్టిన గావు కేకలు ఈ క్రింది సందర్భాల్లో జరిగాయి.

1) డు..దేవుడు , అనడం!
2) సింహాల బోనులో పడడం, సింహం తమలపాకుకి సున్నం రాయడం!
3) చాటింగ్, అమ్మాయిలతో ప్రాంప్ట్ గా చాటింగ్ చెయ్యడం, నీల్ విజయ్ కి సినిమా టిక్కెట్ల విషయం వరకు సంయమనం పాటించడం.
4) మళ్ళీ బోనులో పడడం!
5) ఇంకా రాలేదనుకున్న దినకర్ బోనులో ప్రత్యక్షమవడం పరాకాష్ట!

తెలుగు బ్లాగర్లలో మీరు అత్యుత్తమ హాస్య బ్లాగరు! మీకివే మా జోహార్లు!

తెలుగు బ్లాగర్లలో మీరు అత్యుత్తమ హాస్య బ్లాగరు! మీకివే మా జోహార్లు!

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

chala baga rastharu goutham meeru...its a god's gift....chala chotla navvu aapukolekapoyanu...thanks for such a nice post....

మధు said...

హహ్హ..అదిరింది. భలే రాస్తారు మాష్టారూ మీరు.

Sri Vallabha said...

జంధ్యాల గారి తమ్ముడి లా ఉన్నారు కదండీ మీరు. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నా! :)

రాఘవ said...

సత్యసాయిగారి పాటే నాదీనూ. బావుంది :)

Manohar said...

great, awesome,........
మీ పోస్ట్ కోసం ఎప్ప్పటి నుండో ఎదురు చూస్తుంటి

Anonymous said...

mundu vaatiki ye maatram taggaledu mee latest post.

Kudos!!

కత్తి మహేష్ కుమార్ said...

వీలైతే నాకొకసారి మెయిల్ చెయ్యండి mahesh.kathi@gmail.com

రాధిక said...

చాటింగ్ సూపర్.డు-దేవుడు ని కార్డ్ అడుగుతారా?దినకర్ చివర్లో వచ్చినా మంచి సీన్ లో వచ్చాడు.

Harika said...

Suuuper andi...mee post gurunchi eppati nundo waiting.....

Dhinakar inka raledhenti ani ala chusthu vunna... :)

Engineering graphics paper 34 marks ravatam...adhi chesindhi meera ante..ani Question marks endhuku antam...supeeeeeeer....

HemanthPradeep said...

Chala bagundi goutam garu...
..chinna post ayina me nunchi frequent ga posts vastu vunte ade padivelu...

sanju -The king!!! said...

chatting matuku adirindi sir....prati MNC employee chadavalsina article...

siliconthoughts said...
This comment has been removed by the author.
$hanK@R ...... said...

బాలయ్య సామెత..... కేకో కేక !

బిగ్గరగా నవ్వేసా..... ఆఫిసులో ఉన్న సంగతి మర్చిపోయా..!!!

చాలా చాలా బాగుంది ...!!!!!

siliconthotz said...

బాలయ్య సామెత..... కేకో కేక !

బిగ్గరగా నవ్వేసా..... ఆఫిసులో ఉన్న సంగతి మర్చిపోయా..!!!

చాలా చాలా బాగుంది ...!!!!!

Nagarjuna said...

cheppaTaaniki kottagaa Emundi lenDi..prati post ki raasEdE...
kummEsindi..kaanii "appuDE ayipOyindaa?"anipinchindi
chinnappuDu mogli serial ayipOyindaa??Saktimaan serial ayipOyindaa?? annappuDu enta baadhagaa unDEdO ippuDu alaanTi baadhE kaligindi...meeru enta raasinaa baanE unTundi kaabaTTi length inkonchem peddadunchanDi..parlEdu...

Anonymous said...

అందరూ కేకో.. కేక అంటూ ఊదరగొడుతున్నారు. కానీ, ఈ పోస్టు ఇంతకుముందు ఉన్న పొస్టుల లాగా ఉందా???

నాకైతే.... లేదనే అనిపిస్తుంది.


ఇంకో గౌతం
భజన చెయ్యటం ఆపాలే.... నిజం చెప్పాలే.

shashank said...

U r rocking

Vinodh Kolluri said...

Hi Goutham,

Didn't enjoy much. Definitely not up to your mark.

Waiting eagerly for your next post.

Thanks,
Vinodh

గౌతం said...
This comment has been removed by a blog administrator.
DSG said...

ఈ పై కామెంటు నేను డిలీట్ చెయ్యవలసి వచ్చింది...కారణం - ఎవరో నా పేరుతో కామెంటు చేసి నా బ్లాగు url కు లింకు ఇచ్చారు..అది నేను రాసినట్టు misleading గా ఉందని తీసేసాను..

నవీన్ said...

Superb :)

గౌతం said...

అభిమాన సంఘాలు పెట్టి ఉన్న వాళ్ళని చెడగొట్టకండి.

చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు అబిమాన సంఘాలు పెట్టి ఎలా ఒకరిని ఒకరు అమ్మనా బూతులు తిట్టుకుంటారో అందరికీ తెలుసు.

అందుకనీ.... మంచిగా ఉన్న వాళ్ళని అలాగే ఉండనివ్వండి.

గౌతం

buchibabu said...

కెక....మీకు ఇలాంటి ఐడియలు ఎలా వస్థయ్.....

ashokthemostwanted said...

Goutham garu mi blog too much andi babu. U have great writing skills.
ee madhya hit avutunna cinemalu, blogs annitini gamaninchaka arthamaina vishayam okkate: comedy ni andaru istapadataru.
Trivikram garu cheppinattu, hasyam istapadani manishantu yevvaru vundaru. miru nijamga nannu inspire chesaru.
nenu kuda naa aalochanalaku akshararoopam ivvadaniki try chestunnanu.

ee tapalO chatting sequence bhale vundi.

mi nunchi marinni posts kosam wait chestoo...

Ashok Varma
ayaskantam.blogspot.com

Damodar said...

Hi Gowtham
Post chaala bagundhi
Chala rojula tharuvatha nee post choosaka, maa company lo unna telugu chadhavagaligina vallandhariki link pampa..

Vallaku artham ayyitlu cheppa leka nenu navva leka, chaala ibbandhi padda..
But naa kashtannatha marachipoya,

Konchem veelu chooosukoni dheeniki part-II rastharani korukuntooo..

Hello bloggers,

Please request Gowtham...

సత్య said...

మీరు శిక్ష నించి తప్పించుకోవాలంటే ఈ క్రింది మత్రం చదవండి.

"కళ్ళు మూసుకో - 2x2=6; కళ్ళు తెరు!"

ఇప్పుడు మాములు అయిపోయారు! ఇంక sequel వ్రాయండి.

నేస్తం said...

చాల బాగా రాసారండి మీ సైట్ నిన్ననే చూసా అన్నీ చదివీ చాల నవ్వుకున్నా.. ఇంత నవ్వించినందుకు thanks.

శృతి said...

మరో జంధ్యల గారా మీరు? ఇలాంటి మంచి హాస్యం ఎన్ని రోజుల తరువాత చూస్తున్నాను. ధన్యవాదాలు గౌతం గారు

Anonymous said...

really gr8! hats off guru !

pradeep said...

enti brother... nuvvu raase stories chadivina taruvata nnaaku ninnu kidnap chesi maa intlo pettukoni roju koka story cheppinchukovalani anipistundi baabu..
asalu konni dialogues ayite kevvu keka ( not "teja Keka" ).
inka unte baagundedi anipistundi nijanga..
very very nice

నిషిగంధ said...

చాటింగ్ సీన్ చాలా బావుందండీ.. :-)

Jyothsna said...

అయ్యో, ఇన్నీ రోజులూ ఇంత మంచి టపాలు చూడనందుకు నన్ను నేను చాలా తిట్టుకున్నాను. అసలు ముందు నిరంజన్ గారికి థెంక్స్ చెప్పాలి. తన బ్లాగ్ నుండే మీ బ్లాగ్ కి వచ్చాను. చాలా బాగుంది. మిగతావి కూడ ఈ రొజే చదివేస్తాను. ఇంత creativeగా వ్రాయడం మీకే చెల్లింది.

sandeep mandava said...

hi gowtham mee blog chala baguntunde. kani yee post upto the mark ledu ande. inka koncham sepu vunte baguntunde anu kuntunna. meru kuda telugu cinema hero's laga year ke okka cinemane chesenattu 2 months ke okka sari tappaka nee post chestunnaru. month ke okkate leka 15 days ke okkate anna post cheyande....

నిశాంత్ said...

బా.....బోయ్.... ఏంటండీ ఇలా నవ్వించేసారు.
"అసలు ఇన్నాళ్ళూ ఈ బ్లాగు ఎందుకు చూడలేదా?" అనుకున్నా...
'పూర్ణిమ' గారి బ్లాగు నుంచి 'పొద్దు' కి వెళ్ళి అక్కడనుంచి మీ ఇంటర్వ్యూ చూసి ఇదిగో ఇలా వచ్చానండి.
అసలు ఆ "బాబుకి లేక" కెవ్వ్ కేక....
ఆ జి-టాక్.... అందరూ అలాగే చేస్తారా...!!! ;-) (మావాళ్ళు కూడా అంటారులెండి..."ఒరేయ్! కాసేపు మాతో కూడా మాట్లాడరా" అని)
ఇంక మిస్స్ అవ్వనండీ మీ బ్లాగుని...ఇల ఉచితంగా నవ్విస్తానంటే.. "నువు నవ్విస్తానంటే నేనొద్దంటానా!" అని నేను కూడా ల్యాపు తీస్కొని రెడీ ఐపోతా... ;-) :-) :-))
నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

kiraN said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)


-కిరణ్

మంచిబాలుడు -మేడిన్ ఇన్ వైజాగ్. said...

chaala baga rasaaru.

Lakshmi said...

Nice Bagundii
keep writing.

http://www.lakshmi-n.blogspot.com/

kishore said...

One of my Friend Sudheer always used to ping me this site to read. But i always hesitated to go thru it.
But the moment i started reading it i never felt like stopping it.The way you narrated the story, the characters i just felt like they are right infront of my yes. This purely tell your creative genius. I already have added this site in my Favts will continuously watch out for your updates.

Good Luk !

amadamala said...

I liked it very much. Very funny blog post in telugu.

adarsh said...

చాలా బాగా వ్రాస్తున్నారు.. regular గా [తెలుగులో ఏమంటారో గుర్తుకు రావట్లేదు :( ] వ్రాయచ్చు కదా??

adarsh said...

పాపం దినకర్ గారిని బాగా ఆడుకుంటున్నట్టున్నారే

Anonymous said...

Superb..Keep Posting..All The Best..

Madhuri said...

Hmmm.. really superb young man..

Bongu-Boshanam said...

Bale bavumdhi....

Devidas said...

nice boss

Anonymous said...

Nenu first blog telugulo chadindi meede. Aaa roju koorchoni mottam anni previous vi chadivesaanu.
Missing your blogs...
Meeru malli tvaralone raastarani asisthoo..