Thursday, February 5, 2009

అసమర్థుని కారుయాత్ర

ఫిబ్రవరి 1, 2008 - ఉదయం 4:30 అయ్యింది

సంవత్సరం గడిచింది..

ఫిబ్రవరి 1, 2009 - ఉదయం 4:30 అయ్యింది

నిద్ర లేచాను....చాల రోజుల తరువాత స్నేహితులందరికీ కాస్త సమయం దొరకటం తో..ఇవ్వాళ "నంది హిల్స్" కు వెళ్ళాలని అనుకున్నాము...

తలుపు దగ్గర ఏదో చప్పుడయితే వెళ్ళి చూసాను..ఎవడో మా అమ్మమ్మ చేతిలోనుండి గిన్నె లాక్కుంటున్నాడు. నేను ఆవేశంగా వాడి దగ్గరకు వెళ్ళి 'ఎవడ్రా నువ్వు? మా ఇంటికొచ్చి మా మీదే దౌర్జన్యం చేస్తున్నావు?" అని అరిచాను.

దానికి వాడు "అయ్యో అదేంటి సార్..నేను మీ పాలవాడిని..రోజూ ఈ టైము లోనే వస్తాను సార్" అన్నాడు గిన్నె లో పాలు పోస్తూ..

పోసిన పాలలో ఎన్ని నీళ్ళున్నాయో తెలుసుకోవటానికి చూపుడు వేలితో ఒక చుక్క పాలు తీసి చూసింది మా అమ్మమ్మ..."ఏమీ అనుకోకు శీను..నిన్నెప్పుడూ చూడలేదు కదా మా వాడు...అందుకే.....సరే కానీ, ఈ పాలు ఒకలీటర్ బాటిళ్ళలో పోసి 'మినరల్ వాటర్ ' అని చెప్పి అమ్ము..వ్యాపారం బాగా జరుగుతుంది " అని లోపలకు వెళ్ళింది..

పాల శీను కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని పక్కింటికి వెళ్తుండగా ఇంకొకడెవరో సైకిల్ మీద వచ్చి మా ఇంట్లోకి ఏమో విసిరాడు. నాకు మళ్ళీ కోపం వచ్చింది.."ఎవడ్రా నువ్వు..మా ఇంటికొచ్చి చెత్తా చెదారం వెస్తున్నావు?" అని అరిచాను..

"సార్ అ కుర్రాడు మీ పేపర్ వాడు...ఇదే టైములో వస్తుంటాడు రోజూ " అన్నాడు పాల శీను పక్కింటి వాళ్ళ గిన్నెలో మినెరల్ వాటర్ పోస్తూ..

రోజూ పొద్దున్నే నాకు పరిచయం లేని వాళ్ళు ఇంతమంది మా ఇంటికి వస్తారని ఈ రోజు దాకా నాకు తెలియదు. పొద్దున లేవగానే గ్లాసు లో పాలు, టేబుల్ మీద పేపరు చూసి మా ఇంట్లో అక్షయపాత్ర, శమంతకమణి టైపులో ఏవైనా ఉన్నాయేమో అనుకునేవాడిని..కానీ నాకు తెలియకుండా ఇలా కుట్రలు జరుగుతున్నాయని అనుకోలేదు..

సరే సూర్యోదయం చూద్దామని మేడమీదకు వెళ్ళాను..మా వాటర్ ట్యాంకు మీద ఎవడో చారల టీషర్టు వేసుకుని కూర్చుని ఉన్నాడు...నాకు మూడోసారి కోపమొచ్చింది.."ఎవడ్రా నువ్వు....నేనెక్కాలనుకున్న ట్యాంకు మీద నువ్వు కూర్చున్నావు? " అన్నాను గట్టిగా...దానికి ఆ చారల టీషర్టు వాడు "ష్...కాస్త మెల్లగా అరవండి సార్..నేను దొంగని,,రోజూ ఇదే టైములో మీ పక్కింటికి వస్తుంటాను..మీరు ఈ సమయం లో నిద్రపోతుంటారు " అన్నాడు..

ఒహ్...వీడు కూడా పాలు, పేపర్ వాళ్ళ బాపతు అనుకుని "అలాగా..సరే. జాగ్రత్త..అటువైపు గోడ కాస్త బలహీనంగా ఉంది..చూసుకుని దూకు " అని చెప్పి కిందకు దిగాను..

బాగా చలిగాఉంది...బీరువాలో ఉన్న నా జాకెట్ తీసి సోఫాలో పెట్టమని మా అమ్మ తో చెప్పి స్నానానికి వెళ్ళాను..స్నానం చేసి వచ్చాక సోఫా మీద చూస్తే ఒక నీలం రంగు జాకెట్ గుడ్డ, పట్టు చీర కనపడ్డాయి..

"అమ్మా...ఏంటివి?" అనడిగాను...పూజ గదిలోంచి బయటకొచ్చిన మా అమ్మ "నువ్వే కదరా జాకెట్టు కావాలని అడిగావు...అదిగో..మొన్న సుశీల పెళ్ళికెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన జాకెట్ గుడ్డ అది..వెళ్ళి కుట్టించుకో..దాని మాచింగ్ చీర కూడ పెట్టాను పక్కన్నే " అంది...నేను లోపలకు వెళ్ళి నా జాకెట్ తీసుకొచ్చి "నేనన్నది ఇది " అని చూపించాను..

ఏంటో నిద్రలేచినప్పటి నుండి ఒక్కటికూడా సరిగ్గా నడవట్లేదు..

సంపత్ గాడు వచ్చాడు.."కూర్చోరా..పది నిముషాల్లో తయారౌతాను " అన్నాను..

"రేయ్..నా కారు తాళాలు కనపడ లేదు..ఆటో లొ వచ్చాను..నంది హిల్స్ కు వెళ్ళటానికి ఏదైనా ఏర్పాటు చెయ్యమని దినకర్ గాడికి చెప్పాను " అన్నాడు..

"దినకర్ గాడికా????? దొంగతనం చెయ్యటానికి పోలీసు స్టేషన్ కు వెళ్ళినట్టుంది నీ తెలివి " అన్నాను తల పట్టుకుంటూ..

"నువ్వు దినకర్ గాడిని తిట్టావని అర్థమయ్యింది కాని...ఆ సామెత అర్థం కాలేదు రా " అన్నాడు సంపత్ గాడు..

ఏ ప్రకృతి వైపరిత్యం దినకర్ గాడి రూపం లో వచ్చి మా నంది హిల్స్ ప్లాను ను ముంచేస్తుందోనని భయం మొదలయ్యింది మాకు..పది నిముషాల తరువాత ఇంటిబయట కారు హార్ను వినబడింది. లోపల మేము హనుమాన్ చాలీస చదవటం మొదలెట్టాము. హనుమంతుడికి మా ప్రార్థన చేరేలోపే కాలింగ్ బెల్లు చప్పుడయ్యింది...

" ఎవరు? " అన్నాము నేను, సంపత్ కలిసి..

"గౌతం, సంపత్ " అని వినపడింది తలుపు బయటినుండి..

"మేమడిగింది తలుపుకు ఇటువైపు కాదు..అటువైపు " అన్నాను...సంపత్ గాడు నా తలమీద ఒక మొట్టికాయ వేసి "ఇందాక ఆ సమాధానం వింటే అర్థం కాలేదు రా ఎవరని?...మన తుగ్లక్ గాడే. వెళ్ళి తలుపు తెరు...లేకపొతే మీ కాలనీ వాళ్ళ పేర్లన్నీ చెబుతాడు..."తలుపుకు అటువైపు ఎవరు " అని అడిగావుగా..." అన్నాడు..

పీప్ హోల్లోంచి చూసాను..దినకర్ గాడు తనలో తనే నవ్వుకుంటూ కనబడ్డాడు. బొల్టు తీసి తలుపు లాగుతున్నా రావట్లేదు..బయట గడియ పెట్టినట్టుంది..

"ఇప్పుడు లోపలి నుండి నువ్వు కాలింగ్ బెల్లు కొట్టరా..నేను ఇక్కడ గొళ్ళెం తీస్తాను " అన్నాడు దినకర్ గాడు బయటి నుండి....

"నువ్వే గెలిచావు....తలుపు తీయరా నాయన.." అన్నాను...

తలుపు తెరిచి విజయ గర్వంతో లోపలకు వచ్చాడు దినకర్ గాడు..వచ్చీ రాంగానే సోఫా మీద ఉన్న జాకెట్ గుడ్డ మీద పడింది వాడి కన్ను...."ఇది ఆ ఎర్ర బిల్డింగు సుశీల గారి పెళ్ళిలో పెట్టింది కదూ...నాకు కూడా ఇదే రంగు జాకెట్టు గుడ్డ పెట్టారు..ఇది నాకిచ్చెయ్యిరా...రెండూ కలిపి చొక్కా కుట్టించుకుంటాను " అని ఆ జాకెట్టు గుడ్డ తీసి బ్యాగు లో పెట్టుకున్నాడు..

"పదండి రా..బయట కారు రెడీ గా ఉంది " అన్నాడు....ఆ పక్కన్నే ఉన్న పట్టు చీర జరీఅంచును చేత్తో పట్టుకుని చూస్తూ...

"నువ్వు కారు నడపటం ఎప్పుడు నేర్చుకున్నావు రా " అనడిగాను బయటకు నడుస్తూ..

వాడు ఒక నవ్వు నవ్వి, ఒక దగ్గు దగ్గి, వస్తున్న తుమ్మును తుమ్మకుండా...మా ఇద్దరికీ బయట ఉన్న కారు చూపించాడు..

కారు పైన "PVR Motor Driving School" అని ఒక బోర్డు ఉంది..డ్రైవరు పక్క సీట్లో ఎవరో కూర్చుని ఉన్నారు..కారు ముందు "నంది హిల్స్ విహార యాత్ర " అని ఒక బానర్ కట్టి ఉంది....ఇదంతా చూసి నేను, సంపత్ గాడు అడగాలనుకున్న ప్రశ్నలు అర్థమైనట్టున్నాయి శ్రీమాన్ దినకర్ గారికి....

"నేను వారం రోజులుగా డ్రైవింగు క్లాసులకు వెళ్తున్నాను రా...సంపత్ గాడు కారు తాళాలు కనిపించట్లేదు అనగానే మా గురువు గారితో మాట్లాడి, ఇవ్వాళ క్లాసు నంది హిల్స్ దాక తీసుకొండి సార్ అని రిక్వెస్టు చేసాను...అదిగో, కారులో కూర్చుంది ఆయనే..త్వరగా పదండ్రా..ఆలస్యమైతే ఆయనకు కోపమొస్తుంది " అని గబగబా వెళ్ళి డ్రైవర్ సీటులో కూర్చున్నాడు..నేను సంపత్ గాడు వెనక సీట్లో కూర్చున్నాము..

"వీళ్ళు నా స్నేహితులు సార్ - సంపత్, గౌతం....ఈయన నా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టరు..పేరు PVR " - పరిచయం చేసాడు దినకర్..ఆ PVR వెనక్కి కూడా తిరగలేదు..

మళ్ళీ దినకర్ గాడే మాట్లాడుతూ "అన్నట్టు చెప్పటం మరచిపోయాను రా..నిన్న రాత్రి నీ కారు తాళాలు నా జేబులో దాచాను..నువ్వు కనిపెడతావో లేదో చూద్దామని...ఇవిగో తాళాలు " అని కారు తాళాలు ఇచ్చాడు సంపత్ గాడికి..

వాడు తాళాలు తీసుకుంటూ నా వైపు తిరిగి " నేను దొంగతనానికి వెళ్ళింది పోలీసు స్టేషన్ కు కాదు రా...ఏకంగా సెంట్రల్ జైలుకే " అన్నాడు...సంపత్ గాడు దినకర్ ను తిట్టాడని అర్థమయ్యింది కానీ....సామెత అర్థమవ్వలేదు..

కారు కదిలింది...ఆ PVR క్షణానికోసారి "క్లచ్చు, బ్రేకు...గేరు, బ్రేకు......యాక్సలరేటర్, బ్రేకు " అని...రెడ్ సిగ్నల్ పడినప్పుడు "రూలు బ్రేక్" అని దినకర్ గాడితో డిస్కో, బ్రేకు కలిపి చేయిస్తున్నాడు..

అలవాటు లేనివాడు స్కూటరు వెనక సీటు ఎక్కినప్పుడు, రెండు చేతులతో సీటు వేనకాల రాడ్ ను గట్టిగా పట్టుకుని కూర్చున్నట్టు...నేను, సంపత్ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని కూర్చున్నాము..

బాగా రద్దీగా ఉన్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మా బండి ఆగి ఉంది...ఈ PVR గాడు ఎప్పుడు ఏది నొక్కమంటాడో అని టెన్షన్ లో ఉన్నాడు దినకర్ గాడు...సడన్ గా ఒక అమ్మాయి స్కూటీలో వచ్చి దినకర్ గాడి పక్కన ఆపి...వాడిని చూసి "హాయ్...యు లూక్ సో క్యూట్" అంది...దినకర్ గాడు ఆ అమ్మాయి వైపు కూడా చూడకుండా "ఉండవమ్మా....అక్కడ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా..మా సారు "ఆక్రమణ్ " ఎప్పుడు చెబుతాడా అని నేను ఖంగారు పడుతుంటే...మధ్యలో నీ నస ఒకటి " అన్నాడు...

దినకర్ గాడి వెనకాల కూర్చుని ఉన్న మాతో కూడా ఏమయినా చెబుతుందేమోనని నోరూ, కళ్ళు, కిటికీ తెరుచుకుని చూస్తున్నాము నేను, సంపత్ గాడు...ఈ లోపు సిగ్నల్ పడింది..బండి కదిలింది..

సంపత్ గాడు కోపం పట్టలేక "రేయ్...ఈ దినకర్ గాడు valentine's day రోజు రాఖీ కట్టించునే రకం రా..లేకపొతే, పాస్పోర్టు కూడా లేని వాడికి చంద్రమండలానికి వీస వస్తే వద్దంటాడా?" అన్నాడు...

ఏంటో...ఇవ్వాళ ఏ సామెత విన్నా, అన్నా...దినకర్ గాడిని తిట్టినట్టు అర్థమౌతోంది కానీ...సమెతల అర్థం తెలిసి చావట్లేదు.

ఓ పావుగంటసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు..ఈ నిశ్శబ్దాన్ని భరించలేని దినకర్ "రేయ్..పిక్నిక్ అంటే ఎలా ఉండాలి..కారు కిటికీలోంచి చేతులు బయటకు పెట్టి ఊపుతూ, అంత్యాక్షరి ఆడుకుంటూ వెళ్ళాలి.." అన్నాడు..మేము విని ఊరుకున్నాము..

మళ్ళీ వాడే మాట్లాడుతూ "సరే...నేనే మొదలెడతాను"....అని...

"నవ మన్మధుడా...అతి సుందరుడా..నిను వలచిన ఆ వరుడు " అని ఆపి....PVR వైపు చూసాడు...అప్పుడు ఇద్దరూ కలిసి "అక్కా..ఎవరే అతగాడు.." అని పాడారు..."డు...డు....డు తో పాడు " అన్నడు దినకర్ గాడు సంపత్ వైపు చూసి..

ఈ పాడు గోల ఎలాగయినా ఆపెయ్యాలని సంపత్ గాడు "రేయ్ ముష్టి వెధవ" అని అరిచాడు..

ముందు కూర్చున్న ఇద్దరూ ఒకేసారి " ఆ..ఏంటి " అన్నారు..వెంటనే దినకర్ గాడు PVR ను చూసి "అదేంటి సార్...మీ పెట్ నేం కూడా ' ముష్టి వెధవ ’ నేనా...సేం పించ్" అని గిచ్చి, సంపత్ వైపు తిరిగి "చెప్పరా...ఏంటి " అన్నాడు..

" బండాపు " అన్నాడు సంపత్..

" సాటి ముష్టి వెధవను అడుగు " అని PVR వైపు చూపించాడు..

సంపత్ గాడికి కోపం పెరిగిపోతోంది..."సార్ కాస్త బండి ఆపించండి...బాత్రూం వెళ్ళాలి " అని చిటికెన వేలు పైకి లేపి చూపించాడు..

"నేను ఇందాక ఇంటి దగ్గరే వెళ్ళాను బాత్రూం కు...ఇప్పుడు అవసరం లేదు. థ్యాంక్ యూ." అన్నాడు PVR..

దానికి సమాధానంగా సంపత్ గాడు సభ్యసమాజం హర్షించని కొన్ని మాటాలు వాడాడు..అవి సెన్సార్ చేయబడినవి.

కారు ఆగింది..సంపత్ గాడు కారు దిగి, పక్కకెళ్ళి సభ్యసమాజం హర్షించని పని చేసి తిరిగొచ్చాడు..

"రోడ్డు పక్కన, సినిమా థియేటర్ గోడల పక్కన చేసే పనికి 'బాత్రూం' అని పేరొకటి.....నువ్వు బండి పోనీవయ్యా " అన్నాడు PVR దినకర్ వైపు చూస్తూ..

దానికి దినకర్ గాడు మమ్మల్ని చూసి "ఛి ఛి..మీ వల్ల నా పరువు పోతోంది రా..నా లాగా డీసెంటు గా, హుందాగా ఉండలేరేంట్రా మీరు??" అని అరిచాడు....అరిచిన రెండు సెకెండ్ల తరువాత "సారా బుడ్డి ఉంది...కారా కిళ్ళి ఉంది " అని అంత్యాక్షరి కంటిన్యూ చేసాడు..

ఊరు దాటిన కాస్సేపటికి ఒక చిన్న హోటల్ కనబడింది..హోటల్ ముందు చాలా బళ్ళున్నాయి.."చూడు దినకర్..ఇప్పుడు నీకు కారు ఎలా పార్క్ చెయ్యాలో నేర్పుతాను...ఆ నల్ల రంగు కారుంది చూసావా " అనడిగాడు PVR..

దినకర్ గాడికి ఏమి వినబడిందో ఏంటో..కారు స్పీడుగా పోనిచ్చి ఆ నల్ల కారు వెనకాల గుద్దాడు. నల్ల కారు ముందుకు జరిగింది - మా కారు ఆ స్థానంలో నిలబడింది..

"కారు పార్కు చెయ్యటమంటే అదేదో బ్రహ్మవిద్య అనుకున్నాను సార్...మరీ ఇంత సులభమనుకోలేదు " అని కారు దిగి ఒళ్ళు విరుచుకున్నాడు..

PVR గాడు మా వైపు తిరిగి "ఆ నల్ల కారు చూసావా అనడిగాను...చూసి రమ్మంటే ఇలా కాల్చి, పోస్టుమార్టం చేసొస్తే ఎలాగయ్యా??...సర్లె...దిగండి..టిఫిన్ చేద్దాం..ఇక్కడ 12 నిముషాలు బ్రేక్ అంతే " అన్నాడు...

నలుగురమూ హోటల్లో కూర్చున్నాము..సర్వర్ వచ్చి మా పక్కన నుంచున్నాడు. సంపత్ గాడు "పూరి" అన్నాడు, నేను "ఉప్మ" అన్నాను..దినకర్ గాడు "దోసె" అన్నాడు..

PVR సర్వర్ వైపు చూసి "నలుగురికి ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీ...బిల్" అన్నాడు...సర్వర్ వెళ్ళిపోయాక మా వైపు చూసి "పూరి, దోసె ఐతే బాగా ఆలస్యమౌతుంది...అందుకే నలుగురికీ ఇడ్లీలు చెప్పాను " అన్నాడు టేబుల్ పక్కన్నే చెయ్యి కడుక్కుంటూ..

మా ఓర్పు నశిస్తోంది...

సంపత్ గాడు నా వైపు చూసాడు..నేను దినకర్ గాడి వైపు చూసాను..ఇదేదో కొత్త ఆట అనుకుని దినకర్ గాడు పక్క టేబుల్ మీద కూర్చున్న వాడి వైపు చూసాడు..

ఓ రెండు క్షణాలాగి మా వైపు చూసి "జిహ్వ కొక రుచి..రెండు జిహ్వలకు రెండు రుచులు అన్నారు కదా పెద్దలు...ఇదీ అంతే. సార్ కు ఇడ్లీలు నచ్చుతాయి..సర్దుకోండి రా " అన్నాడు..

ఇప్పుడు దినకర్ గాడిని ఏమన్నా బాగోదని..కోపాన్ని దిగమింగుకుని, ఇడ్లీలు మింగాము. బిల్లు కట్టి బయటకు వచ్చాము.. మా కారు వెనక వైపు నుజ్జు నుజ్జు అయ్యుంది...దాని వెనకాల RVP Motor Driving School అని బోర్డు ఉన్న ఒక కారు కనపడింది...మాకు విషయమర్థమయ్యి కారెక్కి బయలుదేరాము...

ఈ సారి ముందు బెంచీ వాళ్ళు అంత్యాక్షరి మొదలెట్టక ముందే సంపత్ గాడు రేడియో ఆన్ చేసాడు..ఏదో FM స్టేషన్ పెట్టాడు..

"నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నంబర్ - 22022000..నేనడిగిన ప్రశ్నకు సరయిన సమాధానం ఇస్తే మీరు గెలుచుకోగలరు ఒక నీలం రంగు జాకెట్ గుడ్డ..ఇక ఆలస్యమెందుకు..చెయ్యండి ఫోన్ " అంది ఆ రేడియో అమ్మాయి..

'నీలం రంగు జాకెట్ గుడ్డ ' అని విన్న వెంటనే దినకర్ గాడికి మనసు ఆగలేదు...వెంటనే ఫోను చేసాడు..తగిలింది..స్పీకర్ ఆన్ చేసాడు..

"హలో...ఎవరండి మాట్లాడేది"

"హలో...నా పేరు దినకర్ మేడం...ఇన్ని రోజుల నుండి ట్రై చేస్తుంటే ఈ రోజు తగిలింది....అస్సలు నాకు ఏమి మాట్లాడాలో తెలియట్లేదు"

"హహ....చెప్పండి దినకర్ గారు..ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? "

"మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది మేడం...మా ఫ్రెండ్స్ మీతో మాట్లాడతారంట...ఒక్క నిముషం మేడం " అని మాకివ్వబోయాడు

"దినకర్ గారు...మీ వాళ్ళతో తరువాత మాట్లాడతాను...ముందు నేను అడగబోయే ప్రశ్నకు సమధానం ఇవ్వండి "

"మేడం...ప్లీజ్ మేడం...ఈజీ క్వస్చన్ అడగండి...ప్లీజ్" అన్నాడు దినకర్ గాడు...

అప్పుడర్థమయ్యింది మాకు....ఇలా రేడియోలకు, టీవీ లకు ఫోను చెయ్యటం లో వెటరన్ వీడు....

"OK దినకర్ గారు....మీ ప్రశ్న - "అమెరికా రాజధాని ఏది?"

దినకర్ గాడు, PVR మాకు వినపడకుండా ఏదో చర్చించుకున్నారు....దినకర్ గాడు "కొలొంబో" అన్నాడు..

"అయ్యో....అది కాదండి సమధానం" అంది రేడియో ఆవిడ...

"మేడం క్లూ ఇవ్వరా ప్లీజ్....మేడం ప్లీజ్" అని తన 'ముష్టి వెధవ ' పెట్ నేం ను సార్థకం చేసుకున్నాడు దినకర్ గాడు..

"సరే...ఇదిగోండి మీ క్లూ - అందులో మొదటి నాలుగక్షరాలు 'WASH'"

మళ్ళీ దినకర్ గాడు, PVR ఏదో చర్చించుకున్నారు...

" వాష్ కొలొంబొ " అని సమధానమిచ్చాడు దినకర్..

ఈ సమధానాలు విని కారు బయటకెళ్ళి డోక్కోవటం మొదలు పెట్టాడు సంపత్ గాడు..

"అయ్యో సారీ దినకర్ గారు...ఇది కూడా సరైన సమధానం కాదు.....OK శ్రోతలారా...ఇదే ప్రశ్న మీకూ వేస్తున్నాము..అమెరికా రాజధాని ఏది? మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాము - a) మద్రాసు b) మద్రాసు c) వాషింగ్టన్...మీరు a,b or c అని టైపు చేసి 2222 నంబర్ కు SMS చెయ్యండి ".....అంది..

దినకర్ గాడు వెంటనే మా నలుగురి మొబైల్ ఫోన్లు తీసుకుని SMS లు చేసాడు....

"నాలుగు ఫోన్ల నుండీ SMS చేసాను రా...ఎవరో ఒకరు గెలవటం గ్యారెంటీ....మీలో ఎవరికి ఆ జాకెట్టు గుడ్డ వచ్చినా నాకే ఇవ్వల్రో" అన్నాడు....

"ఇంతకీ ఏమి సమధానం పంపావు రా" ఉండబట్టలేక అడిగాను..

"ఆవిడే చెప్పింది కదా...a,b or c అని టైపు చేసి పంపండి అని.....a,b or c అని పంపాను.." అన్నాడు....

మా వాడికి పద్మశ్రీలు, భూషణ్ లు సరిపోవు....ఏకంగా నోబెల్ ప్రైజే!!!

సాయంకాలం ఐదు కావొస్తోంది....పక్కన సంపత్ గాడికి సెలైను ఎక్కించాల్సిన పరిస్థితి....అయినా కాని....పట్టుదలతో ఉన్నాము...నంది హిల్స్ చూడాలని...

"బ్రేక్" అని అరిచాడు PVR..." అందరూ దిగండి " అన్నాడు...

హమ్మయ్య...వచ్చేసినట్టున్నాము...త్వరాగా వెళ్ళి కనీసం ఒక అరగంటైనా గడపాలి..అనుకుంటూ దిగాము..

తన సంచి లోంచి ఒక binoculars తీసి మాచేతికిచ్చి..."ఇందులోంచి చూస్తే ఆ మూలకు మూడు పెద్ద కొండలు కనిపిస్తాయి....ఆ కొండల వెనకాల ఉన్న రోడ్డు మీద వెళ్తే నంది హిల్స్ వచ్చేస్తుంది.....చూసారుగా...ఇక ఇంటికి బయలుదేరుదాము పదండి "....అన్నాడు PVR గాడు...

చేసేదేమీ లేక....ఈ ఇద్దరినీ చేయగలిగిందేమీ లేక....నోరుమూసుకుని ఉన్నాము నేను సంపత్ గాడు...

ఈ రోజు పుద్దుటి నుండీ జరిగిన వన్నీ ఆలోచించాక...తప్పు నాదేనని నిర్ధారించుకున్నాను..

" నంది హిల్స్ కు వెళ్ళటానికి ఏదైనా ఏర్పాటు చెయ్యమని దినకర్ గాడికి చెప్పాను " అని సంపత్ గాడు అనిన వెంటనే ఈ ట్రిప్పు ను ఫిబ్రవరి 1, 2010 కి వాయిదా వెయ్యని నా అసమర్థత వల్లనే ఇదంతా జరిగింది.....

(సశేషం.....((నాకు డౌటే))

80 comments:

నరహరి said...

ప్రతి వాక్యం...పగలబడి నవ్వేలా ఉంది...ఈ సారి ఆంధ్ర భూమి కాలమ్ లో వచ్చింది ఇవ్వలేదు మీ బ్లాగ్ లో?

నరహరి said...

ఫిబ్రవరి 1, 2008 - ఉదయం 4:30 అయ్యింది

సంవత్సరం గడిచింది..

ఫిబ్రవరి 1, 2009 - ఉదయం 4:30 అయ్యింది"ఇప్పుడు లోపలి నుండి నువ్వు కాలింగ్ బెల్లు కొట్టరా..నేను ఇక్కడ గొళ్ళెం తీస్తాను " అన్నాడు దినకర్ గాడు బయటి నుండి....


కూడా ఇదే రంగు జాకెట్టు గుడ్డ పెట్టారు..ఇది నాకిచ్చెయ్యిరా...రెండూ కలిపి చొక్కా కుట్టించుకుంటాను " అని ఆ జాకెట్టు గుడ్డ తీసి బ్యాగు లో పెట్టుకున్నాడు..

వాడు ఒక నవ్వు నవ్వి, ఒక దగ్గు దగ్గి, వస్తున్న తుమ్మును తుమ్మకుండా...మా ఇద్దరికీ బయట ఉన్న కారు చూపించాడు..

నోరూ, కళ్ళు, కిటికీ తెరుచుకుని చూస్తున్నాము నేను, సంపత్ గాడు...

...ఈ దినకర్ గాడు valentine's day రోజు రాఖీ కట్టించునే రకం రా..

ముందు కూర్చున్న ఇద్దరూ ఒకేసారి " ఆ..ఏంటి " అన్నారు..


కారు స్పీడుగా పోనిచ్చి ఆ నల్ల కారు వెనకాల గుద్దాడు.

ఇదేదో కొత్త ఆట అనుకుని దినకర్ గాడు పక్క టేబుల్ మీద కూర్చున్న వాడి వైపు చూసాడు..'నీలం రంగు జాకెట్ గుడ్డ ' అని విన్న వెంటనే దినకర్ గాడికి మనసు ఆగలేదు...వెంటనే ఫోను చేసాడు..తగిలింది..స్పీకర్ ఆన్ చేసాడు..

" వాష్ కొలొంబొ " అని సమధానమిచ్చాడు దినకర్..


"ఆవిడే చెప్పింది కదా...a,b or c అని టైపు చేసి పంపండి అని.....a,b or c అని పంపాను.." అన్నాడు....

dhrruva said...

10/10

Anonymous said...

kevvu kEka ;-) LOL

ప్రభాకర్‌ మందార said...

చాల బాగుంది. అసమర్దులేంటి అసాధ్యుల కారు యాత్ర. ఎంత దిగులుగా వుండే వాళ్ల మూడ్ నైనా ఇట్టే మార్చేయగల అద్భుతమైన కామెడీ మాత్ర.. అభినందనలు

Nag said...

vammO vaayyO ... naa valla kaadu ... kaDupulO noppi(navvi navvi) ... idi ... idenandi memu korukunedi ... malla form lo ki vachesaranamta ...


dinakare anukunte ... dinakar ki twin kuda pettaru kadaa ... ee nellallaki saripada navvesukunna ... narahari garu cheppinattu prati sentence ki viragabadi navvukunnanu ... thanks gowtham ...

మందాకిని said...

భలే నవ్వించారండీ!
ప్రభాకర్ గారన్నట్టు ఎలాంటి మూడ్ లో ఉన్నవాళ్ళనైనా ఇట్టే నవ్వించేస్తున్నై మీ టపాలు.

రవి said...

:-) :-)

Anonymous said...

poddunne pffice ki vachi ila navvutunnanu.... baga rasaru..

సిరిసిరిమువ్వ said...

:)))))

Lalitha said...

you have a gift.

ప్రతి వాక్యానికీ నవ్వించగలగటం మామూలు విషయం కాదు.జంధ్యాల గారి మాటల్లో చెప్పలంటే, మీరు ఒక ' మహా యోగి '.

God bless you Goutham, you're truly amazing!

చైతన్య said...

చాలా బాగుందండీ...
దినకర్ గారికి అచ్చు ఆయన లాంటి మాస్టర్ ఏ భలే దొరికారు :) :)
ప్రతి వాక్యం బాగుంది... మీ టాలెంట్ కి హాట్స్ ఆఫ్.
ఆఫీసు లో ఉన్నాను కనుక చేయి అడ్డంపెట్టుకుని నవ్వుకోవాల్సివచ్చింది...
ఇంక నుండి ఆఫీసు లో మీ బ్లాగు చదవను... ఇంట్లో ఐతే హాయిగా నవ్వుకోవచ్చు.

పిచ్చోడు said...

హహ్హహ్హహ్హహా..... అయ్య బాబోయ్ గౌతం గారూ,,, చంపెశారు. మీ టపా టపా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. అనుకొన్నదానికంటే ఎక్కువ నవ్వించేశారు :-)

చైతన్య said...

హ.హ అదిరిందయ్య గౌతం :)

సుపర్ కెవ్వు కేక ...ఢాం ఢూం ...ఢయ్యా...

అమ్మో మళ్ళీ కామెంటుతా అందరు వింతగా చుస్తున్నారు

Lakshmi Sravanthi Chowdam said...

"donagathanam cheyataniki police station ki velli natlu" saametha chala rojula tharvatha vinannu..

Anni istamina tiffins unchukoni idly thinamante entha badha gaa untundo naaku thlusandi...(mouth ulcer vachinappudu... :)...)

"WASH columbo" & "SMS a,b or c" are excellent LOL ... kevvu kekaaa...

appudey ayipoyindaa anipinchindandi....very funny...hats off mastaaru

Admin said...

ఏదో కొంచెం తక్కువ అయినట్లుంది. కానీ బావుంది.

మనోహర్.సిహెచ్
న్యూజింగ్స్..

oremuna said...

కెక

Sri said...

baagaa navvinchaaru :-)))))

ప్రవీణ్ గార్లపాటి said...

అరిపించారు!

Malakpet Rowdy said...

One of the best I have ever read

$h@nK@R ! said...

ఈ టపాలో "దినకర్" గారి గురించి చాలా చాలా తెలుసుకున్నాము! :-)
2010 లో నైనా Nandi Hills పైకి వెళ్తారు అని ఆశిస్తూ...!

_$h@nK@R!
www.siliconthotz.blogspot.com

Anupama said...

chala chala bagundi.
Jacket concept adirindi :))
ilage rastoo undandi!

ప్రదీప్ said...

బాబోయ్ ! చంపేసారండీ బాబూ !!! నవ్వలేక చచ్చా.. :D

Vijay Namoju said...

సంపత్ మీ వైపు చూడడం ,మీరు దినకర్ వైపు చూడడం అదెదో కొత్త రకం గేం అనుకొని దినకర్ పక్కనున్న టెబుల్ వాడిని చూడటం , కుర్చీలొ కుర్చున్న నేను నవ్వాపుకోలేక రెండు పిల్లి మొగ్గలు వెయ్యడం , ఆఫీసులో జనం నన్ను ఆంటరానివాడిగా చూడటం ఏకకాలంలో జరిగిపొయాయి ...

ఇప్పటి వరకు మీరు రాసిన వాటిలో అత్యున్నతమైన టపా ఇది ..

శ్రీ said...

ఉదయాన్నే మీరు కొత్త టపా రాసారని చూసి మొదలుపెట్టకుండానే నవ్వుతున్నాను.

భలే రాస్తారండీ మీరు, జంధ్యాల గారు బతికుంటే మీ టపాలన్నీ సినిమాగ తీసి ఉండేవారు. ఒకవేళ ఆయనకి ఆ ఐడియా రాకపోయినా నేను తప్పక గుర్తు చేసి ఉండేవాడిని.

Rani said...

paina unna comments anni kalipi naa comment anukondi!! you are too good goutham

Anonymous said...

ఎవుడ్రా నువ్వు? ఏ జాతిరా నీది? నవ్వ లేక చస్తున్నా పోద్దుటికెల్లి. బిడ్డా, నేను బోతే గందుక్ కార్నం నువ్వే అని లెటర్ గిట్ల రాసి జేబ్ ల పెట్టుకోని తిరుగుతుండా మల్లా.

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

ROFL :))
LOL :)).....
daarunamaina comedy....

వికటకవి said...

>> "వాష్ కొలొంబొ"

అదిరింది.

రానారె said...

నంది హిల్లేరియస్ టపా, గౌతమ్ గారూ!!!

అమ్మమ్మ సలహా, ఆ సలహాకు శీను కళ్లనీళ్లు పెట్టుకోవడం ...
జాకెట్ ...
మేమడిగింది తలుపుకు ఇటువైపు కాదు ...
ఇప్పుడు లోపలి నుండి నువ్వు కాలింగ్ బెల్లు కొట్టరా ...
జాకెట్టుగుడ్డతో చొక్కా ...
కానీ....సామెత అర్థమవ్వలేదు ...
నోరూ, కళ్ళు, కిటికీ ...
పిక్నిక్ అంటే ఎలా ఉండాలి ...
అంత్యాక్షరి ఆరంభగీతం, దాని కోరసు ...
సభ్యసమాజం ...
కాల్చి, పోస్టుమార్టం ...
రెండు జిహ్వలకు రెండు రుచులు ...
వాష్ కొలొంబొ ...


నవ్వినవ్వి కడుపునొప్పివచ్చిందనేమాట మీ బ్లాగులో ఎప్పుడూ వినబడేదే. ఇప్పుడు నా పరిస్థితి అదే.
ఆ నందీశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా వుంచునుగాక!

Anand said...

Dinakar ee hero... :)

Ramakrishna said...

eppatilage adra gottesharu.....!
:-)

Anonymous said...

"క్లచ్చు, బ్రేకు...గేరు, బ్రేకు........."
రెడ్ సిగ్నల్ పడినప్పుడు "రూలు బ్రేక్"

Touché!

విజయ్ నామోజు said...
This comment has been removed by the author.
మధుమిత said...

తోటరాముడు తరహా టపా ఐతే కాదు ఇది. నాకు ఐతే అసలు నవ్వే రాలేదు. చాలా నిరాశ పరిచారు.

మధుమిత

Prashanth said...

chala rojula nundi eduru chustunnanu mee tapa kosam....kevvu keka........

నా బ్లాగు said...

చప్పాట్లే చప్పట్లు తోడుగా ఈల గూడ వేసుకోవచ్చు. బ్లాగ్ ఓపెన్ చేస్తే మొట్ట మొదట చూసేది తోట రాముడు కొత్త టప ఎమైన రాసాడా లేదా అనే .ఎప్పుడు ఇలాగే నవ్విస్తూ ఉండండి. పొద్దు లో మీ ఇంటర్వ్యూ కూడా చదివాను.:))))))

కొత్త పాళీ said...

LOL ... as usual

Anonymous said...

అపుడెపుడొ "శ్రీవారికి ప్రేమలేఖ"," ఆహ నా పెళ్ళంటా" సినిమా చుసినప్పుడు ఇంతగా నవ్వా...
ప్రతి line కెవ్వు కేక......

"పాలు ఒకలీటర్ బాటిళ్ళలో పోసి 'మినరల్ వాటర్ ' అని చెప్పి అమ్ము..వ్యాపారం బాగా జరుగుతుంది"

"పొద్దున లేవగానే గ్లాసు లో పాలు, టేబుల్ మీద పేపరు చూసి మా ఇంట్లో అక్షయపాత్ర, శమంతకమణి టైపులో ఏవైనా ఉన్నాయేమో అనుకునేవాడిని..కానీ నాకు తెలియకుండా ఇలా కుట్రలు జరుగుతున్నాయని అనుకోలేదు.."

"ఇప్పుడు లోపలి నుండి నువ్వు కాలింగ్ బెల్లు కొట్టరా..నేను ఇక్కడ గొళ్ళెం తీస్తాను "

అన్ని దీపావళి టపాసులే


" వాష్ కొలొంబొ "......ఇది మాత్రం డైనమైట్

krishna rao jallipalli said...

చాలా నిరాశ పరిచారు....సరే మీరే ఏదన్నా రాసి నవ్వించండి మరి. అప్పుడు తోట రాముడు బ్లాగు చూడకుండా ఉంటాము.

Nazgi said...

OMG!!!

i'm out of words...

goutham, u rock buddy...dis was really awesome...kudos to u

Rajesh said...

This is why, thotaramudu.blogspot is in everybody's favorites/bookmarks.....

You are rocking...Gowtham...
Dinakar....Bramhanandam ki em thakkuva kadu....

మధుర వాణి said...

ఏం చెప్పగలం చెప్పండి మీ పోస్టులకి.. పగలబడి నవ్వడం తప్ప.. :))
జంధ్యాల గారి సినిమాలు చూస్తున్న మంచి అనుభూతి కేవలం మీ టపాలవల్లె దక్కుతుంది. మా అందరికీ ఇన్ని నవ్వుల్ని పంచుతున్నందుకు మీకు సింపుల్ గా థాంక్స్ అంటే సరిపోదు. ప్రతిగా మీ టపాలు మీ చేతే చదివించాలి :))

pavankumar said...

Baavundi andi.
nenu ee madhyane mee blog loni tapalu anni okesari chadivedsanu. Chaala baunnai. Kaani maamulugu mee blogs lo unde punch endukoo indulo miss ayinattu anipinchindi. Meeru tirupathi and dinakar annappudalla naaku maa friend gurthuvastadu endukante vadu kooda mee dinakar laanti vaade andunaa tirupathi vaade. Mothaniki meeru andhra pradesh janam andarni navvinchaalani kankanam kattukunnattu unnaru.

Mahi said...

:)

చాలా బాగా రాశారు.బాగా నవ్వుకున్నాను.

పోస్ట్ చదువుతున్నంతసేపు దినకర్ హీరో లా మీరు డైరెక్టర్లా అనిపించారు

Vasu said...

adhbhutam ga undi... okkokkasari trivivkram ki e maatram teesiporu anipistunid meeru.. Sattires lo ..

chaaala chaala bavundi.. :)

Naveen J said...

Pichekichaaru pondi,
Chala tapala taruvaata malli oopandukonnaru.. office lo navvutunte andaru nanne choosaru chala saarlu.
Naa laga ela navvali ani adigaaru, nenu navvula tonic rasichaanu vallaku, meru ento anukoni koneeseru, vallaku mee blog address rasichaa.. Antee!!!
Naa comments chaduvutaaru ani aasisthu, inka nenu holiday tesukuntunna.
Bye,
Naveen.

Nagarjuna said...

parts parts gaa chadivitE baanE undi...antaku mundu posts lO A to Z pagalabaDi navvEvaaNNi...ippuDu madhyalO konniTiki chirunavvulu...konniTiki pagalabaDi navvulu....meeru andhra jyothi lO raasEvi indulO post cheyyakooDadaa??
alaa aitE cheppanDi...andhra jyothi konukkuni chaduvudaam...
once again mee trademark post tO maa andarinii aanandimpajESaaru....

Nagarjuna said...

basic gaa EmavutundanTE oka Jandhyala,oka Trivikram,oka Gowtham gaari stories lO oka atyunnata Sikharaanni andEskunTaam story madhyalOnE...kaabaTTi aa taravaata Edi choosinaa light anipistundi...

Anonymous said...

Simply superb!!!

పుల్లాయన said...

బాగుందండి

Sudheer said...

Excellent post!

Babu said...

Chaana Bagundhi Gowtham Garu.. Keep it up..

Anonymous said...

baaga rasarandi....chaala rojula tharuvatha mee comedy level ni touch chesthu rasaru...good and thanks

SOPETI said...

binoculous or binoculars?
(రామాయణం లో పిడకల వేట)

Laugh Riot ; as usual.

PAVANKALYAN[I.A.S] said...

exlent gaa vundhi

వేణు గొపాల్ said...

చాల బాగుంది

adarsh said...

హిహి..హిహి.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను... చాలా బాగా వ్రాస్తున్నారు

Latha said...

hi gowtham garu,

mee posts anni chaala baguntayi...
chala mandi valla comments lo meeru andhra jyothi lo vesina articles veyyatledu ikkada emani adugutunnaru...
maa kosam meeru avi kooda oka section lo post cheste baguntadi..maku andhrajyothi dorakadu ikkada north lo...kaneesam aa paper online lo kooda ledu...andukani...

Anonymous said...

Brilliant! paina chaala mandi adiginattu mee andhrajyothi postu kooda ikkada veyyochu ga

Wanderer said...

మీ నైపుణ్యం, మీ నాయకత్వ లక్షణాలు, మీ పంచుకునే గుణం, మీ ఔదార్యం, మీ టీం ప్లేయర్ లక్షణాలు, మీ కష్టపడే గుణం, మీ అటెన్షన్ టు డీటైల్, అబ్బో.... మీ ప్రతీ పోస్టు లోనూ ఇవి కనపడుతున్నాయి. వర్ధతాం అభివర్ధతాం.

జ్యోతి said...
This comment has been removed by the author.
AnuVamsi said...

Adbhutam.......antah kanna emi cheppalenu

puligoru said...

చాలా బాగా వ్రాసావు రా సిద్దు ,మార్పులు బాగున్నాయి..

HemanthPradeep said...

Sandabochitamina comedy ekkuav ga vundi ...me paata tapallo dialogue base comedy ekkuva ga vundi ..

Andhra bhoomi lo prachuritamavutunnaduku santosham ...all the best goutham garu

Vijay said...

అయ్యా !నవ్వలేక చఛ్చా!! నా వల్ల కాలేదు. అసలే office లో ఉన్నాను. పక్కన వున్న వాళ్ళు చూసి నాకు ఏమన్నా రిసెషన్ వల్ల స్వల్పం గా పిచ్చి గాని యెక్కిందెమో అనుకుని వదిలేశారు.

చంద్రసేన said...

చాలా చాలా బాగుంది...ప్రతీ వాక్యము ఎంతో నవ్వుకునేలా హాయిగా వుంది. నిజంగా జంధ్యాల గారి సినిమాల్లో కనపడే చక్కని హాస్యం వుంది. ఇంత చక్కని టపాలను వేస్తున్నందుకు మీకు నా అభినందనలు...

Anonymous said...

is this fictious??

Anonymous said...

hai brother am copy ur postes ok na ples na blog lo ne posts petkunta plessssssssssss my id is ani202008@rediffmail.com

Kamal Kumar said...

సూపర్... చాలా బాగు౦ది... ultimate...

Yunus.M said...

Recently I came to know abt this blog and I can't stop laughing after reading u r every TAPA TAPA lu.Naaku ippudu artham aiyndee inni rojulu life lo eemi miss ayyanoo and ippudu eemi dorikindooo..Hats off andee meeeku....Onsite lo bore godutunnapudu mee TAPA lu pelchee bambulaku navvu lee navvulu..

uma blog said...

babooii enta baagaa raaaaaaaaasaru andi meeru .. aa rasina chetiki award ivvalsinde

sudhakar said...

hi gowtham, its so nice yaaaaaa.

Krishnadar said...

hi meeru baagaa raasaaru

N.Subrahmanyam said...

we are waiting for your post in this new year...pls do it ASAP

Anonymous said...

Hi Goutham,
How are you?
This is the first time I am commenting on your blog.I read your blog almost everyday...why aren't you not blogging these days, please do keep write new posts
I have to tell you this: when ever I am tired I just read your blog to get back to normal
Anyway Hope to see your post soon

Cheers,
Mallika

N.Subrahmanyam said...

Can we expect your post in coming month (June 24th)?

రెండు రెళ్ళు ఆరు - June 24th
:)

Anonymous said...

goutham garu me photo kuda e blog lo peditey anamdistam ledantey edo miss avutunatu undi

Anonymous said...

laugh therapy....rolling on floor laughing :)

Santricexphx said...

అపుడెపుడొ "శ్రీవారికి ప్రేమలేఖ"," ఆహ నా పెళ్ళంటా" సినిమా చుసినప్పుడు ఇంతగా నవ్వా... ప్రతి line కెవ్వు కేక...... "పాలు ఒకలీటర్ బాటిళ్ళలో పోసి 'మినరల్ వాటర్ ' అని చెప్పి అమ్ము..వ్యాపారం బాగా జరుగుతుంది" "పొద్దున లేవగానే గ్లాసు లో పాలు, టేబుల్ మీద పేపరు చూసి మా ఇంట్లో అక్షయపాత్ర, శమంతకమణి టైపులో ఏవైనా ఉన్నాయేమో అనుకునేవాడిని..కానీ నాకు తెలియకుండా ఇలా కుట్రలు జరుగుతున్నాయని అనుకోలేదు.." "ఇప్పుడు లోపలి నుండి నువ్వు కాలింగ్ బెల్లు కొట్టరా..నేను ఇక్కడ గొళ్ళెం తీస్తాను " అన్ని దీపావళి టపాసులే " వాష్ కొలొంబొ "......ఇది మాత్రం డైనమైట్