Thursday, August 20, 2009

మగ పిల్లాడు - పిల్ల మగాడు

అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __.

నేను మా అమ్మ కడుపులో ఉండగా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నారట మా ఇంట్ళో అందరూ. నేను పుట్టాక..అబ్బాయి పుట్టాడని తెలిసి.. తమ మనోభావాలను గాయపరచినందుకు నా మీద కేసు వేసారు మా వాళ్ళు. సరే జరిగిందేదో జరిగిపోయిందని...తన ముచ్చట తీర్చుకోవటానికి రెండేళ్ళ పాటు నన్ను ఒక అమ్మాయిలా పెంచిదట మా అమ్మ..నాకు గుండు గీయించిన మరుసటి రోజునుంచే విగ్గు పెట్టి జడలు వేసేదిట..

జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం' అని అనుకునే ఆ వయస్సులో ఇలా అమ్మాయిలా పెంచబడటం వల్లనో ఏమో..నన్ను ఎవరైనా 'నీ వయస్సెంతా?' అని అడిగితే 'నీ జీతమెంత?' అని అడుగుతాను. అవతలి వాళ్ళు తమ జీతమెంతో చెప్పగానే నా జీతం కూడా చెప్పి చేతులు దులుపుకుంటానే తప్ప..నా వయస్సు మాత్రం చెప్పను....అందుకే మళ్ళీ మొదటి లైనుకు వెళ్దాం..

అనగనగా ఒక సంవత్సరం...19__. అప్పుడు నా వయస్సు __.

అంతవరకు మా ఊరు దాటి ఎప్పుడూ వెళ్ళలేదు నేను. ఆ ఏడాది మా మావయ్య పెళ్ళికని హైదరబాదు తీసుకెళ్ళారు మా ఇంట్లో వాళ్ళు. పెళ్ళి మండపం చేరగానే నా హైటు పిల్లలున్న గుంపులోకి నన్ను తోసేసి వెళ్ళిపోయారు.

అందరూ సిటీ పిల్లలే..అందరూ ప్యాంట్లు వేసుకుని ఉన్నారు..నేను మాత్రమే నిక్కరు వెసుకుని ఉన్నాను..అది కూడా మా అమ్మ తన కాటన్ చీరలతో పాటూ గంజి పెట్టించిన నిక్కరు. అందుకేనేమో నన్ను ఎవ్వరూ పలకరించట్లేదు..నేను మా వీధిలో గోలీల ఆటలో మూడు Grand Slam లు గెలిచానని తెలిస్తేనైనా నాతో మాట్లాడతారేమోనని జేబులోంచి మూడు గోలీలు తీసి గాలిలోకి ఎగరేసాను..ఆ ప్రయత్నం కూడా గాలిలో కలిసిపోయింది.....

ఆ అవమానాన్ని భరించలేకపోయాను..మోకాళ్ళు కనిపించేలా నిక్కరేసుకుని ఉండటమే ఇందుకు కారణమని గ్రహించాను..సైలెంటైపోయాను..

మరుసటి రోజు మా ఊరు తిరిగెళ్ళి...మా స్కూలుకు వెళ్ళేదాక ఏమీ మాట్లాడలేదు నేను..స్కూలు లో భోజనాల సమయంలో గణేష్, సుధాకర్ లతో నాకు హైదరబాదు లో జరిగిన అవమానం గురించి చెప్పాను..

"గాంధీ గారిని సౌత్ ఆఫ్రికా లో ట్రైను నుంచి బయటకు తోసేస్తే ఆయన ఏమి చేసారో తెలుసా?" అన్నాను..

"తెలియదు..కానీ నన్ను ఎవరైన అలా తోసేస్తే..ఆ ట్రైను టైర్లన్నిటికీ గాలి తీసేసేంతవరకు ఆ స్టేషన్ నుండి కదలను." అన్నాడు సుధాకర్ గాడు..

"ఏడ్చావు...ఆ అవమానం జరిగాక ఆయన మన దేశానికి తిరిగొచ్చి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. నిన్న నాకు జరిగిన అవమానం కూడా అలాంటిదే..అందుకనే నేను కూడా ఒక మగాడిగా నా స్వాతంత్ర్యం కోసం పోరాడదలచుకున్నాను..ఇక నుంచి మనము మగ పిల్లలం కాదు..పిల్ల మగాళ్ళం...(టైటిల్ జస్టిఫికేషన్)

వెంటనే ఒక అజెండా తయారు చేసుకున్నాము..

- ఇక పై ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి
- జేబులో ఎప్పుడూ డబ్బులుండాలి

అనుకున్న వెంటనే ఇవి అమలు పర్చాలని...మా నాన్న పని చేసే స్కూలుకు వెళ్ళాను నేను, నా స్నేహితులిద్దరినీ తోడు తీసుకుని..మేము వెళ్ళే సమయానికి మా నాన్న లెక్కల పాఠం చెబుతున్నాడు. నేను నేరుగా క్లాసులోకి వెళ్ళి "నాన్నా..నేను ప్యాంటు కుట్టించుకోవాలి..నాకు డబ్బివ్వు " అనరిచాను..నా ధైర్యం చూసి ముందు బెంచీ లోని అమ్మాయిలు ముక్కు మీద వేలేసుకున్నారు (ఆశ్చర్యమేసి కాదు..ముక్కు మీద దురదగా ఉంటే గోక్కోవటానికి)..మా నాన్న నా మాటలేవీ పట్టించుకోకుండా ఒకమ్మాయిని లేపి "(a+b) ని (a-b) తో గుణిస్తే ఏమొస్తుంది?" అనడిగాడు..ఆ అమ్మాయి "సల్ఫ్యూరిక్ యాసిడ్" అంది..మా నాన్నకు విపరీతమైన కోపమొచ్చింది..వెంటనే నన్ను, గణేష్ గాడిని, సుధాకర్ గాడిని గోడ కుర్చీ వేయమన్నాడు..

ముగ్గురూ పక్కపక్కన గోడకుర్చీ వేయగానే మా కాళ్ళ మీద ఒక గుడ్డ కప్పి 'గోడ సోఫా' చేసాడు మా నాన్న..క్లాసులోని అమ్మయిలంతా గ్రూప్ సాంగ్ పాడినట్టు నవ్వారు..మా వాళ్ళు నా వైపు చిరాకు గా చూసారు..మా స్కూలు లో మేము తీసే గుంజిళ్ళు, తినే తన్నులు చాలవన్నట్టు వీళ్ళ స్కూలుకొచ్చి గోడ కుర్చీ వెయ్యాలా?? ఒక గుంటూరు వాస్తవ్యుడు గోంగూర కోసం బెంగళూరొచ్చినట్టుంది ఇది..

ఈ సంఘటన తరువాత ' మా నాన్న '..' మా బాబు ' గా మారిపోయాడు...అప్పటి నుండి మా ఇద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే Nuclear Fusion జరిగేది. అందుకే ఇక మాటలతో ఈ సమస్య తెగదని..ఒక ఉత్తరం రాద్దామని నిర్ణయించుకున్నాను..మాంచి వింటేజ్ ఫీల్ ఉంటుందని పోస్ట్ ఆఫీసుకెళ్ళి తాళపత్రాలు కొని రాసాను..మొన్నీమధ్య జరిగిన పురావస్తు శాఖ త్రవ్వకాల్లో ఆ తాళపత్రాలు బయటపడ్డాయి..నేను రాసిన ఉత్తరం ఇదిగో -మరుసటి రోజు ఆదివారం. హృదయం లేని మా బాబు 'ఆదిత్య హృదయం' చదువుతున్నాడు పొద్దున్నే.. టీవీ లో 'మహాభారత్ ' వస్తోంది..సరిగ్గా రాహుకాలం మొదలవ్వగానే నా తాళపత్రోత్తరం తెచ్చిచ్చాడు ఒక వేగు గుర్రం మీద..ఆ ఉత్తరం చదవగానే "జానకీ!!!" అని గట్టిగా అరిచాడు మా బాబు. 'జానకి!!!' అనే పేరుతో మా ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వల్ల ఎవ్వరూ పలకలేదు..ఈ సారి మా అమ్మను పిలిచాడు..మా అమ్మ టీవీ ముందు నుంచి లేచి పరుగు పరుగున వచ్చింది..ఉత్తరం చూపించాడు..మా అమ్మ "కింతూ..పరంతూ" అని ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా తాండవం మొదలెట్టాదు మా బాబు....అసలు విషయమేంటంటే - చిన్నప్పుడు ఆయన్ని అందరూ 'బాబు ' అని పిలిచేవారట..నేను ఉత్తరం లో 'అమ్మ, బాబు లకు' అని రాసాను కదా.."నన్నే పేరు పెట్టి పిలుస్తాడా పిల్ల కుంక" అని అరుస్తున్నాడు..ఇప్పుడు నేను దొరికానంటే డ్యాన్సు ఆపి ఫైటింగ్ మొదలెడతాడని..రహస్య మార్గం ద్వారా వంటింట్లోకి పారిపోయాను నేను..

అక్కడ మా అమ్మమ్మ రోట్లో అల్లం పచ్చడి రుబ్బుతోంది..నేనెళ్ళి క్వీన్ విక్టోరియా పక్కన కూర్చుని.."సుధాకర్ వాళ్ళ నాన్న వాడి పుట్టిన రోజుకు ప్యాంటు కుట్టించాడు తెలుసా? నేను ఎన్నాళ్ళిలా ఉత్తరాలు రాసి రోలు పక్కన కూర్చోవాలి?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను..

"ఇంత చిన్న విషయానికి ఎందుకురా ఏడుస్తావు? ఈ సారి మళ్ళీ సుధాకర్ పుట్టిన రోజుకు వాడికి కూడా నిక్కరు కుట్టించమని చెబుదాములే వాళ్ళ నాన్నతో...ఏదీ..ఆ అను" అని రోట్లోంచి ఒక వేలుతో అల్లం పచ్చడి తీసి నా నాలుకకు రాసింది........ఆహా...అమోఘంగా ఉంది..ఆ రుచి నాలుక నుంచి నేరుగా నా బుర్రలోకి ప్రవేశించి నా కోపాన్నంతా ముక్కలు ముక్కలు చేసేసింది..నాకు తెలియకుండా నవ్వు ఎక్స్ప్రెషన్ నా మొహం మీద అలా వచ్చేసింది...

మా అమ్మమ్మ అల్లం పచ్చడి చేసినప్పుడల్లా తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న అమృతం సీసలోంచి రెండు చుక్కలు వేస్తుంది..ఆ పచ్చడి నాలుకకు తగలగానే రెండు రోజులు అలా గాలిలో నిక్కరేసుకుని తేలిపోవాల్సిందే....మా పూర్వీకుడొకాయన అమృత మథనం టైం లో అక్కడే ఉన్నాడుట..పెట్రోలు కోసమని ఒక లీటర్ వాటర్ బాటిల్ పట్టుకుని బయలుదేరిన మా పూర్వీకుడు ఆ ముచ్చటంతా చూద్దామని అక్కడే ఆగిపోయాడట..అమృతం వచ్చాక ఎవరో లేడీ ...దేవతలను, రాక్షసులను కూర్చోబెట్టి "నీక్కావలసింది...నా దగ్గర ఉంది" అని పాడుతూ అమృతం పంచిపెట్టిందట..(ఇదే పాటను మన తెలుగు సినిమావాళ్ళు రైట్స్ తీసుకోకుండా వాడుకున్నారు)...ఒక దేవుడి దగ్గర బ్లాకు లో ఒక లీటర్ అమృతం కొన్నాడు మా పూర్వీకుడు..అది అలా తర తరాలుగ వస్తోంది మా ఇంట్లో........ఇంతకీ ఏమి చెబుతున్నాను?? ఆ...అల్లం పచ్చడి...అది నాలుకకు తగలగానే నేను అన్నీ మరచి పోయాను...

ఓ రెండు రోజులు ఏమీ చేయలేదు..అంటే మూడో రోజు ఏదో చెసానని కాదు..మూడో రోజూ బేవార్సే...నాలుగో రోజు - నేను వరండాలో కూర్చుని వీధిలో వచ్చీ పోయే వాళ్ళ ప్యాంట్లు చూస్తూ ఉన్నాను..మా అన్నయ్య ఇంట్లోంచి హడావిడిగా వచ్చి తన జేబులోని బాల్ పెన్ తీసి మా కాంపౌండు బయట పారేసాడు..ఐదు నిముషాల తరువాత మా అమ్మ వచ్చి కాఫీ ఇచ్చింది మా అన్నయ్య కి..మా వాడు ఎడమ చేత్తో కాఫీ అందుకుని, కుడి చేయి చాచి - "అమ్మా..నా బాల్ పెన్ ఎక్కడో పారేసుకున్నానమ్మా...శ్రధ్ధగా చదువుకుందామంటే పెన్ను లేదు " అన్నాడు....చలన చిత్ర పరిశ్రమ ఎంత మంచి నటుణ్ణి మిస్ అవుతోందో నాకు చూపిస్తూ...

మా అమ్మ వెంటనే వాడి చేతికి ఒక పెద్ద నోటిచ్చి "ఇంక్ పెన్ కొనుక్కోరా..మిగిలిన డబ్బు దాచుకో" అని లోపలికెళ్ళింది..ఈ సన్నివేశాన్నంతా ప్రేక్షకుడి లాగా చూస్తున్న నా వైపు మా అన్నయ్య చూసి "ఉహుహహహహ" అని కళ్ళతో నవ్వి కాఫీ తాగటం మొదలెట్టాడు..

నా తక్షణ కర్తవ్యమేంటో నాకు గోచరించింది..వెంటనే నా వార్డ్ రోబ్ (మా అమ్మమ్మ పెట్టె) లోంచి నా నిక్కరు ఒకటి తీసి...బ్లేడుతో ఎడా పెడా కోసేసాను..ఆ చిరిగిన నిక్కరు తీసుకుని మా అమ్మ దగ్గరకు వెళ్ళాను..ఒక గ్లాసు తో పాలిచ్చింది..

"పాలు తాగటానికి నేనింకా చిన్న పిల్లడిని అనుకుంటున్నావా? నాకు కాఫీ కావాలి " అని అరిచాను..అప్పుడే గదిలోకొచ్చిన మా అన్నయ్య తన గ్లాసు లో మిగిలిన కాఫీ నా నోట్లో పోసాడు..కాకరకాయ, కుంకుడు కాయ, శీకాయ కలిపి నాలుక మీద పడ్డట్టయ్యింది..కళ్ళు చేదుగా మూసాను..

"మొదటి కాఫీ అలానే ఉంటుంది రా" అన్నాడు మా అన్నయ్య...మొదటి కాఫీ ఇలా ఇంత చేదుగా ఉంటుందని తెలిస్తే..మొదలెట్టటమే రెండో కాఫీ తో మొదలెట్టేవాడిని......ఇవన్నీ తరువాత...వచ్చిన పని ముఖ్యం - "అమ్మా...నా నిక్కరు చిరిగిపోయిందమ్మా...శ్రధ్ధగా చదువుకుందామంటే......." నా డైలాగు పూర్తవ్వకుండానే మా అమ్మ మా అన్నయ్య చేతికి నా నిక్కరు, ఐదు రూపాయలిచ్చి ఇచ్చి - "ఇది కుట్టించుకురా" అని పంపింది...మా వాడు ఆ ఐదు రూపయలలో నాలుగున్నర పెట్టి సినిమా చూసొచ్చి, మిగిలిన అర్ధ రూపాయితో ఒక సైకిల్ షాపు వాడి దగ్గర నా నిక్కరుకు ప్యాచ్ లు వేయించుకొచ్చాడు ..

అలా తెల్ల నిక్కరుకు నల్ల సైకిల్ ట్యూబుల అలంకరణలతో నేను కాలం సాగదీస్తున్నప్పుడు ఒక రోజు -

మా పక్క కాంపౌండులో ఉన్న నీలిమ జామెట్రీ బాక్సు కావాలని నా దగ్గరకు వచ్చింది..' శృతిలయలు ' సినిమాలో సుమలత గొంతు అంత అందంగా ఉంటుంది నీలిమ.

ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది..

వెంటనే ఇంటికి పరిగెట్టాను..అక్కడ సైకిల్ తుడుచుకుంటూ కనబడ్డాడు మా అన్నయ్య..

"రేయ్...నాకు డబ్బు కావాలి " అన్నాను..

మా అన్నయ్య పైకి లేచి "సేం పించ్" అని గట్టిగా గిచ్చాడు..

"అబ్బా..అలా గిచ్చావేంట్రా."

"లేకపోత ఏంట్రా...డబ్బు ఎవరికి వద్దు చెప్పు..ఇంతకీ నీకు డబ్బు ఎంత కావాలి? ఎందుకు కావాలి?" అనడిగాడు..

"నాకు 10 రూపాయలు కావాలి రా..నేను నీలిమ ను బాల్య వివాహం చేసుకుందామనుకుంటున్నాను..మనము 10 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చి వరకట్నం గా 200 రూపాయలు అడుగుదాము..అందులో సగం నాకు...ఆ మిగతా 160 రూపాయలతో నీవు మాంచి ఇల్లు కట్టుకో" అన్నాను మా అన్నయ్య భుజం తడుతూ..

"10 రూపాయల్దేముంది రా...కుక్కను తంతే రాల్తాయి..నువ్వు ముందెళ్ళి అమ్మ, నాన్న ఆశీర్వాదం తీసుకో..ఆ తరువాత కుక్కల కోసం ఇద్దరూ రోడ్డు మీదకు వెడదాం.." అన్నాడు..

నేను ఇంట్లోకి వెళ్ళాను...హాలు లో మా బాబు, అమ్మ, అమ్మమ్మ ఉన్నారు…"నేను నీలిమను బాల్య వివాహం చేసుకోవాలనుకుంటున్నను " అని నా నిర్ణయాన్ని చెప్పాను..

కెమేరా మా అమ్మమ్మ వైపు తిరిగింది...తరువాత మా మ్మ వైపు...తరువాత మా బాబు వైపు.....ఆ తరువాత లాంగ్ షాట్..

ఇక్కడ నాకు తెలియని విషయమేంటంటే...ఆ ముందు రోజు మా బాబు లెక్కల క్లాసు అవ్వగానే వాళ్ళ హెడ్మాష్టరు మా బాబుకు చిన్న క్లాసు తీసుకున్నాడట....కోపంతో ఫస్టు క్లాసు మూడ్ లో ఉన్నాడు మా బాబు..నా బాల్యవివాహపు వార్త వినగానే ఏమీ మాట్లాడకుండా పైకి లేచి..తలుపుకు తగిలించిన తన ప్యాంటు జేబులోంచి ఒక ఫొటో తీసాడు..అది వాళ్ళ హెడ్మాష్టరు ఫొటో..దాన్ని నా వీపుకు అతికించాడు..ఆ తరువాత "బాల్య వివాహం కావాలి రా నీకు??" అని నా బాల్య వీపును చితగ్గొట్టాడు..

ఏడుస్తూ ఇంట్లోంచి బయటకొస్తున్న నన్ను చూసి మా అన్నయ్య మనసు కరిగింది..నా భుజం మీద చెయ్యి వేసి...నాకు జ్ఞాన బోధ చెయ్యటానికి మా పెరట్లోకి తీసుకెళ్ళాడు..అక్కడ బోధి వృక్షాలేవీ లేకపోవటం తో ఇద్దరూ మా గులాబి మొక్క కొమ్మలెక్కి కూర్చున్నాము..

"ఇప్పుడు చెప్పరా..నీ సమస్యేంటసలు?" అడిగాడు

"ఏమని చెప్పుకోను రా...'ఇంట్లో అందరికన్నా చిన్నవాడు..కొరింది ఇస్తారు ' అని నా గురించి పబ్లిక్ టాక్..కాని నేను పడే కష్టం ఆ పబ్లిక్ టాక్ కు తెలియదు..ఇంతవయసొచ్చినా నన్నింకా మరీ చిన్న పిల్లాడిలా చూస్తున్నారు..హైదరాబాదు లో నా వయసు పిల్లలంతా పెద్దవాళ్ళైపొయారు...ప్యాంట్లు, డబ్బు...ఏది కావాలంటే అది ఉంది వాళ్ళ దగ్గర..మన బాబేమో డబ్బూ ఇవ్వడూ..ప్యాంట్లూ కుట్టించడు నాకు..ఈ నిక్కరు చూడరా..నీకు నా మీద జాలి కలగట్లేదా?? నీ ప్యాంటు మీద ఒట్టేసి చెప్పు..." అని దీనంగా అడిగాను..

వెంటనే మా అన్నయ్య నా నిక్కరు జేబు చించి...దానిని జేబు రుమాలు లా వాడి నా కన్నీళ్ళు తుడిచాడు...నా చొక్క జేబులో ఉన్న ఉసిరికాయలు తీసి నా నోట్లొ ఒకటి వేసి...తన నోట్లొ ఒకటేసుకున్నాడు..

"థ్యాంక్స్ రా" అన్నాను..

"చూసావా..నీ జేబులోంచి ఉసిరికాయ తీసి నీకిస్తే థ్యాంక్స్ చెప్పావు..నిన్ను వెధవను చేస్తున్నా గుర్తించలేని వెధవ్వి నువ్వు..అందుకే నిన్ను చిన్న పిల్లడిలా చూసేది..సరే..నువ్వు కూడా నాన్నని ' బాబు ' అనే స్టేజ్ కు చేరుకున్నావు కాబట్టీ..నీకు కొన్ని జీవిత రహస్యాలు చెబుతాను. నిన్ను ఇంట్లో వాళ్ళు పెద్దవాడిగా గుర్తించాలంటే నువ్వు నిక్కర్లు కోసుకోవటం...బాల్య వివాహం చేసుకోవటం లాంటి విపరీత చర్యలు చేయనవసరం లేదు రా..నీ డబ్బు నువ్వు సంపాదించుకో" అన్నాడు..

"అంటే బాల కార్మికుడిని అవ్వమంటావా?"

"మూర్ఖా..సంపాదించుకోమంటే - అమ్మ పర్సులోంచి, నాన్న జేబులోంచి సంపాదించుకోమని.."

నా తల వెనకాల జ్ఞాన జ్యోతి వెలిగింది (సాయంత్రమయ్యిందని మా అమ్మ పెరట్లో లైటు వేసింది)..

"ఐతే వెంటనే వెళ్ళి మన బాబు జేబు బూజు దులిపొచ్చేస్తా" అని కొమ్మ దిగాను..

"ఆ తొందరే వద్దనేది..దొంగతనం చెయ్యటమనేది ఈత కొట్టటం లాంటిది" అన్నాడు..

"అంటే ఒక్క సారి నేర్చుకుంటే ఇక ఎప్పటికీ మరచిపోము అనా"

"కాదు...సరిగ్గా నేర్చుకోకుండా దూకితే మునిగి పోతావని"..అని ఒక గొప్ప దొంగ సూత్రం నేర్పాడు నాకు..

మళ్ళీ మా అన్నయ్యే మాట్లాడుతూ - "నువ్వు fresher దొంగవి...కాని నాకు చాలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు టీం లీడ్ ను నేను. కాబట్టీ..నువ్వు నాకు చంచాగిరి చేసావనుకో..నువ్వు పని సరిగ్గా వెలగబెట్టకపోయినా...నీకు ప్రమోషన్ వస్తుంది.." అన్నాడు..

ఆ వయసులో మా అన్నయ్య అన్న మాటలు నాకు అర్థమవ్వలేదు కాని, ఉద్యోగం చెయ్యటం మొదలెట్టాక బాగా అర్థమయ్యాయి...

ఆ తరువాత నా చేతికి ఒక పుస్తకమిచ్చాడు మా అన్నయ్య "ఇదిగో.. 'Rapidex దొంగల కోర్స్ '..దగ్గరుంచుకో..ఒక్క విషయం గుర్తుంచుకో..డబ్బు కొట్టేయాలనుకుంటే నెలలోని మొదటి ఐదు రోజుల్లోనే కొట్టెయ్యి..నెలాఖరు లో ఐతే జేబు లో ఉన్న అర్ధ రూపాయి కూడా అరక్షణానికొకసారి తడిమి చూసుకుంటాడు మన బాబు..ఈ మధ్య ఫింగర్ ప్రింటు గుర్తించే పౌడరు కూడ జేబులో చల్లుకుని తిరుగుతున్నాడు..ఎవరయినా చేతులు పెడితే పట్టుకోవాలని...జాగ్రత్త గా ఉండు. అన్నట్టు అసలు మాట - మొదటి సారే మన ఇంట్లో ప్రయత్నించకు..నీ స్నేహితులతో చేతులు కలిపి వాళ్ళ బాబులను దోచెయ్యి..బాగా అలవాటయ్యాక ఇంట్లో ప్రయత్నించు.." అని నన్ను ఆశీర్వదించి...గాలి లోంచి వీభూది పుట్టించి నా నోట్లో వేసాడు..ఆ తరువాత గొంతు లోంచి ఏదో తీస్తున్నట్టు చాల ఓవరాక్షన్ చేసి..నోట్లోంచి ఉసిరికాయ తీసిచ్చాడు...

నేను వెంటనే సుధాకర్ గాడి దగ్గరకెళ్ళి ..వాళ్ళ నాన్న జేబులో డబ్బు కొట్టేస్తే వెంటనే పెద్దవాళ్ళైపోవచ్చని చెప్పాను వాడితో..వాడు పంచాంగం చూసి మంచి ముహూర్తం నిర్ణయించాడు.ముహుర్తూం నాడు నెను సుధాకర్ ఇంటికి వెళ్ళాను..

"మనమయితే సరిగ్గా చేయగలుగుతామో లేదో నని ఒక consultant ని పిలిపించాను రా..ఇహనో ఇప్పుడో వచ్చేస్తాడు."

"కన్సల్టెంటా? ఎవర్రా?" అడిగాను..

"ఒక తమిళబ్బాయి..పుట్టి పెరిగిందంతా ఇక్కడేలే..దినకరన్ అని.."

"ఎన్నింటికొస్తాడేంటి?"

"వచ్చేస్తాడు రా..సాక్సులు ఇస్త్రీ చేయించుకొస్తానని వెళ్ళాడు.."

పది నిముషాల తరువాత చెప్పులేసుకొచ్చాడు దినకరన్..

ముగ్గురం కలిసి సుధాకర్ వాళ్ళ నాన్న గది వైపు వెళ్ళాము..ఆయన నిద్రపోతున్నారు..

నేనూ, సుధాకర్ తలుపు దగ్గరే నుంచున్నాము..దినకరన్ మెల్లిగా నడుస్తున్నాడు..ఎందుకో ఒక్క క్షణం ఆగాడు..ఆగినోడు ఊరికే ఉండక సుధాకర్ వాళ్ళ నాన్న భుజం తడుతూ "సార్...సార్ మిమ్మల్నే" అన్నాడు మెల్లిగా..అది చూసిన సుధాకర్ శబ్దం రాకుండా గట్టిగా అరిచాడు..అది విన్న దినకరన్ అరవకుండా శబ్దం చేసాడు..మెమిద్దరం గదిలోకెళ్ళి దినకరన్ ను బయటకు లాక్కొచ్చాము..

"మా నాన్నను నిద్ర లేపుతావే? నీకేమైనా పిచ్చా?" అడిగాడు సుధాకర్..

"అది కాదు..డబ్బు ఏ చొక్కా జేబులో పెట్టాడో అడుగుదామని...అంతే..అడిగాక మళ్ళీ పడుకోమని చెబుతా" అన్నాడు కన్సల్టెంట్..

నేను రంగం లోకి దిగాను.."చూడు దినకరన్..ఇప్పుడు నువ్వు చేయబోయేది పులి తోక లాగటం లాంటిది...." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా సుధాకర్ గాడు "రేయ్...నువ్వు అలాంటివన్నీ అనకు..ఇప్పుడు వీడెళ్ళి మా నాన్న లుంగీ లాగినా లాగుతాడు.....చూడు దినకరన్..ఇప్పుడు నువ్వు చేయబోయేది చాల అపాయం తో కూడిన పని..కాబట్టీ ఏ పొరబాటు చెయ్యకు.." అని చెప్పి పంపాడు..

ఈ సారి లోపలేమి జరుగుతోందో చూసే ధైర్యం లేక చార్లెస్ శోభరాజ్ మీద భారమేసి నేను, సుధాకర్ బయటే ఉన్నాను..కాస్సెపయ్యాక మెల్లిగా తలుపు తెరిచి తల బయటపెట్టాడు దినకరన్..

"జేబులో ఉన్నడబ్బంతా తీసాను...ఓకేనా?" అడిగాడు దినకరన్..

సుధాకర్ గాడు ఖంగారు గా "వొద్దొద్దు..మళ్ళీ మా నాన్నకు అనుమానమొచ్చేస్తుంది..అందులో సగం తిరిగి లోపల పెట్టెయ్యి" అన్నాడు..

ఇంకొక కాస్సేపు తరువాత బయటకొచ్చాడు దినకరన్...నుదుటి మీద పట్టిన చమట చూపుడు వేలుతో తీసి గాల్లోకి విసిరాడు..

"డబ్బేది?" అడిగాము నేను, సుధాకర్ ఆత్రంగా..

తన జేబులోంచి సగం చిరిగిన యాభై రూపాయల నోటు తీసాడు దినకరన్..

"ఇదేంటి?" అని అడగలేదు నేను, సుధాకర్..

"జేబులో ఒక్క యాభై రూపాయల నోటు మాత్రమే ఉంది" అని జవాబివ్వ లేదు దినకరన్..

ఎందుకంటే మేము మాట్లాడేలోపే "ఎవర్రా అది?" అని లోపలి నుంచి సుధాకర్ వాళ్ళ నన్న గొంతు వినబడింది..

"ఎవర్రా నా లుంగీ లాగింది?" అని అరిచాడు ఆయన..

నేను, సుధాకర్ గాడు ఒకేసారి "దినక....రన్" అని అరిచాము..

అక్కడ మొదలెట్టిన రన్నింగ్ ఆ దినకరన్ ను ఊరి బయటకు తరిమేదాక ఆపలేదు...

నాలో రోజురోజుకి అసహనం పెరిగిపోయింది..డబ్బెలా సంపాదించాలో పాలు పోలేదు. అందుకే నేరుగా మా అన్నయ్య డబ్బు దాచుకునే వాడి సైన్సు టెక్స్టు పుస్తకం లోంచి 23 రూపాయలు కొట్టేసాను..డబ్బు తీసేప్పుడు ఏదో పౌడర్ తగిలింది చేతికి..అది దులుపుకుని, 23 రూపాయలతో దుమ్ము దులిపేసాను..మరుసటి రోజు ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు చేతిలో పట్టుకునొచ్చాడు మా అన్నయ్య..

"గురు ద్రోహి..నాకే పంగ నామం పెడతావు రా? ఇదే నా శాపం - ఇప్పుడే కాదు..నీకు ఎన్నేళ్ళొచ్చినా నిన్ను పిల్ల వెధవ లాగే చూస్తారు జనం" అని అన్నాడు..గడియారం గంట మోగింది...టైం కరెక్టుగా అసురసంధ్యవేళ అయ్యింది..ఆకాశం లో రౌండ్సుకు తయారౌతున్న తథాస్తు దేవతలు మా అన్నయ్య మాట వినగానే "తథాస్తు...టేక్ ఇట్ ఈసీ" అన్నారు..

అంతే..

నాకిప్పుడు __ ఏళ్ళు..హైటు పెరిగినా, ప్యాంట్లు వేసుకుంటున్నా, డబ్బు సంపాదిస్తున్నా కూడా నన్ను ఒక పెద్ద వాడిగా గుర్తించే దిక్కేలేదు..

మొన్న ఆదివారం ఎవరో వచ్చారు ఇంటికి. నేనెళ్ళి "ఏంటి?" అనడిగాను..

"ఇంట్లో పెద్దవాళ్ళనెవరినైనా పిలు బాబు" అన్నాడు..నాకు గంపెడు కోపమొచ్చింది..

"నీ కళ్ళకి నేను పెద్దవాడిలాగా కనిపించట్లేదేంట్రా...మా ఇంటికే కాదు, మా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలానికి కూడా నేనే పెద్ద మనిషిని.." అని అంటుండగా మా అమ్మమ్మ నన్ను పక్కకు లాగి...ఆ వచ్చిన వాడికి నాలుగు చెక్కులిచ్చింది..వాడు ఆ చెక్కులు చూసి, అందులో ఒకటి తిరిగిస్తూ "ఇందులో సంతకం పెట్టలేదమ్మా" అన్నాడు..మా అమ్మమ్మ నా జేబులోంచి పెన్ను తీసుకుని 'D.S.Goutham' అని సంతకం చేసిచ్చింది...

"నా చెక్కులు నువ్విస్తావేంటి?" అన్నాను కోపంగా..దానికి మా అమ్మమ్మ "పోనీ కాస్సేపు మా వాడికి ఆ చెక్కులు ఇవ్వు నాయన..చెక్కాట ఆడుకుని ఇచ్చేస్తాడు" అంది..

"చెక్కాటేంటి? నీ మీద ఫోర్జరీ కేసు పెడతాను..నేనంటే ఎవ్వరికీ ఖాతరు లేకుండా పొయింది......" అంటుండగా..అల్లం పచ్చడి నంచి, పెసరట్టు నోట్లొ పెట్టింది మా అమ్మమ్మ.....అంతే..రెండు రోజులు రెస్ట్!!

ఇందాకే మా అన్నయ్యకు ఫోన్ చేసి వాడు పెట్టిన శాపానికి విమోచన ఎప్పుడని అడిగాను..తథాస్తు దేవతలను కాంటాక్ట్ చేయమన్నాడు..అందుకే డైరెక్టు గా దెవుడినే అడుగుతున్నా - "వల్లభరావు మాష్టారు..నాకెప్పుడు విరుగుడు????????????"

201 comments:

1 – 200 of 201   Newer›   Newest»
Anonymous said...

Too good

Wanderer said...
This comment has been removed by the author.
Wanderer said...

I started counting the number of sparks in this post and got tired after counting to 50 and then lost count... A fantastic long awaited post. Bless your heart, kid.

Sravya Vattikuti said...

చాల చాల బాగుంది !

మంచు పల్లకీ said...

చాల చాల చాల చాల బాగుంది ! కళ్ళలొ నుండి నీళ్ళుకూడ వచ్చాయి... నవ్వలేక..

చిలమకూరు విజయమోహన్ said...

టపాను ఆసాంతం చదివింపజేసారు.నాకేమో10th class లో ఒకటి ,ఇంటర్లో మూడు కుట్టించారు.ఇంటర్లో కూడా అప్పుడప్పుడు కాలేజీకి నిక్కర్లు వేసుకొనిపోక తప్పలేదు.నాకు తోడు నిక్కర్లు వేసుకొచ్చేవాడు ఇంకొకడుండేవాడు.ఇద్దరం చిన్నపిల్లల్లా ఉండేవాళ్ళం కాబట్టి లెక్చరర్లు కూడా ఏమనేవారుకాదు.

మధు said...

Nice one.

Venkata Ganesh. Veerubhotla said...

too good. Couldn't stop laughing!!

లలితప్రియదర్శిని said...

మీరొక కత్తి, కత్తి, కత్తి పిల్ల మగాడు... నవ్వీ నవ్వీ ... ఇక నవ్వలేక, ఆగి చదవాల్సొచ్చింది !
చివర్లో మళ్ళీ అల్లం పచ్చడితో ముగించటం వల్ల కొసమెరుపు తళుక్కున మెరిసింది !

Bhaskar said...

ఇన్ని రోజులు మీ పోస్టు కోసం ఎదురు చూసిన పుణ్యం దక్కింది. ప్రతి అక్షరమూ కేకో కేక.!

MURALI said...

ఈ నిక్కర్ భాదలు నేనూ పడ్డానండీ బాబు. సారీ ఈ బాబు మీరన్న బాబు కాదు మాములు బాబు. పక్కింటి అమ్మాయితో పెళ్ళే మీ శాపవిమోచనం అని నేను అనుకుంటున్నా. పనిలో పనిగా ఒక పాట ని గుర్తు చేస్తున్నా "గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే బుడి చెంబు కాదు."

తమిళన్ said...

wow

రవి said...

చిచ్చీ, మీ పెద్దాళ్ళెప్పిడూ ఇంతే. మా పిల్లల్నెప్పుడూ అర్థం చేసుకోలేరు.

మీ టపాకూ నాకూ భావసారూప్యం కుదిరింది.

songs lyrics said...

nice.

www.moviessongslyrics.blogspot.com

వెంకటరమణ said...

మీ ఉత్తరం - //అమ్మ బాబులకు, నాకు ప్యాంటు డబ్బు కావాలి.
నవ్వుకోలేక చచ్చాను.
బాల్య వివాహల గురించి , కట్నాల గురించి ఆ టైమె లోనే అంత ఆలోచించారన్నమాట !!

Karthika said...

hehe gud.

sravya said...

Too much. Long awaited post :)
చాలా చాలా విపరీతంగా బావుంది. :)

చైతన్య said...

ఎప్పటి లాగానే మీ పోస్ట్ 'సూపర్ గా ఉంది'... ఎప్పటి లాగానే నా కామెంట్...
"సూపర్ గా ఉంది"

Anonymous said...

మళ్ళీ కడుపుబ్బా నవ్వించారు. ఓ వంద థాంక్సులు!!!
హైలైట్స్ అంటే!!

మా అమ్మ "కింతూ..పరంతూ" అని ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా తాండవం మొదలెట్టాదు

అమృతం వచ్చాక ఎవరో లేడీ ...దేవతలను, రాక్షసులను కూర్చోబెట్టి "నీక్కావలసింది...నా దగ్గర ఉంది" అని పాడుతూ అమృతం పంచిపెట్టిందట..(ఇదే పాటను మన తెలుగు సినిమావాళ్ళు రైట్స్ తీసుకోకుండా వాడుకున్నారు)

"అమ్మా...నా నిక్కరు చిరిగిపోయిందమ్మా...శ్రధ్ధగా చదువుకుందామంటే......." నా డైలాగు పూర్తవ్వకుండానే మా అమ్మ మా అన్నయ్య చేతికి నా నిక్కరు, ఐదు రూపాయలిచ్చి ఇచ్చి - "ఇది కుట్టించుకురా" అని పంపింది

నేను నీలిమ ను బాల్య వివాహం చేసుకుందామనుకుంటున్నాను.

అక్కడ బోధి వృక్షాలేవీ లేకపోవటం తో ఇద్దరూ మా గులాబి మొక్క కొమ్మలెక్కి కూర్చున్నాము..

ఇదిగో.. 'Rapidex దొంగల కోర్స్ '..దగ్గరుంచుకో

అంటుండగా..అల్లం పచ్చడి నంచి, పెసరట్టు నోట్లొ పెట్టింది మా అమ్మమ్మ.....అంతే..రెండు రోజులు రెస్ట్!!


మొత్తానికి, జనాల నిరీక్షణ ఇలా ఫలించిందన్న మాట!!
మగధీర రివ్యూ లతో నూ, షారుఖ్ సోది తోను నిండిపోయిన వాతావరణం లో మళ్ళీ మంచి గంధపు పరిమళాలు వెదజల్లారు. గుడ్ కీప్ ఇట్ అప్

Ruth said...
This comment has been removed by the author.
Ruth said...

హ హ !!! నాకు అద్భుతం గా నచ్చెసింది మీ టపా. నెను ఇక్కడ కొత్త గాని, మీ పాత టపాలన్ని కుడా కవర్ చెసాను. మళ్ళి ఒక సారి..... ఛాలా బాగుంది !!!

సుజ్జి said...

navvatam aiipoyaka, migata sagam chaduvutanu.. !

హరి said...

రెండో సారి చదువుతూంటే మొదటి రౌండ్లో మిస్సైన గంపెడు ఛెణుకులు తగిలాయి. పూతరేకుల్లా పొరలు పొరలుగా హాస్యాన్ని నింపావయ్యా బాబూ. పాత టపాలన్నీ తిరగేస్తుంటె ఒక హాస్య రచయితగా చెందుతున్న పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది.

Thanks a million for all the laughs!

Adarsh said...

hahahah.. ababba navvaleka chaccham baabu...

(a+b) * (a-b) = sulphiric acid? hahahah... aassalu meeku ilanti ideas ela vastayi sir..

paapam mee friend dinakar.. em punyam chesukunnado inta popular ayyadu :P

rAsEgA said...

(a+b) * (a-b) == sulphuric acid ??

Too much :)

కత్తి మహేష్ కుమార్ said...

కేక

Ram said...

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

Lokesh said...

enka rela ga unte baguntadi story.. any way its good practical one.

Anitha said...

bless you!

Anonymous said...

meeru rasina konni gantalake inni comments vachai ante roju mee blog space ni check chese vallu enta mandi unnaro chooskondi mari .. including me.
inka frequent ga mammalni ananda parustaru ani asistunna..

చక్రవర్తి said...

(a+b) * (a-b) == sulphuric acid ??

నాకు అర్దం కాలేదు .. వివరించగలరు. ఇప్పటికీ మా ఇంట్లో ప్రస్తుత పరిస్తితీ ఇంతే. నేను చిన్న కొడుకునే అలాగే నా పెళ్ళాం కూడా చిన్న కూతురే.. అందువల్ల మేము ఎప్పటికీ పెద్దోళ్ళం అవ్వలేక ఎంత నరకం అనుభవిస్తున్నామో .. వివరంగా జోకారు ..

హేట్సాఫ్..

మరో పోస్ట్ కోసం వైటింగ్

Anonymous said...

అన్నయ్యా, కట్టి పడేశావన్నయ్యా. ఆనందంతో తాదాత్మ్యం చెందామనుకో

Anonymous said...

నిన్నెవడన్నా చిన్నోడన్నది

kiran said...

ha..ha..ha...chala bagundi..naku telsi meeru oka post rase mundara konni investigation lu chesi..baga alochinchi rastaranukunta..next post ki intha time teeskokandi...

sunnygadu alias sunnygadu uraph sunnygadu said...

"రాస్తాడు నా గౌతం ఈ రోజు" అని పడుకుంటున్నా,

అంతా బాగానే ఉంది కానీ ఇంత తాత్సారం కూడదు మాస్టారు, కొంచెం అడపా దడపా తాపాలు టప టప పేల్చండి.

ఈ తరహ చిల్ల పనులు చాల ఉన్నాయ్ మన ఖాతా లో,

కొంచెం http://jaajipoolu.blogspot.com తరహ లో ఉంది.

మొత్తానికి బాగు బాగు

శ్రీ said...

ఈస్ట్ ఆర్ వెస్ట్ యు ఆర్ ది బెస్ట్

వేమన said...

'శ్రీరామ' కొట్టేసి కింద శ్రీ రామాంజనేయ యుద్ధం అని రాసారు చూడండీ....heights...:)

నవ్వాగట్లేదు. ప్రతి చెణుకు బావుంది.

alamuru said...

అబ్బ, ఎంతకాలానికి మీ టపా చూస్తున్నాము.
దీనికోసం కళ్ళ కాయలు కాచేలా ఎదురుచూసాను. కాయలు, పళ్ళు అయి రాలిపోకముందే వచ్చింది, సంతోషం.బావుంది, కాని అద్భుతం గా లేదు. మీ మిగతా టపాల కి సరితూగలేదు. "అసమర్థుని కారుయాత్ర", "ఓణం ఆణో పెణ్ కుట్టి" etc. ల range కి మమ్మల్ని త్వరలో నవ్విస్తారని ఆశిస్తున్నాను. రాక రాక వచ్చే దినకర్ పాత్ర నిడివి తగ్గిస్తే మా "దినకర్ అభిమాన సంఘం" ఒక ఉద్యమం నిర్వహించాల్సివస్తుంది చూసుకోండి.మనుషుల అందాన్ని గొంతు (నీలిమ ని సుమలత‌ గొంతు) తో పోల్చడం లో మీకు మీరే సాటి.

మీరు మరీ 3-4 నెలలకొకసారి రాస్తే ఎలాగండీ? మీ పనులు మీకుంటాయనుకోండి, కానీ మాలాంటి హాస్యభోగులకు (నవ్వడం ఒక భోగం అన్నారు కదండి జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు), మీలాంటి హస్యాయోగులు (నవ్వడం ఒక యోగం అని పై వారే అన్నారు) మరీ ఇంత wait చేయించడం అస్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్సలు ఏమీ బాగాలేదు సుమండీ ! ! !

alamuru said...

మీ టపా చూడగానే నాకు నా చిన్నతనం లో జరిగిన ఒక సంఘట‌న గుర్తుకు వచింది. నేను ఐదవ తరగతి నుండి ఆరవ తరగతి కి వచ్చినప్పుడు బడి మారాను. కొత్త బడి కి మొదటి రోజు వెళ్ళినప్పుడు, ఒక‌ పెద్దతరగతమ్మయి వచ్చి నువ్వు మూడో తరగతా అని అడిగింది. నాకు అరికాలి మంట నెత్తికెక్కింది (కొత్త చెప్పులు వేసుకుని ఎండ‌ లో నిలుచున్నాను మరి). ఎంత కోపం వచ్చిందో చెప్పలేను. నా వయసు కి కాకపోయినా నేను వేసుకున్న "క్రొత్త school" dress కి అయినా మర్యాద ఇవ్వలేదని తెగ బాధపడ్డాను (ఆ బడి లో మూడవ తరగతి లేదు, అది high school, ఆరు నుండే మొదలవుతుంది). ఇంటికి వచ్చి మా నాన్నగారితో చెప్పి తెగ ఇదయిపొయాను. పోనిలేమ్మా నువ్వు కూడా పెద్ద తరగతులకి వెళ్ళాక అలాగే ఇంకెవరినైనా అడిగి ఏడిపిద్దువుగానిలే అని సర్దిచెప్పారు. పెద్ద తరగతులకి ఎప్పుడు వెళ్తానా అని కలలు కంటూ ఆ విషయాన్ని తేలికగా మరచిపొయాను.

Phani said...

This is 10 out of 10. Your post is too good. My friend forwarded this link to me. Yours blog has a great content. Keep bloging. Language is pakka local. This is the highlight of your post. Look forward to many such posts. Cheers!

Anonymous said...

చాలా బాగా వ్రాసారు.

"బాపు" గారి చేత టెలి ఫిల్మ్ తీయిస్తే బాగుంటుంది.

aswin budaraju said...

(a+b) * (a-b) = sulphiric acid

hilarious.

Rani said...

good one.

మీరు, మీ అన్నయ్య గులాబి మొక్క కొమ్మల మీద ఎలా కూర్చున్నారొ ఎంత ఆలొచించినా అర్థమవ్వట్లేదు :P

రాధిక said...

too good

Anonymous said...

u r rocking gowtham

రవిగారు said...

జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం' రాత్రి 11 గంటలకి ఇది చదివి గట్టి గ నవ్వుతుంటే (ఇంట్లో అందరు పడుకున్నరనుకుని )మా శ్రీమతి చాటింగ్ ఫ్రెండ్స్ అంటే నవ్వులు మా దగ్గరకి వచ్చేటప్పటికి విసుగులు అంటుంటే అబ్బే అది కాదు చిన్న పిల్లలు ఎప్పుడు ఫ్యాన్ చూస్తూ ఏమి ఆలోచిస్తూ వుంటారా అనుకునే వాణ్ణి ఇన్నాలకి దానర్ధం తెలిసింది (అదే జీవితం అనుకుంటారని} అని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.ఇక నుంచి మీ రాతలు ఎవరు లేనప్పుడే చదువు కోవాలని తిర్మనించుకున్న అపర్దాలకి ఆవకాశం ఇవ్వకుండా. ఇంకా నయం రేపొద్దున్న నా ఛాంబర్ లో చదువుతూ నవ్వుకుంటూ తే అదే సమయానికి నా దగ్గర పనిచేసే ఆడ లేడీస్ ఎవరన్నా ఆఫీసు ఫైల్ తీసుకుని లోపలి కి వచ్చి , నా ముసి ముసి నవ్వులు చూసి వుర్కొన్ది సార్ మీ కెప్పుడు అదే అంటే నా పరువేం కాను.

Rama Rao said...

Excellent boss....
waiting for next one ....

sree said...

Chala bagundi. koncham frequent ga rayandi.

Anonymous said...

ఒకానొకప్పుడు మీ పోస్టులు మమ్మల్ని బాగా నవ్వించేవి.
ఈ మధ్య బ్లాగ్లోకంలో ప్రవీన్ సర్మ అనే వ్యక్తి వచ్చిన దగ్గరనుండి అతడి కథలు చదివి అవాక్కయిపోయి, అతడి వ్యాఖ్యలు చదువుతూ నవ్వీ నవ్వీ ఇంకేదీ నవ్వించకుండా అయిపోయింది.
నా కైతే నిద్రలో కూడా అతడి వ్యాఖ్యలు గుర్తొచ్చి నవ్వొస్తూ ఉంటుంది :(
ఉన్నట్టుండి పుసుక్కున నవ్వేస్తున్నా నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా ఆరోగ్యం పై ఏవో సందేహాలు కమింగ్స్.

Anonymous said...

what is ప్రవీన్ సర్మ's blog?

sunita said...

A fantastic long awaited post.

పేరు చెప్తే గుర్తుపట్టేంత గొప్పవాడిని కాను said...

mee bglog kosam inni rojulu choosi choosi.....nenu pant vesukune age ki vachesanu...good one but not as good as ur other posts...konchem bloglokanni nidaralepandi tvaraga mee blogs tho...nenu padukundi mee last blog ki malli mee blog vachi nidra lepindi....(ante pani padu ledu ani kadu)...pls post frequently....

Ravi Kanth said...

Chaala chaala bagundi brother...

janaallo mee meeda expectations perigipovadam valla kontamandi koddiga vimarsistunnaremo kani..
naku matram mee pratee post denikade adbhutam...

You are a legend.
May the smiles that you bring to our faces take you to greater heights in your life..

సుభద్ర said...

చాలా బాగు౦ది.కెవ్వు కెక అనుకో౦డి....మీ బాల్యవివాహ౦ సీన్ మారీను..కామె౦ట్స్ న౦బర్ చెస్తేనే తెలుస్తు౦ది కదా

keshav said...

keka tapaaa...
nuclear fusion jaragadam...
patch veyyadam...
headmaster foto atikinchi maree kottadam.... hahahaha.... gana (lol (laugh out loud) ki tarjuma... gattiga navvu !)

Vasu said...

చాలా (౧౦౦ సార్లు) బావుంది . దినకరన్ ఎంట్రీ కి విజిల్ వేసాను వినపడిందా గౌతమ్ గారు. ఇంత కొత్త వింత అవిడియాలు మీకు ఎలా వస్తాయండి. Hats off to you.

ముఖ్యంగా ఈ లైన్స్ అదరగొట్టారు.

ఇద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే Nuclear Fusion

"జానకీ!!!" అని గట్టిగా అరిచాడు

నీక్కావలసింది...నా దగ్గర ఉంది"

కెమేరా మా అమ్మమ్మ వైపు తిరిగింది...తరువాత మా మ్మ వైపు...తరువాత మా బాబు వైపు.....ఆ తరువాత లాంగ్ షాట్..

"దొంగతనం చెయ్యటమనేది ఈత కొట్టటం లాంటి"

సాక్సులు ఇస్త్రీ చేయించుకొస్తానని వెళ్ళాడు

ఇప్పుడు వీడెళ్ళి మా నాన్న లుంగీ లాగినా లాగుతాడు

"ఇదేంటి?" అని అడగలేదు నేను, సుధాకర్..

"దినక....రన్"


P.S (అంటే ఏమిటి :D) - మీరు తరుచుగా రాస్తే మరింత సంతోషిస్తాం.

- వాసు

Vasu said...

అన్నట్టు ఉత్తరం మర్చిపోయా - మీ హ్యాండ్ రైటింగ్ చిన్నప్పుడు చాలా బావుంది :D

బొల్లోజు బాబా said...

అందుకే డైరెక్టు గా దెవుడినే అడుగుతున్నా - "వల్లభరావు మాష్టారు..నాకెప్పుడు విరుగుడు????????????

అద్బుతమైన ఫినిషింగ్ టచ్.

బొల్లోజు బాబా

Anonymous said...

awesome!

-sk

rajesh.battala said...

'శ్రీరామ' కొట్టేసి కింద శ్రీ రామాంజనేయ యుద్ధం అని రాసారు చూడండీ ' thats the first best part i liked it.

keep up writing such nice posts. i really liked it alot.
thanks for ur blogs..

Anonymous said...

ఎప్పటిలాగ నవ్వులే నవ్వుల్...!

హరే కృష్ణ . said...

PS
ps అంటే ఏంటి? ..హ హ్హ..

గోడ సోఫా ..హైలైట్

హాయిగా నవ్వించారు థాంక్స్ గౌతం

ఒక డౌట్ ..మీరు చిన్న స్కూల్ పిల్లలతో రాయించారా లెటర్ ..ఆ జలపాతం సూర్యుడు బొమ్మ కూడా

Shashank said...

రచ్చ గురు.. ఈ పోస్ట్ చదువుతున్నప్పుడే మా ఆవిడ సంపని సినెమా పెట్టింది.. అందులో పాట "నిక్కరేసుకున్న వాడు మేలు కద మామో. ముగ్గురు గరల్ ఫ్రెండ్స్ ఉన్నారు" అని.. ఈ టపా కి ఆ సాంగ్ మంచి వెనుక-నేల (అదే బ్యాక్ గ్రౌండ్) భలే సూట్ అయ్యింది. భలే టపా ... నీకుమళ్ళే నా స్థితి కూడా అలనే ఉండేది (ఉంది) .. ఇప్పటికి మా ఇంట్లో నీకెందుకురా పెద్దవాళ్ళ మధ్యలో అంటారు..

Anonymous said...

good one

Administrator said...

(a+b)*(a-b) = Sulphuric Acid
is Ultimate!!

surya said...

తమ్ముడు తోటరాముడూ పెళ్ళి అయిన తరవాత కూడా నీ హాస్యం ఇలాగే పండుగాక.
www.suryamahavratayajula.wordpress.com

Suresh Kumar Telu said...

Keka..Kevvu Keka.

Intalaa navvi chaalaa rojulayyindi. Prathee dialogue chaala haasyospadamgaa undi. Very creative work. A wonderful job.

I came to know about this blog by one of my friends and I must be very very thankful to him. Without him, I wouldnt have laughed this much. I felt very refreshed after read this article.

Thank you so much dude.

Telu.

Simha said...

awesome dude..
U rock !!!

kissna said...

ee roje mee blog maa kazin dwara telusukuni...choosi..chaala kaalam tarvatha..kadupubba..potta chekkalayyela navvukunna...many thanx andi...kalakaalam navvuthoo..navvisthoo...navvaleka..pottalu noppi puttalani koruthoo..maro navvula harivillu kosam noota nalabhai kallatho(sorry naavi ronde..but mee fallowers vi kooda kalipi..mee

విజయ్ నామోజు said...

తెలుగు బ్లాగ్లోకములొ మకుటం లేని మహారాజండి ( మీ మునపటి పొస్టు టైటిల్ కి జెస్టిఫికేషన్ లెండి ;) )మీరు ...మీ రెండు కాళ్ళు కాస్త పార్సల్ పంపితే ఒక కాలికి నీలం మరొ దానికి పసుపు వర్ణపు సాక్సులు తొడిగి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటానని సుధాకర్ వాళ్ళ నాన లుంగీ మరో సారి లాగి మరీ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ... హాస్య నటుడు ఆలీ భాషలో చెప్పాలంటే " కప్లింగ్ మె ధడ్ ధడ్ పువ్వు " పూయించారండి మీరు ఈ టపా తో ... హట్స్ ఆఫ్ ...

Anonymous said...

so nice.

e.v lakshmi said...

చాలా నవ్వించారు గౌతం గారు.

sridhar said...

chaala baaga raasaru.............chala rojula taruvatha thega navukunna

క్రిష్ణ ప్రసాద్ said...

చాలా బాగుంది! "నీక్కావలసింది...నా దగ్గర ఉంది" ఈ సందర్భం అద్భుతం గా కలిసింది.
"అలా తెల్ల నిక్కరుకు నల్ల సైకిల్ ట్యూబుల అలంకరణలతో నేను కాలం సాగదీస్తున్నప్పుడు" తలచుకుంటేనే భలే నవ్వొచింది.
.దొంగతనం చెయ్యటమనేది ఈత కొట్టటం లాంటిది.. అది నిజమే అనుకుంటా.

థాంక్స్ గౌతం..

Nag said...

హహహ ... నవ్వుతూనే ఉన్నానండీ మీ టపా చదువుతూ ... ఎందుకో దినకర్ పేరు కనపడగానే నవ్వు అలా వచ్చేస్తుంటది ... చాలా బాగుంది :)

Poorna said...

latega vachina latest ga vacharu. Many many thanks for giving so many laughs.

Damo' said...

basoo,
nee story lo chinna thappu dorlindhi. :) aadhivaram rahukalam podduna kaadhu. evening 4.30-6.00. so, kathalo mee babu poddunne Aaditya hrudayam chaduvuthunnapaudu vegu vacgadu annav(raahukaalam time lo). he he he he.I am just kidding here.
Eppatilane mee post keka. but requesting you to write quite frequently. ee recession debba lo mee rathalanna konchem ooratanisthayani aasisthooo..veelayithe maro tapa raasi pettandi. chooosi navvukoni tharisthamu. navvadam oka yogam. navvinchadam oka raja bhogam. I Strongly believe this line. PLZZZZZZZZZZZZZZZZZZZZZZZZzz

vijay bhaskar said...

superb

Nazgi said...

dinkar episode is too good....overall a great post....

Balu said...

I wonder how can you think like this...

Sri Vallabha said...
This comment has been removed by the author.
Sri Vallabha said...

తెల్ల నిక్కరుకు సైకిల్ ప్యాచిలు - కెవ్వు కేక :) . సరి లేరు మీకెవ్వరూ, .......

Ranjith said...

abbo super andi, "post office ki velli talapatralu koni uttaram rayadam" ee concept super andi...

Anonymous said...

nice

manasa said...

kasepu nakunna samasyalanni marchipoyanandi...
chala thanks....

Anonymous said...

Hi All, Recently I've seen a movie called "Airplane".
Indulo comedy motham thotaramudu blogs nundi inspire ayinattuga untundi!
Comedy priyulaku manchi treat!!

Issued in public interest :)
-Praveen

Anonymous said...

ultimate boss..

King said...

very good Gautham

AnuVamsi said...

Too much idi. ivale promotion list vochindi. naku chemchagiri cheta kadu. Result.....no promotion...... baga kopam to vundi, pani cheyyakunda mee post chadivanu. post lunch maa manager to yuddham anukunnanu. mood kasta maripoyindandi...... ippudela???

Anonymous said...

Chala bagundi...90Th Comment...

annaya veelithe edina weekly magazine ki pampinchanDi...

Boss

sumanb said...

Navvaleka chachipoyaa maastaaru... Chaala thanks

Anonymous said...

valla kaaaaadu....naaaa valla kaaaaadu.....
navvapadam naaa valla kadu

Anonymous said...

can you give me your phone number or mail id? please -

Bongu-Boshanam said...

Great Goutham you have been doing great.......

Bongu-Boshanam said...
This comment has been removed by the author.
Anonymous said...

super hit.

sudheer said...

చదువుతున్నత సెపు నవ లెక చచి పొయా ఆఫిసులొ అంతా నా వైపె పిచివాడిని చుసినట్లు చుసారు

చలా బాగుంది
నిక్కరు విషయం లొ నెను మీలాగె బాదపడ్డను కాని నాన్నగారు నామిద కొంచం తొందరగనె కరునించారు అందు వలన నా మిత్రులులొ నెనె ముందు వెసుకున్నాను అనుకొవాలి

నా చినప్పటి విషయలు మరల గుర్థు చెసినందుకు మీకు నా దన్యవాదములు

వంశీ కృష్ణ said...

1. జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం'
2. నన్ను ఎవరైన అలా తోసేస్తే..ఆ ట్రైను టైర్లన్నిటికీ గాలి తీసేసేంతవరకు ఆ స్టేషన్ నుండి కదలను
3. గుంటూరు వాస్తవ్యుడు గోంగూర కోసం బెంగళూరొచ్చినట్టుంది ఇది..
4. ఆ ఉత్తరం చదవగానే "జానకీ!!!" అని గట్టిగా అరిచాడు మా బాబు. 'జానకి!!!' అనే పేరుతో మా ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వల్ల ఎవ్వరూ పలకలేదు
5. నిన్ను వెధవను చేస్తున్నా గుర్తించలేని వెధవ్వి నువ్వు
6.ఇప్పుడు టీం లీడ్ ను నేను. కాబట్టీ..నువ్వు నాకు చంచాగిరి చేసావనుకో..నువ్వు పని సరిగ్గా వెలగబెట్టకపోయినా...నీకు ప్రమోషన్ వస్తుంది.

ఇంకంతే మాటల్లేవ్.....

Bixapathi Alagandula said...

ఇ౦ట్లో ఎవరైనా పెద్ద వాళ్లు౦టే పిలవ౦డి...వాళ్లకు చెప్పాలి చాలా చాలా బాగు౦దని!!!!!

gsk said...

Awwwwsomeee :)

Mahi said...

Its too gud...This is the first post i am reading of urs.....u made me keep waiting for rest... :)

Mahi said...

e post lo kick undi :)....too gud...

Murali Krishna said...

Chala bavundi. chala rojula tarvata Telugu sahityam :-).
Too good

Pradeep said...

Baaabai..kummavu..okkasari ilanti story eenadu kathala poti ki pampithe 1 st prize meede inka..

Shaik's Spot said...

రాకొ!! రాకు !!! రాకింగ్!!

వారి దెవుడో ఇంత సౄజనాత్మకతా?? నా కళ్ళు బైర్లు కమ్ముకున్నై
ఓ బ్లాగర్ మహషయ్య కొంపతీసి మీరు హైదరాబాద్ లొ ఉంటార?
ఒక్క సారి కలవండి బాబు పరిచయం చెసుకుంటా బాబ్బాబు మీకు పాపముండదు !!
నా పెరు షేక్ జహంగీర్ చేతిలొ ఒక శ్రవణ యంత్రం ఉంది దాని నంబరు -9849299007

Guns said...

great.. ur character reminded me of budugu and malgudi days..

telugu lo manchi hasyanni maku andistunnaduku nijamga meeku runapadi unnamu...

Vinay said...

hai sir , please give u r orkut id..please, i need to see u sir

Nagarjuna said...

kummESaav boss!!!
chaalaa rOjula taravaata big and completely entertaining post!!
you rock buddy!!

Manoj Addala said...
This comment has been removed by the author.
Manoj Addala said...

గౌతం గారు నేను మీ బ్లాగ్ చూసి నవ్వటం మొదలు పెట్టి ఇప్పటికి ఒక ఇయర్...
నిజంగా మీరు నవ్వించే తీరు...అమోఘం...
ఎంత బాధలో ఉన్నా సరే ఒక సరి మీ బ్లాగ్ రివిజన్ చేస్తే...చాలు కొండంత ఓదార్పు....
God Bless You...

Kiran said...

వల్లభరావు మాష్టారు???

Madhu varma datla said...

రెండు రెళ్ళు ఆరు :చాల చాల బాగుంది...నేను మీ బ్లాగ్ ని చైతన్య దంతులూరి గారి బ్లాగ్ నుంచి చూసాను. ఇది వర్ణాతితమైన అనుభూతి.చాల చాల బాగుంది.

bvraju said...

గౌతమ్,

ఈ రోజు ఆఫీస్ లో నేను చేసిందల్లా మీ బ్లాగ్ చదవడమే :)
అందుకే ఈ రోజు టైం కార్డ్ సబ్మిట్ చేసే అపుడు వర్క్ accomplished coloumn లో " రెండు రెళ్ళు ఆరు' అని రాద్దాము అనుకున్న కాని మల్లి మా ఆవిడ జీతం లెక్క అడుగుతుందేమో అని విరమించుకున్న:)

నేను కూడా బ్లాగ్ రాస్తూ వున్నా ...కొద్ది హాస్యపు క్రియేటివిటి నాకు కూడా వుంది అనుకునే వాడిని ..కాని మీ బ్లాగ్ చదివాక నాకు వున్నది సముద్రలో చిన్న నీటి చుక్క అని ఈ రోజు తెలిసింది...మీ కథ, కథనాకిని నా జోహార్లు

మీకు టైం వుంటే నా బ్లాగ్ చదివి ఎలా వుందో చెప్పండి.నా ఆర్కుట్ ప్రొఫైల్ లో మీ బ్లాగ్ పెట్టాను..నా ఫ్రెండ్స్ కి పరిచయo చేస్తూ.....


Raj
bvraju@gmail.com
http://bvraju212.blogspot.com/

Naani said...

Gowtham Garu,
Malli Mee post Adhirindhi.

Anonymous said...

getting restless again!!!

Karthik said...

ninna ratri journey chayadam valla office lo appude lite gaa nidra padtunte manager gaadi kantlo padda....abba nidra ela aapukovaalaa ani aalochistoo mee blog open chesaa...naa nidra antaa egiri poindante nammandi....bhale pani chesindi goutham gaaru ee post....:-)

Ashus Views said...

Maashtaru... chaala kaalam tharvatha intha healthy ga navvaledhu.. Thanks for the blog :)

uma blog said...

hahaha bale raasaru andi
navvaleka chachham

manchabbai said...

antha ok gaani
19.. naa vayasu
idee artham kaaledhu.. nijam gaane 19 varaku pant lu vesukoledhaa.. ayya baaboi papam kada mee oorlo ammai la paristhithi

nani chowdary said...

mee next post eppudu masteruuuuuuuuu

Nagu said...

Hi chalaa chalaa bavundandi... nenu first time choosa mee blog..
bavundi... inka ilaantivi expect chestunnam future lo

రిషి said...

మేష్టారూ...మీరు మామూలు మేష్టారు కాదు...హాస్య కళాశాల హెడ్డు మేష్టారు :-)

jeevani said...

ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని

Mauli said...

3. గుంటూరు వాస్తవ్యుడు గోంగూర కోసం బెంగళూరొచ్చినట్టుంది ఇది..


bwaaahhhh...naaa gurinche raasaru idi maatram ....

Subhaprada said...

naaku budugu gurthochchadu!!!
simply superb!!!!!

venu... said...
This comment has been removed by the author.
venu... said...

babu.. next post kosam waiting..

Anonymous said...

tooooooo gud.. navvalekapoyanu..

Naa Peeru Charan said...

inkaastha baa raayachhemo anipinchindhi maastaaru..!


http://srujanabhajana.blogspot.com/

Lav said...

Gautham!! chaalaa baagundi myaann!! Yo!! Guthundaa aa life?? sasaraa raaseyi

viswanath said...

polikeka :)

Anonymous said...

baagundandi - nenu meedi chuddam ide modatisari - baaga peddaga unna chaala muchataga undandi...

Sailatha said...

this is the first time am seeing the site... nd it is too good.. i enjoyed reading the blogs... ts really natural and the whole conversation is very funny... nice one..

Anonymous said...

hi,
first time ivale mee blog chusa adi frnd ni bore kodutondi edanna blog chepu ante mee blog chepadu....... 3 hrs nunchi chaduvutuna.......... navvi navvi kalalo neelu,bugalu noppi, kadupu noppi..... recesion valla intlo kaali ga unna job leka(fresher ni lendi e sari resume ki mee salahanu tapakunda patista).... maa amma garu deniki pichi patesindi ani ivala fix ayaru indake vachi teda teda ga chusi velaru.......

meelo hasyaniki ohh god _/\_ ala danam petali andi.....

chinapudu enimidava taragati lo anukunta budugu chadivi bapu ramanla fan ni aya....

marla ala navinchindi mee maga pilladu- pilla magadu... budugu gurtochadu.....

dinakar punch lu ayite superb andi....

next post epudu chestaru andi???

aftr a long time inta navanu tanks andi kadupubba navinchinanduku
mee racahanalu ilane saagalani korukuntu

Anonymous said...

Excellent ga rasaru nenu mee blogs chala baga follow avutunta thanks for entertaining us

Gopal VVS said...

2007-14 posts
2008-5 posts
2009-5 posts (wait chesi chesi.. ee savastharaniki enthey anukuni ..)
2010-?
Please we want more .....

Prem said...
This comment has been removed by the author.
చినబాబు said...
This comment has been removed by the author.
చినబాబు said...

ఒక చిన్న విన్నపం...
తెలంగాణ లొ ఆంధ్రా వాళ్ల సినీమాలు ఆపివేసారు కదా..! మీరు తరువాతి టపా లో 'మరోచరిత్ర ' లాంటి గాఢమైన ప్రేమ కధ ని తెలంగాణా యాస లో తీస్తే ఎలా ఉంటుందో మీ స్టైల్లో వ్రాస్తే చాలా ఆనందిస్తాను.
కనీసం ఈ టాపిక్ మీ తరువాతి పోస్ట్ లో ఎక్కడైనా ఇరికించండి... ప్లీజ్..!

Modini said...

Mee style adhurs andi :-) !!!!

Sunny said...

చాలా చాలా బాగుంది మాష్టారు !!!
మీకో చిన్న సైజు ఆస్కార్ ఇచ్చేయోచు !!

Anonymous said...

Hi Goutham,

Emayipoyyaru..

Anonymous said...

entandi inni rojulu ninchi mee posts kosam eduru choostunte okka post kuda rayatledu???

SkyLark said...

Yemayya Totaramudaa.. 2010 lo katha open chesedhi ledaa??

We r all waiting for the new post.. Come with it soon.

vinaykumar said...

whre are u sir , i also gave add on new telugu chanel soon it wil be launched just kidding , we are eagerly waiting sir,...

hehey kuro muro anandam vachina bada vachina rajendra prasad jayambu nichayambu lo arichinattu
andulone varalakshmi adiginattu

babuuuuuu yekkada unnav(dubbing in our situation)....

srinivas said...

very very funny & good stiry..........................

KITAN said...

I am feeling pretty much bored in the office. Upon contacting my fren, he gave this site address!! I am quite relieved now.. You are making all of us short of rolling on the floor laughing!!! :)

Manoj Addala said...

ఇంత మంచి రాతల్ని నేను చదివినందుకు ఎంతో పుణ్యం చేసుకున్నానేమో అనిపిస్తుంది... మనసు అంత ఇంతా హాయిగా....చాల చాల బాగుంటాయి మీ టపాలు...... రద్ది పెంచితే బాగుంటుంది ఏమో... మీ తపాల కోసం ఎదురు చూసే మీ శిష్య పరమాణువు
మను

Mahi said...

హాయ్,

నాది కూడా సేం ప్రోబ్లెం.

ఉద్యోగం చేస్తున్నా ఎవరూ పెద్దదానిగా గుర్తించరు.

పోస్ట్ మాత్రం చాలా బాగుంది

Chandra Sekhar said...

Fantastic read. :o)
Chala rojula taravata manchi telugu article. Hilarious...

rmandala said...

తరువాయి టపా కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నాం. ఈ నిరీక్షణ ఇంకెంతకాలం?

gowtham said...
This comment has been removed by the author.
Manoj Addala said...

Please Annayya post your new ones...I am eagerly waiting for it...

Anonymous said...

Hi Buddy,

Do you need us to place missing ad in paper.

-Ravi Krishna Reddy

venuram said...

ఈ నిరీక్షణ ఇంకెంతకాలం?

Aravinda said...

ఇంకెంతకాలం?

Ramnath said...

Please DSG garu, please post new one...

Srinivas said...

I am reading this blog for the first type. Article is awesome.

Anonymous said...

ఇన్నాళ్ళూ మీ బ్లాగ్గు చూడకపోవడం వలన ఏం కోల్పోయానో తెలిసింది. అద్భుతం !!!!!!!!!

ప్రభాకర్ రెడ్డి said...

ఇన్నాళ్ళూ మీ బ్లాగ్గు చూడకపోవడం వలన ఏం కోల్పోయానో తెలిసింది. అద్భుతం !!!!!!!!!
సేమ్ డైలాగు నాది కూడా. ఇట్లు, 2*2=6 అభిమానసంఘం.

పవన్ కుమార్ said...

అయ్యా తొటరాముడు గారు మీరు బ్లాగ్ రాయటం పూర్తిగా ఆపేసారా.
ఏదొటి రాయండి. 8 నెలలు అవుతుంది రాసి.
-ది నాకర్ ఫాన్స్

ప్రదీప్ said...

ఇంకెంత కాలం ఈ నిరీక్షణ???

చక్రపాణి said...

మా వలన ఏదైనా తప్పు జరిగుంటే చెప్పండి. అంతే కాని రాయడం మానద్దు

చినబాబు said...

మీరు ఆత్రేయ గారి వారసత్వం తీసుకున్నారా ఏమిటి? ఆయన రాసి ప్రేక్షకులని, రాయకుండా నిర్మాతలని ఏడిపించేవారట! మీరు రాసి మమ్మల్ని నవ్వించండి..చాలు!

Anonymous said...

entandi.. innni nelalu ayina inka post cheyyaledu.. mee tapa gurinchi mee abimanulam andaram eduruchoosthunam..

Anonymous said...

meeru blr ey anta kada.. ekkada untaaru? mimmalni kalisi maa vinnapalu andacheddamani..

sarath said...

"జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం' అని అనుకునే ఆ వయస్సులో..."ఏం చెప్పావు గురూ

Ramnath said...

ఇంకెంత కాలం ఈ నిరీక్షణ???

Anonymous said...

roju ee blog check chestunna ... august ninchi... kotta blog ledu.. ila aithe ela .. ela anadugutunna adyaksha!!

Anonymous said...

Enti baasu pellayi poyinda rayatam manesaru

Anonymous said...

Rhetoric dude........ telugulo cheppali ante....... adviteeya haasyarasa samgalithamu...

Sundeep said...

nice post. baaga navinchavu.

Arun Shourie said...
This comment has been removed by the author.
Arun Shourie said...
This comment has been removed by the author.
Arun Shourie said...

ఏమయ్యా గౌతం....వున్నవా... పెళ్లి అయిపోయి అండమాన్ లో సెటిల్ అయిపోయావా...ఏమిటయ్యా 1 year కావొస్తోంది.... ఏదయ్యా నీ టపా...రోజూ నీ టపా కోసం చూసుకుంటూ కళ్ళు వాచి పోతున్నాయి. త్వరలో నువ్వు టపా కనక రాయకపోతే ఎర్ర సైన్యం లో సైడ్ dancers లాగ మేము నీ మీదకి దండయాత్ర చేయాల్సి వస్తుంది.

Kamal said...

Keka mastaru...

సతీష్ కుమార్ చంద్రసేన said...

చాలా చాలా బాగుంది. చమక్కులు చాలా బాగున్నాయి.

TARAKA SAI RAM said...

VERY VERY VVVVVVVV SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSuper

KK said...

Super Boss!! Haayigaa undi chadavadaaniki..

Gopinadh K said...

Hi Gowtham...Its been an year that you have posted into the blog...we all are waiting for your new post...nuvvu mahesh babu laa chala gap teesukokunda...maa kosam oka post raastavani aasistu...

Gopal VVS said...

Hello saruuu...emadhya tapa ledhemiti...kompathesi pelli lanti riskulemaina chesara enti....

GIRI said...

simply super

Anonymous said...

hey,
Naaku mee sreeramanjaneya yuddam bommma baga pichi pichiga nachesindhi. Ounu Sreerama ani rasi endhuku strike chesaru...achu thappulem leve.... Emanna alignment miss ayyindha?? Meeru nijamgane ee letter rasi mee daddy pocket lo pettara...so funny :)

చక్రపాణి said...

మళ్ళీ ఎప్పుడు?

H'ble member of Thotaramudu Fans

hema said...

entandi babu, emaindi miku? ila maayamayipoyaru. memu roju waiting mee new post kosam. can anyone tell what happened to Mr. DS Gautham????

Manga said...

just visited the blog today..find nothing new..:(
Enti Goutham garu chala busy naa..time chusukuni maa kosam blog update cheyandiiii

Anonymous said...

గౌతం గారు...మీ బ్లాగులొ తపాలు చదవక ఏడాది గడిచింది.

ఇక నైన కరుణించి కటాక్షించండి

Anonymous said...

జీవితమంటే 'రోజంతా పడుకుని సీలింగు ఫ్యాను చూస్తూ ఉండటం' అని అనుకునే ఆ వయస్సు?
ante when you are at <1 year of age?

Sashi said...

adirindi sir......chaala chaala navvinchaaru...dhanyavaadaalu mee haasya rachanaki.

Ravi said...

Mee Haasya post ni choosi malli Jandyala gaaru gurtuku vacharu..

post lo nachinavi points ga raadhamantae . . kudaradam leedhu ... motham post antha nachindi . .

Thanks manaspoorthi ga naavukunna.

Ravi

Praveen Sarma said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు వెబ్ మీడియా వారు ప్రారంభించిన వీడియో చానెల్‌కి నిర్మాతలు కావలెను. మా వీడియో చానెల్ URL http://videos.teluguwebmedia.in మీరు కాంటేసియా స్టూడియో లేదా సైబర్‌లింక్ పవర్ డైరెక్టర్ ద్వారా వీడియోలు రూపొందించి మాకు పంపవలెను. వీడియో యొక్క ఫైల్‌ని మెయిల్‌లో అటాచ్ చేసి ఈ అడ్రెస్‌లని పంపవలెను telugu-videos[at]posterous.com , praveensarma[at]teluguwebmedia.in

reachanr said...

Puli Keka

reachanr said...

Puli Keka

Meraj Fathima said...

Sir, simply hilarious.

Meraj Fathima said...

Sir, Simply hilarious.

Meraj Fathima said...

Sir, simply hilarious.

Anonymous said...

maa potta chekkalu chesinanduku mee meeda police case vesamu :)

Kiran Maroju said...

ookka post lo inni jokes untayani neneppdu oohinchaledu...nijamga navvi navvi edupu vachindi anuko,,,

Anonymous said...

సూపర్! సూపర్!! సూపర్!!! దుమ్ము లేపావన్న...!

CP said...

Superb!!

«Oldest ‹Older   1 – 200 of 201   Newer› Newest»