Monday, January 5, 2009

ఉద్యోగానికి ఉచిత సలహాలు

(ఈ టపా అంధ్రభూమి మాస పత్రిక జనవరి 2009 సంచిక లో నేను రాస్తున్న 'తోటరామాయణం' అనే శీర్షిక కింద ప్రచురితమైనది)

కాలేజి నుండి బయటపడి మొదటి సారి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న కుర్రాళ్ళు, కుర్రాళ్ళినిలకు సహాయపడటానికి నేను చేస్తున్న ప్రయత్నమిది....ఇంటర్వ్యూ లో నెగ్గుకురావటానికి కావలసిన కిటుకులను నేను కాచి, వడబోసి, ఇంటి బయట పారబోసాను. నా సీనియర్లు నాకు ఉచితంగా ఇచ్చిన సలహాలను నేను మీకందరికీ ఆ ఉచితంలో సగం ధరకే ఇస్తాను..

ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యటానికి ముందు మనము చెయ్యవలసిన పని - వచ్చే జన్మలోనైన ఇటువంటి దుస్థితి రాకుండా ఓ పది, ఇరవై కోట్లకు వారసులుగా పుట్టేలా దీవించమని దేవుడికి మొక్కుకోవటం.

ఆ తరువాత resumé తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే ముందు దానిని 'రెస్యూం' అనాలో, 'రెస్యూమే' అనాలో పెద్దలనడిగి తెలుసుకోవటానికి ప్రయత్నిచటం...ఎలా అన్నా ఒరిగేది ఏమీ లేదని తెలుసుకున్నాక అసలు పనికి ఉపక్రమించటం.

'రెస్యూమే ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది ' అని చెప్పే ఉద్యోగ ద్రోహులు చెప్పే మాటలు వినకండి. మన తెలుగు క్యాలెండర్ లాగా కనీసం పన్నెండు పేజీలు ఉండేలా చూసుకోండి..ఆ తరువాత దాన్ని బైండింగు చేయించి, స్కూలు బ్యాగు లో మోసుకెళ్ళొచ్చు ఇంటర్వ్యూ కు.

పన్నెండు పేజీలు ఎలా నింపాలి??

మనం ఎంత వెధవలమయినా మనల్ని మనం ప్రేమించుకోవాలి. కాబట్టి, రెస్యూమే మొదటి పేజీ లో హైబ్రీడు తాటికాయంత అక్షరాలతో మన పేరు ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత మన ఫోన్ నంబరు, మన ఈ మెయిల్ ID రాయాలి. మన ఈ మెయిల్ ID దగ్గరే కంపెనీ వాళ్ళ దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించండి. ఏదో పేలవమైన ID కాకుండా crazyboy007@gmail.com లాంటి వంకర పేర్లు పెట్టుకుంటే మంచిది...మన రెస్యూమే జన్మలో మర్చిపోడు చూసినవాడెవడయినా.

ఈ వివరాల తరువాత objective రాయాలి...

objective అంటే ఈ రెస్యూమే ఎందుకు తయారు చేస్తున్నాము అని - అంటే ఉద్యోగం కోసమని - అంటే డబ్బు కోసమని - అంటే మూడు పూట్లా భోజనం కోసమని - అంటే రాత్రి పూట భోజనం చేస్తే బొజ్జ వస్తుందని - అంటే రాత్రి చపాతీలు మాత్రమే తినాలని....
కాబట్టీ, objective పక్కన 'చపాతీలు తినటం' అని రాయండి! మీ దూరదృష్టి అర్థమౌతుంది కంపెనీ వాళ్ళకు..

ఆ తరువాత మన అర్హతల వివరాలు...

పదవ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ మార్కు షీట్లు చూపించాలి కాబట్టి పెద్దగా అబద్ధాలు రాయకండి...కాని ఒకటవ తరగతి నుండి, తొమ్మిదో తరగతి వరకు రెచ్చిపోండి.

3వ తరగతి - ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్
5వ తరగతి - సౌత్ ఇండియా టాపర్
8వ తరగతి - పరీక్షలు రాయకుండానే పాస్

....ఇలా యధేచ్చగా రాసుకోవచ్చు.

ఆ తరువాత రెస్యూమే కు అతి ముఖ్యమైనది మన 'స్కిల్ సెట్' వివరాలు రాయటం (గుర్తుందిగా...పన్నెండు పేజీలు నింపాలి మనం)

ఇప్పుడిక్కడున్న అందరిలోకి మేధావిని నేనే కాబట్టీ నా 'స్కిల్ సెట్' గురించి ఎలా రాసానో చెబుతాను..దానిని నమూనా గా తీసుకుని మీ మీ స్కిల్ సెట్లు రాసుకోవచ్చు.

"నేను కాలేజీలో చివరి బెంచిలో కూర్చునేవాడిని..ముందు బెంచీ అబ్బాయిలు, అమ్మాయిలు క్లాసు జరుగుతున్నంత సేపు ఏవో చీటీలు రాసుకుని ఒకళ్ళకొకళ్ళు పాస్ చేసుకునేవాళ్ళు. అమ్మాయిలు ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు..అబ్బాయిలు ముసిముసి లేకుండా నవ్వుకునేవాళ్ళు. క్లాసు అయ్యాక ఆరోజు రాసుకున్న చీటిలన్నీ బెంచీల్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను, నాతోపాటు చివరి బెంచీల్లో కూర్చునే ఓ నలుగురిని వెంటేసుకుని ఆ చీటీలన్నీ హాస్టలుకు పట్టుకెళ్ళి, వాటిని క్షుణ్ణంగా చదివి...ఆ చీటిలలోని విషయాలన్నింటినీ రుబ్బి, ఒక కథగా రాసి, ఔత్సాహికులకు పంచిపెట్టేవాడిని."

చూసారా - ఒక నాలుగు పంక్తులు రాసి అందులో నా నిపుణతల్ని అన్నింటిని ఎలా ఇమడ్చానో! ఇది చదివిన వాళ్ళకు నా కష్టపడే మనస్తత్వం, నా అటెన్షన్ టు డీటెయిల్, నా నాయకత్వ లక్షణాలు, నా లోని టీం ప్లేయర్, పక్కవారితో పంచుకునే గుణం - అన్నీ కనిపిస్తాయి.

మీరు కూడా మీ సామర్థ్యాన్ని గురించి బుల్లెట్ పాయింట్ల రూపంలో కాకుండా ఇలా ఒక మినీ కథ రాస్తే పాఠకులు ఎక్కువగా ఆస్వాదిస్తారు.

ఆ తరువాత మనం కాలేజీలో చేసిన ప్రాజెక్ట్ల గురించి రాయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి - మనది వసుధైక కుటుంబం. మన క్లాస్మేట్లు, మన సీనియర్లు అంతా మన ఇంటివాళ్ళే..వాళ్ళ ప్రాజెక్ట్లు మనవి కాదా, మన అరియర్లు వాళ్ళవి కావా? మొహమాటం లేకుండా ఎవరి ప్రాజెక్టు బాగుంటే అది పెట్టెయ్యండి రెస్యూమేలో..

ఆ తరువాత మన 'వ్యక్తిగత వివరాలు ' ఇవ్వాలి..రెస్యూమే మొదట్లో మనము రాసిన వివరాల్ని పీకి పాకాన పెట్టాలి..
మీ వంశవృక్షం మొత్తాన్ని ఒక ఫ్లోచార్టు లాగ గీసెయ్యండి. మీ పుట్టిన రోజు, బారసాల, మొదటిసారి గుండుకొట్టించుకున్న రోజు - ఈ వివరాలన్నీ రాస్తే ఇంటర్వ్యూ చేసేవాడికి బాగా దగ్గరౌతారు..

ఇవన్నీ రాసాక కూడా ఇంకా పన్నెండు పేజీలు నిండకపోతే ఈ రెస్యూమే టైపు చేసిన పేపర్ ఏ షాపులో కొన్నది, ఆ షాపు వాడు నెలకు అద్దె ఎంత కడుతున్నాడు, అద్దెలు బెంగళూరులో ఎలా పెరుగుతున్నాయి, బెంగళూరులో ఇంతమంది అమ్మాయిలున్నా మనల్ని ఒక్కరు కూడా ఎందుకు చూడట్లేదు - మన సృజనాత్మకతనంతా ఉపయోగించి ఇలాంటివెన్నో రాసుకోవచ్చు..

రెస్యూమే తయారయ్యాక దానికి పసుపు, కుంకుమ రాసి అప్లై చెయ్యాలనుకున్న కంపెనీలకు పోస్టు చెయ్యండి..చేసిన తరువాత తెలుస్తుంది - మనము ఇంకా గుప్తుల కాలంలో లేము, ఇప్పుడంతా ఆన్లైన్ అప్లై చేస్తారు అని...అప్పుడు కంప్యూటర్ మానిటర్ కు పసుపు, కుంకుమ రాసి ఆన్లైన్ దరఖాస్తు చెయ్యటం మొదలెట్టండి....

అప్ప్లై చేసేసాం కదా...ఇప్పుడు విశ్రాంతి! విశ్రాంతి తరువాత ఒక పాట. పాట అవ్వంగానే ఇంటర్వ్యూలు రావటం మొదలౌతాయి..

ఇంటర్వ్యూలో ఎటువంటి టెక్నికల్ ప్రశ్నలు అడుగుతారో మనకు తెలియదు...అలాంటప్పుడు వాటికి సమాధానాలు మాత్రం తెలుసుకుని ఏం చేస్తాం?? కాబట్టి, ఏ పుస్తకాలు చదువుకోకుండా నేరుగా వెళ్ళండి.

మామూలుగా శని, ఆదివారాల్లో కంపెనీలు 'వాక్-ఇన్ ' ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి...వీటి వివరాలు పేపర్ లో చూడగానే చెయ్యల్సిన మొదటి పని - అదే ఊళ్ళో ఉన్న మన క్లాస్మేట్స్ ఎవ్వరూ ఆ 'వాక్-ఇన్ ' కు అటెండ్ కాకుండా చూసుకోవటం!
ఇందాక చెప్పినట్టు..నేను బేసిక్ గా మేధావిని. నెను నా మొదటి ఉద్యోగం కోసం వెతికే రోజుల్లో ఇలాగే ఓ శనివారం మధ్యాహ్నం రెండింటికి ఒక 'వాక్-ఇన్ ' ఉందని తెలిసింది. అదే ఊళ్ళో ఉంటున్న నా ఫ్రెండు దినకర్ కు ఫోన్ చేసి - "రేయ్...ఈ శనివారం మధ్యాహ్నం మ్యాట్నీ కి రెండు టికెట్లున్నాయి ..నువ్వు, నీ ఫ్రెండ్స్ ఎవరయినా వెళ్ళండి" అన్నాను...దానికి వాడు "అలాగే రా..థ్యాంక్స్. నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను..ఆదివారం పొద్దున ఆటకు, మధ్యాహ్నం ఆటకు నా దగ్గర రెండు టికెట్లున్నాయి....నీ ఫ్రెండ్స్ ఎవరినయిన తీసుకెళ్ళు...ఒకే రోజు రెండు సినిమాలు!" అన్నాడు.

వాడికి ఉద్యోగం వచ్చింది - నాకు రాలేదు..

సరే....మొత్తానికి 'వాక్-ఇన్ ' ఇంటర్వ్యూల సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలిసిందిగా..ఇప్పుడు ఏదయినా పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూ పిలుపొచ్చింది అనుకోండి.....ఏమీ ఖంగారు పడొద్దు - వేరే ఎవరికో చెయ్యల్సిన కాల్ మీకు చేసుండొచ్చు...అలా కాకుండా నిజంగా మీకు వచ్చిందంటే..బైండింగు చేసిన రెస్యూమే పట్టుకుని వెళ్ళండి.

ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే చెయ్యవలసింది - లోపల ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎంత మంది ఉన్నారో చూడటం. ముగ్గురో, నలుగురో ఉంటే.."రెస్ట్ రూం కు వెళ్ళొస్తాను " అని చెప్పి వెనక్కు తిరిగి రెస్టు తీసుకోకుండా పరిగెత్తటమే! ఎందుకంటే..ఆ నలుగురిలో ఒక హీరో, ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులున్నా...ఆ నాలుగోవాడు ఖచ్చితంగా విలన్ అయ్యుంటాడు.

అలాకాకుండా లోపల ఇంటర్వ్యూ చేసేవాడు ఒక్కడే ఉంటే ధైర్యంగా లోపలకు వెళ్ళండి...మనం ఎంత ధృడంగా కరచాలనం చేసాము అన్నది మన లోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందట..కాబట్టి, ఆ ఇంటర్వ్యూ చేసేవాడు షేక్ హ్యాండు ఇస్తే వాడి చేతిని మాయాబజార్ లో రేలంగి చేతిని యస్వీ రంగారావు నలిపినట్టు నలిపిపారెయ్యండి.

ఆ తరువాత వచ్చే ప్రశ్నలకు కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకుని సమాధానం ఇవ్వాలి...ఈ ఇంటర్వ్యూ ఏ పోస్టుకు అని తెలుసుకుని రండి..ఉదాహరణకు - మీరు 'డాట్ నెట్' మీద పని చెయ్యాల్సిన ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళారనుకోండి...అవతలి వాడు ఏమడిగినా 'డాట్ నెట్' గురించే మాట్లాడండి....

ప్ర: మీ గురించి కొంచెం చెప్పండి
జ : మై నేం ఈస్ గౌతం, డాట్ నెట్...నేను ఇంజనీరింగ్ చేసాను, డాట్ నెట్

ప్ర: వాట్ ఆర్ యువర్ స్ట్రెంత్స్?
జ : డాట్ నెట్

ప్ర: వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్?
జ : నాట్ డాట్ నెట్

మనకు ఆ ఉద్యోగం దాదాపు వచ్చినట్టే....

కానీ అసలు పరీక్ష ఇప్పుడే...ఇంటర్వ్యూ మొత్తానికీ అత్యంత కీలకమయిన ప్రశ్న ఇప్పుడడుగుతాడు -

ప్ర: జీతం ఎంత కావాలి?
జ : ఏదో సార్...మీ దయ

అలా జవాబిస్తే దెబ్బ తిన్నట్టే...జీతం గురించి నెగోషియేట్ చెసేప్పుడు అగ్రెసివ్ గా ఉండాలి. 'జీతం ఎంత కావాలి ' అని అడగంగానే జేబులోంచి కత్తి తీసి టేబుల్ మీద గుచ్చాలి...ఆ తరువాత కావలంటే 'ఏదో సార్...మీ దయ ' అనొచ్చు....

జీతం కూడా మాట్లాడుకున్నాక...ఇక మనము ఆలోచించవలసింది మన 'బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ' గురించి....మీరు గనక ఫ్లాష్ బ్యాకు లో ఏదయినా మర్డర్లు గట్రా చేసుంటే ఆ విషయాలు బయటపడకుండా బెదిరించవలసిన వాళ్ళను బెదిరించండి....

నేనిచ్చిన ఈ సలహాలన్నీ పాటించాక కూడా మీకు ఉద్యోగం వచ్చిందంటే...మీ ఖర్మ...కంగ్రాట్స్!

రేపటి నుండి రోజూ ఉద్యోగం చెయ్యొచ్చు.....ఇంతవరకు సంతోషంగా గడిచిన మీ జీవితం ఇక సర్వనాశనం అయినట్టే...

67 comments:

సిరిసిరిమువ్వ said...

ప్ర: వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్?
జ : నాట్ డాట్ నెట్
హ్హ..హ్హ..హ్హ.

తోటరాముడు గారు పత్రికలకి కూడా ఎక్కేసారన్నమాట!

రవి said...

నేనివన్నీ పాటించినా నాకు "we will get back to you" అన్నారు చాలా మంది. ఆ వాక్యానికి తెలుగులో అర్థం "పోయి ఏట్ళో దూకు" అని చాలా కాలం తర్వాత తెలిసింది.

రాధిక said...

వడపోసి పారబోసారా? సూపర్."పంచుకునే గుణం,నా అటెన్షన్ టు డీటెయిల్.... అన్నీ కనిపిస్తాయి" అవునవును నాకూ కనిపించాయి:) పత్రికలకెక్కారన్న మాట.కంగ్రాట్స్.

MURALI said...

రెండు రెళ్ళు ఆరు శైలికి భిన్నంగా ఉంది. గత టపాలకి భిన్నంగా కొంచెం పెద్దది గా ఉంది. దినకర్ పంచ్‌లు లేవు. నా వ్యాఖ్య తో ఎవరయినా విభేదిస్తే కింద తెలిపిన వివరములయందు సంప్రదించగలరు.
ఈ-మెయిల్:thotaramudu@gmail.com
పాస్వర్డ్:dinakar1234

teresa said...

హ!హా!!

Rani said...

monthly lo entandi, daily ki promote avvaali meeru :)

సత్య said...

Recession Time లో మీరు ఈ టపా వ్రాసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు సార్. ఇంక మీ చిట్కాలతో కుర్రాళ్ళు, కుర్రాళ్ళినిలు జాతర జరుపుకుంటారు. ..జాబ్ మేళా !!

అంతా వ్రాశారు కానీ Interviews కి వేసుకెళ్ళే Dress Code గురించి కూడా వివరించాల్సింది. నాకు తెలిసి ముఖ్యంగా మీరు TCS, Infosys లాంటి office uniform లు ఇచ్చే కంపెనీలకి వెళ్ళేప్పుడు గులాబి రంగు జీన్స్ ప్యాంటు తప్పనిసరి. కుడికాలికి ఎరుపు, ఎడంకాలికి నీలం రంగు సాక్సులు వేసుకోవాలి. T-Shirt మీద cool dude మర్చిపోవద్దు. శ్రీనివాసా హెయిర్ డ్రెస్సర్స్ లో కటింగ్ చేయించుకొని తలకి నవరత్న తైలం వ్రాసుకొని, విబూది పెట్టికెళ్తే మూడొంతులు Interview క్లియర్ చేసినట్లే. ఇంక salary negotiations మాత్రమే ఉంటాయ్.

మధు said...

Hahaha.... :-)

lax said...

Nice!!!
but not like ur previous posts.


http://lakshmi-n.blogspot.com/

మధుర వాణి said...

చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ పర్వం.
పాటించితే దినకర్ లాగ జాబ్ వస్తుందంటారా :)

ఇది మాత్రం సూపరో సూపర్..
ప్ర: వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్?
జ : నాట్ డాట్ నెట్

రవి గారు చెప్పింది కేక :)

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

కంగ్రాట్స్ అండి గౌతం గారు మీ పొస్ట్లు పత్రికల వరకు వెళ్ళినందుకు...ఇలాగే మీరు ముందుకు సాగలని ఆశిస్తు....హట్సాఫ్ ఈ పొస్ట్ కి

కొత్త పాళీ said...

You're selected. Report to work from Feb 29th :)

వేణూ శ్రీకాంత్ said...

మీ ఖర్మ...ఇంతవరకు సంతోషంగా గడిచిన మీ జీవితం ఇక సర్వనాశనం అయినట్టే... :-) ఇది మాత్రం నిజ్జం గా నిజం...

BTW, Congrats for starting the article in a monthly.

Sravya said...

superb

నేస్తం said...

:)

చైతన్య said...

ha.haa :)

మేధ said...

>>నేనిచ్చిన ఈ సలహాలన్నీ పాటించాక కూడా మీకు ఉద్యోగం వచ్చిందంటే...మీ ఖర్మ...కంగ్రాట్స్!

హ్హహ్హహ్హ... నిజమే మరి! :)

పత్రికలో రాస్తున్నందుకు అభినందనలు..

laxmi said...

ఆంధ్ర భూమిలో తోట రామాయణం, కింద తోట రాముడు అని కనిపించగానే అది మీరే అవునా కాదా అని డౌట్ వచ్చింది. అందులో గౌతం డాట్ నెట్ అని కనిపించగానే అర్థం ఐపోయింది అది మీరే అని. ఇంకా నేను నా బ్లాగు ద్వారా బ్లాగు మిత్రులకి చెప్దాము అనుకున్నా మీరు పత్రిక కి ఎక్కేసారు అని, ఇంతలో మీరే చెప్పేసారు.

Anyways congratulations and it was humorous

కత్తి మహేష్ కుమార్ said...

అదిరింది.

Anonymous said...

తరికిట ఝం తరిత
ఇందుమూలంగా యావన్మంది బ్లాగుజనానికి తెలియపరచునది ఏమనగా
మన గౌతం గారు అదేనండీ దినకర్ ఫ్రెండ్ గారు పత్రికల తోటలలో కూడా విహరించేస్తున్నారు
వారు ఇలాగే కీర్తిని ఆర్జించాలి అని కోలుకుంటూ(అమ్మో మల్లి "ల" వచ్చేస్తుందేమిటి ????) లచ్చిమి :):):)

vennela said...

పత్రికలో రాస్తున్నందుకు అభినందనలు..

bapu said...

పత్రికలో రాస్తున్నందుకు అభినందనలు..

Anonymous said...

అదరగొట్టేసావు భయ్యా. ఆ పత్రిక పుణ్యమా అని ఇక నెలకొకసారి మీ బ్లాగు అప్డేటు ఔతుందన్నమాట. మరిక మీ సినిమా ఎంట్రీ ఎప్పుడన్నయ్యా?

S.K

ప్రదీప్ said...

పత్రికలోకి ఎక్కేశారన్నమాట. :)
హమ్మయ్య ! ఇప్పుడు కనీసం నెలకు ఒక సారైనా మీ బ్లాగు అప్డేట్ అవుతుందన్నమాట ! Congrats !!

chandra v said...

very superb,

krishna rao jallipalli said...

హైబ్రీడు తాటికాయంత ... వామ్మో. ఇవేక్కడ దొరుకుతాయి. టపా హైబ్రీడు టైపులో అదిరింది.

ramesh said...

Kekaaaaaaaaaaa

Anonymous said...

Goutham, nee range ki cinemale correct.

Kavaalante Dinakar produce chestaadu ..:)

But, seriously try cheyyavachu kada..?

--Praveen.

నిషిగంధ said...

"కాబట్టీ, ఒబ్జెచ్తివె పక్కన 'చపాతీలు తినటం' అని రాయండి!"
చింపి.. చింపి.. చింపేశారు :))
పైన ప్రవీణ్ గారు చెప్పినట్లు మీది నిజంగా మూవీ మెటీరియలే!

నిశాంత్ said...

:-))

"మనం ఎంత వెధవలమయినా మనల్ని మనం ప్రేమించుకోవాలి. కాబట్టి, రెస్యూమే మొదటి పేజీ లో హైబ్రీడు తాటికాయంత అక్షరాలతో మన పేరు ఉండేలా చూసుకోవాలి."

"ప్ర: జీతం ఎంత కావాలి?
జ : ఏదో సార్...మీ దయ

అలా జవాబిస్తే దెబ్బ తిన్నట్టే...జీతం గురించి నెగోషియేట్ చెసేప్పుడు అగ్రెసివ్ గా ఉండాలి. 'జీతం ఎంత కావాలి ' అని అడగంగానే జేబులోంచి కత్తి తీసి టేబుల్ మీద గుచ్చాలి...ఆ తరువాత కావలంటే 'ఏదో సార్...మీ దయ ' అనొచ్చు...."

అబ్బ... కుమ్మేసారండి..

మీ ఉచిత సలహా కెవ్వోకెవ్వు...

నేను కూడా (ఇంకో సంవత్సరంలో బి.టెక్ ఐపోతుంది) ఇదే ట్రై చేస్తానుండండి...
వాడెందుకుద్యోగమివ్వడో చూస్తా... ;-)

Nag said...

:))

baagundi kaani idivarakantanta aite kaadu ... mukhyam gaa dinakar episode miss avutunnaa ... mee back bench skills bagunnai :D

Nagarjuna said...

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కి కూర్చుంటున్న మాకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. :P
ఎప్పుడూ మీ బ్లాగ్ డైరెక్ట్ గా చూసే నేను ఈ సారి కొత్త పోస్ట్ వచ్చిందనే విషయం మా అమ్మ "ఆంధ్రభూమి" లో చదివి ఎవరో "తోటరామాయణం" అని రాశారు రా...మంచి కామెడీ ఉంది...అని చెప్పటంతో తెలుసుకున్నాను,అది ఎవరో కాదు మీరే అని...
మీ ఆంధ్రభూమి ప్రహసనం కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి అని మనసారా కోరుకుంటూ
-అభిమాని నాగార్జున....

satish said...

పత్రికలో రాస్తున్నందుకు అభినందనలు!!
మీ ఫాన్స్ కి, టేబుల్-ఫాన్స్ కి ఇంక నించి పెద్ద పండగే :)

Anand said...

asalu keka sir meeru... chaduvutunnantha sepu oka range lo navvukunnanu... ma father ki kuda chupisthanu :) ayana mee abhimaani

Aditya Prasad J said...
This comment has been removed by the author.
chaitanya said...
This comment has been removed by the author.
చైతన్య said...

చాలా బాగుందండి... అదరగొట్టేసారు... :)

~ చైతన్య
రాగం

FlotsaM said...

well written

మాలతీ మాధవం said...

భలే నవ్వించారండీ. వ్యాఖ్యల్లో చూసినా.. ఏదోలే.. అని అనుకున్నా. ఇవాళే చదివా మీ టపా, (రెండు రొజులు ఆలస్యంగా. వా....)

[ $h@nk@R G@ng@dh@rI ] said...

ముందుగా ఆంధ్రభూమి మాస పత్రిక కు మీ టాలెంట్ ను గ్రహించినందుకు నా అభినందనలు..!

మీరు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ......
ఇక ఈ టపా... టప్పుల టపా..$#%#$%^&.! గౌతమ్ పంచ్ అంటె మాటలా మరి..!

విష్ యు గుడ్ లక్ !!!!

Aditya Prasad J said...

హాయ్ గౌతం, ఎప్పటి లాగానే కింద పడీ పడీ నవ్వాం. రూమ్ మేట్స్ అందరం కలసి చదివి నవ్వే సరికి, మా అందరికీ ఏదో అయిందనుకుని భయ పడ్డారు చుట్టు పక్కల ప్రజలంతా... హ్హ..హ్హ..హ్హ.. మీ స్కిల్స్ కథ చాలా బాగుంది.

Anonymous said...

hey vinay...wats this all about??write again in english....

రాఘవ said...

అమ్మో... ఉచితసలహాలు హాఫ్-రేట్ కే ఇస్తారా? అందరూ ఇదే పనిలో ఉంటే ఉద్యోగాలు చెయ్యడం అనవసరం ;)

Sujata said...

good show. But I missed dinakar. Is he single (or double? (married/engaged/hooked))?

Ashok Varma said...

గౌతం గారు, పత్రికలకు ఎక్కినందుకు సిటికెలు.
ఈ టపాలో :
-- కుర్రాళ్ళు, కుర్రాళ్ళిని
-- ఉచితంలో సగం ధర
-- కంప్యూటర్ మానిటర్ కు పసుపు, కుంకుమ
-- నాట్ డాట్ నెట్
ఈ ప్రయోగాలు బావున్నాయి. మొత్తంగా చూస్తే మీ మార్క్ కాస్త మిస్సింగ్.

Ravi Kanth said...

Naku mee blog ki vachhina comments chuste okkati ardham ayyindi...
meeku Sachin ki oka polika undi...Sachin ni kuda enta baaga aadina chaala mandi vimarsistaru..

naku matram ee post one of your best anipistundi...
Andhrabhumi dwaara akhilandra prajaneekanni ilaage navvistarani aasisitanu..

Anupama Garimella said...

Chala chala bavundi.. :D You are truly an inspiration :)

chaitanya said...

Dummu raeparu guruvu garoo...!

Patrikalalo rasthunnnaduku congraats

chaitanya

arjun said...

racha racha chesi vadilestunnaru...
mi sense of humour ki sitikelu...

Rajendra said...

Baasuuu Keka basu

Rajesh said...

Gowtham blog kabatti navvukunnam...
Kani, mee range lo ledu.
Dinakar unte bagundedi.

Andhra bhoomi lo mee old blogs ni kooda publish cheyyandi...

Harithandra Swarnandhra emo kani Smilandhra mathram gaurantee....

Vikram said...

Hi...started with this one today and finished all your posts (20)

Visu, Chennai said...

'kurraallini'(????)...hahhahhaahhaahhhahhaaahahaah

zulu said...

Hi Gowtham,

Last maata mathram correct. ee software job lo entha tension untundho, adhi chese vaadike thelusthundhi.

Nenu oka peddddaaaa, mana bhashalo cheppalante, Hybrid MNC lo chesthunnaa..
Bayata andharoo "Nee kemi raa nayana, ***** lo jobu, Govt job tho samanam" ani antaaru.
Kaani ikkada pani chese naaku + maa Team ki mathrame thelusu, ela undho... Team antha night 11.30 varaku (incl All GALS and AUNTIES) pani cheyyadam ekkadanna chooosara..? adhi maa paristhithi, Gatha nela rojula nunchi..

So frnds, SW job okate kaadhu manaku unna options.. Vere vi kooda unnayi, try cheyyandi.. LIVE UR LIFE.

AnuVamsi said...

adbhutam ga vundi mee kadha. nijam ga mee rata dwara intha mandi abhimanula manasu dochukunnaduku hatsoff.

chala rojula nunchi office lo vunna pani ki time leka mee blog chudaledu. ivala koncham khali samayam doriki emanna rasara ani aatram ga mee blog open chesina naku nirasa kaliginchananduku dhanyavadalu.

munduga, mee ratalu patrikalakekkinanduku naa abhinandanalu.

ippude maa ammaki phone chesi cheppa, andhrabhoomi monthly konukkomani inka nunchi. nijam ga mee valla andhrabhoomi vallaki manchi labhalandoy. blog lone kanipinche meeru inka nunchi patrikalalo kuda kanipistaru kada. chinnappati chandamama pustakalu dachukunnattu, inka nunchi memu andhrabhoomi monthly lu dachukovalannamata.

Kadha lo mee Skill Set adbhutam ga vundi.
Inka dot.net, kurrannilu, mee objective description, expected salary.....ila cheppukuntu pothe motham tapa.....SUPER!!!

Anonymous said...

Very Funny.

Mahi said...

హహహ
చాలా బాగుంది.
ఈలాంటి సజెషన్స్ ఇచ్చేవాల్లు ఎవరూ లేక నేను అనవసరంగా B.Tech తర్వాత MBA కూడా చెయ్యాల్సివచ్చింది

Anonymous said...

mee blog chaduvutunte jandhyala gari cinema chusinattu undi, mee pada prayogalu bagunnai

Sekhar said...

Meee blogs punyamaa ani...nenu kooda oka THOTARAMUDU antha kaakapoyinaa... THOKARAMUDU title ki set avuthaananipisthundhi....!! :)

Btw..gr8 blogs!!

Cheers :)

susmi said...

chala bagundhi.I enjoyed a alot

Nazgi said...

champesavayya DSG...navvukoleka chachananuko...

ne prati post lo dinkar ane oka item ni pettadam keka...thega nachesindi aa concept...

nee post lu anni okkati vadalakunda chadivesa....konni rendu moodu sarlu kooda chadiva...

mari inka tamaride late...next post kosam waiting ikkada :)

Anonymous said...

chaalaa baagundi.

adarsh said...

మీరు చెప్పిన పద్దతి పాటించి ఎవరైనా ఉద్యోగానికి ఎంపిక అయ్యరా??? :P

శివకుమార్ said...

చాల ఆలశ్యంగా చదివాను... ఎప్పటి లా ఇరగదీశారు.

Anonymous said...

http://www.scribd.com/doc/11035214/Andhra-Bhoomi-Monthly-Jan09

Ravi said...

నా sms secret ఇలా బహిర్గతం చెయ్యదం ఎంత మాత్రం సమంజసం కాదు.....ఈ విషయం దినకర్ కి తెలిస్తే ఇంకేమన్నా వుందా....

Ravi Nanduri said...

Goutham, Office ki sambandinchi stress lo vunnappudu mee posts chaduvuthanu ... chadivinave ayina malli malli chaduvuthanu ... bahusa intha kanna compliment ivadam naaku raadu ... pls pls keep writing ... posts late ayina parledu, apakandi chalu ...

-- Ravi