Thursday, September 16, 2010

ఈదలేని గోదావరి

******************

"ఏరా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా?"

"పరీక్షల టైం లోనా..మమూలు టైం లోనా?"

"అన్ని సమయాల్లోనూ రా.."

"అంటే..పరీక్షల సమయాల్లో, రిజల్ట్ వచ్చేముందు ..మనసులో ధ్యానించుకుంటాను - 'వచ్చే సెప్టెంబర్ లోనైనా ప్రశ్నాపత్రం లో ప్రశ్నలేవీ లేకుండా చూడు తండ్రీ' అని. మమూలు సమయాల్లో - అంటే..పేకాటాడేప్పుడు, లాటరీ టికెట్లు కొన్నప్పుడు, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడేప్పుడు..'అవతలి వాడు సర్వనాశనమై పోయి...ఈ ప్రపంచమంతా సుఖ సౌభాగ్యాలతో తలతూగేలా చూడు స్వామీ..' అని లోకకళ్యాణం కోసం కోరుకుంటాను.."

"నీ లాంటి వాడికి ఏ నడి సముద్రం లో మునుగుతున్నప్పుడో తప్ప...దేవుడి విలువ తెలియదు రా.."

******************


ఇది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు..నాకూ, మా శీను మావయ్యకు జరిగిన సంభాషణ. మా మావయ్య శాపానికి భయపడి నేను సముద్రం దరిదాపుల్లోకి వెళ్ళలేదు.....ఇప్పటిదాక.

మా అమ్మ, అమ్మమ్మ తిరుమలలో బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళ్ళి..ఇల్లంతా మన ఆధీనంలోకి వస్తే ఏ బాధ్యతాయుతమైన పౌరుడైనా ఏం చేస్తాడు? (జవాబు - కొంప కొల్లేరు చేస్తాడు). నేనూ అదే చేసాను. "ఖాళీ ఇల్లు దొరికింది" అని వినగానే నా ఫ్రెండ్స్ - ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు, షాపింగ్ చేస్తున్న వాళ్ళు, పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు - అందరూ వాళ్ళ పనులు మధ్యలో వదిలేసి మా ఇంటికి బయలుదేరారు. రవి, నీల్ విజయ్, దినకర్, బాలనాగు రాఘవేంద్ర కుమార్...ఇల్లు చేరుకున్నారు. మా వాళ్ళంతా ఇంట్లోకి రాగానే ఇంటి బయట "men's hostel" అని బోర్డు పెట్టి, తలుపు వేసి..TV లో 'భార్యామణి ' సీరియల్ పెట్టాము. మొహానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిన ఐశ్వర్య...తరువాతి ఎపిసోడ్ లో...మొహం మారిపోయి, లావు తగ్గి, పొడుగు పెరిగి, జడ సైజు పెరిగి కనిపించింది. ఈ అద్భుతాన్ని జీర్ణించుకునేలోపు ఎవరో తలుపు కొట్టారు..

మురళీ మోహన్ గారు..

"హలో బాస్. నిన్న సాయంత్రం మీకోసం వస్తే లేరు. మన అపార్ట్మెంట్స్ లో 'potluck' డిన్నర్ జరిగింది. అక్కడ అందరూ కలిసి 'అండమాన్ ' దీవులకు పిక్నిక్ వెళ్దామని నిర్ణయించాము. మీరు కూడా రావాలి..పడవ లో ప్రయాణం."

నాకు నోట మాట రాలేదు...లేకపొతే ఏంటి??? - మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఐశ్వర్య పొడుగు ఎలా పెరుగుతుంది???

"ఏంటండీ...ఏదైనా ప్రాబ్లమా?"

"సారీ..నేను ఏదో ఆలోచిస్తున్నాను. అలాగే వస్తాను..ఇదిగో నా స్నేహితులను కూడా తీసుకొస్తాను." అని చెప్పి ఆయన్ను పంపేసాను.

భార్యామణి దెబ్బనుంచి తేరుకున్న తరువాత అర్థమయ్యింది...అనవసరంగా మాటిచ్చాను అని. అప్పటికే అండమాన్ ప్రయాణమని గెంతులేస్తున్న మావాళ్ళకి మా శీను మావయ్య స్టోరీ చెప్పాను.

"అసలే పడవలో ప్రయాణం అంటున్నారు..మావయ్య మాటలు నిజమైతే?" అన్నాను.

నీల్ విజయ్ గాడు నా చేతిలో రెమోట్ తీసుకుని.."నీ మొహం..అలా అనవసరంగా భయపడకు" అని ఛానల్ మార్చాడు. 'గోరంత దీపం' సినిమా వస్తోంది. అందులో మొదటి పాట - చరణం మొదలయ్యింది..

"కడలి నడుమ పడవ మునిగితే...కడదాకా ఈదాలి" అన్న లైను వచ్చింది..

పడవ సంగతేమో కానీ, మా గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి. కారణం - మాలో ఎవ్వరికీ ఈత రాదు.


"ఇలా భయపడి ఒక మంచి ట్రిప్పు మిస్ అవ్వకూడదు మనం. బయలుదేరటానికి ఇంకా టైం ఉందిగా..స్విమ్మింగ్ నేర్చుకుందాం..ఏమంటారు?" అని అందరినీ చూసాడు బలనాగు.

ఇందాకటి నుంచి 'తెలుగు-కన్నడ ' నిఘంటువు లో 'potluck dinner' అన్న పదానికి అర్థం వెతుకుతున్న దినకర్ గాడు తల పైకిలెపి..

"ఇందిరా నగర్ లో ఉన్న 'water palace' లో నేర్చుకుందాం రా స్విమ్మింగ్. అక్కడ రిసెప్షనిస్ట్లు.. స్విమ్మింగ్ నేర్చుకోవటానికి వచ్చిన అమ్మాయిల్లా బికినీలు వేసుకుని ఉంటారని ఆస్పత్రి లో ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను.." అన్నాడు.

ఈ మాట వినగానే మారు మాట్లాడకుండా water palace కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఎంత త్వరగా చేరుకుంటే అంత త్వరగా రిసెప్షనిస్ట్లని చూడొ.....అదే...ఈత నేర్చుకోవచ్చని.. వెంటనే ఇంటినుంచి బయటకొచ్చి, అటు గా వస్తున్నా ఒక రోడ్ రోలర్ వాడిని లిఫ్ట్ అడిగి..ఆఘమేఘాల మీద కంకర్రాళ్ళు తొక్కుకుంటూ water palace చేరాము. రోడ్ రోలర్ వాడు బ్రేక్ వేయకముందే అందరమూ కిందకు దూకేసాము. అలా దుమ్ము కొట్టుకున్న చొక్కాలు దులుపు కోకుండా...పరిగెట్టుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాము.

అక్కడి దృశ్యం చూసి మా అందరి నోళ్ళు, కళ్ళు తెరుచుకున్నాయి..దినకర్ విన్నది నిజమే.రిసెప్షనిస్ట్లు బికినీలు వేసుకుని ఉన్నారు....మగ రిసెప్షనిస్ట్లు!! మీసాలు, గడ్డాలు పెంచుకుని, సిగరెట్లు తాగుతూ...బికినీలు వేసుకుని ఉన్నారు.

మనసులోని కన్నీళ్ళు కంట్లోకి రాకుండా, గొంతులోనే మింగేసాము.

"ఏరా ఏం చేద్దాం?" అన్నాడు దినకర్.

"నిన్ను చంపక ముందా...చంపిన తరువాతా?" అడిగాడు బాలనాగు.

"నేనేమి చెయ్యను రా...ఆస్పత్రి లో కొంత మంది డాక్టర్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. విన్నది మీకు విన్నవించుకున్నాను " అన్నాడు. ఆ మాటలు అంటూనే...రిసెప్షనిస్ట్లను ఓ రెండు క్షణాలు తీక్షణంగా చూసి - "రేయ్..ఆ ఆస్పత్రిలో మాట్లాడుకున్నది వీళ్ళే.." అని ఆ బికినీ వీరుల వైపు చూపించాడు.

వాళ్ళకు మా మాటలు, మా వాలకం చూసి విషయం అర్థమైనట్టుంది. మీసాలు తిప్పుకుంటూ, గడ్డం గోక్కుంటూ మా దగ్గరకు వచ్చి.."ఎలాగూ ఇంతదాకా వచ్చారు..ఒక్క రోజులో మీ అందరినీ గొప్ప ఈతగాళ్ళను చేస్తాము.." అన్నారు.

రిసెప్షన్ డెస్క్ వెనకాల ఒక పెద్ద పోస్టర్ ఉంది -

"మా దగ్గర ఈత నేర్చుకున్న వళ్ళు" - అన్న హెడింగ్ కింద మిహిర్ సేన్, మైకెల్ ఫెల్ప్స్ ఫొటోలు ఉన్నాయి.
"మా దగ్గర ఈత నేర్చుకోని వాళ్ళు" - అన్న హెడింగ్ కింద టైటానిక్ పడవ, బుధ్ధుడి విగ్రహం ఫొటోలు ఉన్నాయి.

ఆ రెండో లిస్ట్ లో మా ఫొటోలు చూసుకోవటం ఇష్టం లేక, డబ్బు కట్టేసాము. పైగా ఒకే రోజులో ఈత నేర్పించేస్తాము అంటున్నారు..

------

బికినీలు అవీ వేసుకుని ఈత కొట్టలేము కాబట్టీ..మాంచి స్విమ్మింగ్ కాస్ట్యూంస్ కొందామని ఊరి మీద పడ్డాము.

డబుల్ రోడ్డు లో వరుసగా స్పోర్ట్స్ గూడ్స్ షాపులు ఉన్నాయి..మొదటి కొట్టులోకి వెళ్ళాము.

"మేమంతా ఈత నేర్చుకోవాలనుకుంటున్నామండి..స్విమ్మింగ్ పూల్ లో చొక్కాలూ అవీ విప్పేసి దూకాలటగా. అందుకు ఏమి కావాలో కొందామని వచ్చాము " అన్నాను. ఆ కొట్టు వాడు నా మాటలు అర్థం కానట్టు చూస్తున్నాడు. మేమంతా చకచకా చొక్కాలు, బనియన్లు విప్పేసి.. "ఇలా చొక్కాలు విప్పి..ఈత నేర్చుకోవాలనుకుంటున్నాము.."

మా అర్ధనగ్న ప్రదర్శన చూసి కొట్టు వాడు లోపలికెళ్ళాడు. చొక్కాలు విప్పేసాం కదా..ఎవరెవరు ఏ డియోడరెంటు కొట్టుకొచ్చామో డిస్కస్ చేస్తున్నాము. దినకర్ గాడు చమట వాసన తో పాటూ..బొద్దింకలూ గట్రా రాకుండా బేగాన్ స్ప్రే కొట్టుకొచ్చాడట. అందుకే మాకు దూరంగా నిలబడి ఉన్నాడు..

రెండు నిముషాల తరువాత కొట్టు వాడు ఒక 'treadmill' తీసుకుని వచ్చాడు. మా చొక్కాలన్నీ తగిలించటానికి తెచ్చాడేమో అనుకుని అందరమూ దాని మీద చొక్కాలు వేసాము. కొట్టు వాడి మొహం లో రంగులు మారాయి. నాకు విషయం అర్థమయ్యింది - "బేగాన్ స్ప్రే కొట్టుకొచ్చింది వాడు.." అని దినకర్ గాడిని చూపించాను.

నేనన్న మాటలు పట్టించుకోకుండా.."ఈ treadmill తెచ్చింది చొక్కాలు తగిలించుకోవటానికీ, వడ్లు ఎండబెట్టుకోవటానికీ కాదు సార్. మీరంతా ఇది కొని, కొద్ది రోజులు వ్యాయామం చేసి, ఆ తరువాత చొక్కాలు విప్పి జనజీవన స్రవంతి లోకి వెళ్ళటం మంచిది. లేకపోతే ఏంటి సార్ ఆ బొజ్జలు? అక్కడ ఈత నేర్చుకోవటానికి అమ్మాయిలు, పిల్లలు వస్తారు..పెళ్ళి కాని అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే.."ఇటువంటి వాళ్ళనా మేము పెళ్ళిళ్ళు చేసుకోవలసింది?" అని క్షోభ పడతారు..చిన్న పిల్లలు చూస్తే "పెద్దయ్యాక ఇలా తయారౌతామా?" అని భయపడతారు. కాస్త కూడా మానవత్వం లేకుండా ఇలా ప్రవర్తించటం భావ్యమా మీకు?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.

మాకు కనువిప్పు కలిగింది..మా తప్పు తెలిసొచ్చింది. వెంటనే వీడి షాపులో నుంచి బయటకొచ్చి పక్క షాపులోకి వెళ్ళాము.

"మేము చొక్కాలూ అవీ వేసుకుని ఈత నేర్చుకోవాలనుకుంటున్నాము. దానికి కావలసిన వస్తువులు ఇస్తారా? మా దగ్గర treadmill ఉంది. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇంతింత బొజ్జలు ఉన్న పిల్లాలు కూడా ఉన్నారు. మీ కొట్లో కాక్రోచులు లాంటివి ఉంటే..మావాడిని లోపలికి తీసుకొస్తాము." అని బయట చొక్కా లేకుండా నించుని ఉన్న దినకర్ గాడిని చూపించాను. మా వాళ్ళంతా నా తెలివితేటలకు అబ్బురపడిపోయారు. ఇంత తేటతెల్లంగా చెప్పటం వల్ల కొట్టువాడికి కూడా అర్థమయ్యింది. మా తలలు తడవకుండా, చెవుల్లోకి, కళ్ళలోకి నీళ్ళు పోకుండా ఏవో గుడ్డపేలికలు, కళ్ళద్దాలు ఇచ్చాడు. షాపు వాడికి డబ్బిచ్చేసి, ఆ కళ్ళద్దాలు పెట్టుకుని, స్లో మోషన్ లో అందరమూ బయటకొచ్చాము.

"ఏరా...నువ్వు కొనవా? నీ తల తడిస్తే?" అనడిగాము దినకర్ గాడిని. వాడు ఒక నవ్వు నవ్వి.."నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను..పదండి" అన్నాడు.

రెండు రోజుల తరువాత water palace కు బయలుదేరాము.


స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చేరగానే చొక్కాలు గట్రా విప్పేసి, స్విమ్మింగ్ కాస్ట్యూంస్ వేసుకున్నాము. మేము తప్ప ఇంకెవ్వరూ లేరు. మా బొజ్జలు చూస్తే ఇక్కడికి వచ్చే జనాల ఆత్మగౌరవం దెబ్బతింటుందని..బొజ్జలు లోపలికి లాక్కుని, ఊపిరి బిగపట్టుకుని నిలబడ్డాము.

10 నిముషాల తరువాత ఒకాయన తలకు కిరీటం, చేతిలో పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు..

"హలో. నేను రాజుని...సుబ్బరాజుని.” అన్నారాయన.

మేమంతా “బహుపరాక్..బహుపరాక్” అని అరిచాము.

“ఆపండయ్యా వెధవ గోల. మీ ట్రైనర్ ని నేను. మీకు ఈత నేర్పటానికి వచ్చాను. ఈ రోజు మొత్తం నేను చెప్పినట్టు వినకపోతే ఈ కత్తి తో పొడిచేస్తాను. ఈ రోజు ముగిసేలోపు మీకు ఈత రాకపొతే ఇదే కత్తి తో మీరు నన్ను పొడిచెయ్యొచ్చు. ఈ ట్రైనింగ్ అయ్యాక అందరికన్నా బాగా ఈదగలిగిన వారికి ఈ డొక్కు కిరీటం బహుమతిగా ఇస్తాను.." అని కిరీటం, కత్తి పక్కన పెట్టారు రాజుగారు.

"ఈ రోజు మీరు తప్ప ఇంకెవ్వరూ రావట్లేదు ఈత నేర్చుకోవటానికి..ఇక ఊపిరి వదిలి మీ బొజ్జలు మామూలుగా పెట్టొచ్చు. ఇంకాస్సేపాగితే ఆక్సిజన్ మాస్కులు తెప్పించాల్సొచ్చేలా ఉంది. మీరూ మీ వెధవ టెక్నిక్కులు.." అని అసలు విషయం చెప్పి మాకు కొత్త ఊపిరి ప్రసాదించారు.

మేము మా బొజ్జలు విచ్చలవిడిగా బయటకు వదిలి నిలబడ్డాము.

“మీ తలలు, కళ్ళు తడవకుండా, చెవుల్లోకి నీళ్ళు పోకుండా ఏర్పాట్లు చేసుకున్నారా?” – రాజుగారడిగారు..

“యస్సార్” అని మేము తెచ్చుకున్నవన్నీ తగిలించుకున్నాము..ఒక్క దినకర్ గాడు తప్ప. రాజుగారు వాడిని చూసి..”మరి నువ్వు?” అనడిగారు. దినకర్ గాడు తన బ్యాగ్ లోంచి ఒక గొడుగు తీసి, అది తెరిచి, తల మీద పెట్టుకుని నిలబడ్డాడు.

రాజుగారు మమ్మల్ని చూసి.."ఎవరీ వ్యక్తి? పొద్దున్నే తాగొచ్చాడా? ముందు ఆ గొడుగు పక్కన పెట్టి రమ్మనండి.." అన్నారు

"మా వాడే సార్.." అని ఆయనకు సర్దిచెప్పి..దినకర్ గాడి గొడుగు పక్కన పడేసాము.


రాజుగారు అందరినీ హైటు ప్రకారం వరుసగా లైన్ లో నిలబెట్టారు.

“సరే..ఇప్పుడు చేతులు మోకాళ్ళ మీద ఉంచండి...ఎడమ చేత్తో వీపు మీద గోక్కోండి......రైట్..ఇప్పుడు లేచి నిలబడండి..."...

ఈత నేర్చుకోవటం చాలా సులభంగా ఉన్నట్టుందే అనుకుంటుండగా.. “ఇందాక మీరు చేసిన పనులకూ, మీ ట్రైనింగ్ కు.. ఏ సంబంధమూ లేదు. చెప్పిన మాట వింటారా లేదా అని ఒక చిన్న టెస్టు అంతే." అన్నారు రాజుగారు. ఈయన్ని కత్తి తో పొడవటానికి సాయంత్రం దాకా ఆగాలా అనిపించింది..

"ఈత రావాలంటే..ముందుగా క్రమశిక్షణ ఉండాలి...." అని మొదలుపెట్టారాయన.

పక్కవాడికి ఏదైనా నేర్పాలీ అంటే చాలు..ఎక్కడలేని ఙ్ఞానబోధ చేస్తారు జనం. సైకిల్ నేర్పించటానికి కూడా "నీ కన్ను, మనసు హ్యాండిల్ మీదనే ఉండాలి. కాళ్ళలో రసస్పందన కలిగి, తాదాత్మ్యం చెంది...పెడల్ తొక్కితే తప్ప..సైకిల్ ముందుకు కదలదు.." అని భయపెడితే ఎలా?

ఇప్పుడు ఈ ఈత నేర్చుకోవటానికి క్రమశిక్షణ, దుర్గాచరణుడి పట్టుదలా..అన్నీ నేర్చుకోవాలంటే ఎలా?

"ఒక 500 రూపాయలు ఎక్కువ కడితే..క్రమశిక్షణ లేకున్నా, ఈత నేర్పించేస్తాను " అని నేను మనసులో నెమ్మదిగా అడిగిన ప్రశ్నకు గట్టిగా సమధానమిచ్చారు. మా లాంటి సన్నకారు ఈతగాళ్ళకు ప్రభుత్వం అందించిన ఈ చేయూతకు మేమంతా హర్షించి చప్పట్లు కొట్టాము.

"సరే..ముందుగా..నాలుగు అడుగుల లోతు నీళ్ళలో దిగాలి. ఆ తరువాత మెల్లిగా ఆరు అడుగులు..నెక్స్ట్, పది అడుగులు. జీవితం లోనే కాదు..నీళ్ళలో కూడా మీకాళ్ళ మీద మీరు నిలబడేలా చేస్తాను. మనిషి చంద్రమండలం మీద ఈత కొడుతున్న రోజులివి.. మనము ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ లో ఈ మూల నుంచి ఆ మూలకు ఈత కొట్టలేమా???"

"దీనికి సమాధానం నాకు తెలుసు సార్..నేను చెబుతాను..ప్లీజ్..సిర్..ప్లీజ్" అని చెయ్యి పైకెత్తి రాజుగారి మీదకు వెళ్తున్నాడు దినకర్..

"నీ మొహం..నువ్వు సమాధానం చెప్పటానికి నేను ఏ ప్రశ్నా అడగలేదయ్యా...ఏదో మిమ్మల్ని ఉత్తేజితుల్ని చెయ్యాలని అలా అన్నాను. వాక్యం చివర్లో క్వస్చన్ మార్కు ఉన్నంత మాత్రాన...నాలుగో తరగతి పిల్లాడిలా "నేను చెబుతాను..నేను " అని అలా అరుస్తావేంటి..ఎవడయ్యా వీడు?" అని మా వైపు చూసి అడిగారు. ఈ ప్రశ్న కూడా మమ్మల్ని ఉత్తేజితుల్ని చెయ్యటానికి అడిగారేమో రాజుగారు అని మేమెవ్వరూ సమాధానం ఇవ్వలేదు.

"సరే...తరువాతి స్టెప్.." అని ఆయన వాక్యం ముగించే లోగా మేమంతా స్విమ్మింగ్ పూల్ వైపు నడవటం మొదలు పెత్తాము. ఇంకేముంటుంది తరువాతి స్టెప్..నీళ్ళలోకి దూకి, ఈత కొట్టి, రానున్న కామన్ వెల్త్ గేంస్ లో గోల్డ్ మెడల్ సంపదించటం తప్ప..

"ఆగండాగండి....ఏంటి..స్విమ్మింగ్ పూల్ లోకి దిగేద్దామనే?? దిగే ముందు వెళ్ళి స్నానం చేసి రండి " అని ఆదేశించారు రాజుగారు. మేము ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాము. అందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో పుష్కర స్నానాలు చేద్దామని, రెండు రోజులుగా స్నానం చెయ్యకుండా డియోడరెంట్లు కొట్టుకుని తిరుగుతున్నాము. ఇప్పుడు చూస్తే ఈయన స్నానం చేసొచ్చేదాకా నీళ్ళలోకి దిగనివ్వను అంటున్నాడు..

"ఆ మూల షవర్లు ఉన్నాయి. షాంపూ, సబ్బు రుద్దుకుని శుభ్రంగా స్నానం చేసి రండి.." అని దినకర్ ను చూసి.."ఇదిగో..నువ్వు ఆ గొడుగు ఇక్కడే పెట్టి వెళ్ళు బాబూ.." అన్నాడు.

మేమంతా ఆయన చెప్పిన చోటికి వెళ్ళాము. పేరు కు 'షవర్లు '...అక్కడ ఒక్క షవర్ కూడా పని చేసి చావట్లేదు. ఏడు బక్కెట్లలో నీళ్ళున్నాయి. ఐదుగురికి కలిపి రెండు సబ్బులు, ఒక షాంపూ డబ్బా ఉంది.

"ఎవడు ముందు స్నానం చేసొస్తే...వాడికి ఫీజ్ లోంచి 50 రూపాయలు తగ్గింపు.." అని రాజుగారు గట్టిగా అనౌన్సు చేసారు.

అంతే.. మేమంతా ఒక్క మగ్గుతో రెండు మగ్గులకు సరిపడ నీళ్ళు ముంచుకుని పోసుకోవటం మొదలుపెట్టాము. షాంపూ మొదట నీల్ విజయ్ గాడు వాడుకున్నాడు..తలకు నవరత్న తైలం రాసుకున్నట్టు సగం డబ్బా రాసుకుని..కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ తరువాత బాలనాగు..తలతో పాటు, ఒంటికి కూడ షాంపూ రుద్దుకున్నాడు..ఆ సగం లో సగం అయిపొయింది. నెక్స్ట్ దినకర్ గాడు..మూత తీయకుండా డబ్బా నొక్కి, చేతిలో ఏమీ పడకపోయేటప్పటికి.."షాంపూ అయిపోయింది రోయ్..నెనెళ్ళి సార్ కు చెప్పొస్తాను.." అని రవి గాడికి డబ్బా ఇచ్చి బయటకు పరిగెట్టాదు. రవి గాడు "ఏం చేద్దాం?" అన్నట్టు నా వైపు చూసాడు. "ఆ మిగిలిన షాంపూ నాకిస్తావా...నీ sms రహస్యం ఇక్కడ బ్లాగు లో రాసెయ్యమంటావా?" అని కత్తులతో కాదు..కంటి చూపుతో బెదిరించాను. షాంపూ నా తలమీద రుద్ది, నా బక్కెటు లో నీళ్ళు కింద పోసి, మగ్గు విరగ్గొట్టి..బయటకెళ్ళిపోయాడు. నేను పక్క బక్కెట్లలోని నీళ్ళతో స్నానం చేసి, దిగ్విజయంగా 50 రూపయల కన్సెషన్ పొందాను.

రాజుగారు అరగంట ఎక్కడికో వెళ్ళి వచ్చారు. ఆయన రాగానే మేమంతా మళ్ళీ లైన్లో నిలబడ్డాము.

"టైం ఎంతయ్యింది?" అడిగారు రాజుగారు.

దినకర్ గాడు చెయ్యి లేపాడు. ఏంటన్నట్టు చూసారు ఆయన.

"12.10 కి 10 నిముషాలు ఉంది సార్.." అన్నాడు మా వాడు..

"ఏంటయ్యా..ఈ మనిషి ఏదీ తిన్నంగా చెప్పడా?....సరే..ముందు ఈ ట్యూబ్లు వేసుకుని, నాలుగు అడుగుల లోతులోకి దిగండి.......ఇదిగో..ఒక్కొక్కరుగా దిగండయ్యా..ఇదేమైనా సినిమా థియేటరా...అలా ఒకళ్ళనొకళ్ళు తోసుకోకండి.."

ట్యూబుతో మా బొజ్జలను కవర్ చేసుకుని..నీళ్ళలోకి దిగాము. ఆహా...ఎంత హాయిగా ఉంది..

"సార్.." అని చెయ్యి పైకి లెపాడు దినకర్..

"ఏంటి?"

"ఈ రవి గాడు నా నిక్కర్ లాగేస్తున్నాడు"

"మీతో చచ్చే చావొచ్చిందయ్యా..అసలు మీ వయస్సెంత? మీరు చేసే చేష్టలేంటి?? మీకన్నా చిన్న పిల్లలు నయం....సరే..ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ గోడను పట్టుకుని...కాళ్ళు నీళ్ళ అంచు దాక తెచ్చి...కొట్టండి.." అనరిచారు రాజుగారు.

గోడను చేత్తో పట్టుకుని, కాళ్ళు నీటి అంచుదాక లేపి....."ఒలమ్మీ తిక్కరేగిందా" పాటలో NTR పాత్రలో మమ్మల్ని ఊహించుకుని, జయప్రద పాత్రలో నీళ్ళని ఊహించుకుని...స్విమ్మింగ్ పూల్ ని నుజ్జు నుజ్జు చేసి పారేసాము. రెండు నిముషాల పాటు ఒళ్ళు తెలియకుండా అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము. ఈ సౌండు లో "ఆపండయ్యా...మిమ్మల్నే..ఆపండి " అన్న రాజుగారి ఆర్తనాదాలు వినబడలేదు. మేము అలసిపోయి సైలెంటయ్యాక...రాజుగారి వైపు చూసాము..కిరీటం తో తలబాదుకుంటూ కనబడ్డారాయన.

"మోటర్ తో నీళ్ళు పంపు చేసినట్టు ఎన్ని నెళ్ళు బయటకొచ్చేసాయో చూడండి..ఎంటయ్యా ఇది? మీ లాంటివాళ్ళు సముద్రం లో ఈత కొడితే..నీళ్ళు పక్కకు పొంగి, దేశాలకు దేశాలు మునిగిపోతాయి. సుతారంగా కాళ్ళు అలా..అలా అనండి చాలు.." అన్నారు రాజుగారు.

మేమంతా ఆయన చెబుతున్న మాటలు శ్రధ్ధగా, అర్థం కాకుండా వింటున్నాము..

"ఇప్పుడు ఆ గోడను వదిలేసి...మెల్లిగా మీ చేతులతో నీళ్ళు ఇలా వెనక్కు అనుకుంతూ...ఆరడుగుల వైపుకి రండి.."

నేను చేతులతో ఎంత ఇలా వెనక్కు అంటున్నా...ముందుకు వెల్లట్లేదు. పక్కకు చూసాను. మా వాళ్ళ పరిస్థితి అదే. ఒక్క నీల్ విజయ్ గాడు మాత్రం ముందుకు వెళ్తున్నాడు. నేను వెంటనే వాడి ట్యూబ్ పట్టుకున్నాను..బాలనాగు నా ట్యూబ్ పట్టుకున్నాడు. రవి గాడు బాలనాగును పట్టుకున్నాడు..దినకర్ రవి గాడిని పట్టుకున్నాడు..తలెత్తి, రాజు గారిని చూస్తూ "సార్...మీరొచ్చి నా ట్యూబ్ పట్టుకోండి. సరదాగా ఆ మూలదాకా వెళ్ళొద్దాం" అన్నాడు దినకర్.

"పెట్రోలు అయిపోయిన బైక్ ను తీసుకెళ్ళినట్టు అలా ముందు వాడి చెయ్యి పట్టుకుని వెళ్తే..మీకు ఎప్పటికీ ఈత రాదు. వదలండయ్యా...ముందు వదలండి చేతులు.." అని మా మీదకు రాళ్ళు విసురుతున్నారు రాజుగారు.

ఇప్పుడు అందరూ ఆరు అడుగుల లెవెల్ లో ఉన్నాము. ట్యూబ్ల సహాయం తో తేలుతూ ఉన్నాము. టైం 2.30 అవుతోంది. రాజుగారికి ఓపిక క్షీణిస్తోంది.

"ఇదిగో..నేను మొదట్లో మీకు ఈత రాకపొతే నన్ను కత్తితో పొడవమన్నానే...అది మనసులో పెట్టుకోకండి. ఏదో జోక్ చేసానంతే. ఇప్పుడు నీళ్ళ మీద పడుకుని..చేతులతో నీళ్ళు వెనక్కి అనండి....అలా..వెరీ గూడ్! ఇదిగో గొడుగబ్బాయ్..నీ నిక్కరు ఎవ్వరూ లాగరు లే..నిక్కరు మీది నుంచి చేతులు తీసి, ఈత కొట్టు..."

అందరూ మెల్లిగా ముందుకు కదులుతున్నాము. ఒకరి పక్కన ఒకళ్ళం "హలా..హలా" అనుకుంటూ ముందుకు సాగిపోతున్నాము. పది అడుగుల లెవెల్ కూడా దాటేసి, స్విమ్మింగ్ పూల్ ఇవతలి గోడదగ్గరకు వచ్చేసాము. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చేసామని మా అందరిలో ఆనందం...గర్వం...కొవ్వు. ఇక నా సర్టిఫికేట్లలో, విజిటింగ్ కార్డ్లలో.. "గజ ఈతగాడు గౌతం" అని పేరు మార్చేస్తాను.

"అద్భుతం....ఇప్పుడొక పది నిముషాలు బ్రేక్. అందరూ పైకొచెయ్యండి. మీకోసం నిమ్మరసం తెప్పించాను " అన్నారు రాజుగారు.

ముందుగా నీల్ విజయ్ గాడు నీళ్ళ లోంచి బయటకెళ్ళాడు..వాడి వెనకాల ఒకళ్ళ ట్యూబ్లు ఒకళ్ళు పట్టుకుని వరుసగా బయటకొచ్చాము.

సాయంకాలమవుతోంది..


"ఈ నిమ్మరసం తో పాటూ ఫుల్ మీల్స్ పెట్టించుంటే బావుండేది సార్..ఇక్కడ భోజనాలూ అవీ ఉంటాయని....." అని అంటున్న దినకర్ గాడిని మధ్యలోనే mute చేసేసారు రాజుగారు.

"జంతువులకి పుట్టుకతోనే ఈత వస్తుందిట..సో, నిమ్మరసం తాగాక ఏమాత్రం భయపడకుండా...ట్యూబ్లు లేకుండా నీళ్ళలోకి దూకండి చెబుతాను. రబ్బరు బంతిలా బయటకొచ్చేస్తారు.."

ఈ సారి రాజుగారి వాక్యం లో ఏ క్వస్చన్ మార్కు లేకున్నా...మేమంతా ఉత్తేజితులమైపోయాము.

రాజుగారితోపాటూ ఇంకో నలుగురు వచ్చారు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. మమ్మల్నందరినీ పది అడుగుల లెవెల్ కు తీసుకెళ్ళారు.

"మేము ఉన్నాము..మీరు ధైర్యంగా దూకండి.." అన్నారు

మొదట నీల్ విజయ్ గాడు దూకాడు..వాడి వెంట వరుసగా అందరూ దూకాము.

ధబేల్..

నీళ్ళలోకి దూకగానే..మొదటి రెండు క్షణాలు ఏమీ అర్థం కాలేదు. ఏమీ కనిపించట్లేదు..చిన్నప్పుడెప్పుడో సబ్బు నీళ్ళతో బుడగలూదినట్టు..నా నోట్లోంచి బుడగలొస్తున్నాయి..కిందకు వెళ్తున్నాను..నేల తగిలింది. రాజుగారు చెప్పినట్టుగానే పైకి రావటం మొదలు పెట్టాను. అంటే...అంటే...నేను జంతువునేనన్నమాట! పైకి వెళ్ళగానే...నీళ్ళమీద కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. నీళ్ళ బయటైకి తల వచ్చింది..

"సార్..మీరు చెప్పినట్టే..రబ్బరు బం...."

తల నీళ్ళ లోపలికి వెళ్ళింది..మళ్ళీ కిందకు వెళ్తున్నాను. కాని ఈసారి ఏదో తేడా ఉంది. ఊపిరాడట్లేదు..నీల్ గాడిని పట్టుకుందామంటే...కళ్ళు కనిపించట్లేదు..చేతుల్లో, కాళ్ళల్లో నీరసం..

అప్పుడు కనిపించారు - దేవుడు, మా శీను మావయ్య.

మాట్లాడదామనుకునే లోపే ఎవరో నా జుట్టు పట్టుకుని పైకి లాగారు. ఆ తరువాత ఐదు నిముషాలు ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచేప్పటికి స్విమ్మింగ్ పూల్ పక్కన పడుకుని ఉన్నాను. నా పక్కన మా వాళ్ళంతా పడుకుని ఉన్నారు. రాజుగారు, ఆయన భటులు నిలబడి మమ్మలని చూస్తూ ఉన్నారు.

దినకర్ గాడు పైకి లేచి "రేయ్...నీళ్ళ లోపల.. నువ్వు, మీ శీను మావయ్యా, దేవుడు.. కనబడ్డారు రా.." అన్నాడు.

మేమెవ్వరమూ మాట్లాడలేదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు..అండమాన్ ట్రిప్పు గుర్తొచ్చింది..గోరంత దీపం పాట గుర్తొచ్చింది..

మెల్లిగా లేచి..రాజుగారి కత్తి ఎక్కడుందో వెతకటం మొదలుపెట్టాము..

******

పరిస్థితులు, దినకర్ నేర్పిన ఈ గుణపాఠం వల్ల..సాటి మనుషులకు సహాయం చెయ్యాలనే ఉద్దేశం తో ..ఈత నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం నేనొక flowchart తయారు చేసాను. చెలరేగిపోండి.

144 comments:

శ్రీనివాస్ said...

తొలి కామెంట్ నాదే welcome back

Sravya Vattikuti said...

అబ్బ ఎన్ని రోజులకు రాసారు !

శ్రీనివాస్ said...

"ఏరా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా?"

"పరీక్షల టైం లోనా..మమూలు టైం లోనా?"
_______________________________________

బాసు నీకు నువ్వే సాటి

Wanderer said...

సరి లేరు నీకెవ్వరూ....

Anonymous said...

after a long time..

very good story..
-- geeta

Afsar said...

భలే వుంది! మీ వాక్య విన్యాసంలో బోలెడు సరదా వుంది. మరిన్ని రాయండి.
అఫ్సర్

Sai Praveen said...

post chaduvutu entha navvano flow chart chaduvutu antha navvanu. mastarooo... mimmalni kottevadu ledu pondi :)

రాణి said...

as usual, very funny .
hope you will not take any more breaks :)

MURALI said...

టపా వేయగానే నాకు చెప్పినందుకు నెనర్లు. అసలే మూడ్ బాలేక కూర్చున్నప్పుడు మీ మెసేజ్ వచ్చింది. now feeling better

Malakpet Rowdy said...

LOOOOOOOOOOOOOOOOOOOOOOOOLLLLLLLL

Anonymous said...

ఎన్ని ఎన్ని రోజులకు .. మీరు ఇందిరానగర్ లో ఎక్కడ ఉంటారు .. నేను గత 2 yrs ga double road ఇందిరానగర్ లోనే ఉంటున్నా ...... సైకిల్ నేర్పించటానికి కూడా "నీ కన్ను, మనసు హ్యాండిల్ మీదనే ఉండాలి. కాళ్ళలో రసస్పందన కలిగి, తాదాత్మ్యం చెంది...పెడల్ తొక్కితే తప్ప..సైకిల్ ముందుకు కదలదు.." ......... అద్బుతం

Shiva Bandaru said...

:) ఎప్పటిలానే

హరే కృష్ణ said...

ఓహో! కేక పోస్ట్ మాస్టారు
thank you and Welcome back!

nagarjuna said...

ఎన్నాళ్లకు దర్శనభాగ్యం కలిగించారు స్వామి.....ధన్యోస్మి

మంచు said...

:-)) welcome back

హరే కృష్ణ said...

మనసులోని కన్నీళ్ళు కంట్లోకి రాకుండా, గొంతులోనే మింగేసాము.

"ఏరా ఏం చేద్దాం?" అన్నాడు దినకర్.

"నిన్ను చంపక ముందా...చంపిన తరువాతా?" అడిగాడు బాలనాగు.
-----------------------------
ROFL

శేషేంద్ర సాయి said...

superu :)

Anonymous said...

ఫ్లోచార్ట్ కేకో కేక

nagarjuna said...

దినకర్ ఇంట్రడక్షన్ ఎప్పుడెపుడా అని చదవటం మొదలెట్టా హహ్హ హ

>>బొద్దింకలూ గట్రా రాకుండా బేగాన్ స్ప్రే కొట్టుకొచ్చాడట.

కెవ్......

Anonymous said...

వాహ్.. చాల రోజుల తర్వాత.. ఇక విజృంబించండి.. :)

Anonymous said...

Awesome..As Usual Hilarious :)))

Sanath Sripathi said...

మునుపటి టపాల్లో కథనం చాలా పట్టుతో సాగింది కానీ ఈ టపా పట్టు విడుపులుగా సాగింది. అన్నిటికన్నా ఫ్లో చార్టు అదిరింది. మీదైన టచ్ అక్కడ కనిపించింది. :-)

sunita said...

abba enni roejula taruvaata? as usual chaalaa chaalaa navvinchaaru. Thanks.

Vasu said...

అక్కడక్కా మెరుపులు మెరిపించారు. కానీ ఎప్పుడూ అంత నవ్వుకోలేదు ఈ సారి మీ పోస్ట్ చదివి.

ఫ్లో చార్ట్ అదిరింది.

Ramnath said...

Bossu,

Superb gaa rasharu.. meeku meere sati..

శేఖర్ పెద్దగోపు said...

శ్రీనివాస్ గారి బ్లాగులో ఈ రోజే మిమ్మల్ని తలుచుకున్నాను...అంతలోనే మీ పోస్టు...నమ్మలేకపోయానండీ...ఎప్పటిలానే అరిపించారు....మీ టపాలు చదివేటప్పుడు పరిశీలనగా చదువుతాను..ఎక్కడ ఎలా రాసారో..ఎక్కడైనా ఇరికించినట్టు హాస్యం ఉందా అని...ఎక్కడా అసలు అలా ఉండదు... కంటిన్యుటిని భలే మెయింటెయిన్ చేస్తారు మీరు...మొన్న ఎప్పుడో మీ ఇంటర్వ్యూ చదివాను..బద్దకం వల్ల మీరు రెగ్యులర్‌గా రాయరని తెలిసింది...ప్లీజ్..మీరు నెలకో రెండు టపాలైనా రాయరూ....

Wit Real said...

lol!

Pramida said...

intha peddaga undi em chaduvutham anukunna... kani kathilaa undi.. Dinakar highlight....

Anonymous said...

asalu enni rojuluga me post kosam eduruchusano nenu.....
deadly andi asusual..
flow chart super.....

Weekend Politician said...

Hilarious :))

Naresh said...

హహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హా

వద్దు, ఇప్పుడొద్దు, సాయంత్రం ఇంట్లో చదువుకో అని మనసు ఎంత చెప్తున్నా వినకుండా మొదలుపెట్టా. సగం చదివి పక్కనవాళ్లు నవ్వింది చాలు ఆపమని చెప్పాక వదిలిపెట్టా. రాత్రికి కంప్లీట్ చేస్తా.

Anyways, welcome back.

నేను బ్లాగ్లోకంలో చేరేనాటికి మీరు తోటరామాయణం మొదలెట్టి తోటరాముడిని మరిచిపోయారు. కాస్తంత ఫ్రీ టైం దొరికినా దీనకర్ కోసం ఆంధ్రభూమి ఆన్లైన్ వెర్షన్ వెతికేస్తున్నా. మీరి మళ్లీ వచ్చెసారు, కనీసం నెలకోసారైన మాకు పండగే ఇంక.

Lakshmi said...

తెలుగు కన్నడ నిఘంటువు లో పాట్లక్ డిన్నర్ కి అర్థం వెతుకుతున్నాడా...ఎలా వస్తాయండి మీకు ఐడియాలు :-)) మీ పోస్టులు చదవలేకపోతారని టెన్షన్ కి మా పిల్లలకి సీరియస్ గా తెలుగు నేర్పిస్తున్నాను నేను. తెలుగు చదవటం రాని వాళ్ళ మీద నేను అమితంగా జాలిపడే సందర్భం ఏదైనా ఉంటే అది మీ పోస్టులు చదివినప్పుడే.

You are just too good. మీరు బిజీ గా ఉంటే ఏమో కానీ జస్ట్ బద్దకంతో ఎక్కువగా రాయకపోతుంటే మాత్రం తెలుగు జాతికి తీరని ద్రోహం చేస్తున్నట్టే :-))

కొత్త పాళీ said...

hilarious as usual.

satya said...

అదరగొట్టారు .విజిటింగ్ కార్డు లో గజ ఈతగాడు గౌతం, హహ్హ.. అదేమో గాని గజ కామెడీ గాడు గౌతం అని మాత్రం తప్పకుండా పెట్టుకోవచ్చు. అక్కడ మైఖెల్ ఫెల్ఫ్ ఫోట పక్కన నా ఫోటో పెట్టిలేదా? నేను అక్కడికి వెళ్ళి ట్యాప్ కింద ఈత నేర్చుకొని వచ్చాను.

లలిత (తెలుగు4కిడ్స్) said...

సైకిల్ నేర్పించటానికి కూడా "నీ కన్ను, మనసు హ్యాండిల్ మీదనే ఉండాలి. కాళ్ళలో రసస్పందన కలిగి, తాదాత్మ్యం చెంది...పెడల్ తొక్కితే తప్ప..సైకిల్ ముందుకు కదలదు.." ....
మరి ఈ లెవెల్లో హాస్యమాడితే కాని తెలుసుకోలేము కదా? అలాగే అన్న మాట!
:)))))

krishna said...

మొదటి సారి మీ బ్లాగు చదవడం , ఇన్నాళ్లు ఏమి మిస్సయానో ఇప్పుడు తెలుస్తుంది. కొంచెం రెగులర్ గా రాయండి ..

3g said...

ఆహా...... ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇవాళ ఎదురైంది. welcome back.

మేధ said...

>>సైకిల్ నేర్పించటానికి కూడా "నీ కన్ను, మనసు హ్యాండిల్ మీదనే ఉండాలి. కాళ్ళలో రసస్పందన కలిగి, తాదాత్మ్యం చెంది...పెడల్ తొక్కితే తప్ప..సైకిల్ ముందుకు కదలదు.." ....
Super :))

Bhaskar said...

A loooooong wait..as usual superb!

Sudhakar Komakula said...

Is it fiction?

If yes very good story/imagination and usage of words..

chala bagundi, i liked the connections very much.

JB - జేబి said...

మీ పాతవిలాగానే బాగా రాసి మమ్మల్ని నవ్వించారు. ఇక తరచుగా రాయండి.

kiran said...

hahahhahahhhaha.. :D...
maga receptionist lu ...twist peddade.. :)...
kotha post ki intha gap teeskokandi.. :(

రానారె said...

ఎల్లకాలమూ మీరు ఇదే ఆరోగ్యంతో ఆనందంగా వుండాలని మనసారా కోరుకుంటున్నాను గౌతమ్ గారూ.

Manga said...

hehehe..poddunne bhale navvukunna mothaniki mee blog chadivi..very humourous as usual..keep rocking!!

Anonymous said...

ఫ్లోచార్టు ప్రకారం నాకు దినకర్ అనే ఫ్రెండుంటే సముద్రంలో దూకాలా, లేక వాడిని కత్తితో పొడవాలా ? కన్ఫ్యూజన్గా ఉంది సర్ :) (Sorry if that was intentional, in that case, I suppose I didn't get the joke :))

oremuna said...

హహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హాహహ్హహ్హహ్హాహ్హాహ్హాహ్హాహ్హహాహ్హా

Suree said...

kevvu keka

e.v lakshmi said...

కేక!

కవిత said...

meemu,meere saati maastaaru.."gaja eethagaadu Goutham"..He he he

"ఏరా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా?"

"పరీక్షల టైం లోనా..మమూలు టైం లోనా?"
_______________________________________

Super assalu.

Best Blogger awards ganuka unte...meere ekapaksham ga empikavutharu...

Ravali Priya said...

గోడను చేత్తో పట్టుకుని, కాళ్ళు నీటి అంచుదాక లేపి....."ఒలమ్మీ తిక్కరేగిందా" పాటలో NTR పాత్రలో మమ్మల్ని ఊహించుకుని, జయప్రద పాత్రలో నీళ్ళని ఊహించుకుని...స్విమ్మింగ్ పూల్ ని నుజ్జు నుజ్జు చేసి పారేసాము. రెండు నిముషాల పాటు ఒళ్ళు తెలియకుండా అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము. ఈ సౌండు లో "ఆపండయ్యా...మిమ్మల్నే..ఆపండి " అన్న రాజుగారి ఆర్తనాదాలు వినబడలేదు. మేము అలసిపోయి సైలెంటయ్యాక...రాజుగారి వైపు చూసాము..కిరీటం తో తలబాదుకుంటూ కనబడ్డారాయన.


Read that blog NOW!!!! Em pani lo unnaa AAPESI chadavandiiii!! NOW NOW NOW ani naa twitter lo.. gmail lo anni contacts ki pampesi gola gola chesi champesanu!! Hilarious! Welsome back andi!!!! :) :) :)

spoorthi said...

first time mi tapa chusanandi. kudali lo tapa chadivi chadavagane, add chesesukunnanu, eekabigina poddunnundi mi tapa lanni, chadivesanu. navvi navvi navvi......... tapa chadivuthunnappude kaka lunch break lo kuda thaluchukoni thaluchukoni navvuthunte, ma colleagues andaru nannu verri vengalay ni chusinattu chusthunnaaru. to be continued ani ippude malli start chesanu. chala baga navvisthunnaru.

Ramakrishna Reddy Kotla said...

Hilarious as usual. Please do keep posting :-)

Anonymous said...

ekkado me interview vachindani vinnanu.adi epudu ekkada vachindo koncham evarana cheppandi pls...

Anonymous said...

chala bagundi .. potta chekkalu ayyela navvanu :-)

prabhakar reddy said...

బాసూ, సూపర్ ఇంకా చదవలేదు కానీ మీరు వ్రాశాక మామూలుగా ఉంటుందా? మీరు ఇంకా వ్రాయరేమో అనుకున్నా అనుకోకుండా ఈరోజు మీ బ్లాగ్ లో పోస్ట్ వున్నట్టు కూడలి చూపింది ఆనందం తో పాటు షాక్ కూడా ! అభిమానుల కోసమైనా తరచూ వ్రాయండి ప్లీజ్ . కావాలంటే మీ ఇంటికైనా వచ్చి అడుగుతాను నేను కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నా.

శ్రీనివాస్ పప్పు said...

కేకోకేకశ్యకేకహహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హ

Anonymous said...

Awesome!!! Much awaited post...I thought you are moved to film industry and ignored these blogs to come back on silver screen....but... u r back....Great!!

You are my true inspiration...

I'm ur Eklavya Sishya.

Anonymous said...

Hilarious. You should be writing more frequently.

-Murali

Anonymous said...

ఇవాళ్ళ పొద్దున్నే మాలిక మీద చూశాను మీ బ్లాగ్ అప్డేట్ ఐంది అని. మరీ అంత పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి అని తెల్సినా కూడా చదవకుండా ఉండలేకపోయాను. As usual చాలా బావుంది. చాలా నవ్వుకున్నాను. Thank you !

Phanindra said...

Nice story. Had fun reading it. Some parts are too good. Keep writing.

శివరంజని said...

మీకు మీరే సాటి సార్ …ఎంత బాగా రాసారో చెప్పలేనంత బాగా రాసారు …..నవ్వి నవ్వి సచ్చిపోయేలా ఉన్నాను సగం పొస్టే చదివే సరికే … ఇంక మిగతా సగం పోస్ట్ కోలుకున్నాకా చదవాలండి

My Dear Friend said...

Terrific.I am proud of being a Telugu person,simply because of you people

My Dear Friend said...

ఏమని వర్ణించ గలను?.అద్భుతం,అమోఘం..ఇంతకన్నా నేను వర్ణించలేను.మీలోని సరస్వతమ్మతల్లికి నా సాష్టాంగదండప్రణామాలు.
ఓ తెలుగువానిగా పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను...జై తెలుగు తల్లీ....

My Dear Friend said...

ఎవరయ్యామీరు?.ఎలా అబ్బింది మీకీ విద్య?.సమ్మోహితున్ని చేసేసింది నన్ను, మీ రచన.ఎన్నిసార్లు చెప్పినా,ఎంత చెప్పినా నాకు తృప్తి కలుగుట లేదు.

raghavendra said...

kevvu kekaaaa
baasu
tarachuga raaayandi please..............

Ravi K Chowdary said...

Pavan kalyan cinema release ayithe kani blog rase mood raleda babu neeku.

Bulusu Subrahmanyam said...

చాలా చాలా బాగుంది.ఆద్యంతం హాయిగా నవ్వుకొన్నాం. ఈమధ్య కాలంలో ఇంతగా అట్టహాసించి లేదు. థాంక్యూ ఇంత మంచి టపా అందించినందుకు.

filmmaster said...

ee blog gurinchi evaru chepparo theliyadu kani nijamaina friend antey vade, chaduvuthunna sepu enka akvakunda untay baguntundi ani anipisthundi really hatsoff DSG.keep writing

Anonymous said...

Literally.. I was waiting for your post.... You took a loooooooooooooooooooooooooong gap.... Hope everything is going good with you in your life.. and expecting more regular posts from you...

I was writing this even without reading your post :)

సవ్వడి said...

నేను బ్లాగు లోకానికి రాకముందు నుండి మీ బ్లాగు గురించి తెలుసు. సూపర్ గా రాస్తారని. నేను వచ్చాక మీరు రాయనేలేదు. ఇప్పుడు పెట్టారు. చాలా బాగుంది. బాగా నవ్వించారు
<< "మా దగ్గర ఈత నేర్చుకోని వాళ్ళు" - అన్న హెడింగ్ కింద టైటానిక్ పడవ, బుధ్ధుడి విగ్రహం ఫొటోలు ఉన్నాయి. >> హైలెట్ అసలు. ఎమ్త నవ్వానో! ఎలా వచ్చింది ఈ ఆలోచన. సూపర్బ్..
తరచూ రాస్తుండండి.

GK said...

Jandhyala garu inka bratike unnaru!

Mahi said...

చాలా బాగుంది,


కామెడీ మూవీ లా ఉంది.అన్ని ఎలిమెంట్స్ తో.
:)

sireesha said...

మీ పోస్ట్ల తోనే బ్లాగు లోకానికి పరిచయం అయింది నాకు. బ్లాగ్ గురు, నవ్వుల గురువు గారికి వెల్ కం బ్యాక్.ఇక ఆగకండి.

Anonymous said...

WELCOME BACK..

ఇంత బాగా పంచ్ లు వ్రాసేవాళ్ళు బ్లాగుల్లో ఎవరూ లేరు.
మీరు సినిమాలకి వ్రాస్తున్నారా?

bachu said...

After a very long time....this time Dinakar got a full length character....

BachuSandeep said...

Adaragottarandi....after a long time...this time Dinakar got a full length character.

Vamsi Krishna Hemanth Illindala said...

adbhutam! amOgham! potta chekkalayyindi!

Damo' said...

No words. Inthakaalam raka poye sariki pillakayaki pelli ayipoyindhi anukunna. Inthakee nenu anukunnadhi nijamenaa, leka ajnatha vasam chesaara - Goutham. ROFL. cycle di soooopero super. God bless you.
Itlu,
Damodar, President.
Suvarna Karnataka Gowtham Fans Association

SkyLark said...

Devudaa, ooh manchi devudaa.. Maaku Gautam gaari blogs chadavaadaniki internet ichav, telugu lo chadavataaniki telugu nerpinchaav, comment cheyyataaniki tenglish nerpinchaav, but porapaatuna kuda dinakar ane friend matram ivvaku nayanaa...

gamanika - Mee blog chadivaka, dinakar ane peru pettadaaniki kuda janaalu inkosaari aalochisthaaremo..

Sreelakshmi said...

emi raasarandi baboo, intagaa navvinchatam mamulu vishayam kaadu. mee sense of humour adbhutam.

Vamsi said...

Telugu vadiga puttinanduku Aavakaya, telugu padyam, ghantasala pata, jandhyala cinemalu enjoy chestunnanu. Vatito patu cherchavalasina peru meedi..... dayachesi ekkuvaga rayandi....

Nagarjuna said...

Kim Clijsters ప్రసవం తరవాత grandslam కొట్టినట్టు కేక comeback అండి మీది!!
comparison కంపు కొట్టినట్టనిపించినా విషయం మాత్రం అది!!! trademark comeback!!
దీన్ని comeback అనచ్చో లేదో కూడా నాకు తెలీదు!!

anilme said...

Excellent post. Super!

"దుర్గాచరణుడి పట్టుదలా...."
Took me back to memories..
Though I don't remember which class book was that story was from..

Anonymous said...

మీ పోస్ట్ చాల బాగుంది.

Bharath said...

aaha... chaala rojula tarvaatha mee tapaa darshanam.. adbhutham gpowtham gaaru...

vaidya said...

too good.......pls post regularly

ప్రేమిక said...

ఒక బ్లాగ్ చదువుతూ ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు.... కేక..... ఇది చదివాక కూడా నవ్వలేదంటే వాడు మనిషి కాదు..... దినకర్ అయ్యుంటాడు

Anonymous said...

Super Gautham Garu, Welcome back.... After a long time :) Very happy to see your posts :) Please post time to time :)

Srujan YM@ said...

“సరే..ఇప్పుడు చేతులు మోకాళ్ళ మీద ఉంచండి...ఎడమ చేత్తో వీపు మీద గోక్కోండి......రైట్..ఇప్పుడు లేచి నిలబడండి..."...

ఈత నేర్చుకోవటం చాలా సులభంగా ఉన్నట్టుందే అనుకుంటుండగా.. “ఇందాక మీరు చేసిన పనులకూ, మీ ట్రైనింగ్ కు.. ఏ సంబంధమూ లేదు. చెప్పిన మాట వింటారా లేదా అని ఒక చిన్న టెస్టు అంతే." అన్నారు రాజుగారు. ఈయన్ని కత్తి తో పొడవటానికి సాయంత్రం దాకా ఆగాలా అనిపించింది..


Idi rachha sir asalu ... Kallalo tenkayalu kachela eduru chusaanu sir mee post kosam ...

Anonymous said...

innaallu emaipoyaradi
enthaga miss ayamo thelusa
welcome back

Arun Shourie said...

ఆహా...ఇన్నాళ్ళకి మమ్మల్ని మళ్ళీ తరింప చేసారు...ఈ సారి కూడా అదుర్స్ ......కేక......అరుపు....
కూసింత రెగ్యులర్ గా రాస్తూ ఉండండి...

FG said...

ultimate....

Anonymous said...

చలా రోజుల తరువాత మీ టపా చదివే భాగ్యం కలిగింది మాకు క్రుతఘ్నులం...నాకు నచ్చినవి అన్ని మీ ఫాన్స్ కమెంట్స్ లో రాసేశారు. మీ ఇదువరికిటి టపా ల లాగా అనిపించలేదు నాకు ఎందుకో. కాని ఫ్లో చలా బాగుంది. మీ టపా కోసం 1ఇయర్ నుండి ఎదురుచూస్తున్నా.

తరచూ రస్తూ వుండండి.

Nagarjuna said...

చేతన్ భగత్ కన్నా మంచి sense of humour ఉంది మీకు!!
మీరు కూడా సరదాగా ఒక రెండు మూడు తెలుగు/ఇంగ్లీష్ నవలలు రాసి పారెయ్యకూడదూ!!!??
మీ ఇంగ్లీష్ బ్లాగ్ కూడా చదివా చాలా సార్లు!!!
you are too good!!

Anonymous said...

Ultimate relaxation to my mind!!!! Thanks a lot...

sree said...

Good one Goutham

Srinivasarao said...

After a long gap!! Nice one.

deepika said...

Parledu baane undhi ...kaani mundhu vi chaalaa baagunnayi ..

Sundeep said...

asalu kummesaru kada. baaga navvu kunanu andi :), btw, dinakar lanti friend maaku okadu vunadu andi :D, but naaku eetha baane vachu so parledu anukunta :D.

stk said...

దుర్గాచరణ నాగ్ అసలు గుర్తుకు లేడు మాష్టారు.
మది లో యేవో వీణలు మీటారు ఆ పేరు చెప్పి.
మీరు గ్రేటు ... బహు గ్రేటు.

ప్రదీప్ said...

Great. I was waiting for your post from the past year! As usual, its toooooo good. :)))

Fazlur Rahman Naik said...

Oh My God ... నా కడుపు నొప్పికి మీరే కారకులు ... అమ్మా ... నా వల్లా కాదు ఇహ నవ్వటం ... Hillarious. చాలా రోజుల తరువాత ... రాసారు ... చాల బావుందండి ...

abhi said...

Goutham,
Mee posts chala baguntaayi.
please keep writing regularly.

Thanks
Abhi.

Manoj Bharadwaj said...

So glad to see a new post from you! :) As usual, adirindi!

Anonymous said...

yennallo vechina udayam..... excellent mastaru..... super.... keka

Anonymous said...

i was waiting for ur post...thnaks a lot for posting...welcome back!!!Keep posting pls

Arun Shourie said...

"ఆ మిగిలిన షాంపూ నాకిస్తావా...నీ sms రహస్యం ఇక్కడ బ్లాగు లో రాసెయ్యమంటావా?" అని కత్తులతో కాదు..కంటి చూపుతో బెదిరించాను." - ఇంతకీ ఆ SMS రహస్యం ఏమిటండి... కాస్త చెప్దురు

Anonymous said...

iragateesaru mastaru.. after long time.. ee madhya office lo bore kodutondi marinni postlu pampite we will enjoy :)

rakeshsingarapu said...

Welcome back goutam..

Long long long long waited post.. hope we can see atleast 1 in a month..

god bless you :)

Srinivas said...

Kevvvuuuu keka Gautham! Chaduvuthu navvaleka chachanu, mee writing style super.......mee post kosam wait chesinandhuku full satisfy chesaru! Will b waiting for your next post even it takes years..
Thanks a lot....

japangadu said...

Chiru Megastar aithe Meru Mega Blogstar........

Anonymous said...

Great fun. Amazing writing.

Kummu said...
This comment has been removed by the author.
ప్రవీణ్ మలికిరెడ్డి said...

గౌతమ్ గారు,
యుగానికి ఒక్కడు సినిమా లో రాజగురువు హీరో తల పైన చెయ్యి పెట్టి ......ఆయన శక్తులన్నీ హీరోకిచ్చి చచ్చిపోయినట్టుగా.....మన జంధ్యాల గారు పోతూ పోతూ.....మీ తల పైన చెయ్యి పెట్టి పోయారనుకుంటా.

ప్రవీణ్ మలికిరెడ్డి said...

గౌతమ్ గారు,
యుగానికి ఒక్కడు సినిమా లో రాజగురువు హీరో తల పైన చెయ్యి పెట్టి ......ఆయన శక్తులన్నీ హీరోకిచ్చి చచ్చిపోయినట్టుగా.....మన జంధ్యాల గారు పోతూ పోతూ.....మీ తల పైన చెయ్యి పెట్టి పోయారనుకుంటా.

Anonymous said...

115 Comments before this. All within in a day. Superb......

Harikrishna Kalluri said...

Kaeka ... had fun reading ur posts ..
I am ur fan from today ..

Ratnadinakar said...

Normal..andi...! modatlo kummesina..chivarlo.. normal.. ga ending iccharu !!! Welcome back

N.Subrahmanyam said...

I like it so much...Please keep it up.Don't take much breaks.

Anonymous said...

chaala baagundi...okka line quote cheyyali anukunte,post mottam cheyyavalasi vachela vundi
each and every word is simply superb!!!
please continue writing...chadivi maa burrala tuppu vadilinchukuntam...

Anonymous said...

kottandi anagane.. okallani okallu kottukunto..meeru tube lo virarinchina vidhanga.....chivarakariki..mana raju garini kottaremo ani oohinchukunnanandi..

Kanee okka vishayam matram artham ayindandi...
work lo unnappudu mee tapa chadava koodadu ani...

mee tapa chaduvutoo naloo nenu navvaleka.. bayatiki gattiga navvaleka.. entha avastha paddanoo meeku telusa...;)))))

superb andi.. keep writing...you are such a fabulous medicine.!

విక్రమ్ said...

బాగా రాశారు.... పైన ఎవరో అన్నట్టు "బద్దకం" అనేది
ఈ బ్లాగుకి ప్రతిబంధకం అయితే అంతకన్నా మా
దురదృష్టం ఇంకోటి ఉండదు....
గౌతంగారి ఇంటర్వూ : పొద్దు.నెట్>
వర్షఋతువు పేజ్ లో తోటరాముడితో ఇంటర్వూ
లో ఉంది....

veena said...

కత్తులు కటార్లతో చంపేవాళ్లని చూశాను..కానీ హాస్యంతో చంపేవాళ్లని మిమ్మల్నే చూస్తున్నాను...out standing..!!!!1

యేలూరు అమర్ said...

తోటరాముడుగారూ,

మీ ఈతోపదేశం బాగుంది. బ్లాగు చదువుతూ గట్టిగా నవ్వుతూ ఉంటే మా ఆవిడకు ఏదో అనుమానం కూడా వచ్చింది.

సరే, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఒక రివ్యూ కామెంటు.

ఫ్లోచార్టులో నిర్ణయపెట్టెలు వజ్రాకారంలో గీయడం రివాజు. మీరు దీర్ఘచతుస్రాకారంలో గీచారు.

భవదీయుడు,
అమర్

Harikrishna Kalluri said...

HI Gowtham,
As usual ur post is hilarious ..

మీరు ఆ దినకర్ ఎవరో కాని .. ఆ పేరు పెట్టి ఆడేసుకున్నారు... అసలు అంత కన్నా దరిద్రమైన క్యారెక్టర్
ఒకడు వున్నాడు ... వాడే .. మా టీవీ జీ టీవీ లో వచ్చే ఓంకార్ గాడు ... వాడి కంటే ముష్టి నాయాల ఇంకెవరు వుండరు .. ఈసారి దినకర్ బదులు వాడి పేరు వాడుకోండి .. కనీసం దినకర్ కొంచం సంతోషిస్తాడు

Anonymous said...

Hi Thota Ramudu Garu,
Mee kotta post kosam wait chesi chesi em cheyyalo ardam kaka....inkevo chetta blogs chaduvutunnam...soooo konchem ilanti valla meeda karuninchi inko post rastarani aashistu...

O Abhimani

Krishnadar said...

Nenu alaaa sardaagaa Youtube lo edupu paatalu pettukoni.. Eppudo maa friend ichhinaaa reference to mee blog chadavataaniki koorchunnanu.. Maa roommate .. edupu paataki edaavaalo .. naa ardhakaani navvulaki navvaalo ardhamavvaka tikka tikka gaa choosaadu. Chadavataaniki 20 nimishaalu padite... maa roommate ki intalone picchekkindi.. Meeradagochhu Youtube aapeyyochhugaa ani.. kaani.. nenu aa sangathi marchipoyyanu..
mottammedaaa.. dimmatirigi mind block ayyindi.. maa roommateki..

Devudaa... Mari.. Enduku aapesaaru vraayataanni... busynaa!
oorkondi saar! appudappudu prajaa seva chestuu undaali...

Srinivas said...

Really liked it. Especially flow chart!

Hemanth said...

తెలుగు వాడిని కాకపోయివుంటే ఈరోజు ఎలా ఆనంద పడే వాడిని కాదేమో ....మీరు రాసింది ఫ్రాన్సు లో ఆఫీసు కి వెళ్ళే బస్సు లో చదివాను

అ నవ్వుని ఎక్కడ వాళ్ళు చూస్తుంటే ... మీకు ఈ బాగ్యం లేదురా !!!! అని వాళ్ళకి ఒక్క చూపు చూసాను....

కానీ మేరు మటుకు బ్రేఅక్ తీసుకోకండి ....:-)

vidya said...

chala bagunadhi

Anonymous said...

Kev keka..

Real world said...

hi nenila na blog gurinchi rastunnanduku sorry... villalanti mahamahula mundu negguku raleka publicity gurinchi ilanti tricks cheyalsi vasthundi.. plz na blog okkasari chadivi mi amulyamaina salahalu ivvandi... http://nijajivitham.blogspot.com/

andra piligrims said...
This comment has been removed by the author.
Anonymous said...

kekoo kekaa navaleka poyam

YJs said...

గౌతమ్ గారు! మీ టపాలు అద్భుతం. మీరు జంధ్యాలగారు కలిసి వుంటే బావుండేది

Rao said...

Mastaru....adaragottesaru :)

Anonymous said...

too good...reminded me of humorous novel 'barrister parvateesam'.

చాతకం said...

మీ బ్లాగు చాలా బాగుందండి. కడుపుబ్బ నవ్విస్తున్నారు.

Purushotham said...

super sir..Durgacharan pattudala 6th class lesson gurthuku techindi..:)

Mystery Girl @ HYD said...

hi dsg i was checking your blog my sis told about it...
it is such a tension relief for me...
but seems like you dint post recently...
hope to see your next post asap...

Mystery Girl @ HYD said...

hi dsg...
i am following your blog since my sis told me abt it...
its such a tension relief for me...
but seems like no recent post from you...
hope to see another asap...

Madhavi said...

పొట్ట చెక్కలయ్యిపోయింది........... బుగ్గలు నవ్వీ నవ్వీ నొప్పెడుతున్నాయి....
ఇంకో రెండు టపాలుగానీ మీవి ఇక్కడ కూర్చొని చదివానంటే నా ఉద్యోగం గోవిందా...

Super.....Awesome..... :-)

Seenu said...

keeeeeka

siri said...

Potta chekkalayindandee..
" milanti vallu samdramlo eetha kodithe desaalaku desaalu munigipothayi"
ha ha ha... nenu kastha rest thisukovali navvi navvi baga alisipoyanu..